Thursday, August 5, 2010

ఈ చర్చ ఇంతటితో పరిసమాప్తం...శుభరాత్రి ...

బ్లాగులో కొన్ని చర్చలు భలే గమ్మత్తుగా, ఊహించని దిశ తీసుకుని రసవత్తరంగా సాగుతుంటాయి. సమాజానికి బాగా ఉపకరించే, చర్చకు పనికివచ్చే విశ్లేషణ చేస్తే స్పందించని వారు...ఆమ్మాయిలు, సెక్సు, రీ ప్రొడక్టివ్ హక్కులు...వంటి అంశాల విషయంలో చక్కగా స్పందిస్తారు. ఇలాంటి అంశాలపై రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్ల యుద్ధం నడుస్తుంది. అలాగని వారిని తప్పుపట్టలేం.

తాడేపల్లి గారి బాధాకరమైన వాదనలో చాలా లొసుగులు, అన్వయలోపం వంటివి కనిపించినా...ఈ వాదన కొండవీటి చాంతాడు అయిపోయి...కంపు కంపు అవుతుందని...భావించి ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను. ఇక నుంచి దీనిపై వచ్చే కామెంట్స్ పోస్ట్ చేయబడవు. 

ముగించే ముందు మాత్రం...నేను గమనించిన ఒక్క విషయం మీతో పంచుకుంటాను. రాష్ట్రంలో విద్యార్థినులు, ఉద్యోగినులు, గృహిణులు ప్రత్యక్ష, పరోక్ష హింసకు గురవుతున్నారు. మిగిలిన రాష్ట్రాలలో ఎలా వుందో కానీ...తెలుగు నేల మీద ఈ దాష్టీకం, దారుణం రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. సినిమాలు, టీ.వీ.లది ఈ పాపంలో సింహభాగం. దీని పట్ల లింగ, కుల, ప్రాతీయ తదితర బేధాలు మరచి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే...ఆ అబలే మన అమ్మ, మన సోదరి, మన భార్య, మన కూతురు. మనకేదో ఒకటి రెండు చేదు అనుభవాలు ఎదురయ్యి కదా అని....వీరి విషయంలో పాషాణమైన వైఖరి తీసుకుని, మూర్ఖపు వాదన చేస్తే....అది వారిపై మరొక మేధో దాడి అవుతుంది. దీన్ని నివారిద్దాం. శుభమస్తు.

15 comments:

Thirmal Reddy said...

@ Ramu


అసలు చర్చ మీరు రాసిన టపాతోనే మొదలైంది. మొత్తానికి ముగింపు కూడా మీ టపాతోనే కావడం ముదావహం. ఒక విషయం మాత్రం సుస్పష్టం. భావ వ్యక్తీకరణ విషయంలో మనందరికీ ఓ మంచి వేదిక ఉంది. తెలుగు భాషకు, ఆంగ్ల అనువాదానికి ఈ బ్లాగు మహా బాగా ఉపయోగపడుతుంది. అందుకు కారణం వ్యాఖ్యలు చేసే వారి భాష ప్రావీణ్యత... పాత్రికేయ రంగంలోకి వచ్చేవారికి కొంత అవగాహన కల్పించడమే.

వ్యక్తిగతంగా నాకు రెండు విషయాల్లో అసంతృప్తిగా ఉంది. ఒకటి... apmediakaburlu అనే మాధ్యమాన్ని మీడియా యేతర అంశాలఫై చర్చకు ఉపయోగించడం. రెండోది... మొదలు పెట్టిన చర్చ రసవత్తరంగా సాగుతున్న దశలో అర్ధాంతరంగా నిలిపేయడం. సరే... ఏదో ఇప్పటికిలా సరిపెట్టుకుంటాంగాని... కాస్త మీడియా కబుర్లపై దృష్టి పెట్టండి మహాప్రభో.

Saahitya Abhimaani said...

Well said Ramuji.

Is it the way you are writing thesis for your M.Phil etc.???!!!

Ramu S said...

తిరుమల్,
సోదరా...ఈ మీడియా మీద రాయాలంటే గాసిప్స్ లాంటివి చాలా వున్నాయి. అవి మనం రాయం. పోజిటివ్ అంశాలు ఒక్కటీ కనపడటం లేదు. ప్రతి రోజూ మీడియా మీదనే రాయాలంటే నెగిటివ్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడూ జనాలను తిట్టలేము కనుక ఇలాంటి అంశాలు అపుడప్పుడు రాయాల్సి వస్తున్నది. ఈ మధ్య కొద్దిగా టైం సమస్య వచ్చింది. మీ సూచనకు థాంక్స్. Why don't you give me some good inputs?

శివ గారూ...
థీసిస్ గురించి మీరు రాసింది అర్థం కాలేదు. అది మెచ్చుకోలో, మొట్టికాయో అర్థం కాలేదు. నేను చేస్తున్నది PhD. I am all set to give my first presentation in the presence of professors and my guide in a couple of days. Its a good news.
Cheers
Ramu

katta jayaprakash said...

Thanks Ramu garu for ending the discussion on the subject which has no end.Hope you donot give any chance to friends who deviate from the main track an indulge in using unpalatable sentences.
It is true that it is only the negative aspect that is seen in media.But there are positive points too to dicuss and enlighten the people.
JP.

Anonymous said...

*తాడేపల్లి గారి బాధాకరమైన వాదనలో చాలా లొసుగులు, అన్వయలోపం వంటివి కనిపించినా...*
అయ్యా రాము గారు, ఇక్కడెవ్వరు తాడెపల్లి గారిలా రాసిన వాడు, వాదనను అన్ని కోణాల నుంచివినిపించిన వారు లేరు. సరి కదా ఆర్.యస్.రెడ్డి నోరు పారేసు కోవటం అతని లో ఉన్న భూస్వామ్య భావజాలం నర నరాన ఎంత గట్టి గా పాతుకొని ఉందో సూచిస్తున్నాది. ఇతను చదివింది ఆర్.ఇ.సి. వాడింది చౌక బారు బాష. ఇతనిని ఇప్పటి వరకు బ్లాగు లోకం లో ఎప్పుడూ చూడలేదు. మొదటి సారే తగుదునమ్మా అని వచ్చి తాడేపల్లి గారి మీద ఆంబోతు లా విరుచుకు పడ్డాడు.
----------------------------------
తాడేపల్లి గారి అభిప్రాయాలు "పెళ్ళి చేసుకుందాం రా" అనే సినేమాలో వేంకటెష్ లా వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అంతె కాని శివగారు చెప్పినట్టు ఎదో తన వాదనా పటిమతో తిమ్మిని బమ్మిని చేయలేదు.
----------------------------- బాధాకరమైన విషయమేమిటంటె మీరంతా తాడేపల్లి గారు ఇంత క్లారిటి ఇస్తారని ముందు గా అనుకోలేదు.ఆయన వాదనకి *రాముగారు* మీరు ప్రతివాదన చేయ లేదు సరి కద ముగింపులో "తాడేపల్లి గారి బాధాకరమైన వాదనలో చాలా లొసుగులు, అన్వయలోపం వంటివి కనిపించినా " అని రాయటం చాలా విచారకరం.

Chaitu said...

Well said Srikar :-)

చదువరి said...

తాదేపల్లిగారిని సంబోధిస్తూ ఒక టపా రాసారు. కానీ ఆయన తన వాదనను వినిపించనీయలేదు. ఆయన మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూంటే, వాటిని అనుమతించారు. హఠాత్తుగా ఆ టపాను మూసేసి, కొత్త టపా రాసేసారు. ఈ రెండోది మరీ అన్యాయంగా ఉందనిపించింది.

"తాడేపల్లి గారి బాధాకరమైన వాదనలో చాలా లొసుగులు, అన్వయలోపం.." ఉన్నాయన్నారు. అంతకంటే అన్యాయంగా,
"మనకేదో ఒకటి రెండు చేదు అనుభవాలు ఎదురయ్యి కదా అని....వీరి విషయంలో పాషాణమైన వైఖరి తీసుకుని, మూర్ఖపు వాదన చేస్తే...." అంటూ ఇంకోమాట అనేసారు.

మీరు మీకు నచ్చే వాదనను ప్రోత్సహిస్తూ, అవతలి వాదనను కురచచేస్తున్నట్టుగా నాకనిపిస్తోంది.

ప్రేమిక said...

enti ramu garu nenu lekundane na comment lekundane charcha muginchesara? chinchaga chinchaga tadepalli garu cheppedani lo kuda logic undanipistundi... but ethic ledanipinchindi

Ram said...

రాము గారు బాగున్నారా..ముందుగా All The Best 4 Ur P.hd..రెగ్యులర్ గా కాక పోయిన పోస్టింగ్స్ ఇవ్వండి..ఈ మద్య మన బ్లాగ్ లో అబిప్రాయాలు చెప్పడం లో కొంతమంది ఎందుకో కొంచం శ్రుతి తప్పుతున్నారు అనిపిస్తుంది..దాని వల్ల అందరిమద్య వాదోప వాదాలు జరుగుతునాయి.దాని వల్ల విషయం పక్క దారి పడుతుంది..ఆలా జరగకుండా చూడగలరు..అనవసరంగా గొడవలకి దారితీస్తుంది..అలా జరగకూడదు అని కోరుకుంటున్నా..అల్ ది బెస్ట్ రాము గారు...తిరుమల్ అన్నా బీ కూల్ అన్నా..మీ రమేష్

Pavani said...

Agreed with Sreekar.I am not sure why Ramu garu wrote like that. Clearly Tadepalli arguement is fresh, analytical and thoughtprovoking. Other than abusing him hardly anybody even tried to answer him.

I may or may not agree with all of his opinions, but Tadepalli is the clear winner here.

kvramana said...

annayya Ramu
Even I agree with some of the friends responding to your postings that the blog should continue to focus on state of affairs in the media. It need not necessarily be about pointing at the nagatives or lapses. You can make it more constructive and positive. Even if it has to be negative, so be it. What can you do about it? Please focus on media. For a break, you can still sometimes write about Fidel's success in a TT tournament, etc.
Ramana

Anonymous said...

డియర్ రాము గారూ.
చర్చ ముగిసిందని మీరు చెప్పిన తర్వాత కూడా మరొకసారి వ్రాస్తున్నందుకు మన్నించి నాకు ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా మనవి.
మీరు చెప్పినవిధంగా రెండు, మూడు పదాలు నేను అంత సూటిగా తాడేపల్లిగారి గురించి వ్రాసియుండికూడదని నేనుకూడా అంగీకరిస్తున్నను, మరియు వారి మనసును నొప్పించియుంటే క్షమాపణలు చెబుతూ వాటిని వుపసం హరించుకుంటున్నాను. ఇక్కడ శ్రీకర్ అనే పెద్దమనిషి వ్రాసినట్లుగా సంస్కార హీనులు ఎవరూ లేరుగానీ, ఒక విషయంపైన వితండ వాదన జరుగుతున్నప్పుడు, ఒకాయనకు దేవుడు కొంచెం తర్క జ్ఞానం ఎక్కువ ఇచ్చాడు గదా అని, మిగతా వారు కూడా దానికి మెస్మరైజ్ అయ్యి సమర్ధిస్తూ వుంటే, అంత తర్క జ్ఞానం లేని మాలాంటి వాళ్ళు వారికి నిజాలను దగ్గరగా చూపించే ప్రయత్నంలో ఈవిధంగా టెంప్ట్ అయ్యేందుకు ఆస్కారం కలుగుతుంది. ఇది నన్ను సమర్ధించుకోవడానికి సాకుగా వ్రాయడంలేదని గమనించగలరు. అలాగైతే, ముందుగానే క్షమాపణలు చెప్పియుండేవాన్నికాదు.
ఇహ, అయ్యా శ్రీకర్ గారూ! మాకు సంస్కారం లేదంటూ తమరు వెలగబెట్టింది ఏమిటో? ఆంబోతులా అనే పద ప్రయోగం సబబేనా? అంటే నేను పైన చెప్పినట్లుగా తమరుకూడా టెంప్ట్ అయ్యారుగదా? కనుక నేను వాడిన అభ్యంతర పదాలను ఖండించినా మిగతా విషయాన్ని ఒప్పుకోవచ్చేమో చూడండి. టాడేపల్లిగారు శ్రీకర్ గారికి అన్నో, తమ్ముడో కాకపొయినప్పటికీ నేను సరిగా సంభోదించలేదని కోపానికి వచ్చారు. మరి అలాంటిది మన అక్కలను, చెళ్ళెళ్ళను ఎవడో ఏదో అనేస్తున్నా కల్పించుకోకుండా మీకిష్టమైతే అంగీకరించండి, లేదంటే ఊరుకోండి అంటూ హితభోదలు చెయ్యాలనడం ఏమి వాదం. అభద్దాన్ని కూడా నిజంలాగా వాదించగలిగే తర్కం మనలో వున్నంతమాత్రాన రియల్ స్పిరిట్ లో కూడా అది నిజం అయిపోతుందా? ఒకవేళ, వీరు వాదించిన విధంగా ఒక అమ్మాయికి/ గ్రుహిణికి ఎవడైనా పైత్యుడు ప్రపోజ్ చేస్తే మీకిష్టమైతే అంగీకరించండి, లేదంటే ఊరుకోండి అనే కొత్త సంప్రదాయం మనమంతా కలిసి ఈ సమాజంలో బలవంతంగా (తాడేపల్లి గారు, వారిని సమర్ధించేవారికోసం అనుకుందాం) ఇంఫ్లిక్ట్ చేద్దమనుకుంటే, అలా ప్రపొజ్ చేసినవాడు ఆ అమ్మాయి/ గ్రుహిణి తిరస్కరించిన తరువాతైనా వదిలేస్తాడని గ్యారంటీ ఏమిటి. వీరంతా కలిసి అలాంటి పైత్యులకు ఇస్టంలేదన్న వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, రేపులు చంపడాల్లాంటివి చెయ్యొద్దు, ఒకరు తిరస్కరిస్తే మరొకర్ని ట్రై చేస్తూపొండి అని కన్విన్స్ చేస్తూపోగలరా? ఇక్కడ నాకు ఇంకో భయం వేస్తోంది- ఏమంటే వీరంతాకలిసి ఆల్రెడీ మావాళ్ళంతా ఇదే పాలసీ ఫాలో అవుతున్నారు, ఇప్పటివరకూ అలంటి రేప్ లు ఎక్కడా జరగలేదు, జరిగినవన్నీ వారి వారి ఇష్టప్రకారం జరిగినవే అనికూడా సమర్ధించుకోగలరేమో?
ఇహ చివరిగా, శ్రీకర్ గారికి- అయ్యా తమరి కళ్ళలో పడేంత భాగ్యం మాకు ఇప్పటివరకు కలగనంతమాత్రాన, వీడెవడు, ఎప్పుడొచ్చాడు లాంటి ప్రశ్నలు వేయకండి- అయినా తమరి ప్రశ్నకు సమధానం నేను ఈ బ్లాగ్ చాలా రోజులనుంచి చూస్తున్నాను, మరియు వ్రాస్తున్నాను. సరేనా? మరియు మీరన్నట్లుగా నేనేదో ఫెమినిస్ట్ నో లేక బుద్ధిలేని రొడ్డ సాంప్రదాయవాదినో కాను. ఒకరకంగా చెప్పాలంటే ఫెమినిస్మ్ ను గుడ్డిగా సమర్ధించడం, ఒక స్త్రీ అయినంతమాత్రాన ఆమె చెప్పిందల్లా నిజమేనని ఈ వరకట్ణ వేధింపుల కేసులు అన్నీ నిజమేననీ భావిచనవసరంలేదనీ నేనూ మాట్లాడిన వాడినే. కానీ, అంతమాత్రాన ఈ ఇష్యూ లో నిస్పక్షపాతంగా వారిని సమర్ధించకుండా వుండలేం. అలాగే, ఎక్కడో ఒకరిద్దరు స్త్రీలు తమరి ఇష్టప్రకారామే పర పురుషుడితో కలిసికూడా విషయం బయటపడ్డాక సీన్ రివర్స్ చేసిన సంధర్భాలు వున్నంతమత్రాన తాడేపల్లి గారు/ వారి సమర్ధకులలాగా జనరలైజ్ చేసి స్త్రీ మూర్తులను అందరినీ కించపరచలేం కదా? ఆలొచించండి.
చివరగా, రామూ గారికి ధన్యవాదములు. ఇంతమంచి విషయంపై ఇన్నిరోజులు చర్చకు అనుమతించినందుకు. అర్ధాంతరంగా ముగించడాన్నికూడా ఈ చర్చలో వచ్చిన భిన్న వాదనలలాగానే అర్ధంచేసుకోవచ్చు. healthy DUALS can always be welcomed. చర్చను ముగించియుండకూడదన్నవారిలో ఎవరైనా మరి ఇన్నిరొజులలో కూడా అందరూ అంగీకరించే కంక్లూజన్ ఎందుకు ఇవ్వలేకపోయారు. పైగా ఎవరికి వారు (నాతో సహా) తమవాదనే కరక్ట్ అనిపించుకోవడంకోసం అవతలివారిపై వ్యక్తిగత కామెంట్లు చేసేదాకా విషయం వెళుతున్నప్పుడు దాన్ని అర్ధాంతరంగానైనా ముగించడం తప్పుకాదని నా అభిప్రాయం.

gajula said...

100puulu vikasinchani 1000 aalochanalu sangarshinchani-mao.mitrulu tadepalligaaru chaala vishayaalu chepparu,nijangaa aayana medhavi.maanavasambandaalu konni kattubhatlaku lobhadi untaayi.prapose chestene kodtara ante ,aa praposenu sweekarinchaala,kottala anedi avathali vaari istamu.prapose chesetappude annitiki siddapadaali.suppose aa prapose maatalake sensitivega vunde evaraina suicide chesukunte evaru bhadyulu?iddariki istam aite evariki problem ledu,evaru nastapokunte.idi generalgaa.prastuta vishayamlo vaadu chaala depthkelle harass chesintaadu.anduke aa reaction.sarvejana sukhinobhavanthu

maharshi said...

శ్రీకర్, చదువరి అభిప్రాయాలు చాలా సముచితంగా ఉన్నాయి. రామూ గారూ అంత విచ్చలవిడి భాషను ప్రచురించడం దురద్రుష్టకరం. తాడేపల్లి గారి వాదనా పటిమ, భాషా పటిమ అద్భుతం. అతని అభిప్రాయాలతో ఏకభవించినా, ఏకీభవించకున్నా.. చర్చ ముగింపులో మీరు చేసిన పదప్రయోగం చూశాక, లేదంటూనే తాడేపల్లి గారిని ఎండగట్టేందుకే చర్చను లేవదీసినట్లు ఉంది. అడ్డగోలు భాషతో విరుచుకుపడే వారని మీరే నిలువరించాల్సింది. మీరు ఒక యాంగిల్ తీసుకోవడం అలాంటి వారికి మరీ రెచ్చిపోయే అవకాశం కల్పించింది. సరే. ఇవన్నీ ఎలా ఉన్నా.. మేలిస్ట్... తాడేపల్లి గారికి అభినందనలు. -మహర్షి

Pavani said...

తాడేపల్లి రాతలలో చాదస్తమ్ కానీ, మొన్డి వాదన కానీ, complexity కానీ నాకెమాత్రమూ కనిపిన్చలేదు. పైగా వీలైనన్త విపులన్గా, చక్కటి తెలుగులొ, ఎన్తో మర్యాద గా రాశారు. ఆయన అభిప్రాయాలు నచ్చటమా నచ్చక పోవటమా అనేది personal preference. ఆయన చెప్పిన points ని దేనికి దానికి analyze చేసి తప్పని నిరూపిస్తే అదో పధతి. కానీ ఎద్దేవ చెయ్యటమ్, character assasination, personal attacks ఇలాన్టి వన్నీ allow చేసి పైగా చర్చ సమాప్తమ్ అని ఇన్కొ article రాశారు. మీ బ్లాగు మీ ఇష్టమనుకోన్డి! నెమ్మదిగా ఆయనకు support ఎన్దుకు పెరుగుతున్దో గమనిన్చన్డి. Because of the realization that he writes with conviction , insight and great observation.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి