Wednesday, July 7, 2010

స్నేహిత్ కు టేబుల్ టెన్నిస్ లో మొదటి మేజర్ టైటిల్


2000 ఒలింపిక్స్ సందర్భంగా...'వందకోట్ల జనం...ఒలింపిక్స్ లో ఎక్కడున్నాం మనం?' అన్న శీర్షికతో 'ఈనాడు' ఎడిట్ పేజిలో ఒక పెద్ద వ్యాసం రాసాను. ఇంజినీరింగ్, మెడిసిన్ యావలో పడి పిల్లలను చదువులకు మాత్రమే పరిమితం చేసే తల్లిదండ్రులు...ఒలింపిక్స్ లో పతకాల పట్టిక చూసి క్రీడల్లో భారత్ దుస్థితికి భోరుమంటారని, పిల్లలను త్యాగం చేయలేని వారు ఇలా దేశం గురించి ఏడవడానికి అనర్హులని అందులో రాసాను.

ఆ వ్యాసం బాగుందని చాలా మంది అన్నారు. కానీ...ఈ వాక్యం నన్ను వెన్నాడింది. ఆ టైం లోనే పుట్టిన నా పుత్రరత్నం ఫిదెల్ (స్నేహిత్) ను ఎలాగైనా ఒక పెద్ద క్రీడాకారుడిని చేయాలని శపథం చేసుకున్నాను. నా కెరీర్ ను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసి 'ది హిందూ' లో చేరాను. వాడికి కేటాయించడానికి సమయం దొరుకుతుందని జిల్లా రిపోర్టింగ్ ఎంచుకున్నాను. 

నేను అప్పటికే యూనివర్సిటీ స్థాయిలో ఆడిన బ్యాడ్మింటన్ నేర్పడం ఆరంభించాను ఫిదెల్ కు ఆరేళ్ళ వయస్సు రాగానే. అక్కడ ఆనంద్ బాబా (న్యాయవాది) అనే ఒక టీ.టీ.కోచ్ చూసి...ఆట మార్చమని సలహా ఇచ్చారు. ఈ సలహా అమలు చేయడం జీవితంలో చేసిన పెద్ద తప్పుల్లో ఒకటి అని తర్వాత తర్వాత అర్థమయ్యింది. అలా...2007 March 7 న ఫిదెల్  టీ.టీ.బ్యాట్ పట్టాడు. బాబా గారు చాలా బాగా కోచింగ్ ఇచ్చారు. ఆయన ఓపిక అమోఘం. అయితే...పిల్లల కోసం ఎంతో ఇష్టంగా మేము తెప్పించిన రోబో విషయంలో వేరే ఒక పెద్ద మనిషి విషయంలో నాకూ ఆయనకూ మాట పట్టింపు వచ్చింది. ఫోన్లో అటుపక్క పెద్ద మనిషి...బాబా ఉన్నారా? అని అడిగితే...'పక్కనే ఉన్నారు' అని ఫోన్ ఆయనకు అందచేసాను. 'నేను ఉన్నానని ఎందుకు చెప్పారు?' అని విసుక్కుంటూ బాబా గారు ఇంకొక మాట జారారు. ఇక్కడే చిక్కు వస్తుంది....మనం ఉన్నది ఉన్నట్లు చెప్పకూడదని, అబద్ధం చెప్పాలని జనం కోరుకుంటే ఎలా? 

ఈ లోపు మా పిల్ల వాడికి కాస్త అడ్వాన్స్ కోచింగ్ కావాలని, హైదరాబాద్ బదిలీ చేయండని 'ది హిందూ' వారికి రెండేళ్ళు దరఖాస్తు చేసుకున్నా లాభం లేకపోయింది. కొన్నాళ్ళు ఫిదేల్ను నల్గొండ నుంచి శని, ఆదివారాలు హైదరాబాద్ తీసుకువచ్చి కోచింగ్ ఇప్పించాను. అప్పుడు అకామిడేషన్, భోజనం భలే కష్టం అయ్యేవి. లక్ష్య సాధనలో ఉద్యోగం అడ్డు అనుకుంటే ఎలా? అని...చాలా రిస్క్ తీసుకుని...'మెయిల్ టుడే'లో జాయిన్ అయి...ఆనంద్ నగర్ లో ఒక స్పోర్ట్స్ అకాడమీ పక్కనే ఇల్లు తీసుకున్నాను. ఆ సమయంలోనే 'అవుట్ లుక్'లో వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం...నేను చేసిన మరొక పెద్ద తప్పుల్లో ఒకటని అనిపిస్తూ వుంటుంది. అదీ మన మంచికే అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

ఫిదెల్ విషయంలో నేను చూపిస్తున్న క్రీడాసక్తి నచ్చి రమాదేవి గారు భారతీయ విద్యా భవన్ లో విద్యా సంవత్సరం మధ్యలో సీటు ఇచ్చారు. అప్పటి నుంచి...ఫిదెల్ స్కూల్ జట్టులో వుండి ఏదో ఒక ప్రైజ్ తెస్తున్నాడు. గత వారం హైదరాబాద్ లో సెయింట్ పాల్స్ టీ.టీ.అకాడమీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇంటర్ స్కూల్స్ పోటీల్లో మొట్ట మొదటి సారిగా భారతీయ విద్యా భవన్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ పోటీలు పెట్టిన పన్నెండు ఏళ్ళలో ఒక్క సారైనా ఈ స్కూల్ ఈ టైటిల్ సాధించలేకపోయిందిట. 


ఆ జట్టులోని ముగ్గురు సభ్యులలో...ఐదో తరగతి చదువుతున్న ఫిదెల్ ఒకడు. మిగిలిన ఇద్దరు గణేష్ (తొమ్మిదో తరగతి), జిష్ణు వకారియ (ఏడో తరగతి). ఈ పై చిత్రంలో రమాదేవి మేడం తో వారు ముగ్గురూ ఉన్నారు. చిత్రంలో కుడి చివరన ఉన్న వాడు...ఫిదెల్. ఇదే టోర్నమెంట్ లో క్యాడెట్ విభాగంలో ఫిదెల్ ఫైనల్స్ దాకా చేరి అక్కడ పేలవంగా ఆడి ఓడిపోయాడు. రన్నర్ అప్ అయినందుకు...వీడికి ఒక సైకిల్ ఇచ్చారు. సాధించింది అల్పం....సాధించాల్సింది చాలా ఉందని తెలిసి కూడా రికార్డు అయి పడి ఉంటుందని ఇది పోస్టుగా రాస్తున్నాను. మరోలా అనుకోకండి. ఫిదెల్ చిన్న విజయాలు రాయను గానీ...పెద్ద విక్టరీ లు పోస్టులుగా పెడతాను...ఎందుకంటే...నన్ను క్రీడాకారుడిగా, స్పోర్ట్స్ రిపోర్టర్ గా, క్రీడాభిమానిగా చూసిన నా ఆత్మీయులు ఈ పోస్టులు చదువుతున్నారు కాబట్టి.

తల తాకట్టు పెట్టైనా క్రీడా రంగంలో తాడో పేడో తేల్చుకోవడం మన ఏకైక లక్ష్యం ప్రస్తుతానికి. ఈ రంగంలో వ్యక్తులు, వారి ధోరణులు, ప్రవర్తన, తొండి వ్యవహారాలు కూడా నాకు ఉపయుక్తమైన పాఠాలు నేర్పుతున్నాయి. ఫిదెల్ ఆట ఎంజాయ్ చేస్తూ ఉన్నంత కాలం...ప్రోత్సహిస్తూ పోవడమే!

16 comments:

సుజాత వేల్పూరి said...

బాబు ఆట లో ఎదగడం కోసం మీరు కెరీర్ లో ఎదిగే అవకాశాలను కూడా పక్కన పెట్టి శ్రద్ధ తీసుకోవడం ఎందరికో ఆదర్శనీయం.మీ నమ్మకాన్ని వమ్ము చేయని స్నేహిత్ కు అభినందనలు!

మీకు,హేమ గారికి కూడా అభినందనలు..పుత్రోత్సాహం పొందిన సందర్భంగా!

ఇలాగే స్నేహిత్ బోల్డన్ని పతకాలూ ట్రోఫీలు సంపాదించి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.

మధురవాణి said...

Hearty congrats and best wishes to Snehith! :-)

కన్నగాడు said...

మీ అబ్బాయికి అభినందనలు, "గమ్యం కన్నా పయనం మిన్న" కనుక మీరు కూడా ఖచ్చితంగా అభినందనీయులు. మొన్ననే టి.టిలో శరత్ యూ.ఎస్ ఓపెన్ గెలవడం కాస్తలో కాస్త టి.టి.కి ప్రజాదరణ పెంచాలని ఆశిస్తూ.

నేను స్కూల్లో టి.టి ఆడలేదు కాని, ప్రస్థుతం నేను పనిచేసే చోట ఒక టేబుల్ ఖాళీగా ఉంటే విరామ సమయాల్లో ఆడడం మెదలుపెట్టిన నేను ఇప్పుడు ఆడడం కోసమే ఒక గంట వెచ్చిస్తున్నాను. దేని మజా దానిదే.

Malakpet Rowdy said...

Congrats

వెంకట్ said...

మీకు మీ అబ్బాయికి నా శుభాభినందనలు.keep going

Vinay Datta said...

Congratulations to Snehith and your family!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

I wish him many more victories and trophies.

Anonymous said...

మీకూ, హేమకీ, స్నేహిత్ కూ మా ఆశీర్వచనాలు.ఇంకా ఎన్నెన్నో రావాలని ఆశిస్తున్నాము. బైదవే మళ్ళీ ఆ పాత ఫొటో పెట్టావేమిటి నాయనా? మార్చి 24 గంటలు కాలేదు.

..nagarjuna.. said...

ర్యాంకులు, మార్కుల rat raceలో మీ అబ్బాయి పడకుండా మంచి ప్రయత్నం చేస్తున్నారు గురువుగారు, అభినందనలు..

All the best for snehith

Sky said...

Congratulations Sir

చిలమకూరు విజయమోహన్ said...

బుడ్డోడికి ఆశీస్సులు.ముందు ముందు మంచి విజయాలు నమోదు చేయాలని కోరుకుంటున్నాను

Ramu S said...

దీవెనలు, ఆశీస్సులు అందించిన మీ అందరికి కృతఙ్ఞతలు. వందనాలు.
రాము

Ramu S said...

హరేఫల గారు...
బాబాయ్...ఫోటో మార్పిడి వెనుక చిన్న brainstorming జరిగింది. హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు నాకు ఇచ్చే పది శాతం టైం లో అది కూడా ఒక పాయింట్ గా వివరిస్తాను. లేదంటే...ఫోన్ లో చెబుతాను.
రాము

Raja said...

Ramu garu thammudu fidel ki chala manchi bhavishyath undhi, anduku meeru isthunna protsaham adbhutham.

Convey my best wishes to Fidel Rafiq Snehith.

Raja

katta jayaprakash said...

Hearty congrats for the initial achievement inthe game.This is only a begining a good foundation for the boy's future in the game and please see that you cocentrate equally on the game and the studies without neglecting any one.Hope you and Hema garu are most happiest couple as you got many friends through this blog to share your joy,hapiness etc which can never be available with any cost.I will inform Dr.Pulla Rao also.
JP.

Vinay Datta said...

The picture of the couple as profile pic was good.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి