Tuesday, August 2, 2011

అంకం రవి-శ్రీధర్ బాబు నేతృత్వంలో...విశాక ఇండస్ట్రీస్ ఛానల్..."వీ సిక్స్" త్వరలో

తామర తంపరగా పుట్టుకొస్తున్న తెలుగు టెలివిజన్ ఛానెల్స్ జాబితాలో మరొక ఛానెల్  చేరబోతున్నది. తెలంగాణాలోని పెద్దపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎం.పీ. జీ.వివేక్ గారికి చెందిన విశాక  ఇండస్ట్రీస్ ఈ ఏడాది నవంబర్ లో "వీ సిక్స్ (V-6)" అనే పేరుతో ఒక ఛానల్ ను తెచ్చేందుకు సిద్ధమవుతున్నది. 
తెలుగు టెలివిజన్ జర్నలిజంలో 'హార్డ్ కోర్' చర్చలు జరపడంలో మంచి పేరు తెచ్చుకున్న అంకం రవి నేతృత్వంలో ఇది రాబోతున్నది. ఈ చానెల్ ఏర్పాటుకు రవి మంచి కసరత్తు చేసి...ప్రతిపాదనను ఒక కొలిక్కి తెచ్చారని సమాచారం. తెలంగాణా కాంగ్రెస్ నేత ఛానల్ కదా...ఇది మూడునాళ్ళ ముచ్చటేలే అనుకున్న నాకు హెచ్.ఎం.టీవీ లో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్న నా మంచి మిత్రుడు పసునూరి శ్రీధర్ బాబు (మాజీ ఇండియా టుడే జర్నలిస్ట్) ఒక షాక్ ఇచ్చారు. హెచ్.ఎం.టీవీ కోర్ కమిటీ సభ్యుడైన శ్రీధర్ "వీ సిక్స్" లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా చేరారు. తక్కువ కాలంలోనే ఎక్కువగా మిత్రుడైనా జర్నలిస్టు శ్రీధర్. ప్రతిభను పరిగణలోకి తీసుకుని శ్రీధర్ ను  మంచి పదవిలో నియమించడం ఈ గ్రూప్ తీసుకున్న మంచి నిర్ణయమని నాకు అనిపించింది. వినోద్ వాళ్ళ ఇంట్లో పేర్లన్నీ "వి" తో ఆరంభమవుతాయట, అలాగే వారికి అచ్చివచ్చే సంఖ్య "ఆరు (సిక్స్)" అట. అందుకే అలాంటి పేరు పెట్టారట. నాకైతే పేరు నచ్చలేదు కానీ...రవి-శ్రీధర్ సమన్వయంలో వచ్చే టీం పట్ల ఆసక్తి ఉన్నది. 

కాంగ్రెస్ కు, తెలంగాణాకు కొమ్ము కాయడం తమ ఎజెండాలో లేకుండా ఛానల్ నడపాలని ఈ యాజమాన్యం భావిస్తున్నది...ప్రస్తుతానికి. అది మంచిదే కదా! ఈ చానెల్ వారైనా ఇష్టం వచ్చినట్లు జర్నలిస్టులను తీసుకుని...అనక భరించలేక వారిని ఇంటికి పంపబోరని, ఒక ఉద్యోగిని తొలగించడం ఒక హత్యతో సమానంగా భావిస్తారని, "వాడిని పీకుదాం...వీడిని పీకుదాం" అని పెద్ద కత్తి పట్టుకుని కూర్చొనే జర్నలిస్టు జాతి కంటక అమానుష ఎడిటర్లకు బుద్ధి వచ్చేలా వీరు ప్రవర్తిస్తారని నేను కోరుకుంటున్నాను.  

తమకు తప్ప మరొకడికి పరిజ్ఞానం లేదని
భ్రమల్లో బతికే మహనీయులు, మన అనుయాయులకు తప్ప వేరే వారిని బతకనివ్వకూడదని అనుకునే మహానుభావులు, జర్నలిజం లో నీతి-విలువలను అర్జెంటుగా పాతరెయ్యాలని కంకణం కట్టుకున్న వీరులు...నడుపుతున్న పోరంబోకు ఛానల్స్ కు భిన్నంగా కొత్త ఛానల్ తేవడానికి తెలుగులో వీలు ఉన్నది. ఆ గ్యాపును కొత్త చానెల్ ఎలా పూడుస్తుందో వేచి చూడాల్సిందే. తులసి వారి చానెల్, విజయవాడ కేంద్రంగా ఒక ఛానల్, చిరంజీవి ఛానల్ కూడా రాబోతున్నాయని అంటున్నారు.

నా మిత్రుడు శ్రీధర్ గురించి రాయకుండా ఈ పోస్టు ముగిస్తే అది తప్పవుతుంది. నల్గొండ జిల్లా కు చెందిన పసునూరి శ్రీధర్ బాబు చెన్నై లో ఇండియా టుడే పత్రికలో పనిచేస్తున్నప్పుడు హెచ్.ఎం.టీ.వీ. చీఫ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు తన కోర్ టీం లోకి ఆహ్వానించారు. విషయ పరిజ్ఞానం, విశ్లేషణా సామర్ధ్యం, సందర్భ శుద్ధి, ప్రజాస్వామ్యయుత భావన...అన్నింటికి మించి చక్కని తెలుగు రాసే సత్తా ఉన్న రచయితా-కవి శ్రీధర్ అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీధర్ చేసే వార్తా వ్యాఖ్య కు మంచి రేటింగ్స్ వచ్చేవి, తన చర్చలు అర్థవంతంగా అనిపించేవి. శ్రీధర్ కు టీ.వీ.జర్నలిజం లో మంచి భవిష్యత్తు ఉంది. రవీ అండ్ శ్రీదర్...విష్ యు గుడ్ లక్.


ఇక్కడ ఒక వివరణ ఇచ్చితీరాలి. సాక్షి లో పనిచేసే స్వప్న చిరంజీవి ఛానెల్ కు వెళ్ళారని అక్కడి మిత్రులు చెప్పారు కానీ ఆమె అదే నగుమోముతో జగన్ ఛానల్ తెర మీద కనిపిస్తున్నారట. టీ.వీ.-నైన్ రజని కూడా చిరు పక్షం చేరతారని వాకబు చేయమని నాకు మెయిల్స్ వచ్చాయి. వీటిలో ఏది నమ్మాలో, ఏది కమ్మకూదదో తెలియడం లేదు. మిమ్మల్ని తప్పు దారి పట్టించడం ఇష్టంలేక అలాంటి వివరాలు రాయడం లేదు. ఇంట్లో టీవీ కనక్షన్ పీకేసిన కారణంగా తెర మీది సంగతులు కూడా తెలియడం లేదు.

7 comments:

katta jayaprakash said...

It is nice to know that one more Telugu channel is taking birth with able,efficient and proffessional journalists.As RAmu has given good ratings to Ravi And Sridhar one can hope a beter channel if not best for the Telugu people.
I humbly request and appeal to Chief Editor and senior journalists of this V6 channel not to become one more Ravi Prakash and Radhakrishna as these two have converted Telugu media into a mafia without any shame for themselves and their staff.

JP.

Vinay Datta said...

Swapna's programmes in Sakshi could be old ones. When I mentioned that Swapna joined Chiranjeevi's channel after seeing your blog, a journalist of The Hindu called a person from MAA TV. And he confirmed it.

we4telangana said...

amkam ravi discussions baga chesthadu.2009 electtions time ravi discussions anni chusanu.inni rojulu ekkedunnada anukunnanu.ika sridhar manchi quality journalist.manchi bhasaha charchalu arthavanthamga nirvahisthadu.

TV9 Rajinikanth tv9 lo ee madhya ekkuvaga kanipinchadam ledu(If i am not wrong).
Ramu garu idi sandarbhamo kado theliyadu kani NTV lo vasthunna modern mama,mama miya program chala vulgar ga undi.Just for fun perutho ,heroines nu players nu nana matalu antu(anni double meaning matalu) chala darunanmaga untondi.andariki neethulu cheppe NTV KSR ,mari e program gurinchi emi chebuthado thelliyadu.Meru eppatike post rayakapothe deeni goorchi okasari chudandi.

అయితగాని జనార్ధన్ said...

మంచి ప్రయత్నం.. తెలంగాణ ప్రాంత జర్నలిస్టులకు మంచి అవకాశం దొరినట్టుంది. ముఖ్యంగా కొన్ని కంపెనీల్లో తక్కువ జీతాలకు మగ్గుతున్న వారికి ఇదో జంపుజిలానీ మజిలీలాంటిది.. గుంపులోంచి బయటకు వచ్చి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.. సహజంగా శ్రీధర్.. రవి డెడికేటెడ్ అయితే ఇక ఆపేదెవరు?

venki said...

హేలోవ్ ఫ్రెండ్స్
ఇది సందర్భమో అసందర్భామో కానీ..ఓ న్యూస్ వస్తుంది..కొత్త గ వచ్చే ఛానెల్లో ఒక దాంట్లో యంగ్ అండ్ yenargitic గైస్ ని తిస్కోబోతున్నారట..
నాకు తెలిసిన సమాచారం ఇది..
టీవీ five నుంచి సూరి pothedar , శేఖర్ , నరేష్
మహా నుంచి కుమార్ , రవి
హెచ్ ఎం నుంచి రాజేష్
inews నుంచి కోటి,నరేష్
స్టూడియో ఎన్ నుంచి అంబరీష్ , రమేష్

ఇలా ఈ పది మందితో పాటు మరో చాకుల్లాంటి కుర్రాళ్ళని రంగం లో కి దింపాలని ఆ కొత్త యజమాని భావిస్తున్నాడట..
వీళ్లు జౌర్నలిస్త్స్ గ వచ్చి ౩ ఏళ్ళు ఆయినా , రాత లో మాత్రం, menopause దశ కి వచ్చిన వాళ్ళకంటే చాల రెట్లు నయం అని అయన సర్వే లో తేలిందట..విల్లెవారు పెద్దగ ఎవరికీ తెలిదు..వాళ్ళ సమాచారం కోసం ప్రయత్నించినా దొరకలేదు
ఇలా ratings తక్కువ ఉన్న చానల్స్ లో వాళ్ళనే ఏరుకోవడం లో కారణం..బాగా cheap గ అంటే ఓ ఇరవై వేలకే దొరుకుతారనే..అని ఆ పెద్ద మనిషి వేరేవాళ్ళతో నవ్వుతు అన్నాడు..చూసారో ఎంత కపటమో..ఒక దెబ్బ కి రెండు పిట్టలంటే ఇదేనేమో..ఒక్కళ్ళకి మర్రి చెట్టుల వయసు తప్పితే ఏ పద న్ని ఎక్కడ వాడలో తెలిదు కానీ..జీతాలు మాత్రం అయిదంకెలు..ఆరంకెలు..వాళ్ళ సీట్లు కదలకుండా ఉండటానికి ఇలా కాస్తో కూస్తో టాలెంట్ ఉన్నవాళ్ళని బలి చేస్తుంటారు..అయన ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో కొన్ని రోజుల్లో తేలిపోతుంది..మరి ఆ ఛానల్ ఏది?

shadow (antaramgam) said...

నేను ఇ బ్లాగ్ లకి చాల కొత్త..
ప్రతి వాడు ఓ బ్లాగ్ పెట్టుకోవడం అన్నిటికి" అట".."అంటున్నారు" అనేటప్పుడు మీరు కొత్త గా బ్లాగ్ రాయడమెందుకు? అంటే నేను పెద్ద ఈ విషయాల మిద ద్రుష్టి పెట్టను..జస్ట్ న్యూస్ ఇస్తాను..అవి నిజమో కాదో నాకు తెలిదు అంటారా...అలాంటప్పుడు ఇక మీ బ్లాగ్ డైరీ లాగా ఎవరికీ కన్పించకుండా రాసుకోండి..
ఇక్కడెవరు సమాజాన్ని ఉద్దరించడం లేదు..ఎందుకు ఊరికే స్వయం తృప్తి పొందడం..పది మంది పర్సనల్ విషయాలు రోడ్డు మీదకి లాగే, మీడియా వెధవలకి...వాళ్ల బతుకులు మాత్రం సేఫ్ గా ఉండాలా...ఏదో అన్ని వ్రుతుల్లనే ఇది కూడా ఒకటి అనుకునేవాళ్లు ..ఇక నీతి నిజాయితీల గురించి ముచట్లు చెప్పడం ఎందుకు..? ఎవడు సమాచార విప్లవం తిసుకురానక్కర్లేదు..అలానే నేను రాసిన ఈ కామెంట్ కి విశ్లేషణలు..వివరణలు కూడా ఏం అక్కర్లేదు..అసలు పోస్ట్ కూడా చేయనక్కర్లేదు..ఎందుకంటే..ఈ కామెంట్ పది మంది చదవాలనే దుగ్ధ నాకేం లేదు..బ్లాగర్ కి ఎటు తెలుస్తుంది నేనేం చెప్పింది..సో bye

kanthisena said...

జర్నలిస్టు జాతి కంటక అమానుష ఎడిటర్లకు..
ఆహా...! ఇక కామెంట్ అనవసరం...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి