Friday, December 24, 2010

శరత్ ఆవేదనకు పరిష్కారం ఏమిటి చెప్మా?

ప్రముఖ బ్లాగర్ శరత్ గారిది న్నది ఉన్నట్లు కుండ బద్దలుకొట్టినట్లు చెప్పే మనస్తత్వం. జనం సభ్యత, సంస్కారం ముసుగువేసి మేకప్ తో కప్పేసే పలు అంశాలకు ఆయన తనదైన భాషలో తన భాష్యం చెబుతారు. ఆయనీ మధ్యన హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఆఫీసుకు ఆహ్వానించాను. ఒక గంట పాటు మాట్లాడాను. ఆయన నిర్మొహమాటత్వం, విషయాల పట్ల క్లారిటీ నాకు బాగా నచ్చాయి. ఆయన ఇంటర్వ్యూ  హెచ్.ఎం.-టీ.వీ.లో వచ్చేట్లు చేయాలని చాలా ప్రయత్నించాను కానీ....కుదరలేదు. 
తను నాకు ఆ రోజు చెప్పిన పలు అంశాలతో 'పెళ్ళయిన బ్రహ్మచారిని నేను!' అన్న శీర్షికతో ప్రచురించిన అత్యంత డేరింగ్ పోస్టు చూసి మా అబ్రకదబ్ర ఆగలేక రాసి పంపిన పోస్టు ఇది. 'వాడొక పెంట వెధవ' అని ఒకప్పుడు తిట్టిన ఒక మహిళా బ్లాగరు...'మీరు ఏమైనా అనుకోండి...ఆ శరతే బెటర్ అనిపిస్తున్నది నాకు. ఉన్నది వున్నట్లు రాస్తాడు,' అని ఈ మధ్యన అన్న విషయం గుర్తుకు వచ్చింది...ఈ పోస్టు పబ్లిష్ చేస్తుంటే. మా అబ్రకదబ్ర గాడి ఆత్మఘోష ఇప్పుడు చదవండి...రాము
--------------------------------------------------------------------------------
శరత్ 'కాలం' ఇవ్వాళ చాలా మందికి పెద్ద హాట్ టాపిక్ అనిపించవచ్చు. శరత్ మీద మంట వున్న వాళ్ళు కూడా....బాధపడేట్లు ఉందా కథనం. ఒక ముఖ్యమైన విషయాన్ని ఈయన ప్రస్తావించాడు. మగ వల్ల ఆడకు గానీ, ఆడ వల్ల మగ కు గానీ ఇలా జరగడం గృహహింస కిందికే వస్తుంది. 

దంపతుల మధ్య గుట్టుగా ఉండాల్సిన విషయాన్ని ఇలా బహిర్గతం చేయవచ్చా? ఈ పోస్టు రాయడానికి ముందు శరత్ తన శ్రీమతి అనుమతి తీసుకున్నారా? ఈ పోస్టు గురించి తెలిస్తే ఆమె ఎలా ఫీలవుతారు? నిజంగా శరత్ వైపు నుంచి ఏమీ తప్పులేకుండానే ఆమె అలా ప్రవర్తిస్తున్నారా? నిజంగానే విడాకులు ఇచ్చి పారేస్తాడా? పెళ్లి కాకముందు మనోడు పిచ్చి తిరుగుళ్ళు తిరిగిన విషయం తెలిసినందునే శరత్ పట్ల మేడం అలా ప్రవర్తిస్తున్నారా? ఇత్యాది ప్రశ్నల జోలికివెళ్ళకుండా ఉంటే...ఒక్కటి మాత్రం నిజం: నిజానికి శరత్ బాధ....ఈ ఇండియాలో మెజారిటీ మెజారిటీ వివాహితుల బాధ. పెళ్ళయిన బ్రహ్మచారులే తొంభై శాతం మంది. పెళ్లి బాసలు, కట్టుబాట్లు వంటి నైతిక సంకెళ్ళ మధ్య నలుగుతూ మూసుకు కూర్చున్న వారే అధికం. ప్రేమపెళ్లి చేసుకున్న జంటలలో కూడా ఈ పరిస్థితి ఉండడం విచిత్రం. మగవాడి అనాసక్తి వల్ల ఉస్సురుమనే మహిళలూ ఉండకపోరు. ఇలాంటి కీలక విషయాల మీద చర్చ జరగకపోవడం, జరిపితే...తప్పన్నట్లు చూడడం మన విషాదం. 

ఈ తొక్కలో జీవితంలో...సెక్స్ ఎంతో ముఖ్యం. మనిషన్న ప్రతి వాడికీ ఇది అనుభవంలోకి వచ్చే సత్యమే. కానీ...పిల్లలు పుట్టగానే ఇక పని అయిపోయిందన్న భావన పెరగడం సాధారణం అయిపోయింది. నాలుగు పదులు దాటక ముందే...'ఇంత వయస్సు వచ్చినా...ఇంకా ఏమిటీ....పాడుపని' అనుకునే వారే అధికం.
సెక్స్ కు దూరంగా వుంచబట్టే...కుటుంబాలకు దూరంగా ఉండే సైనికులు కనిపించిన మహిళలను రేప్ చేయడం చూస్తున్నాం. సెక్స్ కు దూరంగా ఉండే మనిషి ప్రవర్తనకు, కనీసం రెండు మూడు రోజులకొకసారైనా సెక్స్ సుఖం వున్న వ్యక్తి ప్రవర్తనకు మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 

అన్నం, నిద్ర లాగా ఈ సుఖం చాలా ముఖ్యం, అది నిత్య సత్యం. ఇంత ముఖ్యమైన విషయాన్ని పిల్లలకు బోధించకుండా...పెళ్ళిళ్ళు చేస్తారు. దోస్తుల ద్వారా...బూతు పుస్తకాలు, నీలి చిత్రాల ద్వారా 'విషయ'జ్ఞానం పెరిగిన మగవాడి కోరికకు...సంప్రదాయం బుట్టలో తరలివచ్చిన ఆమె అవగాహనకు మధ్య పొంతన కుదరడం లేదు. సెక్స్ లేక మాడే వారే దొంగ పనులు, వైవాహికేతర సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంది. అందుకే శరత్ లేవనెత్తిన అంశం కీలకమైనది. సెక్స్ లో పాల్గొన్న తర్వాత రెండు రోజుల పాటు నాకైతే...ఆడ పురుగు వైపు చూడబుద్ధి కాదు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇదే చెబుతారు.

ఈ సమస్య పోవాలంటే....మన విద్యావ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో బలమైన మార్పులు రావాలి. సెక్స్ పట్ల అందరికీ మంచి అవగాహన పెరగాలి. సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచం తలరాతను మారుస్తుంటే...ఎంతో కీలమైన ఆనందం విషయంలో మాత్రం మనం అనుకూలమైన వ్యవస్థను నిర్మించుకోలేకపోతున్నాం. ఇదొక విషాదం. మహా విషాదం. 

ఇప్పుడు శరత్ పోస్టు చదివిన కపుల్స్ చేయాల్సింది ఒక్కటే: కనీసం పక్షానికి ఒకసారైనా కూర్చొని సెక్స్ గురించి మాట్లాడుకోవాలి. పరస్పర అవసరం గురించి సమీక్షించుకుంటూ....సవరణలు చేసుకుంటూ...పథ(డ)క రచన చేసుకోవడమే. లేదంటే....ప్రతి జంటా....కొత్త సంవత్సరపు తీర్మానాల జాబితాలో సెక్స్ ను చేర్చాలి. శరత్ సమస్య కూడా శరవేగంతో పరిష్కారమై...మనోడు ఇంటికిపోవడానికి కూడా భయపడే ఒక విచిత్ర  పరిస్థితి రావాలని ఆశిద్దాం. 

Wish you good luck Mr&Mrs Sharat

--With love.... Abrakadabra

13 comments:

lakshman said...

I am reading sarth posts from long back. I liked his frankness.

I think this year one of the best blog article is 'పెళ్ళయిన బ్రహ్మచారిని నేను!' .

Sarth has to think about his children feature and if needs he has bear the pains and live with her wife for this life

విజయ్ అనంగి said...

'ఎవరి స్వార్థంకోసమో బలిపీఠం ఎక్కిన లేగను నేను'..
ఇవి పైళ్లైనకొత్తలో డైరీలో రాసుకున్న మాటలు. ఈసమస్య ఒక్క శరత్ గారిదేకాదు.మీరన్నట్టు తొంబైశాతంమందిది. ఇందులో ఆడ, మగ తేడాలేదు. మనసుపడ్డవాళ్లే.. జీవితభాగస్వామి కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. సంప్రదాయం, కట్టుబాట్లు, ఇవేకాదు... పెద్దవారి ముందుచూపు కూడా చిన్నోళ్లకు సంకెళ్లవుతున్నాయి. డబ్బో ,అందమో చూసి ఇష్టంలేని పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు. అసలు శృంగారం అనేది.. 10 శాతం శరీరానిదైతే..90శాతం మానసికమైనది.ఆకలి, దాహంలా మనిషికది సహజమైన లక్షణం. ఇది గ్రహించకుండా 'కట్టడి'చేస్తే... విపరీతాలేమరి...!! ఎక్కువశాతం గృహింసలకు సెక్స్ లో అవగాహన లేకపోవడమేనని నాఅభిప్రాయం. టీనేజ్ వచ్చేసరి ప్రేమలోపడి జట్టు కట్టేస్తున్నవారిలో.. ఎక్కువ జంటలు ఇదే సమస్యతో కుమిలిపోతున్నారు. మీరన్నట్టు పెళ్లికి ముందు విషయజ్జానం ముఖ్యమేగాని.

శరత్ కాలమ్ said...

@ ఆబ్రకదబ్ర
మీ టపా చూసి విస్మయం, ఆనందం చెందాను. ధన్యవాదాలు. నేను చాలా మంది దృష్టిలో, మా ఆవిడ దృష్టిలో పెంట వెధవనే అయివుండవచ్చు. నేను పెంట వెధవనే అనే విషయాన్ని అంగీకరిస్తున్నాను. కాకపోతే ఆ వెధవతనం నా దృష్టిలో లైంగిక హక్కులు అంతే. ఆ విషయం నేను పెళ్ళికి ముందే వివరించాను. నాకో పెంట పెళ్ళామే కావాలనుకున్నాను. పవిత్రమయిన పెళ్ళాం వద్దనుకున్నాను. పెంట పెళ్ళాం వస్తేనే నాతో మనుగడ సాగించగలదు అని తెలుసు. అయితే కనీసం భర్తతో కూడా సంసారం చెయ్యనంత మహా పతివ్రత నాకు లభించడంతో నా గొంతులో పడింది పచ్చి వెలగకాయ. (ఇక్కడ పతివ్రత అన్న పదాన్ని వ్యంగ్యంగా మాత్రమే వాడుతున్నాను. చాలావరకు ప్రతి భర్తా తన పెళ్ళాన్ని పతివ్రత అనే నమ్ముతాడు). పెంట మొగుడిని వదిలిపెట్టేంత ఆత్మ స్థైర్యం, వ్యక్తిత్వం మా ఆవిడకి కలగాలని, ఆమెకు మరో పరిపూర్ణ పురుషుడు భర్తగా లభించాలని, ఆమె మున్ముందు జీవితం ఆనందంగా కొనసాగాలని అందరం కోరుకుందాం, ఆస్థికులం అయితే పూజలు చేసేటప్పుడు దేవదేవునికి అనిత పేరుపై ఓ విన్నపం చేద్దాం.

Anonymous said...

డియర్ రాము!
ఎప్పుడూ స్త్రీల విషయం రాగానే చాలా సంప్రదాయంగా, ఒకింత స్త్రీవాది టైపులో వ్రాసే మీరు స్వభావ విరుద్ధంగా ఒక అత్యంత ప్రాముఖ్యతగల అంశంపైన, అదీ పచ్చి నిజాల్ని కాస్త పచ్చిగా (కొందరికి) అనిపించేవిధంగా...(నాకు మాత్రం నో ఆబ్జక్షన్) చాలా డేరింగ్‌గా వ్రాసిన ఈ టపాపై మీకు హేట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మీరు ప్రస్థావించిన ఈ విషయాలన్నీ 100% వాస్థవాలు మరియు ఎన్నాళ్ళుగానో సామాజిక శాస్త్రవేత్తలు నెత్తీ నోరూ బాదుకొని చెబుతున్న వాస్థవాలే.
మీరు వ్రాసిన కొన్ని విషయాలపై నా అభిప్రాయాలు:
@ "పెళ్లి కాకముందు మనోడు పిచ్చి తిరుగుళ్ళు తిరిగిన విషయం తెలిసినందునే శరత్ పట్ల మేడం అలా ప్రవర్తిస్తున్నారా?"
నిజానికి ఇదే తప్పు చాలామంది ఆడవాళ్ళు చేస్తూ తమ జీవితాల్ని దుర్భరం (భర్తలను ఇలాంటి వంకలపేరుతో దూరంగా ఉంచి హింసించడం ద్వారా) చేసుకుంటున్నారు. నా ఉద్దేశ్యం నిజంగా పెళ్లి కాకముందు మనోడు పిచ్చి తిరుగుళ్ళు తిరిగిన విషయం తెలిసినంతమాత్రాన ఇన్ని యేళ్ళ అనుబంధాల్ని పక్కనపెట్టి కర్కశంగా ప్రవర్తించడం క్షమార్హం కాదు. అదీ పిచ్చి తిరుగుళ్ళు తిరిగిన విషయం కేవలం గతం మాత్రమే అయినప్పుడూ, తన సాంగత్యం తరువాత అతను మళ్ళీ ఆ తప్పును చెయ్యనప్పుడూనూ. ఒకవేళ అతను అదే తప్పు ఇప్పటికీ చేస్తున్నప్పుడుమాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఆడది అతన్ని క్షమించకూడదు. అంతేకాదు వెంటనే అతనినుండి విడిపోవడానికీ వెనకాడరాదు. కానీ ఆ పని చెయ్యకుండా తనకో తోడూ నీడా ఉండాలికాబట్టి..అనుకుంటూ తనకు తాను నమ్మకద్రోహం చేసుకుంటూ అతనికీ ద్రోహం చేస్తూ ఆ (నరకప్రాయమైన) కాపురాల్ని కొనసాగించడం మాత్రం చాలా పెద్ద తప్పు. కానీ చాలామంది అదే చేస్తుంటారు.
మరో విషయం అదే పెళ్ళైన కొత్తలో అదే భర్త పాత స్నేహాల గురించి తెలిస్తే ఇలాగే రియాక్ట్ అవుతుందా? మొగున్ని పక్కనపెట్టడానికో, వదిలేయడానికో మొగ్గుచూపుతుందా? నేనంటాను-ఖచ్చితంగా అలా చెయ్యదు. వయసు వేడివల్ల కావచ్చు, కొత్తగ మొదలైన కొత్త కాపురంపై ఉన్న ఆశలవల్ల కావచ్చు, లేదా స్త్రీలో సహజ సిద్ధంగా ఉండే క్షమా గుణంవల్ల కావచ్చు ఆమె తనను తాను అతనికి సమర్పించుకుంటుంది. మరి అదే క్షమా హృదయం కొన్నేళ్ళతర్వాత ఎక్కడికిపోతుంది?
ఇంకా ఈ క్రింది పాయింట్స్‌కు బహుశా ఎంతటి స్త్రీవాదులకైనా అభ్యంతరం ఉండదనే భావిస్తాను:
1. మగవాడి అనాసక్తి వల్ల ఉస్సురుమనే మహిళలూ ఉండకపోరు.
2. పిల్లలు పుట్టగానే ఇక పని అయిపోయిందన్న భావన పెరగడం సాధారణం అయిపోయింది. నాలుగు పదులు దాటక ముందే...'ఇంత వయస్సు వచ్చినా...ఇంకా ఏమిటీ....పాడుపని' అనుకునే వారే అధికం.
3. సెక్స్ కు దూరంగా ఉండే మనిషి ప్రవర్తనకు, కనీసం రెండు మూడు రోజులకొకసారైనా సెక్స్ సుఖం వున్న వ్యక్తి ప్రవర్తనకు మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
4. ఇప్పుడు శరత్ పోస్టు చదివిన కపుల్స్ చేయాల్సింది ఒక్కటే:...పథ(డ)క రచన చేసుకోవడమే.

Vinay Datta said...

I wish all the best to Sarath garu and Anitha garu.

Vijay Bhaskar said...

తప్పో రైటో, నలుగురి తో పాటూ నారాయణ అనే వాళ్ళ జీవితాలు, ఆనందం గా కాకపోయినా, ఓ మోస్తరు ప్రశాంతం గా సాగిపోతాయి. అలా కాదు, నేను నిజం అని అనుకున్నదానికి కట్టుబడి నిలుస్తాను, అవసరం అయితే సమాజాన్నే ఎదిరిస్తాను, అని అనుకుంటే, అడుగడుగునా, ఇంటా బయటా ఒడిదొడుకులు తప్పవు. అందరి జీవితాలూ, ఓ రోజు ముగిసి పోవాల్సిందే, కొందరి నీడలు కాస్త ఎక్కువ పొడుగ్గా ఉంటాయి, అంతే తేడా. ఎన్ని మనస్తత్వాలు, ఎన్ని ఆలోచనలు.. నిజం గా నిజం అంటూ ఒక్కటే ఉందా అని అనిపిస్తుంది నాకు.

Anonymous said...

శరత్ గారి టపా చదివిన వారినీ, వారిపై (వన్ సైడ్) సానుభూతి చూపినవారినీ, శరత్ గారినీ ఓ విషయం నేను సూటిగా అడుగుతాను, నొప్పిస్తే క్షమించండి. సపోజ్ మనకే ఏదైనా (ఏక్సిడెంటో, ఎక్షో, వైయో) జరిగి మనం ఆ 'పనికి ' పనికిరాకుండా పోతే మనవాళ్ళు మా ఆయనవల్ల నాకు ఆ సుఖం దొరకడం లేదహో అంటూ మైకెట్టి ఠాం ఠాం చేసి మరో మన్మధ సామ్రాజ్య స్థాపనకు బయలుదేరుతారా? హక్కులు, గిక్కులు అంటూ మొత్తుకునే మనలో ఎంతమందికి కనీసం ఈ విషయం గురించి ఊహించడానికైనా మనసొప్పుతోంది?
@"చాలామంది తలవంచుకొని బ్రతుకు వెళ్ళదీస్తున్నారని ఈ శరత్ కూడా అలా జీవితాన్ని లాగేస్తే ఈ శరత్ ప్రత్యేకత ఏంటి?" అంటూ శరత్‌గారు తన లేటెస్ట్ టపాలో వ్రాసారు. అయితే ఈ "ప్రత్యేకత"విషయంలో ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ కాస్త ఎక్కువ అవడంవల్లే వారికి సమస్యలు ఎక్కువ అవడమో/ ఆయనగారి 'ఆ ఒక్క సమస్యే ' చాలా పెద్దదన్నట్లు ఫీలవడమో జరుగుతుందేమో అని నాకనిపిస్తోంది.
వాస్థవంగా వారికున్న ప్రాక్టికల్ ధృక్పదం, సామాజిక స్పృహ నాతోపాటూ ఎంతోమంది మన్ననలు పొందదగినదే అయినా ఈ ఒక్క సమస్య విషయంలో మాత్రం 'వివేచన లోపం ' అనే వంక అనితగారితోపాటు వారివైపుకూడా ఉన్నదేమో?అనిపిస్తోంది. ఎందుకంటే మనలో కొంతమందికి మాంసం తింటాము అని చెప్పుకోడానికీ ఎముకలు మెళ్ళో వేసుకుని తిరగడానికీ మధ్య వ్యత్యాసం తెలియకపోవడంవల్లాగానీ/ అతి మోడ్రనిస్ట్ అనిపించుకోవాలనే ఒకరకమైన 'తీట 'వల్లాగానీ అవతలవాళ్ళ ఇష్టాఇష్టాలతో సంబంధంలేకుండా మనకు నచ్చినదానిగురించి మాట్లాడడమూ, కంపెల్ చెయ్యడమూ లాంటి పనులవల్ల ఎదుటివారికి మనపైనా/ మనం వారినుండి కోరుకునేవాటిపైనా పూర్తి విరక్తి వచ్చేలా చేస్తాయి. ఇవన్నీ ఆయన విషయంలో ఇలాగే జరిగివుంటాయని ఊహించడమో, ఆయనకు ఆపాదించడమో నా ఉద్దేశ్యం కాదుగానీ-తరచి చూస్తే ఆయన బ్లాగులు చదివేవారికెవరికైనా ఆయన వ్రాసే విషయాలపైన వ్యతిరేకత లేకపోయినా, వ్రాసే పద్ధతిపైనా, కొంచెం పచ్చిగా అనిపించేలా ఉండే విషయాలపైనా అభ్యంతరాలుంటాయని నాకనిపించింది.
ఒక చిన్న ఉదాహరణ: పెళ్ళయ్యాక మొగుడూ పెళ్ళాలు ఏంచేస్తారో ఎటూ అందరికీ తెలిసిందేకదా అని 'బజార్లో శోభనం ' ఏపాటు చేసుకోరు కదా! అలాగే నిన్నటి మీ 'బ్రహ్మచారి పోస్ట్ ' లో కూడా అందరికీ తెలిసిన విషయాలే అయినా 'బొక్కలు మెళ్ళో ' టైపులో అనవసరపు వర్ణనలకు పోకుండా, డైరెక్ట్‌గా విషయం వ్రాయకపోవడం లాంటివన్నీ కొంచెం మన పర్సనాలిటీకి కూడా డ్యామేజీ కలిగించేలా లేవంటారా?
అఫ్కోర్స్. ఆయన సమస్య చాలా చిన్నదనో, అసలు సమస్యే కాద్నో నేననట్లేదు. శృష్టిరీత్య జరిగిన ఒక లోపం ఏంటంటే 'ఆ ' విషయంలో అతిగా స్పందించే తత్వం ఆడా, మగా లో సమానంగా లేకుండా మగవారికి ఎక్కువగా ఉండడం. ఇంకా కొంతమందికేమో స్వతహాగా ఏర్పరుచుకున్న 'భావా 'ల వల్ల మాటిమాటికీ ఆ అవసరం గుర్తుకురావడం(ఇది ఒకరకంగా జబ్బు మరియు దానికి వైద్య చికిత్సలుకూడా ఉన్నాయి:).
కానీ, అంతమాత్రాన అది పరిష్కారమేలేని సమస్యగా భావించి, పదే పదే దాన్నే హైలైట్ చేసి అవతలి వాళ్ళనుకూడా విసిగించి, వేధించి చివరికి వాళ్ళను (తనకు) 'పనికిరాని ' వాళ్ళుగా చిత్రించి వదిలించుకోవాలని చూసేదాకా వెళ్ళేబదులు ఎన్నో 'ప్రత్యామ్నాయ ' మార్గాల్లో ఒకటో రెండో ఎంచుకుని సర్దుకుపోయినంతమాత్రాన 'సర్దుకుపోయే చాలా మంది గొర్రెల వంటి 'వాడినవుతాననుకోవడం నాకైతే ఆత్మవంచనలాగా అనిపించింది. నిజంగా ఆయన ఏ విషయంలోనూ ఏమాత్రం సర్దుకుపోనంత ప్రత్యేక మనిషే అయితే - 'ఇప్పటికిప్పుడు బిర్యానీ తింటే బాగుండు ', 'వేడి వేడి కాఫీ తాగితే బాగుండు 'అని అనిపించిన ప్రతీసారీ ఆయనకున్న ప్రత్యేకత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అదేపని చేసారా? లేక సర్దుకుపోయి బిర్యానీ బదులు పప్పన్నం, కాఫీ బదులు టీ తాగారా!

katta jayaprakash said...

Though I have not gone through Sharath blog on marital relationships,he views expressed by you are more than hundred percent correct and every couple must understand the meaning,philosophy of routine sexual relationships between a couple which gives them a perfect and good life which increases the confidence in one another.Sex is a part of our life which cannot be avoided nor neglected.As we drink water to wet the tongue and eat food to fil the stomach and breath air for respiration we should also look into the hunger of sexual senses which completes the circle of better living.So one need not feel ashamed to think,act and enjoy sex as long as it is moral,ethical and legal.

JP.

katta jayaprakash said...

Ramu garu,
where is Ravi Prakash of TV9? He is not seen on TV for quite a long time? Any problem of health or any proffessional problem or any personal issues?

JP.

Prashant said...

The some of the differences between human beings and animals is sanity, sense and sensibility.The article clearly violates the differentiating line between humans and a wild beast. Moreover Sarath's justification in revealing personal details as he considers that fellow bloggers and readers of his columns as his friends is something over the board.You can only share thoughts,ideas,expressions ,cultures,traditions,travel tips,tech,financial,photography,art, queer sexual orientations, BUT NOT REVEAL PERSONAL DETAILS INVOLVING TWO PEOPLE.
The bloody rogue has forgotten that whatever rant he posted in the blog also involves his life partner's sanity and it is nothing but travesty of modesty of that woman.She can sue him and demand a huge compensation making him hold his balls with foot in the mouth.It's possible for her in USA as the human rights laws are strictly enforced there.
A blogger can post personal problems he is encountering which doesn't do character assassination of anyone,be it wife/husband.
And yes,he aptly claimed himself as "vile stray dog"(chithakarthe kukka).
Whoever in contact with that lady I hope they advice her to take cue from wife of Tiger Woods.
I ignore the merit of the column as I am not interested in his personal woes.

Unknown said...

అమ్మాయ్ అనితా, అక్కడ తుపాకులు మైసూరు పాకుల్లా దొరుకుతాయట.. ఓ తుపాకీ కొనుక్కొచ్చి నీ మొగుణ్ణి కాల్చి పారేయి తల్లీ.. నీకూ, లోకానికీ దరిద్రం వదులుతుంది. ముందు ఆ దూలిస్టు బారి నుంచి నీ పిల్లని రక్షించుకోవడం నీ ప్రథమ కర్తవ్యం.

Anonymous said...

@J.P garu
మీ కొరిక మొన్న తీరిందిగా? అదేనండీ స్లిం గా ట్రిం గా తయారైన రవి ప్రకాష్ గరు కూచిపూడి 'ధిల్లానా" కార్యక్రమమప్పుడు కనిపించారుగా:)

Praveen Mandangi said...

మీరు మగవాళ్లు కాబట్టే కదా శరత్ 'కాలం' బూతు వ్రాతలని అంత శ్రద్ధగా చదువుతున్నారు. మీకు అంత నిజాయితీ ఉంటే మీ కుటుంబ సభ్యుల చేతే అవి చదివించండి. అంతే కానీ శరత్ ఏదో గొప్పవాడని నమ్ముతున్నట్టు నటించొద్దు. సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడేవాళ్లు నిజ జీవితంలో ఉన్నారు. సాధారణ ప్రజలకి అర్థం కాని డబల్ మీనింగ్ బాషలో రోడ్ మీద పోయే అమ్మాయిలకి వినిపించేలా మాట్లాడుతారు. రేపు మీ భార్యనో, కూతురినో అలాగే చేస్తే అప్పుడు మీరు "ఇది మోడర్న్ కల్చరే కదా" అని సమర్థిస్తారా?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి