Friday, July 30, 2010

హరీష్ రావుకు, సచిన్ టెండూల్కర్ కు పోలిక: Z వారి ప్రయోగం

'Z 24 గంటలు' ఈ రోజు ఒక ప్రయోగం లాంటిది చేసింది. ఇది నాకైతే చెత్త పోలిక అనిపించింది. మీకు సృజనాత్మకత అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు.
మెజారిటీ మీద మెజారిటీ సాధిస్తూ మరొక సారి సిద్ధిపేట ఉప ఎన్నికలో జయకేతనం ఎగురవేసిన  హరీష్ రావు ను టెండూల్కర్ తో పోలుస్తూ 'హరీష్ టెండూల్కర్' అనే శీర్షికతో ఒక స్టోరీ ప్రసారం చేసింది ఆ ఛానల్ ఈ సాయంత్రం.

రాజకీయ వార్తల మధ్య టెండూల్కర్ బొమ్మ వచ్చింది ఏమిటా! అని  అబ్బురపడి చూస్తే...పక్కనే...హరీష్ ఫోటో తో పాటు...ఆయన్ను పొగుడుతూ ఒక కథనం ప్రసారం అయ్యింది. 

"క్రికెట్ లో సచిన్, పాలిటిక్స్ లో హరీష్" అని చెప్పుకుంటూ పోయారు. హరీష్  'పొలిటికల్ టెండూల్కర్' అట. సచిన్ డబుల్ సెంచరి కొట్టి భారత్ ను ఆదుకున్న రోజులు కాబట్టి కాపీ ఎడిటర్ ఏదో పోలిక పెట్టి  రాసాడు కానీ...ఆ  పోలిక నిజంగా ఇక్కడ వర్తిస్తుందా? పది సార్లకు పైగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎం.పీ.లు ఉన్న రోజుల్లో...ఈ పోలిక హాస్యాస్పదంగా అనిపించింది. 

అయితే....వాయిస్ ఓవర్ ఇచ్చిన అక్కయ్య...హరీష్ ను 'టీ.ఆర్.ఎస్. అధినేత మేనల్లుడు' అనబోయి...'టీ.ఆర్.ఎస్. మేనల్లుడు' అని చదవగా...వార్తలు ప్రజెంట్ చేసిన సోదరుడు...."ఈ పొలిటికల్ క్రికెటర్ మున్ముందు మరిన్ని రికార్డులు తిరగరాస్తారనడంలో సందేహం లేదు," అని బల్లగుద్ది మరీ చెప్పి బులెటిన్ ముగించారు. ఈశ్వరా...ఈ భారీ భీకర పొగడ్తల వెనుక మర్మమేమి?  

చంద్రబాబు కంటికి 'సాక్షి' ప్లాస్టర్

తెగ బలిసిన వాళ్ళు, రాజకీయ నేతలు ఛానెల్స్ పెడితే...జర్నలిజం అమానుష స్థాయికి వస్తుంది. తెలంగాణా లో టీ.ఆర్.ఎస్.జయభేరిని అందరి కన్నా బాగా సెలబ్రేట్ చేసుకున్న ఛానల్ 'సాక్షి'. (జగన్ లాంటి) సమర్ధుడైన నేత లేకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయని...అబంటి రాంబాబు లెవెల్ లో యాంకర్లు చెప్పేశారు. 'అని చెప్పి' కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటూ ఉన్నట్లు ఆపాదించడం ఒకటి. 

ఇదే ఛానల్ 'ఒక కన్ను ఔటే...రెండో కన్ను డవుటే..." అన్న మాటలతో ఒక పొలిటికల్ స్టోరీ ప్రసారం చేసింది. ఆ అక్షరాల పక్కన చంద్ర బాబు బొమ్మ వేసి, ఆ మాటలకు అనుగుణంగా ఆయన ఒక కంటికి ఇంటూ మార్కు ప్లాస్టర్ వేశారు. ఇక 'ఈనాడు' 'సాక్షి' మధ్య మరొక సారి మొదలైన ప్రాపర్టీ పంచనామా మీరు చూస్తూనే ఉంటారు. రోజూ చచ్చే వాడికి ఏడ్చే వాడు...ఎవడూ ఉండడు కాబట్టి...దాని మీద రాయడంలేదు.

8 comments:

gajula said...

ikaada samasya polikathone vaste,vaallanu kshamincheyandi,nerchu kuntaaru,mee vuddesyam prakaaram 10 saarla kanna ekkuvasaarlu gelistene pogadaala?ika aa rendu patrikala vishayam andariki telisinde.rendukalla siddantakartaku aa cartton correctgaa vundi.maalanti vaallam harishlanti vyakti maaku m.l.a ga vunte bhagundedi ani anukuntunnamu.kaani maa bad luck.gajula

kolahari said...

తాడిని తన్నే వాడు ఒకడయితే..తలదన్నే వాడు మరొకడు. మీడియాను మేనేజ్ చేసి ప్రపంచంలో ఎవడూ చేయని మహా నేరమేదో మామ ఎన్.టి.రామారావు చేసినట్టు ప్రపంచాన్ని నమ్మ బలికి ఆయన్ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబును..సాక్షిలో ఆ మాత్రం అవమానించటంలో తప్పేం లేదనిపిస్తోంది. సాక్షేదో పుణ్యాత్ముల చానల్ అనే అభిప్రాయం ఏమీ లేదు. కాకపోతే మీడియా మేనేజ్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ ఉన్న చంద్రబాబుకు అదే మీడియా తానులో ముక్కయిన సాక్షి...కంటికి గంతలు కట్టి తగిన బుద్దే చెప్పింది. పాత్రికేయ ప్రమాణాల రీత్యా సాక్షి చేసిందే ఖచ్చితంగా తప్పేమో గానీ, ఒకరినొకరు నగ్నంగా బట్టలూడదీసి విమర్శించుకోవటాన్ని ప్రజలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు

Ravi said...

యదా రాజా తథా మీడియా !
మొదటిది సరదాగా తీసుకుందాం.
రెండోది సీరియస్ గా ఆలోచిచాల్సిన అంశం.
ఒకే పార్టీకి రెండు కళ్ళు,
రెండు రకాల వాదనలు,
రెండు రకాల తీర్మానాలు, రెండు రకాల రిపోర్టులు..
అక్కడ జై సమైక్యాంధ్ర ఇక్కడ జై తెలంగాణా ... సమస్యలను పరిష్కరించకుండా సాగదీయడం .. ప్రజా జీవితాలతో అతాడుకోవడం.
రాజకీయ పార్టీల ఈ అవకాశ వాదాన్ని అవశ్యం ఎందగట్టాల్సిందే!
"ఒక కన్ను అవుట్... రెండో కన్ను డవుట్ ..! సందర్భోచిత టైటిల్ !
చాలా మంది బాగుందన్నారు !

srikanth said...

ఈ తంతు గత కొన్నాళ్లుగా ఆ మాటకొస్తే కొన్నేళ్ళుగా జరుగుతున్నదే... ప్రతి చానల్ వాడు ఏదో ఒక పార్టీ ని బుజానికి ఎత్తుకోవడం వాడికి కావాల్సిన పనులు చేయించుకోవడం.. ఇది తంతు..

చానల్ యాజమాన్యానికి ఏదైన పార్టీ రంగు అంటడం కొంతవరకు అర్థం చేసుకోవచు కానీ కొన్ని రూపాయల జీతం తీసుకుని పని చేసే యాంకర్ మహాశయులకు కూడా ఈ పిచ్చి నశాలనికి ఎక్కడం మనం చర్చల్లో చూస్తూనే ఉన్నాం...

ఈ బాపతు ఆంకర్స్ అంతా తమ పక్ష(వా)పాతం చూపిస్తూ చర్చల్లో తమకు అనుకూల భావాలను రుద్దుతు ప్రజలు ఇలా అంటున్నారు అని నిస్సగ్గుగా చెప్పటం వారికే చెల్లింది.. ముఖ్యంగా రజని కాంత్, కొమ్మినేని, స్వప్న తదితరులు.

అన్నింటా ముందుండే ఆంధ్రులు మీడియా ని బ్రష్టు పట్టించే పని లో కూడా ముందున్నారు... ముఖ్యం గా ఈ జాడ్యం ఎక్కువగా ఉన్న టీవీ9, ఎన్ టీవీ (షబ్బీర్ అలీ బినామీ), చ్యానెల్ ఎన్, సాక్షి లు మరీ ఘోరం.

రాగ ద్వేషాలకు అతీతంగా ఉండాల్సిన ప్రసార సాధనాలను సొంత అవసరాలకు వాడుకుని, అర్థ సత్యాలను, అసత్యాలను ప్రచారం చేసి, మీడీయ అంటే ఇలాగే ఉంటుంది అని తమ ఘన సంస్కృతి ని భావి తరాలవారికి తెలియ చెప్పాలనుకున్న అందిస్తున్న తెలుగు టీవీ చానల్స్ ను చూసి అసహయించుకుంటూ....

-శ్రీకాంత్

Krishnarjun said...

ఎవడి గోల వాడిది..

Krishnarjun said...

ఎవడి గోల వాడిది..
ఎవడి చానెల్ వాడిది..
ఎవడి న్యూస్ పేపర్ వాడిది..

కానీ మీ బ్లాగ్ మా అందరిది.

katta jayaprakash said...

While dealing the subject of your Phd thesis please include the attitude and culture of Enadu and Sakshi for their personal war to settle personal scores in the name of media harrasing the readers and viewers and please give your sggestion.
JP.

premade jayam said...

కొన్నాళ్ళ కింద లోకేష్ చానల్లో రోశయ్య కు ఇనుప బూటు తొడిగి అటు ఇటు తిప్పుతూ ఐరన్ లెగ్ అంటూ స్టోరి ఇచ్చారు. అంతకన్నా నీచమా?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి