Monday, January 10, 2011

"ద సండే ఇండియన్" లో 'రామ్ బాణం' ఆరంభం

క్రమం తప్పకుండా ఒక కాలమ్ రాస్తే బాగుంటుందని ఏ జర్నలిస్టుకైనా అనిపిస్తుంది. దాదాపు రెండు దశాబ్దాలు జర్నలిజం లో వున్న నాకు కూడా ఈ ఉత్సాహం (తీట) చాలా రోజుల నుంచి ఉంది. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ కోరక తీరింది-- గత ఏడాదిలో "ద సండే ఇండియన్" సీనియర్ ఎడిటర్ నరేష్ నున్నా నాకు పరిచయం కావడం వల్ల.

బొత్తిగా సాహితీ జ్ఞానం లేని అజ్ఞానిని నేను. ఏదో విషయాన్ని వున్నది వున్నట్టు రాయమంటే రాస్తాం గానీ....కవితాత్మకంగా రాయమంటే మనవల్ల అయ్యే పని కాదు. నిజానికి....కవిత్వంలో డెబ్భై శాతం నాకు అర్థం కాదు...ఒక పాతిక శాతం విషయాన్ని...'బహుశా ఈ అర్థం అనుకుంటా...' అని  సరిపుచ్చుకుంటాను. సరిగ్గా అర్థమయ్యేది ఒక ఐదు శాతమే. అందుకే...కవుల చర్చల్లో పాల్గొనకుండా తప్పించుకోవాలని అనుకుంటాను. అలాంటి వాడికి...ఒక కాలమ్ రాసే అవకాశం ఇస్తారో...ఇవ్వరో...అనే సంశయం వుండేది. 'సార్..నేను ఒక రెగ్యులర్ కాలమ్ రాస్తే ఎలా వుంటుంది? పక్షానికి ఒక పేజీడే,' అని అడగ్గానే....నరేష్ గారు నన్ను ప్రోత్సహించారు. మొదటి కాలమ్ లో నేను రాసిన కొన్ని పడిగట్టుపదాలను చూపించి....ఇవి బాగుండవని ఆయన చెప్పారు. మరొక సారి చదివితే...నిజమే కదా...అనిపించేలా ఉన్నాయి అవి.
నిజంగా మంచి ఫోటోతో వచ్చిన ఈ పేజీని చూడగానే....నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను 'ఈనాడు' సంపాదక పేజీలో వందకు పైగా బై లైన్ ఆర్టికల్స్, 'ది హిందూ' లో దాదాపు వెయ్యి స్పెషల్ స్టోరీలు  రాసాను గానీ...ఇంత ఉత్సాహం ఏనాడూ కలగలేదు.   
నరేష్ గారికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతూ...ఈ కాలాన్ని కలకాలం కొనసాగిస్తారని ఆశిస్తూ...నేను దీన్ని నాణ్యమైన పేజీగా తీర్చిదిద్దుతానని మాటిస్తూ...ఆ పేజీని మీకోసం దిగువ ఇస్తున్నాను. 

14 comments:

కొత్త పాళీ said...

very nice. All the best.

Anonymous said...

@కవిత్వంలో డెబ్భై శాతం నాకు అర్థం కాదు...ఒక పాతిక శాతం విషయాన్ని...'బహుశా ఈ అర్థం అనుకుంటా...' అని సరిపుచ్చుకుంటాను. సరిగ్గా అర్థమయ్యేది ఒక ఐదు శాతమే.
... మీకే కాదు చాలా మంది జనాలకు కవిత్వమ్ విషయమ్ లొ అంతే..

Anonymous said...

గురూజీ!
Your column is 'Good' and ALL THE BEST 4 YOUR FUTURE COLUMNS:)
శ్రీ శ్రీ గారు తన అద్భుత చైతన్య గీతం "నేను సైతం" లో "సకల జగతిని శాస్వతంగా వసంతం వరియించుదాకా, ప్రతీ మనిషికిజీవనంలో నందనం వికసించుదాకా పాత పాటను పాడలేను కొత్తబాటను వీడిపోను" అని చెప్పినట్లు ఇలాంటి మహానుభావులు అరుదుగానైనా ఈ భూమిపై పుడుతూనే ఉంటారు, బీదా బిక్కీ జనుల జీవన గతుల మార్పుకోసం కొత్తబాటలు వేస్తూనే ఉంటారు. వారిలాంటివారు మరింతమంది ఈ పుడమిపై జనియించాలనీ, వారి స్పూర్థి అజరామరంగా నిలిచిపోవాలనీ ఆశిద్దాం.
ఆన్నట్లు, "ఈ కాలాన్ని కలకాలం కొనసాగిస్తారని" అనే బదులు column ని అంటే బాగుండేదేమో?

Prashant said...

Sunday Indian website lo telugu spelling correct cheyyamanandi mundu...telugu ki tegulu pattinchaaru..

Prashant said...

your article paying homage to civil liberty rights activists is worthy.

సుజాత వేల్పూరి said...

మీరు ఏదైనా మంచి పత్రికలో కాలమ్ రాస్తే బాగుంటుందని అనిపిస్తూ ఉండేది మీ బ్లాగు పోస్టులు కొన్ని చదువుతున్నపుడు. అయితే కాలమిస్టు గా మారరన్నమాట. శుభాభినందనలు! మొదటి బాణం అంత పదునుగా లేనప్పటికీ మున్ముందు మరిన్ని పదునైన బాణాలతో మీ కాలమ్ ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.

శరత్ కాలమ్ said...

అభినందనలు. పేరును బట్టి సండే ఇండియన్ ఇంగ్లీషు పత్రిక అనుకున్నాను. ఈ పత్రిక పేరు ఇదివరలో వినలేదు. వీలయితే కొన్ని వివరాలు తెలియపరచండి.

Ravi said...

Reddy garu,

"Nenu saitham" lo "Sakala jagathi ki saswatam ga vasatanam ....."
Ee pankutulu levu, ivi Sri Sri gaari vere kavitha lo vunte telupa galaru.

Itlu
Ravi

Anonymous said...

This was from Nenu Saitam song in Rudraveena film written by Siri Vennela.

VENKATA SUBA RAO KAVURI said...

కాలమిస్టుగా మీరు విజయవంతమవుతారనటంలో అతిశయోక్తి లేదు. అభినందనలు.

వేణు said...

కాలమిస్టుగా మీ తొలి బాణం సమాచారయుతంగా ఉంది. మీ రచనోత్సాహం ఇలాగే కొనసాగాలి. కాలమ్ పేరుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పదునుగా రాయాల్సిన బాధ్యత ఎటూ మీపై ఉంటుంది!

మీ ‘నివాళి’లో ‘మావోలు’ అనే మాట ఉంది. ఈ పదాన్ని దినపత్రికలు యథేచ్ఛగా వాడేస్తున్నాయనుకోండీ. ‘మావోయిస్టులు’ అనే మాటను సరిగ్గా పలకాలంటే ‘మావిస్టులు’ అనాలట. తెలుగు పాత్రికేయులు వీరిని కాస్తా ‘మావోలు’ చేసేశారు!

ఇంతకీ మొదట్లో మీరు రాసిన ఆ ‘పడికట్టు పదాలు’ ఏమిటో నాకు చెప్పకూడదూ! :)

premade jayam said...

మీరు రాస్తున్న పత్రిక అంటే చదవదగ్గదే.

ఇక వ్యాసం విషయానికి వస్తే పడిగట్టు పదాలు ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు మృత్యువు గురించి చెప్పినపుడు. నిజానికి మృత్యువు సహజంగా జరిగి పోయిన విషయం. ఈ లోగా ఆంధ్ర దేశంలో వారంతటి వారసుల్ని తయారు చేయలేక పోవడం ఆ ముగ్గురి వైఫల్యం. తయారై ఉన్న వారిని గుర్తించలేక పోవడం మీడియా వైఫల్యం. ఆ ముగ్గురి మరణం తర్వాత రాష్ట్రంలో పౌర హక్కుల ఉద్యమం ఎలా ఉండబోతోందో, వారి absense ఎంత లోటో చెప్పాల్సింది. మీరు చరిత్ర చెప్పారు. అవన్నీ పత్రికలు రాసేసాయి. ఇలాంటివి రాసేందుకు చాలా మంది ఉన్నారు.

ఈనాడులో మీ వ్యాసాల పదును నాకు గుర్తు ఉంది. చాలా రోజుల తర్వాత కాబట్టి ఈ పరిస్తితి మామూలే. ఎవరికోసమో మొహమాట పడకుండా చిక్కగా వచ్చాకే జనంలోకి వదలండి.

katta jayaprakash said...

Congrats for the new assignment.Your first article on Kannabhiran is appreciable.Hope you reflect the good,bad and ugly of the society,people etc without monopoly on any issue or problem.Sunday Indian is a new one to every one and so far I have not seen it.Anyhow best of luck.

JP.

Thirmal Reddy said...

Congratulations

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి