Thursday, July 8, 2010

మూగబోయిన మూడు ఛానెల్స్: 'వనిత'లో వస్తున్న 'సాక్షి'

నిన్న రాత్రి నుంచి మూడు ప్రధాన ఛానెల్స్--సాక్షి, i-news, HM-టీవీ-- ప్రసారాలు నిలిచిపోయాయి. ఈ ఛానెల్స్ ట్యూన్ చేస్తే...నల్లని తెర మాత్రమే కనిపిస్తున్నది. ఇంకొన్ని ఛానెల్స్ కూడా సరిగా రావడం లేదు. ఉపగ్రహ సాంకేతిక సమస్య వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఒక సీనియర్ జర్నలిస్టు తెలిపారు.
 

TV-9, TV-5 ఛానెల్స్ లో కూడా స్పష్టత లోపించింది. ఏవో రంగుల చారలు అడ్డదిడ్డంగా వస్తున్నాయి. ఇలా కొన్ని ప్రాంతాలో వస్తున్నదా? అన్నిచోట్లా ఇదే పరిస్థితా? అన్నది తెలియరావడం లేదు. TV-9 లో గత కొన్ని రోజులుగా క్లారిటీ లోపిస్తే...పిచ్చి రేసులో పడి ఎవరైనా కావాలనే ప్రసారాలు అంతరాయం కలిగిస్తున్నదేమో అని నాకు అనుమానం వచ్చింది. 

ఇస్రో వారి ఉపగ్రహంలో ఒక ట్రాన్స్ పాండర్లో సాంకేతిక సమస్య వల్ల దేశవ్యాప్తంగా ముప్ఫైకి పైగా ఛానెల్స్ ఈ రోజు మూగపోయాయని, పరిష్కారం కోసం ఇంజినీర్లు రాత్రి నుంచి కష్టపడుతున్నారని సమాచారం.  

అయితే...అధిష్టానం హెచ్చరికలు తోసిరాజని వై.ఎస్.జగన్ యాత్ర ఆరంభించిన రోజే ఛానల్ ప్రసారాలు లేకపోవడంతో 'సాక్షి' యాజమాన్యం కలత చెంది వేగంగా స్పందించింది. కావాలనే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసి ప్రసారాలు నిలిపివేసిందని, ఇది దారుణమని 'సాక్షి' ఉద్యోగులు గట్టిగా నమ్ముతున్నారు. వారి అనుమానం నిజమో కాదో మనకు తెలియదు. 

అంత పెద్ద ప్రోగ్రాం నిర్వహిస్తున్న సమయంలో ఛానల్ లేకపోవడం భరించలేని జగన్ బృందం...సహచర కాంగ్రెస్ వాది, N-TV ఓనర్ నరేంద్ర చౌదరిని సంప్రదించింది. ఆయన పెరటి ఛానల్ గా నడుపుతున్న 'వనిత' ఛానల్ లో 'సాక్షి' ప్రసారాలు కొనసాగిస్తున్నారు. మామూలుగా ఛానెల్ వుంటే...అపుడుప్పుడు జగన్ ప్రోగ్రాం చూపే 'సాక్షి' వారు ఇప్పుడు 'వనిత'లో రెచ్చిపోయి లైవ్ ఇస్తున్నారు. 'వనిత' లోగో కింద 'courtesy to Saakshi channel' అని వేస్తున్నారు. 'సాక్షి' ఛానల్ 'వనిత' లో వస్తుందని N-TV, TV-5 లలో స్క్రోల్స్, హెడర్స్ ఉదయం నుంచి వేసి ప్రచారం కూడా చేసారట. జగన్ నుంచి చౌదరి క్యారీ చార్జెస్ వసూలు చేస్తారో లేక మనం మనం బరంపురం అనుకుని వదిలేస్తారో వేచి చూడాలి. 

12 comments:

Raja said...

thanks for update Ramu garu.just tuned into vanitha channel.cant believe these kinda cheap tricks(as i believe there is a conspiracy behind the tech issue on a field day).

CH.DURGA PRASAD said...

పాపం జగన్.ఏంటో అయనకి ఇన్ని కష్టాలు.అదీకాక ఈ రోజు వై.యస్. పుట్టిన రోజు. యన్ రాం వోయిస్ ఓవర్ కనీసం ఈ రోజయిన మిస్ అయ్యే భాగ్యం కలిగింది.

Unknown said...

nijam ga problem aa leka kutra na
?

thanks ramu, ee news cover chesaro ledo ani nenu office ragane mee site chusa and u didnt disappointed me..

kani edi nijam ga technical problem aa leka kutra ani kodiga update cheyandi pls

VARA said...

ayinaa devudu sarvaantaryaami...Sakshi TV raanantha maatraana YSR kanipinchakunda apotaadaa?...

raashtram lo e moolano maaya lu chesthuntaadu....Vigrahaala nundi..prasaadam istoo.....jabbulni maayam chestoo....vere vaalla intlo kodukulu gaa puduthoo......YSR ledani baadha padutoo vunde vaalla gundelni suddengaa apesi tana dagagar ki pilipinchukontoo....raashtram lo anni moolalaa vuntaadu

He has already been marketed and well established(By xxxxxx)brand now....So one day Sakshi TV raakapote daanni koodaa brand value ki elaa add chesukovaalo bathiki vundagaane nerpi velaadu le

Nani said...

Dear Ramu...

సాంకేతిక కారణాల వల్ల హెచ్ఎమ్ టీవీ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. హెచ్ఎమ్ టీవీ ప్రసారాలను www.hmtvlive.comలో చూడగలరని ప్రేక్షక మహశయులకు ఈ బ్లాగ్ ద్వారా తెలియజేయుచున్నాము..

మీరు(రాము గారు) మీడియాపై స్పందించిన తీరు చాలా బాగుంది...

జయహొ.. మీడియా వీరాభిమాని..

vaanachinuku.blogspot.com said...

Since yesterday..I am unable to watch N-TV,SAAKSHI,RK-NEWS..LIVE
in INTERNET..

Now i could understand the reason.

Thanq..

Vinay Datta said...

Can you give details of Kommineni's programme and also ABN's closing programme on Telangana issue?

Ramu S said...

Madhuriji,
I am unable to watch TVs due to ill-health. Spare me for this time.
Cheers
Ramu

Vinay Datta said...

Ramugaru,

I wish you a speedy recovery. Here's a good news to the well wishers of Yogeswararao garu. His son, Gowtham, has shown some improvement. He started walking a little bit. The treatment should go on for about two more months after which they can come back and continue the treatment. They hope to send Gowtham to college after returning.

Anonymous said...

నిజమా సార్ మేము న్యూస్ ఛానెల్స్ చూడడం మానేశాం..ఆ టెక్నికల్ ప్రాబ్లం మరింత కాలం ఉండాలనీ ప్రజల మెదళ్లు మామూలు స్థితికి రావాలనీ ప్రార్ధిద్దామ్..

Raja said...

Madhuri garu thanks for the update on Gowtham.wish him a speedy recovery .


Ramu garu dont take risks. dont watch telugu news channels until u r 100%fit ;)

Raja

Krishnarjun said...

రాము గారు, ఈ చానెళ్ళు అతిగా చూసి అనారోగ్యం పాలయ్యారేమో, ఆ ABN, Saakshi చానెళ్ళకు కొద్ది రోజులు దూరంగా ఉండండి సార్, ఆరోగ్యం అదే కుదుటపడుతుంది....

మీ అరొగ్యాభిలాషి
క్రిష్ణ.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి