Sunday, September 12, 2010

చవితి నాడు 'పులి' నోట్లో తలపెట్టి....తలపోటు కొనుక్కున్న వైనం

చిన్నప్పుడు మా వూళ్ళో డ్రామా రిహార్సల్స్ మళ్ళీ గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు ఛాన్స్ దొరికినా నేను కూడా హీరో వేషం వేయవచ్చు,  నేనూ సినిమా ఫీల్డులో ఏ రంగంలో అయినా రాణించవచ్చు అన్న వెర్రి ధైర్యం పుట్టుకొచ్చింది.
శుభమా అంటూ వినాయక చవితి పండగను చేసుకుని...రోజులు బాగోలేవు కదా ఎందుకొచ్చిన గొడవ అని నీలాపనిందలు పడకుండా వుండాలని కథా శ్రవణం చేసి...ప్రసాద్ ఐ మాక్స్ లో అక్షరాలా ఎనిమిది వందల రూపాయలు వెచ్చించి టికెట్లు కొని 'కొమరం పులి' అనే తలా తోకా లేని బోడి, వెర్రిమొర్రి, చెత్త, నాసిరకం, దరిద్రపు సినిమాను చూశాక ఈ పైన రాసిన రెండు భావనలు కలిగాయి. ఈ సినిమా బాగుంది అని అన్న వాళ్ళు....లగడపాటి, కే.సీ.ఆర్. లతో పాటు ఒకే గదిలో ఒక నెలల తరబడి గడిపినా పిచ్చి ఎక్కని దృఢ చిత్తులు గానీ....చలన రహితులు గానీ అయివుంటారని అర్థం. 


అసలు ఈ పీ.కే.కు పవర్ స్టార్ అన్న బిరుదు ఇచ్చిన వాడిని వెతికి మరీ...దంచాలని ఉంది. అదొక నటన! అదొక డైలాగ్ డెలివరీ!! జనాలను ఉర్రూతలు ఊగించి ధబేలున కిందపడి నడుములు ఇరగ్గొట్టుకున్న ప్రజా రాజ్యం పార్టీ కన్నా అధ్వాన్నం గా అనిపించింది. మధ్యమధ్యలో ఏ మాత్రం అతకని ఆ తెలంగాణా మాండలికం, పిచ్చి ట్విస్టులు, స్టెప్పులు...ఛీ...ఛీ...ఇంత దరిద్రపు సినిమా గత ఐదేళ్ళలో ఎప్పుడూ చూడలేదు.

అసలు సినిమా టైటిల్ కు కథకు సంబంధం లేదు. ఒక సారి 'కొమరం' అని మరొక సారి 'కొమ్రం' అని రాసారు. పవరు స్టారు గారి డైలాగులు కామిడీకి, ఎకసెక్కానికి, సీరియస్ నెస్ కు మధ్యన కలాగాపులగం గా ఏడ్చాయి. మీడియా మీద సెటైర్లు పాతచింతకాయ పచ్చడిలా వున్నాయి. చివరకు ఒక సెమి కామిడీ కుర్రోడు...అన్ని ఇళ్ళకు పేపర్లు వేసి...బాగా సంపాదించి...చివరకు తానే ఒక పేపర్ పెడతా....అని ఇకిలిస్తూ చెప్పడంతో కథ ముగుస్తుంది. పీ.కే.తోనే చస్తుంటే....ఆ విలన్ మనోజ్ బాజ్ ఓవర్ యాక్షన్ తో చావగొట్టి చెవులు మూసాడు. రేపు పొద్దున్న క్షవరానికి అయ్యే....యాభై రూపాయలతో కలుపుకుంటే....ఈ సినిమాకు అయిన ఖర్చు కేవలం 1300. 

ఇంత అర్థరాత్రి వేళ నిద్ర ఆపుకుని ఈ పోస్టు రాయడానికి కారణం...మీరు పొరపాటునైనా....'కొమరం పులి' సినిమా చూడవద్దని గట్టిగా సూచించడానికి. ఈ సినిమాకు పోవడం పులి నోట్లో తలపెట్టడం కాదు...పులి అయితే...మెడ కొరికి ఒక్కసారే చంపుతుంది. ఇది నిజానికి ఆకలి మీద వున్న కొండచిలువకు వినాయక విగ్రహానికి పెట్టినట్లు సాష్టాంగ ప్రణామం ఆచరించడం. మెదడు పనిచేయక ఏదేదో రాస్తున్నట్లు వున్నాను. ఇక వుంటాను.

47 comments:

శరత్ కాలమ్ said...

:))

Anonymous said...

Thanks Guruajee!
ఇంకా నయం. గణేశుని పుణ్యమా అని టిక్కెట్స్ దొరుకుతాయో, లేదో అని మేమూ వెల్దాం అనుకున్న వాళ్ళం ఆగిపోయాం. లేకుంటే మీ ప్లేస్ లో నేనుండేవాణ్ణేమో? సో, ఈ రోజు వెళ్ళకపోవడానికి గణనాధునికి, రేపు వెళ్ళనవసరం లెకుండా చేసినందుకు మీకు థాంక్స్ అన్నయ్యా!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Sir,please take pains to see my post on Aug 30 to see my prediction on this movie.

Saahitya Abhimaani said...

My hearty condolences for your losing hard earned money for such lousy movie.

I wish you speedy recovery. cheers.

భాస్కర రామిరెడ్డి said...

Ramu S గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

హారం

Ramu S said...

Bhaskara rami reddi గారు
నిజంగా ఈ ఏడాది చాలా భక్తి తో పూజించాం సార్. వర్క్ అవుట్ కాలేదు. దురదృష్టం.
రాము

Alapati Ramesh Babu said...

సర్,క్షవరం అయనా మీకు ఉపయొగపడుతుంది.... కాని.....పవన్ గారి పులి....

శ్రీకాంత్‌ బాబు said...

సారు బగా చెపిండ్రు, నేనైతె తెలుగు సినిమాలు చడక కొన్ని ఎండ్లు అవుతుందీ, ఎమివుంటది ఈ తొక్కలో తెలుగు సినిమాల్లొ, ఆకిరిగా ఒక ప్రష్న మీ articleలొ "తెలంగాణా మాండలికం" కి ముందు "ఆ" ఎండుకు ??

మేధ said...

చాలా చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు.. మూడు రోజుల సెలవులు వస్తున్నాయి, ఏం చేయచ్చో గూగులమ్మని అడిగితే, ఈ సినిమా మొదటిరోజు సాయంత్రం మొదటి ఆట టిక్కెట్లు దొరుకుతున్నాయని చెప్పింది.. సర్లే ఇంటికి వెళ్ళడానికి రిజర్వేషన్ దొరకలేదు, కనీసం సినిమా టిక్కెట్లైనా దొరికాయి అనుకున్నా కానీ నా గ్రహబలం ఇంత అధ్వాన్నంగా ఉందని సినిమా చూసేవరకూ అర్ధమవలేదు :(
అసలు కామెడీ ఏంటంటే, పి.కె. అవార్డు తీసుకుంటూ ముక్కుపచ్చలారని బాలిక అదీ-ఇదీ అంటూ ఏదో చెబుతాడు.. మా ముందు సీట్లో కూర్చున్న చిన్నపిల్ల ఎవరి ముక్కు డాడీ అని అడిగినప్పుడు మాత్రం హాలు అంతా నవ్వింది, ఆ తరువాత అందరూ ఎవరి జుట్టు వాళ్ళు పీక్కుంటూ కనిపించారు.. అదండీ విషయం...!

Ramu S said...

శ్రీకాంత్ అన్న..
ఆ మొహం ఒకటి, ఆ ఏడుపు ఒకటి...అని మనం అన్నా, రాసినా...ఆ 'ఆ'కు ప్రత్యేక అర్థం ఉండదు. కోడిగుడ్డుకు ఈకలు పీకకు భాయ్...
రాము

tarakam said...

మీ పోస్ట్ చాల బాగుంది .పొద్దున్నే హ్రిదయ పూర్వకం గా నవ్వు కున్నాం.మీరు డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని నవ్వించారు . మీకు నా ప్రఘాడ సానుభూతి .

Nagaraju said...

Hi
welcome to my blog
gsystime.blogspot.com
Read for Universal knowledge and spiritual information
Thanks
Nagaraju

నేటితో రేపటి సమాచారం పూర్తవుతుందా
రేపటితో నిన్నటి సమాచారం మొదలవుతుంది
సమస్యలను అర్థానికి భిన్నంగా వివరిచుకుంటూ పొతే విషయమే అర్థం కాదు
ప్రతి సమస్యను అర్థవంతంగా పరిష్కారించుకుంటూ పొతే ఏ రోజు సమాచారం ఆ రోజుదే

భావన said...

ప్చ్.... :-(

Unknown said...

This is a comment on your previous post about the current media updates . "..ఒకడిది రెడ్డి అజెండా, ఇంకొకడిది కమ్మ అజెండా.." do u feel it is needed to bring up caste over here ? I don't see any reason for bringing up caste into this post . Do you think Studio-N channel is doing any benefit to the common people in Kamma caste ? Do you think Sakshi channel is doing any benefit to the common people in Reddy caste ? Both of the channels have only one agenda to promote their respective owners and not the common people in their caste . I don't think they have even that much broad mind ( even then it is narrow mindedness though ) . I feel u just got carried away with false assumptions and mouth propaganda like any other common man . If you want a fair and matured society with equal importance to all castes , then it starts right from you . Stop seeing them from caste angle and do stop writing up about the castes into posts . Being a responsible writer you seed the thought to think in caste angle into 10 other readers .

Anonymous said...

ఆ ఎనిమిది వందలూ పెట్టి,నాలాటివాళ్ళకు బిరియానిలు పెట్టించినా పుణ్యం వచ్చేది!

లాహిరి said...

పొలం కావాలో... ప్రాణం కావాలో తేల్చుకో... నువ్వు ఎస్.ఐ.కి పది వేలు ఇస్తే నేను లక్ష ఇస్తా... కొమురం పులి సినిమా చూసి సచ్చాడని రాసేస్తాడు.....
- ఇవ్వాళే ఒక ఎస్.ఎం.ఎస్ వచ్చింది ఇలా. మీ పోస్టింగ్ చూసాక అది మళ్ళీ గుర్తుకొచ్చింది..

సుజాత వేల్పూరి said...

పూజ ముగిశాక గుంజిళ్ళు తీయకపోతే గణేశుడికి కోపం వస్తుందిట. తీసి ఉండరు మీరు! అందుకే తగిన శాస్తి చేశాడు.. హహ్హ హ్హ! అందుకే ఇలాంటి ఎక్కువ అంచనాలున్న సినిమాలకు వెళ్ళేముందు అక్కడక్కడా కాస్త రివ్యూలు చూసి వెళ్ళాలి. జేబు, మెదడు, క్షేమంగా ఉంటాయి.

Unknown said...

Hi Ramu,

I am not happy with this article. The article narration is not good. You have right to express your feeling about the movie and you have right to adivce the people about to watch or not watch.

Recently you have posted couple of articles about EENADU srithar cartoons and expressed your unhappiness.

But now what you did. How you commented the pawan kalyan.

అసలు ఈ పీ.కే.కు పవర్ స్టార్ అన్న బిరుదు ఇచ్చిన వాడిని వెతికి మరీ...దంచాలని ఉంది. అదొక నటన! అదొక డైలాగ్ డెలివరీ!! జనాలను ఉర్రూతలు ఊగించి ధబేలున కిందపడి నడుములు ఇరగ్గొట్టుకున్న ప్రజా రాజ్యం పార్టీ కన్నా అధ్వాన్నం గా అనిపించింది.

Don't you think you crossed your limits. You will always try to point to fingures within in media or press. You will also say this is not the right way to speak/Question at TV show's.

As a experienced journalist and as teacher how you have written above comments.

I am reading your articles regurarly and most of the times I have agreed with your points. Your articles build the good impression about you.

I never expected these kind of words from you. Don't assume that based on the cast or fan feeling or some thing else I am writing this post.

I like pawan kalyan very much. Till now I have watched only his movies in theater. Compare to other hero's I have observed lot very good qualities/points in him.
Even I don't like Chiru or his son that much. He is not like a cunny or selfish guy. He try to react quickly and on the face he will express his feeling whether it is good or not. Even I have never seen nudity or vulgarity in his movies. If you compare his movies with other movies then definetly you will some difference.

If you don't like I don't have any issue. But you don't have any right to critisize like this.

As a educated person re think and do analysis on your comments how you have crtisized.

Krishnarjun said...

"The Legend came as a IRRITANT "అన్నమాట .

Ramu S said...

dear monarch,
Sorry boss, I didn't mean to hurt your feelings. I am not saying that PK is a bad actor. This post is purely based on "komaram puli". Sometimes it happens boss. You can't expect all hits from actors. Lets be sportive. Believe me, still I am suffering from the headache created by this puli.
Cheers
Ramu

seenu said...

Ramu garu...
cinema gurinchi bahu baga selavichharu...kaani aa rajagopalni kcr sarasana oke gatana kattesarenti?
rajagopal mee vyakyananiki sarigga sootaina, kcr gurinchi ala matladdam enduko nachhaledhu...

Anonymous said...

సినిమా బాగోలేదు, సినిమా చూడకండి అంటూ మిగతా వారికి చెప్పడం బాగానే వుంది కాని, పవన్ కళ్యాణ్ పై ప్రజారాజ్యం పై చేసిన కామెంట్స్ చాలా చెత్తగా మీలోని నిజమైన వ్యక్తిని బయట పెట్టేలా వున్నాయి. ఎందరికో నీతులు వల్లించే మీరు వ్రాయడం దురదృష్టకరం.

Big Data Enthusiast said...

రామూ గారూ, నాకు మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ లో మెంబర్ ఐన ఒక మిత్రుడు 4 ఫ్రీ టిక్కెట్స్ ఇచ్చాడు. వెళ్తే జరగబోయే అనర్థాన్ని ముందే గ్రహించిన నేను దానికి సిద్దపడ్డ ఇంకో మిత్రునికి ఇచ్చా.

పాపం ఫ్యామిలీ తో కలిసి వెళ్ళాడట. మూవీ అయిపోయిన వెంటనే ఫోన్ చేసాడు, అర్థ రాత్రి అని కూడా ఆలోచించకుండా! నిద్రలో వున్న నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు... అంత హింస పెట్టిన నాతో మళ్ళీ మాట్లాడినట్టు తెలిస్తే పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పిందట వాళ్ళ ఆవిడ. పిల్లలేమో గుక్ఖ పెట్టి ఏడుస్తున్నారట, తిరునాళ్ళ లో తప్పిపోయిన వాళ్ళలా. ఎలాగోలా నెక్ష్ట్ డే డిన్నర్ కి పిలిచి చెల్లెమ్మని కూల్ చేసామనుకోండి, అది వేరే సంగతి...

Vinay Datta said...

think 'monarch'expressed feelings beyond 'acting and talent '. I was enjoying reading the post till I read about 'prajaaraajyam '. I sincerely feel there's no need to mention this in this context. And....I'm at wquidistance from all parties.

Ramu S said...

మధురి గారు,
'ఊరించి నీరుగార్చడం', 'బాగా హడావుడి చేసి నిరాశాపరచడం' అనే అర్థంలో ప్రజారాజ్యం ప్రస్తావన తెచ్చాను.
సీనూ గారు,
ఇద్దరిలో ఏ ఒక్కరిని కించపరచడం లేదు. ఇద్దరు ఒకే రూం లో ఉంటే...తిట్టుకుంటూ, కొట్టుకుంటూ బీభత్సం సృష్టిస్తారనే అర్థం లో అది రాసాను.
raamu

Sudhakar said...

Thanks to facebook..my facebook friends warned me not to dare a bit..just after the first morning show of this great flick of tollywood.

Sudhakar said...

బాబు ఏ2జడ్, మోనార్కులు...ఇక్కడ వున్నోల్లంత కుషీ సినిమాని ఒకటికి పది సార్లు చూసి...డీవీడీ కొనుక్కుని వున్నోల్లే. కానీ చెత్త సినిమా ని ఎలా కావాలంటే అలా వుటికే హక్కు పదిహేను వందలు పోగొట్టుకున్న ప్రతీ తెలుగు ప్రేక్షకుడికి వుంది. మీ ఫాన్ కళ్ళద్దాలు ఒక సారి తీసి పులి చూడండి. మీ మనీ ఎప్పుడు వేష్టు కాదు.

deepu said...

komaram puli eppudu eppudu chudama anukuntunna thank god..and thank u ramu garu munde cheppi nannu bathikincharu.....
పొలం కావాలో... ప్రాణం కావాలో తేల్చుకో... నువ్వు ఎస్.ఐ.కి పది వేలు ఇస్తే నేను లక్ష ఇస్తా... కొమురం పులి సినిమా చూసి సచ్చాడని రాసేస్తాడు.....
srinivas garu ee msg chala nachindi rojantha navvukunnanu...
thanku

seenu said...

the one F l A w I n women
author uknown
Women have strengths that amaze men. They bear hardships
and they carry burdens, but they hold happiness, love and joy.
They smile when they want to scream.
They sing when they want to cry.
They cry when they are happy, and laugh when they are nervous.
They fight for what they believe in.
They stand up to injustice.
They don’t take “no” for an answer
when they believe there is a better solution.
They go without so their family can have.
They go to the doctor with a frightened friend.
They love unconditionally.
They cry when their children excel,
and cheer when their friends get awards.
They are happy when they hear about a birth or a wedding.
Their hearts break when a friend dies.
They grieve at the loss of a family member, yet they are strong
when they think there is no strength left.
They know that a hug and a kiss can heal a broken heart.
Women come in all shapes, sizes and colors.
They’ll drive, fly, walk, run or e-mail you to show
how much they care about you.
The heart of a woman is what makes the world keep turning.
They bring joy, hope and love. They have compassion and ideas.
They give moral support to their family and friends.
Women have vital things to say and everything to give.
However, if there is one flaw in women, it is this;
They forget their worth and how remarkable they truly are!
www.t h e o n e F l awi nwome n. com

Anonymous said...

Sudhakar, mind your business sir.


Ramu S, I take back my words on you. "మెదడు పనిచేయక ఏదేదో రాస్తున్నట్లు వున్నాను." అన్న మీ మాటలను ఇగ్నోర్ చేయడం వలెనే మిమ్మల్ని అపార్దం చేసుకున్నాను. I am really sorry. మీ పరిస్తిత్తే నా పరిస్థితి కూడా after watching movie.

NARESH said...

sir ramu garu,
oka cinema kondarki nachuthundi,marikondariki nachakapovachu.andarki oke opinion undalani ledu.meeku nachaledu ok naku nachaledu ani rrasthe bavundedi kani migilina vallani choododdu ani cheppadam correct kadu.mee opinoin andari meeda ruddadam entha varaku correcto mere alochinchukondi.i am very sorry sir

Ramu S said...

నరేష్...
సారీ ఎందుకు? నిజంగా ఈ సినిమా అస్సలు బాగోలేదు సర్. అందుకే అలా రాయాల్సి వచ్చింది. బ్లాగ్ రీడర్స్ ను స్నేహితులుగా భావించి ఆ సలహా ఇచ్చాను. అంతే. మీరు సినిమా చూసి మీ అభిప్రాయం రాయండి. నా అభిప్రాయంతో ఏకీభవించకపోతే...ఈ పోస్ట్ ఎత్తేస్తా.
రాము

Surya Tej Reddy said...

thanks ramu sir.. u saved me .. oka friend call chesi night show ante ok .. anna .. ready avutaniki water heat chestunna .. aa lopala .. blog lo review chadiva ... vaadiki phone chesi .. are! mummy night show aithe ..vaddu antundi ra ! ani cheppesi padukunna ;) .. :)

Sudhakar said...

Mr A2Z if everyone minds their business and respect other's views laterally, this discussion wouldn't be like this. Sorry to say this but it the fact. Stay cool.

Sudhakar said...

Dear Ramu garu,

Let everyone know if you are writing this blog for you or someone else. Blog reading requires some maturity which lacks largely in our telugu blogosphere.

Thanks
Sudhakar

Anonymous said...

@Sudhakar
well said, majority of our blog readers are thinking as if this is a forum for REFERENDUM on the topics given. We should come out of such impression. In reality a blogger can write his own views on anything & in any manner they like. We need only to respond in a rationale way.

Unknown said...

ramu garu, i started reading your blog from last 3months , during initial stages i used to start my day reading your blog, dont know now a days i lost interest ,may be your getting diverted from the aim of your blog..

i want to see your blog on par with some english news blogs

media yela dhigajaripoyindo chudandi ,in one of the blog i read sainath P says

"“How many national media journalists were covering the agrarian crisis in Vidarbha? There were six. But there were 512 journalists covering the Lakme Fashion Week in Bombay."

applies to us also

Unknown said...

IRS Q2 2010

I request Ramu garu to put some informative posts like this

Of the 14 Telugu publications – eight dailies and six magazines – six have seen declines according to the Indian Readership Survey (IRS) Q2 2010. Among the dailies, Eenadu and Sakshi take the lead, while among the magazines, Swati Sapari Vara Patrika and Annadata emerge on the top.

Both Eenadu and Sakshi have show growth in AIR of 3.55 per cent and 1.62 per cent, respectively. Andhra Prabha, which is placed sixth, is the only other Telugu daily to have shown growth in AIR, garnering the highest growth of 13.73 per cent.

Andhra Jyothi, Vartha, Andhra Bhoomi, Surya and Prajasakti are among those that have seen decline in readership. Of these, Andhra Bhoomi has recorded a massive drop of 28.86 per cent, the steepest decline among all 14 Telugu publications. Vartha is next with a drop of 27.96 per cent.

The highest gainer among Telugu publications is weekly magazine Sitara, which has recorded a growth of 30 per cent; its AIR going from 50,000 in Q1 to 65,000 in the latest round.

Among the magazines, Swati Sapari Vara Patrika leads the pack, registering a growth of 14.62 per cent in its readership, while Annadata at No. 2 has recorded a growth of 6.98 per cent. Telugu weekly Andhra Bhoomi Sachitra Vara Patrika has also a 17.39 per cent growth in readership.

Swati is the only periodical to have seen a decline. The AIR of the monthly magazine fell by 9.72 per cent.

Naagarikuda Vinu said...

saaru meeku nenu " Peepli Live" chudandi, chala bagunnadi ani mail chestini. meeremo pattinchukoka potiraaye. mallanemo antha paisalu karsu petti maree netti noppi techkuntiraaye. em chestam, mem cheppetdi mem cheppinam aa tarvata mee ittam! I pity you :D

Anonymous said...

Sudhakar, ఒక్కసారి చెపితే అర్ధం కాదా మీకు ? మీ పని మీరు చూసుకోండి సారూ. మీ సలహాలు నాకు వద్దు. నాకు రిప్లై ఇవ్వకండి.

Anonymous said...

Dear Ramu!
బహుశా మీరీమద్య బిజీ అయిపోవడంవల్ల మంచి విషయాల మీస వ్రాయలేకపోతున్నట్లున్నారు. లేకపోతే పులి మీద ఇంత చర్చలెందుకు సార్. ఏదో మీరు పడ్డ తిప్పలు మీరు చెప్పుకున్నారు, అంతమాత్రాన ఒకాయనేమో మీరేది చెబితే బ్లాగర్స్ అందరూ అదే చేస్తారనీ, పులి చూడొద్దన్నందుకు ఎవరూ చుడక వారి పీ.కె కు నష్టం జరిగిపోతుందన్నట్లు ఆక్రోశపడిపోతాడు-అక్కడికి మీ బ్లాఘులో మీకు నచ్చిన (నచ్చని) విషయాన్ని మీరు వ్రాయగూడదన్నట్లు.
అబ్బో, ఇంక చాలు సార్. తొందరగా దీన్ని ముగించి మరొక ఆసక్తికర టపా వ్రాయండి సార్. సపోజ్ 'మీడియ ఆంబుడ్స్‌మన్ ' పైన చర్చ పెడితే బాగుంటుందేమో? ఎందుకంటే దాదాపు మన అన్ని టపాలలో మీడియా అతిమీద వ్రాసాం కానీ దాన్ని అదుపులో పెట్టడానికి మార్గాల గురించి చర్చించలేదు.

Sudhakar said...

ఏ పీ మీడియా కబుర్లు బ్లాగు బాగా అర్ధం కావాలంటే కొద్దిగా బుర్ర వుండాల్సిందే. వుంటే చదవాలి, లేకపోతే తొంగొవాలి. ఇక్కడ పనికిరాని స్టేట్మెంట్ లు పారేసి, రచయతకి టపా వుంచాలా వద్దా అనే విరక్తి కలిగించకండి. మనసుకి తోచింది ధైర్యంగా రాసేవాళ్ళు అసలే తక్కువున్న తెలుగు లోకం మనది.

Krishnarjun said...

ఈ సినిమా చూసి వారం రోజులైనా మీరు తేరుకున్నట్లు లేదు??
వారం రోజులుగా కొత్త టపా లేవీ వేయట్లేదు.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

నా బ్లాగు http://dare2questionnow.blogspot.com/ లో 12 సరదా ప్రశ్నలు (చాలెంజింగ్) అడిగాను. సమాదానాలు try చెయ్యండి.
1. మనం పుట్టినప్పటినుండీ ఒకే సైజ్ లోవుండే అవయవం ఏది? మరియు చనిపోయేంతవరకూ పెరుగుతూనే వుండే అవయవాలు ఏవి?
2. ప్రపంచంలో ప్రస్తుతం బ్రతికున్న మనుష్యుల సంఖ్య, కుక్కల సంఖ్య, కోళ్ళ సంఖ్య లలో ఏది ఎక్కువ?
3. ‘‘dous’ అక్షరాలతో అంతమయ్యే 4 ఇంగ్లీషు పదాలను ప్రయత్నించండి. ఇఒకా ఎక్కువ వీలవుతాయా?
4. ఇంగ్లీషు అచ్చులు అయిన ‘a,e,i,o,u’ లు అదే వరస క్రమంలో వచ్చేట్లు ఏవైనా రెండు పదాలు వ్రాయండి?
ఇలాంటివి. good luck. see you.

Ram said...

Ramu garuuuuuuu..........kotha post cheyandi maha prabhooooooo.........10days nunchi update ledu..blog open cheyadam patha post undatam close cheyadam jarugutundi...new post veyandi sir..Urs Ramesh.......

Satish Meesala said...

hi ramu,been reading ur blogs for last few years.I love them.But ..now ..am urging to not make this a battle field for kammas & Kapus.if u are keen on expressing ur feeling on movies..we will be forcing u to write reviews all balakrishna family movies.
Oka Movie ni Batte,Meeru Actor ni estimate cheste ...can we judge u based on any of ur OKOK posts..?
PLZ DONT MAKE THIS SACRED PLACE AS BATTLE FIELD- SATISH MEESALA,PINNER,LONDON

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి