Sunday, September 18, 2011

అంబటి రాంబాబు "రాసలీల": దమ్మున్న చేగు"వేరా" వీర పోరాటం

పుట్టపర్తి సత్యసాయి బాబా గారు పరమపదించాక....ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని నేను ఎదురు చూస్తుంటే...చివరకు ఒకడు దొరికాడు. ఇప్పుడాయన...యువత ఎలా ఉండాలో ఉద్భోదిస్తున్నారు, అవినీతిని ఎలా నిర్మూలించాలో చెబుతున్నారు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఎలా మెలగాలో స్పష్టం చేస్తున్నారు. ఆయనే...మన వేమూరి రాధాకృష్ణ అలియాస్ వేరా. మన తెలుగు జనం పాలిటి పోరాట యోధుడు లాంటి చేగువేరా.

కాలేజీలకు వెళ్లి పిల్లలకు ఉద్భోదలు చేసే చేగువేరా...సంస్కృతి పరిరక్షణలో వీరత్వాన్ని చూపుకోవడానికి ఒక మంచి మసాలా దొరికింది. అదే...జగన్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఒకమ్మాయితో ఫోన్ లో చెబుతున్నట్లు ABJ- Andhra Jyothi ఛానల్ ప్రసారం చేసిన కథనం. ఒక గవర్నర్ రాసలీలలు బైట పెట్టిన దమ్మున్న ఛానల్ ఇప్పుడు రాంబాబు మీద పడింది. 

రాంబాబు ఏమైనా రాముడా? ఈ తొక్కలో రాజకీయ నేతలంతా దాదాపుగా దగుల్బాజీ గాళ్ళే. అమ్మాయిల పిచ్చి లేనోళ్ళు చాలా తక్కువ. నాకు తెలిసిన నేతలు చిత్తకార్తే కుక్కలు. ఈ కుక్కల ఆగడాల వల్లనే చాలా మంది మహిళలు రాజకీయాలలోకి రాలేకపోతున్నారు. వీళ్ళే కాదు...ఫోన్లు టాప్ చేస్తే...పొద్దున్న లేచిన దగ్గరి నుంచి జనాలకు సుద్దులు చెప్పే జర్నలిస్టులు చాలా మంది కూడా మద పిచ్చిగాళ్ళేనని ఇట్టే తెలుస్తుంది. ఛానళ్ళల్ లో పనిచేసే సూపర్ సూపర్ జర్నలిస్టుల కథలు, యజమానుల రాసలీలలు రాస్తే పెద్ద గ్రంథం అవుతుంది. నా పీహెచ్డీ అయ్యాక ఆ పని చేస్తే ఎలా ఉంటుందా అని అనుకుంటున్నా. ఈ చెత్తగాళ్ళ కథలను మనమెందుకు మార్కెట్ చేసుకోకూడదు?  ఈ వెధవులు చాలా మంది కొంపలో పెళ్ళాం బిడ్డలను ఉంచుకుని...ఫీల్డులో చెత్త పనులు చేస్తూ సంసారాలు కూలుస్తున్నారు. ప్రతి ఛానల్ లో ఈ బ్యాచ్ పాతుకు పోయి ఉందన్నది బహిరంగ రహస్యం. 

ఈ సన్నాసుల టెలిఫోన్ల మీద ఆధారపడి కథనాలు ప్రసారం చేయడం ఒట్టి వేస్టు. సరే...అర్జెంటుగా జగన్ పార్టీ ని సన్మార్గంలో పెట్టాలని అనుకున్నా, అక్కడి మహిళలకు నిజంగానే రక్షణ కల్పించాలని అనుకున్నా...పధ్ధతి ఇది కాదు....పచ్చి రొడ్డ జర్నలిస్టు వేరా.

ఒకమ్మాయి వచ్చి నాతొ వేరా ఫోనులో చెత్త వాగుతున్నాడు. రికార్డు చేసాను...వేసుకుంటారా అంటే...ఎస్ అని సొంగ కార్చుకుంటూ దాన్ని ప్రసారం చేసే వాడిని జర్నలిస్టు అనరు. బేవార్స్ అంటారు. అది ప్రసారం చేసే ముందు...కనీసం రాంబాబు ను..."ఏం బాబూ..." అని అడగాల్సిన బాధ్యత వేరా బృందానికి లేదా? ప్రత్యర్ధిని భ్రష్టు పట్టించాలన్న తీట ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ .రాంబాబును వెర్షన్ కోసం పలకరిస్తే...తను ఏమైనా ఇవ్వజూపితే....తీసుకోక తప్పి చావదు కాబట్టి...మాట్లాడక పోవడమే ఉత్తమమని అనుకున్నట్లు వున్నారు...అక్కడి జర్నలిస్టులు. వీళ్ళు చేస్తున్నది జర్నలిజం కాదు...పచ్చి చీప్ మార్కెటింగ్ టెక్నిక్. 

సరే...వెర్షన్ లేకుండానే ఆ అమ్మాయి కథనాన్ని నమ్మి దాన్ని ప్రసారం చేసారు అనుకుందాం. ఆ కాపీ రాసే విధానం ఏమిటి? అందులో వాడే పదజాలం ఏమిటి? ఆర్కే పేరిట వచ్చిన ఒక వ్యాఖ్యాత్మక కథనంలో వాడిన పదజాలం...వీధి రౌడీలు తొడకొట్టి సవాల్ అన్నట్లు ఉంది. పైగా...ఈ స్టోరీ లు వాడినప్పుడు యాంకర్లు గా, వాయిస్ ఓవర్ కూ అమ్మాయిలను వాడారు...బహుశా కావాలనే. అంత చెత్త పదాలు, అసభ్యపు మాటలు ఆ అమ్మాయిలతో చెప్పించడం మరీ బాగోలేదు. తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చే దాకా వేరా ఆగేట్టు లేడు. అప్పటి దాక మరిలాంటి కథనాలు మనం ఎన్ని చూడాల్సి వస్తుందో?

డియర్ చేగు'వేరా'...ఇప్పటికే...నీ 'ఓపెన్ హార్టు', 'ఓపెన్ డిబేటు' లతో జనాలకు జర్నలిస్టుల పట్ల ఏహ్యభావం మరింత పెరిగింది. ఎందుకయ్యా...ఇలాంటి చెత్త కథనాలతో జనాలను విసిగిస్తావ్? ఫోన్ లో మాటలు...తాటికాయంత అక్షరాలతో టీ.వీ.స్క్రీన్ మీద వేస్తున్నావ్. ఎందుకయ్యా...మమ్మల్ని ఇలా చంపుతావ్. రాంబాబులకు, రాధాకృష్ణ లకు సంస్కారం...సిగ్గూ ఎగ్గూ ఉండకపోవచ్చు....తెలుగు జనాలకు అవి వున్నాయి బాబు. కాస్త మా గురించీ ఆలోచించి పుణ్యం కట్టుకో.   

32 comments:

ఆత్రేయ said...

ఈ పోస్ట్ మొదటి సగం, రెండో సగం.. ఒకరే రాసేరా అన్న అనుమానం వచ్చేట్టు రాసారు.
మొదట వేరా ను సత్యసాయిబాబా అంతవాడు అంటే తిట్టారా పొగిడారా, అని డోలాయమానం లో పడ్డా.
ఏదేమైనా ఎబీయన్ ది కాస్త విపరీత ధోరణే. వర్షం పడ్డా సాయంత్రం కాఫీ తాగుతూ తినే పకోడీల బదులు ఇలాంటి ఛానల్ చూడొచ్చు.

ప్రేమిక said...

baga chepparu sir...

Praveen Mandangi said...

శ్రీరంగ నీతులు చెపుతూ బోగం గుడిసెలలో దూరేవాళ్ళు ఉంటారు (బోగంవాళ్ళు క్షమించాలి. మీ పూర్వపు కులవృత్తి పేరుతో మిమ్మల్ని కించపరచడం నా ఉద్దేశం కాదు). జగన్ ఏదో దేవుడు అనుకుని అతనికి కడపలో వోట్లు వేసినవాళ్ళకి దేవుని పార్టీలో ఉన్న బోగం గుడిసెల్లో దూరే పెద్ద మనుషుల గురించి తెలియాలి కదా. కనుక వేమూరి రాధాకృష్ణ చేసినది తప్పు కాదు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

వీళ్ళిద్దరూ చెత్త నా ------- లు. కొన్నాళ్ళు ప్రజలు ABN ఆంధ్ర జ్యోతి వైపు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఏంటో న్యూస్ చానల్సు నుండి కూడా పిల్లలని కాపాడాల్సి వస్తూంది.

srinivasrjy said...

ఎంత కరెక్ట్ గా చెప్పారు...అందుకే మీ పోస్టుల గురించి ఎదురు చూసేది..

సుజాత వేల్పూరి said...

బాగా చెప్పారు. ఈ రాజకీయ నాయకులంతా ఏదో మడి కట్టుకుని కూచున్నట్టు ఇక్కడ ప్రజలెవరికీ భ్రమలు లేవు కదా! ఇప్పుడు ఏ బీ ఎన్ ఈ కథనం ప్రసారం చేయగానే "అవునా?" అని నిర్ఘాంత పోవడానికి? ఆయన ఏదైనా వేషాలేసినా అది ఆయన వ్యక్తిగతం! అందులొ ప్రజా ప్రయోజనమేముంది? ఎవరిక్కావాలి ఈ సెక్స్ స్టోరీలు!ఎవరికి ఏం వొరుగుతుంది దీనివల్ల?

నిజానికి ఒక వార్తల కోసం నేను ETV 2 మాత్రమే చూస్తున్నాను!వాళ్లు కూడా పొద్దున లేస్తే చాలు జగన్,గాలి వార్తలు తప్ప ఇంకేమీ ప్రసారం చేయకపోవడంతో విసుగు పుట్టి అసలు వార్తలే చూడ్డం లేదు. మీ పోస్టు చూశాక, ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే రాంబాబు స్టోరీ తెల్సింది.

durgeswara said...

రాముగారూ చర్నాకోల చెల్లు మన్నది సార్
కానీ దున్నపోతులచర్మాలకు అది ఆనుతుందా అనేది అనుమానం

Alapati Ramesh Babu said...

'వేరా' అబ్బా ఎన్నిరొజులకు రాధక్రిష్ణగారి తీట తగ్గె టైటిల్.
ఈ వేరాగారి ఇంటర్యులు పరిశీలనగా చూస్తె ఆక్రమసంభంధాలు గురించి వత్తిడి చెసె ప్రశ్నలు. కాలేజిలలొ దాస్టికాలు ఇది ఈన పాత్రికేయం

Unknown said...

if he has further evidences...why is he not approaching police with them...even after a case was registered against him??

sreenivasmnaga said...

BAAGA RASAVANNA

విష్వక్సేనుడు said...

ఇలాంటి చెత్త వెధవలు జర్నలిసానికి మచ్చ తెస్తున్నారు...

GKK said...

పచ్చమీడియా ఆగడాలను చక్కగా ఎత్తి చూపుతున్నారు మీరు. పద్దతిప్రకారం వ్యక్తిత్వ హననం చేయటంలో పచ్చమీడియా పైశాచిక ఆనందం పొందుతుంది. అసలు తామేదో పులుకడిగిన ముత్యాలమన్నట్టు తెలుగు చానెల్లు ప్రదర్శించే self righteous attitude చూస్తే అసహ్యం పుడుతుంది. వేరా is the worst of the lot.

వనజ తాతినేని/VanajaTatineni said...

సెన్సేషనల్ న్యూస్ యెవరికి కావాలి. చానల్స్ కి ప్రజలని చైతన్యవంతం చేసె వార్తలు వద్దు.రెటింగ్స్ కావాలి అందులో వాస్తవాలు ఎంతో..! మనం చూడా వద్దు.పిల్లలని చూడనివ్వ వద్దు అనే విధంగా ఉన్నాయి. బాగా చెప్పారు. ఎవరికి కావాలి..ఈ వార్తలు.

Ram said...

Podduna lesthe Jagan and Gaali news kakunda inke news vestharu ETV2 vallu...akkada jarigindi mamulu avineethi kaadu....

its a NATIONAL CALAMITY ani Tehelka vallu rasaru ante...entha bibatsamaina avineethi and doopidi jarigindoo oohinchukondi....alanti dopididarlu...poddune lesthe...dabbu madam tho nenu great, ma ayya DEVUDU ani pracharam chesthunte....ETV2 vallu dacoit gang mida daily cover cheyadam lo tappu ledu...endukante......YES, ITS A NATIONAL CALAMITY.

Nenu Reddy kabatti, ma reddy nayakudu aina JAGAN ki support chesthanu ani anukunevallu...please don't reply back

Srikanth said...

చెదవేరా సరిగ్గ సరిపొతున్ది ఆయనకి, తెలుగు జర్నలిజనికి పట్టిన చెద.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సారీ, రెడ్లు అందరూ జగన్‌కి సపోర్ట్ చేస్తారనీ, అతనిది, అతని తండ్రిదీ అయిన అవినీతిని గుడ్డిగా సమర్ధిస్తారని అనుకోవద్దు. ఎందరో రెడ్లు ఆ ఇద్దరినీ తిట్టడం నాకు తెలుసు.

Unknown said...

Why the media is silent on Reliance KG scam? Why eenadu did not write any news about it? This shows media targets the people whom they don't like.

Here some body talking about Thehelka, then same magazine reported that CBN is richest politician in India.

No body believes media either it is eenadu or sakshi or xyz.

katta jayaprakash said...

A very good piece.Please speed up your work to expose the people like RK who are filthy journalists defaming the proffession.Plesse let the common man know the hidden lives of people who belong to DAMMUNNA CHANNEL.It is most surprising that how and why the seniors are tolerating RK and company and blind,deaf and dumb to the dark life of these unscrupulous people.Have they sucumbed to these people?

JP.

raj said...

Enti Boss, Radha Krishna nu, journalistlanu thittav... Murty prasthavana ledu. ninnagaka monna aakashanikethanu kada appude thidite bagodu anukunnava... avunu... Aa reporter evado varta thechadanuko. ass.editor ga unna murty em peekadu annai. Murty gadi storylanni ilantive.. WASTE FELLOW MURTY

Praveen Mandangi said...

సెక్స్ అనేది వినకూడని పదం అనుకునే సంస్కారవంతమైన దేశం మనది అని అనుకునేవాళ్ళు ఉన్నారు. మన దేశం అంత సంస్కారవంతమైనది కాదు అనే నిజం బయట పెట్టడం తప్పెలా అవుతుంది? వేమూరి ఆ నిజమే కదా బయట పెట్టాడు. సెక్స్ అనేది వినకూడని పదం అని పైకి చెపుతారు కానీ అలా చెప్పేవాళ్ళే రహస్యంగా పాడు పనులు చేస్తారు. ఇలాంటివాళ్ళ బతుకులని బయట పెట్టడం తప్పెలా అవుతుంది?

Ram said...

"Unknown"

When and where did I support CBN here in this comments section. YSR ni or YS Jagan ni emanna ante...."yee?..CBN ala cheyaledaaa" ani reverse flawed argument okati vesukoni vastharu enti vayya....

Basic ga YSR ni support cheyadaniki miku argument ledu...anduke reverse lo miru chesindi kuda tappega anesi..so memu chesindi oppu ani antunaru...

YES. CBN mida court lo case veyandi....jail lo veyandi if found guilty.....miru anagalgutharaa..same YSR and Y S Jagan ni??

analeru, endukante appudu miru inko argument vethukuntaru...so basic reason enti ante.....miku support cheyadaniki edo oka vanka kavali...

SAD STATE OF AFFAIRS in AP.

inka pothe reliance issue....oka Andhra Pradesh nunchi M.P ga super majority tho elect aina YS Jagan enduku Reliance Scam mida matladadu? Delhi ki velli enduku pressmeet petti cheppadu? yee....dammu ledaaa?


Ambati news ni eenadu lo cover cheyaledu..kanisam 1 line news kuda ledu. Mari adigavaa? Ambati news enduku cover cheyaledu ani?

Heritage Fresh lo rates ekkuva unnayii....Heritage milk packets lo 2 ml milk takkuva undi lanti sodhi stories kakunda..edanna dammuna articles rayamanandi Sakshi vallani....anthe kani, janalu ala anukutunaru...singapore lo hotels unnayi anta lanti faltoo stories rayoddu...memu aite wait chesthunamu edanna dammuna article or evidence dorukuthundaa CBN ki against ga ani...CBN dorikithe , tittadaniki memu ready

kaani already dorkipoyina YS Jagan ni enduku venakesukoni vasthunaru?

ye miru Jagan ni disown cheyaleraaa? tittalera? edanna abhimanam addosthundaa? if so, elanti abhimanam?

Mee Abhimani said...

Ramu

In your blog, I never saw a negative article on Jagan / Sakshi. Sakshi's journalistic ethics are worser than ABN.

My 2 cents.

Ramu S said...

సార్...
నేను గతంలో సాక్షి మీద, సాక్షిలో ఉండి కావాలని 'ఈనాడు' ను కుమ్ముతున్న నా ఇష్ట మిత్రుడి మీద కూడా రాసాను. నిజానికి 'సాక్షి' ని ఒక సీరియస్ న్యూస్ ఛానెల్ గా చూడాల్సిన పనిలేదని నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే...వారి అజెండా క్లియర్. జగన్ ఎప్పుడూ చేగు"వేరా' లాగా....సుద్దులు చెప్పడు. సమాజోద్ధరణ కార్యక్రమాలు పెట్టుకోరు. ఆయన అజెండా క్లియర్. దాంతో మనకు ఇబ్బంది లేదు. ఆయన దగ్గర పనిచేసే జర్నలిస్టులు విధిలేక పొట్ట కూటికోసం పని చేస్తున్నవారు. వారిని అని లాభం లేదు. నాకు తెలిసి...సాక్షి పొలిటికల్ అజెండా స్పష్టంగా వున్న ఛానెల్ తప్ప మరీ అంత కక్కుర్తి బూతు ఛానెల్ కాదని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు?
రాము

Praveen Mandangi said...

బూతు సన్నివేశాలు చూపించలేదు కనుక సాక్షి మంచి చానెల్ అని మీరు నమ్మేస్తున్నారా? ఏమి అమాయకత్వం మీది? బీహార్‌లో షాహబుద్దీన్ అనే ఒక మాజీ ఎంపిపై డబ్బై బందిపోటు కేసులు ఉన్నాయి. ఆ ఎంపి తన మీద రేప్ కేసులు వ్రాయొద్దు, ఆ కేసులు వ్రాస్తే ఊరుకోను అన్నాడు. రేప్‌లు & వ్యభిచారం చెయ్యనివాళ్ళందరూ నిజాయితీపరులని నమ్మేస్తామా?

కిరణ్ కుమార్ కే said...

వేర ఒక పాత్రికెయుడుగా సుద్దులు చెపుతాడు, జగన్ ఒక రాజకియ నాయకుడుగ సుద్దులు చెపుతాడు, పాడయిపొయిన పాత్రికెయుల గురించి మిరు బాధ పదుతారు కాని పాదయిపొయిన నాయకుల గురించి మికు బాద లెదు.

మీరు చెప్పినత్లు ప్రజలు నాయకుల పయిన సధబిప్రయంలొ లెరు, అంత మాత్రం చెత రాజకియ వారతలు చదవతం మానలెదు, ప్రజల సెవకు అంకితం అయినము అని చెప్పుకునె వాల్ల జివితం గురించి తెలుసుకునె హక్కు ప్రజలకు ఉంది, ఈది బూతు కాబట్టి మీడియలొ రావటం తప్పు అయితె , దాని గురించి మిరు రాయతం కూడ తప్పె.

Mee Abhimani said...

Ramu sir

RK, oka rogue ani andaru oppukontaru. Samajaniki chetu, Sakshi valla ekkuva jaruguthundi, ABN kante. Sakshi is trying to justify the corruption of Jagan. Jagans ki dabba kottadam kante, society meeda dani implications inka deep ga untayi.

Whats your take on this.

Sriharsha Nandaluri said...

మీతొ పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏబీఎన్(వెరా) చేస్తున్నది జర్నలిజం కాదు. సాక్షి అజెండ గురించి కొత్తగ చర్చ అనవసరం.

చక్కటి విశ్లేషనకు రాము గారికి ధన్యవాదములు.

Anonymous said...

మిస్టర్ చెదవేరా
ఒక స్టీరియోటిపికల్ కమ్మకులగజ్జి పాత్రికేయుడు.
అతని పత్రిక ఒక యెల్లో చిత్రిక
అతని బూతుఛానల్ ఒక డ్రెయినేజి కెనాల్
పోనివ్వండి ! పాపం !
అతన్ని ఇలాగే కొనసాగనివ్వండి !
జనమే తెలుసుకుని
తుపుక్కున ఉమ్మేసి
అతని మీడియాని వెలేస్తారు.
"అతనివాళ్ళు" తప్ప
అన్యులెవరూ వాటిని చూడరు.
వస్తుంది, ఆరోజు తప్పక వస్తుంది.

మాయానది said...

చేగువేరాతో పోల్చొద్దు ప్లీజ్....
మీరాతలు రాసుకోండి... కానీ, చే పేరు ఇలాంటి వాటిలో ఇరికించడం సరికాదు.

అయితగాని జనార్ధన్ said...

రాధాకృష్ణ ఛానల్ పెట్టిన తొలిరోజుల్లో నేను చేసిన స్టోరీ నాకు బాగా గుర్తుంది. టీ.వీ 9 తో కయ్యం పెట్టుకోడానికి కాబోలు.. కొన్ని ఛానళ్లుశృంగార కార్యకలాపాలను ప్రసారం ఇలా చేస్తున్నాయంటూ.. వాటిని చూపించారు.. ఇలా చూపించ కూడదంటూ.. మళ్లీ అవే సెక్స్ విజువల్స్... ఏ.బి.యన్ లో వచ్చే స్టోరీలు.. ఆ మొదటి రాత్రి,,, పవర్ తగ్గిందా.. టెన్షన్ తో సుఖం కరువు,, కౌంట్ డౌన్.. అబ్బా చస్తున్నా.. ఎంతైనా సంవత్సరం ఉపాధి నిచ్చిన ఛానల్ అని రిమోట్ నొక్కితే.. పిల్లలతో చూడలేక పోయే న్యూసెన్స్ చానల్ గా మారింది.. ఒక్కమాట... రాధాకృష్ణ ఎంత బ్రోకరో రాజకీయ నాయకులకు తెలియంది కాదు.. ఆయనకే ఈ రాజకీయ నాయకుల శృంగార కథలు ఎందుకు దొరుకుతున్నాయో లోకానికి తెలయంది కాదు... ఇక గొంగట్లో బొచ్చనుకోవడం ఎందుకు ? శుద్ద దండగ...

shine said...

ramu garu meeprayathanam baagundi

shine said...

ramu garu mee blog chaalaa intresting gaa vundi

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి