Saturday, May 14, 2011

బ్లాగుల్లో రాసుకుంటే...పొట్టమీద కొడతారా?

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐ.పి.ఎల్.) లో కొందరు క్రికెటర్ల చూపులు, చేష్టల పై తన అభిప్రాయాలను సొంత బ్లాగులో ఉన్నదున్నట్టు రాసుకున్నందుకు దక్షిణాఫ్రికాకు చెందిన గాబ్రియేలా అనే ఛీర్ లీడర్ (విలాసిని అని "ఈనాడు" పత్రిక వారి అనువాదం) బ్లాగర్ ను అర్జంటుగా ఇంటికి పంపడాన్ని పత్రికలు, ఛానల్స్ బాగానే వండివార్చాయి. ఈ ఉదంతం... ఆ మధ్యన తాను పనిచేస్తున్న ఛానెల్లో పెద్దమనుషుల గురించి, వారి ప్లానింగ్ లోపం గురించి తన బ్లాగులో దాపరికం లేకుండా రాసిన ఒక యువ యాంకర్ ను గుర్తుకు తెచ్చింది. 

ఛానల్ వారు...బ్లాగు ఆపుతావా? ఉద్యోగం వీడతావా? అని ఇబ్బందిపెట్టినా...బ్లాగు వీడేదిలేదని తేల్చిచెప్పింది ఆ అమ్మాయి. కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా మరొక ఛానెల్లో ఉద్యోగం సంపాదించి తన పని తాను చేసుకుపోతున్న ఆ యాంకర్ ను టీవీ తెర మీద చూస్తే నాకొక వీర వనితలా కనిపిస్తుంది. కొందరికేమో...ఫూలిష్ గా, ఇంప్రాక్టిల్ గా బుక్ అయిన యాంకర్గా అనిపిస్తుంది. తన ప్రస్తుత యాజమాన్యం గురించి కూడా తను బ్లాగులో రాస్తున్నదో...మునుపటి అనుభవంతో కాస్త జాగ్రత్తపడుతున్నదో నేను ఫాలో కాలేదు. 

 సునిశితంగా చూస్తే గాబ్రియేలా లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవి. జనం తమను మాంసపు ముద్దల్లా చూస్తారని, కొందరు క్రికెటర్లు వెకిలిచూపులతో చేష్టలతో ఇబ్బందిపెడతారని, తక్కువేమీ తినని కొందరు విలాసినులు 
లీగుల యజమానులతో, క్రికెటర్లతో అంటకాగుతారని కూడా ఇరవై రెండేళ్ల గాబ్రియేలా రాసుకున్నది. ఇతరులపై కడుపుమంటతో కాకుండా నిజంగానే బాధతో తను అలా రాసిందని నాకు అనిపించింది.

"I have come to realise that cricketers are the most loose and mischievous sportsmen I have come across. Makes me wonder if I should worry about them more than the commoners on the street! I still have a long while here, so I shall keep my tip list in mind. Tip number 1: Beware of the cricketers!" అని కూడా గాబ్రియేలా స్పష్టంచేసింది. బాధతోనో, భరించలేకనో తను బ్లాగులో రాసుకున్న విషయాలను మరొక విలాసిని ఉప్పందించడంతో గాబ్రియేలా ఉద్యోగానికి ఎసరొచ్చింది. 
పనిచేస్తున్న సంస్థ వెర్రితనం గురించో, సంస్థను పాలిస్తున్న వెర్రిపప్పల గురించో, వెధవాయిల గురించో ఉన్నదిఉన్నట్టు రాయడానికి నిజంగా దమ్ముండాలి. పనిచేస్తున్న సంస్థ గురించి మంచైనా చెడైనా రాయడం చాలా కష్టమని...అది ఇతర పత్రికలు, ఛానళ్ల గురించి ఆలవోకగా రాసినంత వీజీ కాదని ఈ బ్లాగరుకు కూడా తెలిసొచ్చింది. అదొక చెప్పుకోలేని బాధ. 

సత్యనిష్ఠ ఉండకపోతే...పెను సవాళ్లను (ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి) సైతం ఎదుర్కొని రాయడం కష్టం. ఇంతకూ గాబ్రియేలా గానీ మన యాంకర్ సోదరీమణి గానీ బ్లాగుల్లో తన అభిప్రాయాలు నిక్కచ్చిగా రాసుకోవడం సబబేనా? ఇలాంటి సత్యవాదులకు మీరిచ్చే సలహా ఏమిటి? తీరికచేసుకుని మీ అభిప్రాయం రాయండి.
****************************
Photo courtesy: foxsports.com

27 comments:

Anonymous said...

సత్యవాది లోక విరోధి

Rajendra Devarapalli said...

కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా మరొక ఛానెల్లో ఉద్యోగం సంపాదించి తన పని తాను చేసుకుపోతున్న ఆ యాంకర్ ....ఎవరు????

Vinay Datta said...

Yes, she can pour her heart out. The management should have apologized her. The difference in behaviour of the people between the so called developed and developing countries is actually nothing. Women are suffering everywhere. Jobs like this are more prone to the things like she mentioned in her post.

While I notice that fully covered women and skimpily dressed women are facing similar problems of sexual abuse, I really wonder if there's a need to hire men and women to cheer the playing teams. This way the team managements actually target the crowd and not the teams.

I'm actually confused about the different kinds of fancy professions we have.

madhuri.

Vinay Datta said...

My sincere comments ( above ) were with regard to Gabriela. I donot know that ' sodareemani ' of yours.

madhuri.

NEWS ARTICLES said...

ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి మరీ నిజాలు బ్లాగ్‌లో రాయడానికి ఎంతో ధైర్యం, తెగువ కావాలి. ఆ చీర్ లీడర్, యాంకర్ సత్యనిష్ఠను అభింనందించాల్సిందే. అయితే వీరిలాగే చాలామందిలో సైతం సొంత కంపెనీకి సంబంధించిన నిజాలు బయటకు చెప్పేంత ధైర్యం ఉన్నా... ఉద్యోగం కోసం భరించాల్సి వస్తుంది. ఏదేమైనా ఒకరి కోసం తమ భావాలు దాచుకోకుండా... ప్రపంచానికి చెప్పిన వీరికి హ్యాట్సాఫ్

Unknown said...

రాము గారు, ఆ యువ యాంకర్ బ్లాగ్ పేరు చెప్పగలరా ఒక సారి చదవాలని

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి said...

నిజంగా ఆయాంకర్ దైర్యాన్ని మెచ్చుకోవాళ్సిందే...నిజాన్ని నిర్బయంగా చెప్పగలిగిన వాళ్ళను కచ్చితంగా ప్రొత్సహించాల్సిందే

nareshnunna said...

పొరపాటున బ్లాగ్ పోస్టు చదవక ముందే గాబ్రియాలా ఫొటో చూసి, ఆ సౌందర్య కాంతికి నా
కళ్ళు వెలిగి, తట్టుకోలేని వెల్తురులో కళ్ళు మండి, చత్వారం కళ్ళజోడు అడ్డంగా, అంతరాయంగా ఉండటం సహించలేక, కళ్ళజోడు అడ్డు పోయిన సంతోషం ఎక్కువ సేపు నిలవక, మసక బారిపోయిన నా mid-career కళ్ళ నీటిపొరలమీద ఆమె రూపం అలుక్కుపోయి, మూసిన కళ్ళ కొలకుల్లోంచి జారిపోతుందేమో నన్న తొట్రుబాటులో, తొణికిసలాడుతున్న నీటి ముత్యాల్ని తెల్లని చేతి రుమాలులో దాచి, ఆమె ఫొటో చుట్టూ చలిచీమల్లా కనిపిస్తున్న మీ బ్లాగ్ పోస్టు అక్షరాల్ని అనాసక్తిగా చదివి, మీ అలవిమాలిన సౌశీల్యం తో ఎక్కడ గాబ్రియాలాని కూడా సోదరీమణి అంటారేమో అని ఆందోళన పడి, అలా అననందుకు కుదుటపడ్డాను.

Vinay Datta said...

I myself couldn't take my eyes off Gabriela. No wonder you turned so poetic, Naresh garu.

madhuri.

Anonymous said...

నరేష్ నున్నా గారికి ఏ స్త్రీ కనపడ్డా ఆమెను రక్తమాంసాలతో తప్ప చూడటం సాధ్యం కాదనుకుంటా. పైగా ఇతరులు కూడా ఆమెను వ్యక్తిత్వంతో ఎక్కడ గుర్తిస్తారో, ఆమె శరీరాన్ని అందాన్ని ఎక్కడ గుర్తించరో అని బాధ కూడా పడుతున్నారు. పాపం,ఎంత అవస్థో!

హోలీ పండగ ప్రతేటా వస్తే బాగుండు, తడిసిన బట్టల్లో ఆడపిల్లల అందాలు చూడొచ్చని తహ తహ లాడే వాళ్ళంతా జర్నలిస్టులై, సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు! దౌర్భాగ్యం కాకపోతే

సుజాత వేల్పూరి said...

నరేష్ గారూ,ఛీర్ లీడర్ అనేది గాబ్రియేలా పొట్టకూటికి చేసే ఉజ్జోగం. అంత మాత్రం చేత ఆమె అందరి వెధవ చూపుల్నీ భరించాలని కాంట్రాక్ట్ ఏమీ ఉండదు. క్రికెటర్ల జులాయి చూపులు తననెంత బాధించాయో ఆమె రాసుకుంటే అందులో మీకు ఆమె ఆవేదన కనిపించకపోగా, మీరూ ఒక జులాయి కామెంట్ రాసి మీ "సౌందర్యోపాసన" బయటపెట్టుకున్నారు. పైగా రాము ఆవిడను ఎక్కడ చెల్లెలుగా భావిస్తారో అని కూడా కంగారు పడుతున్నారు. మీరే కాక ప్రపంచమంతా ఆవిడ శరీరాన్ని మాత్రమే చూడాలని ఆశిస్తున్నారన్నమాట.

మీరు సరదా టోన్ లో ఆ వ్యాఖ్య రాసి ఉన్నా సరే, గాబ్రియేలా ఎదుర్కొంటున్న మానసిక పరిస్థితిని ఊహించి ఈ కామెంట్ రాయడానికి వెనుకాడ్డం లేదు.

Srinivas said...

బ్లాగుల్లో రాయడం వల్ల వొరిగేదేమిటి ఈమెకయినా, ఆ యాంకర్‌కయినా? పోరాడటమంటే చట్టపరంగా తమ హక్కుల్ని సాధించుకోవడం! ముందు తమపై వేధింపులపై యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం, వాళ్ళు చర్య తీసుకోనప్పుడు చట్టం సాయం తీసుకోవడం, అందుకూ మార్గం లేనప్పుడు తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ చెప్పి (బ్లాగులో, పోటీ పత్రికలో, ఛానెళ్ళో) వాళ్లను కూడగట్టుని పోరు కొనసాగించడం కదా చేయవలసింది! తమ ఉద్యోగి రాతల వల్ల తమ ప్రతిష్ట భంగపడుతుంటే ఏ యాజమాన్యమయినా చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా ఆశిస్తున్నారో అర్థం కాదు నాకు.

Thirmal Reddy said...

@Nareshnunna,

I totally empathize with you. What I can simply realize from your words is the admiration towards beauty (thanks to Ramu sirjee for selecting a good picture). However, reading the follow up comments on your poetic expressions, I'm really surprised why people fail to understand the difference between Nareshnunna's spontaneous admiration to that of (some) loose or mischevious sportsmen that Gabriela quoted. Secondly, I'm in complete agreement with Gabriela's freedom for expression, but do we also know that she said "some" cricketers and not cricketers? Do we even know that Gabriela wrote the following lines in her secret diary "The few Indian players we have met, such as MS Dhoni and Rohit Sharma, have been very polite and keep to themselves in dark corners. Hotshots like Tendulkar with families at home are never present" I can foresee brickbats coming my way, but couldn't contain to question the blanket perception people have towards admiration

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Sudhakar said...

Whatever she wrote is correct and she would have just quit her job and write it. Writing a blog demands certain responsibilities and especially when you are writing about your job after signing up for the confidentiality and rules. Whatever she is did is completely wrong (if you put the content aside) and in violation with the Non disclosure agreement (NDA) she made as part of job.

What does she thinks about her job other than being an entertainment to men? I am asking this question as I am not able to get any other reason except that..pardon me for my ignorance here.

nareshnunna said...

@కిరణ్‌ కుమార్‌

కిరణ్‌! మీ అభిప్రాయం పాక్షికంగా సత్యమే, ఏ స్ర్తీ కనిపించినా, 'అందం' అని నాకు తెలిసిన ప్రమాణాలతో తొలి బేరీజులు వేస్తాను. నా ప్రమాణాల ప్రకారం 'అందం'గా అనిపిస్తే ఆ క్షణాన్ని ఒక 'బ్రతికిన క్షణం'గా ఆ passing second లో నేను enliven అయినట్లుగా భావిస్తాను. అయితే, నా యీ చర్య వాళ్ళ వ్యక్తిత్వాల గుర్తింపుకి ప్రతిబంధకమవుతుందా? క్షమించండి- అది నాకు తెలియదు. సమాజానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు తడిసిన బట్టల్లో ఆడపిల్లల్ని చూసి ఎలా ప్రవర్తిస్తారు? ఎలా ప్రవర్తిస్తే సమాజానికి ప్రాతినిధ్యం వహించే అర్హత సంపాదించుకుంటారు? ఇవి నా సందేహాలు. మరొక్క చిన్న సవరణ: నన్ను చూసి, జర్నలిస్టులందర్నీ ఒక గాటన కట్టేయకండి!


@సుజాత గారూ!

'సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేల? కొందరు పిచ్చను పడనేల?' అని అప్పుడెప్పుడో పింగళి గారు అడిగారు. నేను ఊహెరిగి, ఆ పాట నాలో sync అయ్యాక, ముచ్చట పడటం, పిచ్చను పడటం వేర్వేరని స్వానుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాను. రెంటిలో నేనే category అని వివరణ ఇచ్చుకోవడం కంటే, 'చూడటం' అనే ప్రక్రియలో మీరంటున్న 'జులాయి', 'వెకిలి' చూపులే కాకుండా వేరే చూపులు ఉండే అవకాశం ఉందా (మీ ప్రకారం)? పింగళి వారి మాటల్లో అడగాలంటే, ముచ్చట పడటం, పిచ్చను పడటం అనే భేదాన్ని మీరు గుర్తిస్తారా? మీ మటుకు మీరు అటువంటి తేడా ఉందంటే ఒప్పుకుంటారా? 'భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు' అని ప్రతిజ్ఞ చేసేవారందరూ ఆ ప్రమాణాలకు నిబద్ధులని, అలా చేయలేని నా బోటివాడు అనిబద్ధులైన జులాయి అని మీ నిశ్చలనిశ్చితాల్లా ఉన్నాయి సుమండీ!

ఇక ఆమె ఆవేదనకి వాచ్య సంఘీభావం గురించి అంటారా?
తన సౌందర్యాతిశయంతో నన్ను ఆమె రాజ్యంలో బంటుని చేసుకున్న ఆ రాణి ఆవేదన పట్ల అక్కర, ఆ రాజ్యంలో స్థానం లేని మీకంటే నాకు ఎక్కువ కాదాంటారా?

@ Tirumal Reddy garu!

Thank u very much.

ఆకాశరామన్న said...

vilasini kadu ramu garu..
ullasini

Sudhakar said...

and one more comment she made...In india they look at your ****s and bu***ks and then B***s. Everywhere it is the same and it depends on the men's mindset but not the geography when you just wear skin tight 20% covering on a curvy/tailored body for a cheerleader job. Practically speaking, that's the truth !

ravi said...

ఎవడి పిచ్చి వాడికానద్దం, మీరు ఇంకా చీకట్లోనే కదా ఉంది తెలుసుకున్తరులే మీ తెలివి తెల్లారినప్పుడు.

SREEDHEESSPACE said...

నరేశ్ నున్నా,
ముచ్చట పడడానికి, పిచ్చను పడడానికి తేడా ఉన్నప్పుడు, రాము గారు "సోదరీమణి" అని అంటారేమోనని తెగ కంగారు పడిపోవడం దేనికి? నువ్వు జీవ రసాయనిక క్రియ గురించే మాట్లాడుతున్నావ్. తప్పు లేదు. కానీ, ఆ క్రియలోంచి మాత్రమే మాట్లాడడమేమిటి? హార్మోన్లతో స్పందిస్తాం, ఆలోచించలేం. ఆలోచించడానికి వేరే పదార్థం ఉంది. దాన్ని నువ్వు హార్మోన్లతో ఉతికి ఆరేస్తున్నావ్. ఏంటీ బాధ? అందం గురించి నువ్వు స్పందిస్తుంటే.. ఆనందంగా ఉండాలి కాని, నాకు జాలి కలుగుతుందేమిటి?
- పసునూరు శ్రీధర్ బాబు

Edge said...

Let me please play the devil's advocate here....

మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి, మీ ఇంట్లో భార్యా భర్తల మధ్య జరిగే సరసాలు విరసాలను ప్రపంచానికి సవివరంగా తెలియచేస్తున్నారని మీకు తెలిసిందనుకోండి... మీరు ఆ వ్యక్తిని మెచ్చ్చుకొని promotion ఇస్తారా లేక ఉద్యోగం పీకేసి వెళ్ళగొడతారా?

SREEDHEESSPACE said...

Dear Ramu,
What should be done in this case if sending the girl back to her home country is not right? How can you take her version for granted? Taking woman's side sounds good in general but that may not be right every time, right? And finally, what about the privacy concerns for the players? Male self esteem also need to be protected my dear. There is an atmosphere of menace in blogging and you know that the internet has no eraser. Gabriella Pasqualotto may be honest, but her blog can never be an evidence to prove her right. Cheerleaders are born to capitalism and hedonism. So, money and meat matter here. To what extent is depends on an individual. Beauty is a virtue and not an investment. Women, who understands this don't like sympathies.
- Sreedhar Babu Pasunuru

Sudhakar said...

@Sreedhar : good response.

Ram said...

అబూలో నలుగురు తెలుగు జర్మలిస్టుల అరాచకాలు...త్వరలో....

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి said...

ఓ దైర్యం ఉన్న అమ్మాయి గురించి..ఇలా మాట్లాడుకోవడం ఏంబాగోలేదు...అమ్మాయి అంటే చాలు అందరికి శరీరాలే గుర్తుకు వస్తాయా...మనకు ఇళ్ళలో ఉన్నారు వారిగురించి ఇలా ఎవ్వరైనా కామెంట్ చేస్తే మనం ఊరుకుంటామా..కాస్త మనుషులుగా ఆలోచిస్తే మంచిది..నాకు ఎవ్వరిని కించపర్చాలని కాదు కామెంట్స్ చూసి భాదేసి ఇలా అంటున్నా ప్లీజ్ ఇక ఈవిషయాన్ని వదిలేయండి..

Anonymous said...

@Edge
ఆమె క్రికెటర్ల+వారి భార్యల సరస సల్లాపాల గురించి వ్రాయలేదుగదబ్బా? బజార్లో వెళ్తూ మనలాంటి సగటు క్రికెట్ అభిమాని చేసే ఎదవపనే (తనలాంటి ఛీర్ గర్ల్స్ ను తినేసేలా చూసే/ కామెంటే) చేసే ఎదవ క్రికెటర్ల గురించి వ్రాసింది. చూడబోతే మీరు చాముండేశ్వరి నాధ్ లాంటి ఎదవల్ను గూడా సమర్ధించేలా ఉన్నారు?

Prashant said...

Either you update the blog regularly or shut the blog completely.Don't keep it like a decomposing dead body.

Vinay Datta said...

@ Prashant :

you shouldn't bother about the blog. It's the will and wish of the blogger...can post everyday or occassionally. A blog is also like a diary.

madhuri.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి