Saturday, August 21, 2010

టీ.వీ. ఛానెల్స్... హీరో ల ఫోన్ నంబర్లు ఇవ్వడం సబబేనా?

నైజీరియా వాడి దగ్గర డ్రగ్స్ కొంటూ రవి తేజ సోదరులు దొరికారు. పోలీసుల కథనం ప్రకారం పేపర్లు, ఛానెల్స్ ఆ వివరాలు అందించాయి. బాగుంది. కానీ కొన్ని ఛానెల్స్ ఈ రోజు ఆ నైజీరియన్ దగ్గర దొరికిన ఫోన్ నంబర్స్ ఇవి అంటూ...ఉదయ్ కిరణ్, రాజా తదితరుల ఫోన్ నంబర్లు, ఫోటోలు వేసి నానా యాగీ చేసాయి. 

ఇది అత్యంత బాధ్యతారహితమైన జర్నలిజం. ఒక గజదొంగ దగ్గర ఉండే డైరీ లో ఏదైనా ఛానెల్ హెడ్ ఫోన్ నంబర్ దొరికితే...ఆ గజదొంగ పాపాలలో ఆయన పాలు పంచుకున్నట్లు కాదు. ఎందుకైనా మంచిదని...ఆ గజదొంగ ఆ ఛానెల్ హెడ్ ఫోన్ నంబర్ రాసుకుని ఉండవచ్చు. లేదా...పోలీసులే...సంచలనం కోసం వాడి డైరీ లో ఆ ఛానెల్ హెడ్ పేరు రాసి దాన్ని మీడియాకు లీక్ చేసి ఉండవచ్చు.

ఈ ఇంగిత జ్ఞానం లేకుండా...ఛానెల్స్ ఆ ఛానెల్ హెడ్ కు, గజదొంగకు సంబంధం ఉందన్న టైపు లో పదే పదే వార్తలు ప్రసారం చేయడం దారుణం. నైజీరియన్ తో నిజంగానే ఈ నటులకు సంబంధం ఉండి ఉండవచ్చు, వాళ్ళు గతంలో వాడి దగ్గర డ్రగ్స్ కొని సేవించి ఉండవచ్చు. ఆ ఆధారాలు దొరికితే ప్రసారం చేయవచ్చు గానీ....ఎవడూ ధృవీకరించని ఫోన్ నంబర్లు తెర మీద చూపడం దారుణం. ఇందులో చాలా మంది యువ నటులు పత్తిత్తులు కాదని అందరికీ తెలుసు. అయినా సరే....మీడియా జాగ్రత్త వహించాలి. ఆధారం లేకుండా ఇంత పెద్ద అభాండం వేయకూడదు. పైగా...యావత్ తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ కిక్ లో మునిగినట్లు శీర్షిక లొకటి.

తాము ఎలాంటి ఫోన్ నంబర్ల లిస్టు మీడియాకు ఇవ్వలేదని స్టీఫెన్ రవీంద్ర (డీ.సీ.పీ.) మొత్తుకుంటున్నాడు. అయినా...ఆ నంబర్లు మీడియా డిస్ ప్లే చేస్తున్నది. హీరో ఉదయ్ కిరణ్ కొద్ది సేపటి క్రితం స్టూడియో-ఎన్ ఛానెల్ లో మీడియాను కడిగి పారేసాడు. ఇలాంటి విషయాలలో మీడియా బాధ్యతతో మెలగాలి. బురద చల్లడం తగదు. మీడియాకు స్వీయ నియంత్రణ లేకపోతే వచ్చే ప్రమాదాలు ఇలానే ఉంటాయి. 

ఐ-న్యూస్ లో ఒక యాంకర్ 'నిప్పు లేకుండా పొగ రాదు కదా' అని నవ్వుతూ అడుగుతూ కనిపించాడు. ఇది సత్తెకాలపు సామెత. ఇప్పుడు దానికి కాలం చెల్లింది. నిప్పు లేకుండానే పొగ వస్తుంది ఇప్పుడు. ఆ పొగ పేరే వార్త. దాన్ని రాజేసేది మన మీడియా. 

15 comments:

prakash said...

Meeru cheppindi nijamenandi.kani cheviti vadi Mundu shankam vudhithe labam ledu kadandi mana telugu elictronic media paristithi kuda ipudu alage vundi.ila cheyakunda vundadaniki governement edina chattam thisukoni vaste baguntundi

prakash said...

Meeru chepindi nijamenandi.kani manam ennirojulu ila matladukunna eloctronic media loni peddavallu maratharu ani anukovadam ledandi.endukante e vokka vishayam lone kadu kadhandi veellu thappu chesedi prathi vishayamlo thappu chestune vuntaru.thappu chesedi valle malli kaneesam vivarana kuda vundadu. edukante eroju ABN Andrajyothi hero nani peru kuda display chesaru kani athanu studioku vachi naku dheenitho sambandam ledu ani cheppina kaneesam dhani vivarana ivvaleka poyaru.

kvramana said...

రాము అన్నయ్యా
రెండో పేరాలో 'ఇది అత్యంత బాధ్యతాయుతమైన జర్నలిజం' అని వుంది. అంటే? మరొక విషయం...ఏదొ వందల నంబర్లలో ఉన్న ఒక నుంబెర్ ఫలానా హీరోది ఆ హీరో గారు నిజంగా ఆ డ్రగ్ వ్యాపారి గారి క్లైంట్ కానక్కరలేదు అన్న వాదన ఎందుకో సరిగా లేదు. ఆ వందల నంబర్లలో ఆ ఫలాన హీరో గారి నంబర్ ఒక రిపొర్టర్ పట్టుకొవడం అసాధ్యం. కేసును ఇన్వెస్టిగెట్ చెస్తున్న బ్రుందంలొ మనకు ఉప్పందించే వాడు చెపితే తప్ప ఆ నంబర్ కాని ఆ హీరొ గారి వివరాలు కాని మన దాక రావు. పైగా ఏదొ సరదాకి ఆ హీరొ గారి నంబర్ ఒక నైజీరియ దేశస్తుడు ఫోన్ లో సేవ్ చెసుకున్నడంటె నమ్మొచ్చా? ఆ డ్రగ్స్ అమ్ముతున్నవాడు మనలా సగటు తెలుగు వాడు కాదు ఆ హీరొ గారి ఫ్యాన్ అనుకోడానికి. ఇంక ఏదో విషయం ఉంది.

Lathanjal said...

నిజమే రామూ గారు.. ఇప్పుడు నిప్పు లేకుండానే పొగ వస్తుంది. పొగ వచ్చేలా కొందరు చేస్తున్నరు.

Saahitya Abhimaani said...

"........మీడియాకు స్వీయ నియంత్రణ లేకపోతే వచ్చే ప్రమాదాలు ఇలానే ఉంటాయి......."

ఇలా ఉండవు రామూగారూ. ప్రభుత్వ నియంత్రణ వస్తుంది. ఇప్పుడు కనుక ప్రభుత్వాలు ప్రెస్స్ సెన్సార్షిప్ పెడితే ప్రజలనుండి వ్యతిరేకత వస్తుందా అని నా అనుమానం. 1975లో ఎమర్జెన్సీ విధించి పేపర్ల పీకలు (అప్పటికి టి.విలు లేవు) నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే, ప్రజలు న్యూస్ పేపర్లకు ఎంతగానో వెన్ను దన్నుగా నిలబడ్డారు. ఇప్పుడు కనుక ప్రభుత్వం సెన్సార్షిప్ పట్టుకువస్తే, ప్రజలు హర్షిస్తారు. ఈ న్యూస్ చానెళ్ళ పరిస్థితి అంత లేకిగా, బాధ్యతా రాహిత్యంతో కూడుకున్నవి అయి ఉన్నాయి.

".........నిప్పు లేకుండానే పొగ వస్తుంది ఇప్పుడు. ఆ పొగ పేరే వార్త. దాన్ని రాజేసేది మన మీడియా............" చాలా చక్కగా చెప్పారు రామూ గారూ. ఇది వంద కారెట్ల నిజం.

Ramu S said...

రమణ అన్నా..
కొంప ఆరింది. బాధ్యతా రహితం అని రాయబోయి...అది రాసాను. ఇప్పుడే మారుస్తున్నాను. నాది బాధ్యతారహితమైన పని అయ్యింది. సారీ.
రాము

katta jayaprakash said...

It is true that media has been exaggerating the involvement of some artists of film industry though the drug business has been rampant in the industry among the new generation who are in much depression due to falure of their innings in the film indusry as well as due to personal problems of their affairs.The channels are just creating chaos in the film industry by giving news which has no proof and basis inspite of denial by police personnel on some names and mobiles.
As rightly said by Shiva garu the peoples perception of media is very poor and no one supports the media if government regulates it except the politicians who cannot survive without media coverage.The common man has fed up with the way the media has been functioning.In these days no media person except a few seniors gets respect,loveand honour from the people as every knows the inside stories of the media personnel.But all are not ailing in the same boat there are media personnel rendering service with proffessional,human values,ethics and dignity.I salute them for not succumbing to many ills of the new generation media personnel.
JP.

seenu said...

రాము గారు...ఇలా ప్రతీ రొజు ఎదొ ఒక విషయంపై చర్చ జరగడం దానిలొ మా అభిప్రాయాలు రాసి అవెశం తగ్గించుకుంటున్నామా అనిపిస్తుంది. వంద లక్షలకు పైగా జనభా దాటిపొతున్న మహనగరం మన హైధరాబాధ్. ప్రతిరొజు ఎధొ ఒక సంచలనం జరగడం అది టివీల్లొ రావడం సహజంగా జరుగుతూనె ఉంది. నిన్నటి సంఘటనను చూస్తె, కొందరి పేర్లు మాత్రమే బయటకు రావడం, వారి పేర్లను మాత్రమే బయటపెట్టడం వెనుక ఎధో జరగలేధని అనుకొలేము. ఎవరి చానెల్ వారి పిల్లలను కాపడుకున్నాయి. అందులో ఏ అనుమానం లేదు. ఎవరికీ పట్టని, లాభం కనిపించని వారిని బలి చెసారు. కాని వారి మానవ హక్కుల గురించి పొరాటానికి ఓ వేదిక ఉంది. ఆలస్యం చేయకుండా స్టెప్ టీసుకుంటే బెటర్..నిజము నిలకడ మీద తెలియడం మానేసి చాల కాలం అయ్యింధి

Unknown said...

అయ్యో రాము గారు మీరు టీవి నైన్ చూడలేదన్న మాట .
వాళ్ళు నిన్ననే త్రిష , తరుణ్ , రాజ , మరి కొంత మంది
నటించిన సినిమాలు నేగటివే చూపించి వాళ్లే అని తెలిసేలా
జాగర్తలు వహించి మరీ చూపారు . అందులో నిజం ఉండొచ్చు గాని
ఇప్పటికే పట్టు బడిన రవితేజా సోదరులు కూడా
రేపు కోర్టు లో అది వట్టి టాల్కం పౌడర్ అని నిరుపించ బడడం తో
కాలర్ లేపుకుని బయటకోస్తారు చూస్తూ వుండండి .
మళ్లీ వాళ్లే మీడియా మీద పరువు నష్టం దావా వేసిన ఆశ్చర్య పడనక్కరలేద్దు .

Anonymous said...

రమణ గారూ,
'ఆ హీరో గారు నిజంగా ఆ డ్రగ్ వ్యాపారి గారి క్లైంట్ కానక్కరలేదు' అన్న వాదనతో మనం ఏకీభవించవచ్చో లేదో తరువాత. కానీ, ఇక్కడ విషయం మీడియా అతిమీద. అడ్డమైన చానళ్ళన్నీ అడ్డగోలుగా పుట్టుకొచ్చి, అనారోగ్యకర పోటీ లో భాగంగా ప్రతిదీ సెన్షేషనలైజ్ చేస్తున్నాయి. పోలీసు వారు కనీస ఇన్వెస్టిగేషన్ చేసి ప్రెస్ కు తెలియపరచకుండానే వారు పేర్లతో, ఫోన్ నంబర్లతో సహా వ్యాఖ్యానించడం ఖచ్చితంగా తప్పే. కనీసం 'కొందరు యువ గీరోలు, గీరోయిన్ల పాత్రకూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ' లాంటి వ్యాఖ్యలైనా చేసియుండాల్సింది. ఆ మద్య తమిళ చానల్ ఒకటి ఇదే తరహాలో వీడియోలో దొరికిన రంజిత తో పాటు ఎవరెవరో మాజీ హీరోయిన్ల పేర్లుకూడా చెప్పి అందరిని గుండు గుత్తగా కించపరచింది. కనుకనే, మీడియాకు స్వీయ నియంత్రణ లేదా ఆంబుడ్స్మన్ లాంటి వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఇది ఏమో గానీ, నిన్న అందరు నటీ నటులూ కామన్ గా చెప్పిన డైలాగ్ ఏమంటే నేను సెలబ్రిటీని కాబట్టి నా నంబర్ ఎవరి దగ్గరైనా ఉండొచ్చు అని. రమణ గారు చెప్పిన దానిలో నిజం ఉంది. ఆ నైజీరియన్ గాడికి మన నటీ నటులు నంబర్లు సేవ్ చేసుకునే అవసరం ఏం ఉంటుంది?

Anonymous said...

రాము గారు,
వారికి ఇంగిత జ్ఞానం మే ఉంటె అసలికి చానల్స్ పెట్టెవారు కాదు. వారికి ఎదీ కావాలో అది స్పషటంగా తెలుసు. మీడియ వారికి కావలసినది డబ్బు, పరోక్షం గా ప్రభుత్వం మీద అధికారం చేలాయించటం. ఆ రెండింటి కొరకే వారు వాటిని పేపర్లు, టి.వి. చానల్స్ నడిపెది అంతే కాని ప్రజను ఉద్దరించటానికి అని ఎవరైనా చెపితె అంతకన్నా హాస్యాస్పదమైన మాట మరొకటి ఉండదు. మీరు ఇంకా పాత కలపు ఆంధ్ర పత్రిక,ఆంధ్ర ప్రభ రోజుల నాటి విలువలు వీరిని నుంచి ఆశించటం ఎమీ బాగలేదు. ఆంధ్ర పత్రిక స్థాపించిన వారు దేశం కొరకు స్వాతంత్ర పోరాటం లొ పాల్గొన్న వారు. ఆ పోరాటం గురించి ప్రజలందరికి తెలియాలని ఉద్దెశం తో స్థాపించ బడినవి. వారి స్థాన్నాని ఆక్రమించిన ప్రస్తుత మీడియా వారికి 1940లో అయాన్ రాండ్ రాసిన "ఫౌంటైన్ హెడ్ " లో మీడీయా హెడ్ పాత్ర ఆదర్శం. ఇప్పుడు తక్కువ కాలం లో ఎక్కువ డబ్బులు బాగా సంపదించిన వారు తమను తాము చట్టం నుంచి రక్షించు కోవటానికి టి.వి. చానల్స్ పెట్టుకుంట్టునారు అంతెకాని ప్రజను బాగు పరచటానికి కాదు. ఇటువంటి వారు పెట్టిన చానల్స్ లో ఇంగిత జ్ఞానం, విలువలు మనం ఎమీ ఆశిస్తాం? కాని వారు మటుకు వారి డబ్బులు సంపాదించాలనే గోల్ మీద బాగా ఫొకస్ పెట్టి అన్ని విలువలకు తిలోదకాలు ఇచ్చి చానల్స్ నడుపుతున్నారు.

జర్నో ముచ్చట్లు said...

రామూ..
టీవీల్లో వస్తున్న వార్తలను చూసి..కుయ్యో మొర్రో అని మొత్తుకోవడం ఎందుకు చెప్పు. బాధ్యతాయుతమైన జర్నలిజం.. మేము సమాజహితం కోసం అని గప్పాలు కొట్టుకునే ఛానెళ్ల ముఖ్య ఉద్దేశం ఏంటో విస్పష్టంగా తెలిసిపోయినపుడు.. మనం ఎంత బాధ పడితే మాత్రం ప్రయోజనం ఏముంటుంది..? మన కన్నీళ్లు వాళ్ల "టిఆర్పీ" హృదయాలను కరిగిస్తాయా చెప్పు.? నిజంగా వాళ్లు సమాజ హితం గురించి ఆలోచించే వాళ్లయితే.. రైతులు యూరియా దొరక్క రేయింబవళ్లు పడిగాపులు కాస్తే వీరికి పట్టిందా..? పోలీసు స్టేషన్లలో యూరియా అమ్మిన సంగతి వీరి హృదయాలను కదిలించిందా..? అసలు ఈ సోకాల్డ్ ఛానెళ్లలో యూరియా కొరత అంశానికి దక్కిన ప్రాధాన్యత ఎంత? అసలు పల్లెలను పట్టించుకుంటున్న ఛానెళ్లు ఉన్నాయా..? గ్రామీణం రోగాలతో సతమతమవుతోంది.. ఎవరికైనా పట్టిందా..? విషజ్వరాలతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి.. వైద్యం అందక ఏజెన్సీ ప్రజలు.. ముఖ్యంతా విద్యార్థులు చనిపోతున్నా.. ఒక్క ఛానెల్ అయినా ఫోకస్ చేసిందా..? ఎంతసేపూ.. అయితే శ్రీరామచంద్ర.. కాకుంటే కాకా-శ్రీకాంత్ ల వివాదం. కాదూ కూడదంటే.. జగన్ ని పార్టీ నుంచి బయటకి గెంటే ప్రయత్నం. ఎవడురా టీవీ వాళ్లను సమాజహితం కాంక్షించే వాళ్లనకునేది? అంతా ట్రాష్. వీళ్లు టిఆర్పీ వలలో చిక్కుకున్న పురుగులు. అక్కడే బతుకుతారు.. అక్కడే గతిస్తారు. ఇట్లాంటి వాళ్లు ప్రసారం చేసే అల్లరిచిల్లరి కథనాలపై నీ విలువైన టైమ్ ఎందుకు చెప్పు వేస్ట్ చేస్తావు?
ఉంటా మరి

నీ.. విజయ్

Unknown said...

Ramu Garu,

You write on every topic but how come there is not write up on N TV "Naa varthalu naa istam" about MK Gandhi ?

Thanks
Srini

Vinay Datta said...

నిజము నిలకడ మీద తెలియడం మానేసి చాల కాలం అయ్యింధి

true and meaningful.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి