Tuesday, August 3, 2010

'ఈనాడు' నరసింహరెడ్డి ఐదు లక్షలు లంచం ఇవ్వజూపాడా?

వాడు అక్రమాలకు....వీడు అవినీతికి పాల్పడుతున్నాడని పత్రికా కార్యాలయాలలో కూర్చొని అద్భుతమైన పరిశోధనాత్మక వ్యాసాలు రాసే జర్నలిస్టు సార్లు తమ సొంత పనులకు లంచాలు ఇవ్వజూపడం దారుణం.
పదవీచ్యుతురాలైన వైస్ చాన్సలర్ కుసుమ కుమారి, ఆమె భర్త భూమన్ రెడ్డి ఈ రోజు HM-TV స్టూడియో లో కూర్చొని అసలేమి జరుగుతున్నదీ వివరంగా
చెప్పారు. యాంకర్ కిరణ్ చక్కగా నిర్వహించిన ఈ చర్చలో భూమన్ ఒక విషయాన్ని ప్రత్యేకంగా వెల్లడించారు. 

'ఈనాడు రిపోర్టర్ నరసింహ రెడ్డి...వాళ్ళ మరదలుకు అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్ట్ కోసం ఒక ఐదు లక్షల రూపాయలు లంచం ఇవ్వజూపాడు," అని భూమన్ వెల్లడించారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం తప్పు కాబట్టి 'ఈనాడు' వెంటనే...ఈ నరసింహా రెడ్డి ఎవరో కనుక్కుని, చర్య తీసుకోవడం తక్షణావసరం. 


నేను గత రెండేళ్లుగా చూస్తున్నాను...ఈ విశ్వ విద్యాలయాల పోస్టులు దాదాపు అక్రమాల మయమే. ఒక పది లక్షలు ఇస్తే...ఒక పోస్టు రావడం కష్టం కాదని నాకు ఒకడు ఆశ చూపితే...'మా ఊరెళ్ళి ట్యూషన్లు చెప్పుకునైనా బతుకుతా గానీ....ఇలాంటి పోస్టుల కోసం పైసా లంచం ఇవ్వను," అని స్పష్టం చేశాను. ఒక మంచి యూనివెర్సిటీ లో ఇలాంటి 
పోస్టు వచ్చినట్లు వచ్చి పోయింది. 'సారీ రాము....ఇంటర్వ్యూ నువ్వు అద్భుతంగా చేసావు. కానీ...కొన్ని ఈక్వేషన్ల వల్ల వేరే అమ్మాయికి ఇది ఇవ్వాల్సి వచ్చింది,' అని నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్న ఇద్దరు ప్రముఖులు చెప్పారు. సత్యమేవ జయతే.   
లంచాలకు  అమాం బాపతుగాళ్ళకు
పంతుళ్ళ పదవులు ఇస్తే...వీళ్లు విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తారు. అది దేశానికి ఎంతో నష్టం తెస్తుంది. ఈ బాపతు కార్యక్రమాలు దేశద్రోహంతో సమానం.

8 comments:

Unknown said...

రాము గారు మీ పోస్టింగ్ అసంపూర్తి గా
కొంచెం తికమక గా వుంది .అందులో మీ పేరు కుడా ప్రస్తావించారు?
అవిడ మీద అవినీతి ఆరోపణలు రుజువు అవ్వబట్టే తీసేశారని కదా సమాచారం.?
మళ్లీ వాళ్ళ ఆయనే పది లక్షలు లంచం ఇస్తారని ఎలా అన్నాడో?

చిలమకూరు విజయమోహన్ said...

"లంచాలకు అమాం బాపతుగాళ్ళకు పంతుళ్ళ పదవులు ఇస్తే...వీళ్లు విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తారు. అది దేశానికి ఎంతో నష్టం తెస్తుంది."
ఇప్పుడు జరుగుచున్నదదే కదా!

dhana said...

Ramu sir I am not thinking this suspension as part of elimination corruption in Universities rather it might be a dispute in sharing the corrupted collection percentage. Because of higher authority didn't receive proper or expected percentage this suspension could have arisen.I heard this in recent past Anti corruption dept. attacking highly corrupted official and at higher Govt. ruling authority level providing a channel to escape by a part payment from the illegal earnings.

First of all to what extent Smt.Kusama Kumari , who appointed as vc on political basis,is telling truth as she got plenty of media focus and freedom to show her anger on any one now. I don't really surprise with the offer as our most efficient Govt. administrative machinery recruited this way by at least 30% because its most plausible way to secure a Govt. job,which has no obligations with work , salary and extra earnings.

I expected a strong condemning article from you on attack of NRI writer Chakravarthi garu.If the same attack on Sonia Gandhi poster how much big drama will be there by now from Govt. or if it is on NTR statue how telugu aatham gouravam will be floated. May be you also wanted to keep away from this type of controversies ?

gajula said...

deshadrohama ante?e vyavastalo neethi nethibeerakaya-nethi laaga vuntundi.prastuta samajamlo 100% nijaayithigaa vunna raajakeeyanaayakudu,vudyogastudu,pourulu,journalistlu evaraina vunte chebite vaallanu sanmaniddamu.

Ramu S said...

గాజుల గారూ..
వంద శాతం నీతిగా ఉన్న జర్నలిస్టులు లేకపోలేదు. నేనైతే గుండె మీద చేయి వేసుకుని చెప్పగలను...నిజాయితీ గా జర్నలిజం బాధ్యత నిర్వహించానని. నేతలు పంపిన కరెన్సీ నోట్ల కట్టలను, ఇతర ప్రలోభాలను తిప్పి కొట్టాను. ఫ్రీ లంచ్ లు, గిఫ్టులు తిరస్కరించాను. వీడో బతకలేని మనిషి అని సాటి జర్నలిస్టులు అనుకున్నా....తృప్తిగా బతికాను, బతుకుతున్నాను.
రాము

the news said...

I THINK NARASIMHAREDDY MOST HONEST JOURNALIST IN EENDU. HE VISIT THE FIELD AND INVESTIGATE THE SUBJET AND WRITE THE STORY. HIS MOST OF STORIES BASED ON LEG WORK NOT TABLE WORK. IN THE CASE OF BRIBARY FOR AAST. PROF. POST, I THINK HE NEED NOT TO GIVE BRIBE FOR POST. HIS FAMILY AND MEMBERS ARE WELL SETTLED. KUSUNAKUMARI'S ALLEGATIONS WERE BASELESS.

NAVEEN, PRAJASAKTI

katta jayaprakash said...

I agree fully with Vennela Rajyam.Had TTD Chairman Keshavulu paid neary rupees one crore to Ravi Prakahsh TV9 would have stopped the serials on the TTD management as TV channels are notorious for extortion,blackmail etc as seen in the recent past.Corruption is a universal phenomenon is present every where along with the air we breath.The day we landed on this land and till wecleave it in the grave yard we havevto swsim,live and with it and no body is immune to it though there are sincere and non corrupt citizens around us but they are being neglected,harased and over looked.
JP
JP.

WitReal said...

>> అమాం బాపతుగాళ్ళకు పంతుళ్ళ పదవులు
>> ఇస్తే...వీళ్లు విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తారు.

Thats an interesting statement.

How about the students who pay "white bribe" in the name of management quota? They will be our future doctors/engineers

How about other పంతుళ్ళu who sneak in in the name of various quotas?

yawn...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి