Saturday, July 3, 2010

తెలుగు ఛానెల్స్ లో...అవీ--ఇవీ--అన్నీ....

శివరామ్ ప్రసాద్ గారి ఛానల్ యత్నాలు 
TV-5 ఆరంభంలో ఒక మెరుపు మెరిసి మాయమైన శివరామ్ ప్రసాద్ గారు ఇప్పుడు మరొక ఛానల్ తెచ్చే యత్నంలో ఉన్నారు. మూత పడిన hy-tv లైసెన్స్ కొని channel-4 పేరుతో తెరమీదికొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం తెర వెనుక భారీగా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ కొత్త ఛానల్ రావడానికి ఆయనకు ఇద్దరు, ముగ్గురు రాయకీయ నేతలు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారట. 

'ఈనాడు' గ్రూపు కు చెందిన ఆంగ్ల పత్రిక...'న్యూస్ టైం' లో ఒక చిన్న ఉద్యోగం చేసి బైటికొచ్చి మీడియాలో రకరకాల వెంచర్లు చేసిన శివరామ్ ప్రసాద్ TV-5 నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు కానీ యాజమాన్యంతో పడక వెళ్ళిపోయారు. ఏదో చేయాలన్న తపన, కాస్త విజన్ వున్న శివరామ్ ప్రసాద్..బూతు జర్నలిజం చేయకుండా...సృజనాత్మకతతో ముందుకు పోతే....మార్కెట్ సృష్టించుకోవడం కష్టం కాదు. అందుకు కావలసింది....భారీ పెట్టుబడి, బుర్ర పెట్టడం. కులం గోడలు బద్దలు కొట్టి...కాస్త సరుకున్న జర్నలిస్టులను తీసుకుంటే....ఈ ఛానల్ మంచి పేరు తెచ్చుకోవచ్చు. 

HM-TV లో ఐ.ఎస్.: RK-news లో గోవింద్

'ఈనాడు' తో జర్నలిస్టు జీవితం ఆరంభించి...పలు ఛానెల్స్ లో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు ఐ.సత్యనారాయణ (ఐ.ఎస్.)గారు ఇప్పుడు HM-TV లో చేరారు. అక్కడి ఔట్పుట్ వ్యవహారాలు చూస్తున్నారు.  ఆయన అక్కడ చేరి దాదాపు నెల కావస్తున్నది. 

Zee-24 గంటలులో పనిచేస్తున్నప్పుడు Studio-N లో అవకాశం వచ్చి చేరిపోయారు సత్యనారాయణ గారు. 'నార్నే' వారి నుంచి 'నారా' వారికి  పగ్గాలు చేతులు మారే సరికి అక్కడ సీను చాలా మారింది. అది సారుకు సరిపడలేదు. ఐ.ఎస్.గారికి అసలు పరిస్థితి అర్థమయ్యే సరికి గ్రూపు రాజకీయాలు అక్కడ ఊపందుకున్నాయి. తన మీద ఒక అభాండం వేయడంతో సంస్థను వదిలి బైటికి వచ్చిన ఐ.ఎస్.గారు మళ్ళీ ఆ సంస్థలో కావాలని కొద్దికాలం పనిచేసి చివరకు  HM-TV లో చేరారు.

ఐ.ఎస్. గారి మాదిరిగానే అదే Zee-24 గంటలు నుంచి 'సాక్షి' ఛానల్ కు వెళ్లిన మరొక సీనియర్ జర్నలిస్టు గోవింద రెడ్డి ఇప్పుడు RK-News లో ఒక కీలక పదవిలో చేరారు. అగ్రి గోల్డ్ సంస్థ, వాజ్ పేయి అనే సీనియర్ జర్నలిస్టు సహకారంతో ఈ కొత్త ఛానల్ ను ఆగస్టులో ఉపగ్రహ ఛానల్ గా మార్చే పనిలో ఉంది. 

గోవింద రెడ్డి గారు కూడా 'ఈనాడు' తోనే కెరీర్ ఆరంభించారు. 'సాక్షి' లో పరిణామాలు నచ్చక రెండు నెలల కిందట బైటికి వచ్చి ఇప్పుడు RK-News లో చేరారు. నిజానికి జెమిని టీ.వీ.లో ఆయన చేరేందుకు రంగం సిద్ధమయ్యిందని అనుకున్నారు కానీ....అది కారణాంతరాల వల్ల కుదరలేదు. 

తెలంగాణా పై ఒక కొలిక్కి వచ్చిన 'దశ-దిశ'  
HM-టీవీ తెలంగాణా ఉద్యమం నేపథ్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్న 'దశ-దిశ' కార్యక్రమానికి ఈ ఆదివారం తెరపడనున్నది. సీనియర్ ఎడిటర్ కే.రామచంద్ర మూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఛానల్ కు గత సంవత్సరం డిసెంబర్ మూడో వారంలో ఆరంభించిన 'దశ-దిశ' ఎంతో పేరు తెచ్చి పెట్టింది. 

తెలంగాణా అంశంపై అన్ని ప్రాంతాల అభిప్రాయాలపై చర్చ జరగాలన్న సంకల్పంతో రాష్ట్రం అట్టుడుకుతున్న వేళ ముందుగా హైదరాబాద్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అదే రోజు ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఈ బ్లాగ్ "దశ-దిశ కోసం hm-tv యత్నం భేష్" అని ఒక పోస్టు పెట్టింది. ఆ సమావేశంలో ఓ కాంగ్రెస్ నాయకురాలి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో నిర్వహించారు. "ఈ 'దశ-దిశ' లేకపోతే...ఈ ఛానల్ దశ మరోలా వుండేది," అని ఒక సీనియర్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్య ఎంతైనా నిజం.

ఎంతో కీలకమైన ఒకే సీరియస్ అంశంపై గంటల తరబడి లైవ్ లో సుదీర్ఘ చర్చలు అన్ని జిల్లాలలో జరగడం విశేషం. ఇది ప్రపంచ టీ.వీ.జర్నలిజం చరిత్రలో ఎక్కడా జరగలేదని మూర్తి గారు చెప్పారు. యాజమాన్యాలు రాజకీయ మైల అంటించుకోకుండా, ఎడిటర్లు సొంత అజెండాతో కాకుండా....నిష్పాక్షికంగా వ్యవహరిస్తే....ఇలాంటి అంశాలను కూడా ప్రజలు వీక్షిస్తారని చెప్పడానికి 'దశ-దిశ' కు వచ్చిన రేటింగ్స్ ఒక చక్కని ఉదాహరణ. 
ఇలాంటి చర్చలు ప్రజాస్వామ్యంలో చాలా కీలకం. 'దశ-దిశ' ఈ అంకం నేర్పిన పాఠాలతో ఈ ఛానల్ మరిన్ని సీరియస్ చర్చలు జరిపాలని ఆశిద్దాం.
ఆదివారం జరిగే ఈ ముగింపు ప్రోగ్రాంను బ్లాగ్ కోసం రిపోర్ట్ చేయడానికి నేను కూడా వెళుతున్నాను. వచ్చాక మరిన్ని విశేషాలు....

ఏ తప్పూ చేయలేదు: అంకం రవి
కావాలని తమపై ABN-ఆంధ్రజ్యోతి బురద చల్లిందని ఐ.-న్యూస్ లో కీలక బాధ్యతలు చూస్తున్న అంకం రవి చెప్పారు. కర్నూలు లో భూ వివాదంలో చిక్కుకున్న 14 మంది జర్నలిస్టులలో రవి ఒకరు. 

బ్లాగ్ లో దీనిపై "కర్నూలు లో బైటపడిన విలేకర్ల భూభాగోతం" శీర్షికతో గత సోమవారం పోస్ట్ చేసిన దానికి స్పందిస్తూ బుధవారం రవి నాకు ఫోన్ చేశారు. అది చూసి తాను చాలా నొచ్చుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో 'సాక్షి'లో వచ్చిన తన వాదన లింక్ ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ లో తాను చేసిన వాదన అరణ్య రోదనే అయ్యిందని, మీడియా సరిగా కవర్ చేయలేదని చెప్పారు.

బాధిత జర్నలిస్టుల కోసమే ఈ బ్లాగ్ ఉందని, తన వాదనను రాసి పంపాలని కోరాను. ఇతర జర్నలిస్టులు ఎవరినైనా...ఈ బ్లాగ్ నొప్పిస్తే...వెంటనే దయచేసి మాకు రాయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న పైశాచిక ఆలోచన మాకు లేదు. రాగ ద్వేషాలు లేకుండా బ్లాగ్ నడపాలన్నదే మా ప్రయత్నం. మీ వాదన వినిపించడానికి దీన్ని ఒక వేదికగా చేసుకోండి. ఈ బ్లాగ్ సదుద్దేశాన్ని అర్థంచేసుకోండి, వేదికను సద్వినియోగం చేసుకోండి. సత్యమే మన బాట.   


ఈ అంశంపై తన వాదన వినిపించడానికి తన ఛానల్ ఒక గంట ఎయిర్ టైం ఇచ్చినట్లు మాటల సందర్భంగా రవి చెప్పారు. నిజంగానే వేమూరి రాధాకృష్ణ గారు ఇతర ఛానెల్స్ పై బురద చల్లడం ధ్యేయంగా ఆ కథనం ప్రసారం చేసి ఉంటారని రవి బృందం భావిస్తే....నిజంగానే ఆ ఎయిర్ టైం వాడుకోవచ్చు. బాధితులను స్టూడియోలో ఉంచి...చర్చ జరిపేందుకు యాంకర్ పాత్ర పోషించడానికి నేను సిద్ధం.

7 comments:

Saahitya Abhimaani said...

".....ప్రెస్ మీట్ లో తాను చేసిన వాదన అరణ్య రోదనే అయ్యిందని, మీడియా సరిగా కవర్ చేయలేదని చెప్పారు...."

పైన వారు పొందిన ఆవేదన అర్ధం చేసుకోవచ్చును. కాని ఈ విధమైన "మీడియా ట్రైల్"కు గురైన వ్యక్తులు అపరాధం చెయ్యలేదని ఆ తరువాత తెలిసినప్పుడు ఏ మీడియా సరిగ్గా కవర్ చేసింది??? ఇదే మరి తన దాకా వస్తే కాని తెలియదని జనం అనుకునేది.

మీడియా వార్తలను అందించటానికి తమ చాకచక్యాన్ని మరింత మెరుగు పరుచుకోవలిసింది పోయి, స్టింగులని, ఏదో నేరం గురించిన వార్తా రాగానే దాని మీద పడిపోయి నిజా నిజాలు తెలుసుకునే ప్రయత్నం మాని, అప్పటికప్పుడు ఎవరు నేరస్తుడని పోలీసులు అనుకున్న వాళ్ళను దాదాపు వీళ్ళే స్టూడియో అయ్యఅన్నల/అమ్మలక్కల కాట్లాటలో శిక్ష వేసేయ్యటం తగ్గించుకోవాలి.

స్టింగు ఆపరేషన్లు రాజకీయ ఆపరేషన్లు కాకుండా చూసుకోవాలి. పార్లమెంటులో డబ్బులు ప్రదర్సన గురించిన స్టింగు నిజా నిజాలు ఇప్పటికి తెలియవు. ఎవరి ప్రోద్బలంతో ఈ ఆపరేషన్ ఆ చానెల్ చేసిందో?

katta jayaprakash said...

It is still surprising that Radhakrishna of ABN has been silent to the allegations of Ravi about the five lakhs transaction between ABN and Bala Saibaba to stop the telecast on the affairs of Bala Saibaba's misdeeds.Why this pseudo gentlemanship of RK?LET HIM NOT BEHAVE LIKE GURUVINDA seed.
JP.

CH.DURGA PRASAD said...

నమస్తె
నిజంగా దశా దిశా కార్యక్రమం హెచ్.యం టివి కి మంచి పేరు తెచ్చింది. రామచంద్రమూర్తి గారికి అభినంథనలు.ఇలాంటి మరెన్నొ కార్యక్రమాలు జరిపించాలని కోరిక.

దుర్గా ప్రసాద్.సి.హెచ్

పానీపూరి123 said...

ప్రతి నెల రెండొవ ఆదివారం తెలుగు బ్లాగర్ల సమావేశం కృష్ణకాంత్ వుద్యానవనంలో జరుగుతుంది

http://jokabhiramayanam.blogspot.com/2010/07/blog-post.html

ramnarsimha said...

I request Mr.Ankam Ravi to write his opinion in APMediaKaburlu.blogspot.com..

ramuputluri@yahoo.in

Raja said...

@Panipuri

krishnakanth park lo biryani,biscuit and chai lu allow cheyyaru kada :)

premade jayam said...

@ pani puri

samayam?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి