Friday, September 24, 2010

'ఈనాడు' పాత్రికేయుడు గౌస్ గారి మృతి

'ఈనాడు' కు దాదాపు పాతికేళ్ళ పాటు సేవలందించిన సీనియర్ జర్నలిస్టు ఎండి గౌస్ (55 ఏళ్ళు) గారు ఈ ఉదయం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఒక ఏడాదిగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు 'ఈనాడు' వర్గాలు తెలిపాయి. ఆయన ప్రస్తుతం 'ఈనాడు' లో Deputy News Editor గా పనిచేస్తున్నారు.

మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయనకు రోజు విడిచి రోజు డయాలిసిస్ చేసేవారని, ఆయన మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చితికి పోయారని 'ఈనాడు' వర్గాలు తెలిపాయి. రక్తపోటు, షుగర్ సమస్యల వల్ల ముందుగా కిడ్నీ, తర్వాత లివర్ దెబ్బతిన్నాయి. తర్వాత శ్వాసకోశ సంబంధ సమస్య వచ్చింది, కంటి చూపు పోయినట్లు 'ఈనాడు' లో ఉన్నత స్థాయిలో ఉన్న మిత్రుడొకరు చెప్పారు.
ఈ ఏడాదే గౌస్ గారి కూతురు వివాహం చేశారు కానీ అది దెబ్బతినడంతో ఆయన మరొక సంబంధం చూసే పనిలో ఉండగా ఈ దారుణం జరిగిందని ఈ మిత్రుడు తెలిపారు. చెన్నై లో చదువుకుంటున్న గౌస్ గారి అబ్బాయి ఈ రాత్రికల్లా హైదరాబాద్ వస్తున్నారు.  


జర్నలిస్టులకు సాధారణంగా ఉండే అహంకారం, గోరోజనం, పొగరు వంటి లక్షణాలు ఏమాత్రం లేని గౌస్ గారు 'ఈనాడు' లో చాలా మంది జర్నలిస్టులకు సన్నిహితులు. "ఈనాడు కోసం ఆయన రక్తం ధారపోసారు. టైం కు తినకపోవడం వల్లనే ఇలా జరిగిందని అనుకుంటున్నాను," అని 'ఈనాడు' ఉద్యోగి ఒకరు చెప్పారు. 'ఈనాడు' సిబ్బంది ఈ మధ్యనే ఆయన కోసం కొంత మొత్తం విరాళంగా అందించారు. నాతో కూడా గౌస్ గారు చాలా ఆత్మీయంగా వుండేవారు. ఆయన మరణం నన్ను కూడా కలచివేసింది. 

గౌస్ గారి భౌతిక కాయాన్ని ఆయన నివాసానికి ఈ సాయంత్రం తరలించారు. రాత్రికి ఆయన స్వస్థలమైన నరసరావుపేటకు తరలించే అవకాశం ఉందని, వారి బాబు వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటారని 'ఈనాడు' జర్నలిస్టులు తెలిపారు. శనివారం అంత్యక్రియలు జరుగుతాయి. గౌస్ జీ...We miss you.

13 comments:

సుజాత వేల్పూరి said...

గౌస్ గారి గురించి ఎంతో గొప్పగా విన్నాను. నిజానికి మీ బ్లాగు పరిచయం కూడా వారి అనారోగ్యం వార్త తో నే జరిగింది అనుకోకుండా!(ఒక మిత్రుడు లింక్ పంపడంతో)

వేళా పాళా లేకుండా వృత్తికి అంకితమవడం జర్నలిస్టులకు తప్పని సరి అయినా, ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకతను గౌస్ గారి మరణం తెలియజేస్తోంది. ముఖ్యంగా ఒక తీరూ తెన్నూ లేని లైఫ్ స్టైల్(వృత్తిపరంగా అవవాటుపడినదైనా సరే) డయాబెటిస్ కి దారి తీసే అవకాశం ఉన్న ఈ రోజుల్లో, ఒక్కసారి అది వచ్చాక ఇక ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఎక్కువ బాధ్యతలు,ఒత్తిళ్ళ మధ్య పని చేసే వారు, గుర్తు పెట్టుకోవాలి.

గౌస్ గారి పిల్లలు కూడా ఇంకా సెటిల్ కాలేదంటే బాధగా ఉంది.

గౌస్ గారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

Alapati Ramesh Babu said...

గౌస్ గారి కుటుంబానికి సంతాపం. పాపం మెనెజ్మెంట్ యెమన్నా సాయమా లెక మాములుగానె రూల్స్ .......... ఆహ అందుకు కొదవవుడదు.రామొజి గారి కంపెని లొ.పాపం గౌస్ గారు యెజన్మలొ నొ బాకి ఇలా చెల్లగొట్టుకొని వుంటారు.

Vinay Datta said...

My sincere condolences to Gous garu's family.

Again and again we are forgetting that 'I' must be in a position to first support 'myself' and then the family, organization and the society. When will we start loving ourselves?

astrojoyd said...

really shocking news to me sir/jayadev,chennai-17

Anonymous said...

గౌస్ గారి మృతికి నా ప్రఘాడ సానుభూతి.
అయితే మన జీవితంలో ఒకరి చేదు అనుభవం ఎందరికో అప్రమత్తత నేర్పుతుంది. గౌస్ గారి లాంటి నిబద్ధత గలిగిన జర్నలిస్ట్‌కు చివరికి మిగిలిందేమిటి? పోయేముందు ఆయన పిల్లలకు ఒక స్తిరత్వం ఇవ్వకుండా పోతున్నానే అని ఎంతగా క్షోభించియుంటారు. వృత్తి పట్ల ఎంత నిబద్ధత కలిగియున్నవారైనా, సొంత లాభం 'కొంతే' మానుకొని పనిచేయాలనీ, అంతా మానుకొని పనిచేసినా అందరినీ ఒకే గాటన కట్టి 'ఆః మనమిచ్చే జీతానికి మిగతావాళ్ళకన్నా ఇతనెక్కువ న్యాయం చేసాడు తప్ప నాకు ఈయనేం ప్రత్యేకం కాదు ' అనే టైపు హృస్వ దృష్టి గల చెత్త యాజమాన్యాలే ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి.

Unknown said...

GOUSE SIR I MISS U.

Unknown said...

sri

sir we miss u

Thirmal Reddy said...

@RS Reddy

With my deepest condolences.... I totally second your comment.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Unknown said...

ఏమండి RSరెడ్డిగారు, మీ తెలుగుకి కాస్త తెగులు సోకినట్టుంది. ఎవరైనా సానుభూతి మృతుల కుటుంబానికో లేక బాధితులకో తెల్పుతారు, మీరేమో ఏకంగా గౌస్ గారి మృతికే సానుభూతి చూపిస్తున్నారు.

Anonymous said...

@Edge
క్షమించాలి మృతికి అంటే వారు మృతి చెందడం పట్ల అని. సానుభూతి బదులు సంతాపం అని వ్రాసుండవలసిందేమో.

Damaraju Venkateswarlu said...

Really very sad..Though I don't know him personally I respect all sincere and service oriented people like Sri Gouse. My heartfelt condolences to Sri Gouse family. May his soul rest in peace.

prabhakarrao said...

Gouse gariki bheshajam ante theliyedu..sahacharulanu aayena entha
gouravistharo matallo cheppalem...aayana biddalni aa dhevudu thappakunda kapadathadu..

PRABHAKAR

deepu said...

really we miss u sir

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి