Friday, November 25, 2011

స్వప్న, మురళీకృష్ణ, వాసుదేవన్....

తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేం. ఏడబోతవ్ రాజన్నా....అంటూ జనాన్ని కంటతడి పెట్టించిన మన ఎనర్జిటిక్ అన్నయ్య మీసాల రాంరెడ్డి 'సాక్షి' నుంచి బైటికిపోవాల్సి వస్తుందని ఎవరనుకున్నారు? అలాగే...అప్పట్లోనే ఈ బ్లాగు రాసినట్లు స్వప్న కూడా ఈ మధ్యన 'సాక్షి'కి గుడ్ బై చెప్పారు. మాకున్న సమాచారం ప్రకారం ఆమె ఆ సంస్థ నుంచి బైటికి వెళ్లిపోవడం ఇది రెండో సారి. గతంలో ఒకసారి వెళ్లి మళ్లీ కొందరు పెద్దల జోక్యంతో చానల్ బాధ్యతలు స్వీకరించారు. 

జగన్, సీబీఐ గొడవలు, ఆఫీసులో తనకు సరిపడని వాతావరణంతో ఇబ్బందిపడిన స్వప్న కూడా వదలడంతో 'సాక్షి' ఛానల్ బోసిపోయింది. ఆమెకు పలు చోట్ల నుంచి ఆఫర్లు ఉన్నట్లు సమాచారం. వై.ఎస్. హయాంలో సమాచార కమిషనర్ గా నియమితులై బాగా పనిచేసిన మాజీ 'ఈనాడు' పాత్రికేయుడు దిలీప్ రెడ్డి కి ఛానల్ లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. ఈ నెలాఖర్లోపు ఈ నియామకం ఖరారు కావచ్చట. 

స్వప్నమాదిరిగానే టీవీ-నైన్ నుంచి వచ్చి సాక్షి ఛానల్ లో చేరిన రిపోర్టర్, యాంకర్, ప్రజంటర్ మురళీ కృష్ణ తాపీగా సొంత గూటికి చేరారు. నిజానికి మురళీ కృష్ణ సొంతగూడు ఈనాడు. తనీ మధ్యనే టీవీ నైన్ లో చేరి తెరమీద దర్శనమిస్తున్నారు. 
'సాక్షి' ఢిల్లీ బ్యూరో చీఫ్ గా అద్భుతంగా పనిచేసి అనుకోకుండా జెమిని ఛానల్ లో బ్యూరో చీఫ్ గా చేరిన పత్రి వాసుదేవన్ జెమినికి రాం రాం పలికారు. అక్కడ మ్యానేజ్ మెంట్ లో ఉన్న ఒక వ్యక్తితో తనకు బెడిసినట్లు సమాచారం. అంతే కాక...తన ప్రమేయం లేకపోయినా తనను 'ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్' కేసులో ఇరికించడంతో వాసు మానసికంగా కుంగిపోయారు. తను మళ్లీ 'సాక్షి' ఛానల్ ఢిల్లీ బ్యూరో ఛీఫ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తున్నది. పైన పేర్కొన్న ముగ్గురూ టీవీ-నైన్ పాత బ్యాచే. మురళీ కృష్ణ ఈ టీవీలో, వాసుదేవన్ 'ఈనాడు' సహా పలు పత్రికలతో పాటు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో కూడా పనిచేశారు. 


ఈ టీవీ చర్చల్లో బాలకృష్ణ
ఈ మార్పులు చేర్పులు మధ్యన కొద్దిగా హాయినిచ్చిన అంశం..ఒకప్పుడు హెచ్.ఎం.టీవీలో పనిచేసిన మంచి యాంకర్ బాలకృష్ణ మళ్లీ రంగ ప్రవేశం చేయడం. సివిల్స్ కు ప్రిపేర్ కావడానికని హెచ్ఎం టీవీని వదిలి వెళ్లి పోయిన ఈ బాలుడు ఈ టీవీ-2 లో కనిపించాడు. తనక్కడ ఫ్రీ లాన్సింగ్ చేస్తున్నట్లు తెలిసింది. నేను గతంలోనే రాశాను...మళ్లీ చెబుతున్నాను...కులాలు...ప్రాంతాలకు అతీతంగా ప్రోత్సహించి ఆదరిస్తే గొప్ప యాంకర్ అయ్యే కళ ఉన్న అతి కొద్ది మందిలో బాలకృష్ణ ఒకరు. ఆల్ ది బెస్ట్ బాలకృష్ణ.

4 comments:

evadaite enti said...

వాసుదేవన్ అంతే ఎవరు సర్?
ఐ న్యూస్ లో ఒకాయన ఉన్నారట..geminilo కూడా చేసారట అయన..మరి సాక్షి లో చేసారో లేదో తెలిదు..అయన ఈయన ఒకరు కాదేమో

స్వప్న గారు ntv కి ఓ ప్రోగ్రాం చేస్తున్నారు..ఇక మురళి సంగతి తెలిదు కానీ..ఈ వాసుదేవన్ గారు తనకంటూ ఓ టీం ఉండాలన్నట్లు టీవీ five నుంచి కొంత మందితో inews లో జాయిన్ అయ్యారట..అప్పుడే వాళ్ళలో ఇద్దరు తిరిగి వెనక్కు వెళ్లారట..అసలెందుకు ప్రతి ఒక్కళ్ళు కొత్త చోటు కి వెళ్తే తోకల్ని తిస్కేల్లాలి.?.అక్కడున్నోళ్ళని ఇబ్బంది పెట్టాలి? కొత్తగా జాయిన్ అయి వీళ్లు చిన్చెడెం ఉండక పోయినా అప్పటి దాక ఉన్నవాళ్లు చేతగాని వాళ్ళలా మాటలు వాగడం...ఇలా behave చేసే వాళు వాళ్ళకేం చేతకాదనే విషయాన్నీ వాళ్లే బయట పెట్టుకున్తున్నారని ఎప్పడు గ్రహిస్తారో మరి..తొందర్లోనే ఈ రెండో వాసుదేవన్ కూడా అక్కడ నుంచి జుంప్ అయి వేరే చోటికి వెళ్తారట..ఏదైనా మీరు పెట్టిన heading అలా అయినా కూడా కరెక్టే అవుతుంది లెండి..

cheppandi please said...

వాసుదేవన్ ఏమో కానీ ఐ న్యూస్ పరిస్తితి నిజంగా బీభత్సం గ ఉంది ఎంతో టాలెంట్ ఉన్నవాళ్ళందరూ అక్కడ చేరిన ఇనప పడాల వాళ్ళ నాశనం అయిపోతున్నారు..నరేంద్ర ఛానల్ తీస్కున్న దగ్గర నుంచి ఇంత వరకు ఒక్క పైసా కూడా జీతాలు పెంచలేద టా . hardcore ప్రోగ్రాం , buletins చూస్తుంటే ఎవరికైనా వాళ్ళు గగుర్పొడుస్తుంది..పైన పటారం లోన లొటారం అంటే ఇదేనేమో ...ayina

ఈ మధ్య కొత్త చానల్స్ గురించి ఎవరు రాయడం లేదేం..ABC ఛానల్ కి ట్రై చేస్తే వాళ్ళు షిఫ్ట్ incharge కి కూడా పదివేలకి మించి ఇవ్వదలుచుకోవడం లేదట..ఇక నిజంగా బతకలేక బడిపంతులు సామెత , బతకలేక జర్నలిస్ట్ అని మార్చాలేమో అన్పిస్తుంది ఇలాంటి విషయాలు వింటే..

మీ బ్లాగ్ లో రాసిన జుస్తిసు గారి సూచనలపై ఫాలో అప్ ఏది మాస్టర్ రామ్?

cheppandi please said...

వాసుదేవన్ ఏమో కానీ ఐ న్యూస్ పరిస్తితి నిజంగా బీభత్సం గ ఉంది ఎంతో టాలెంట్ ఉన్నవాళ్ళందరూ అక్కడ చేరిన ఇనప పడాల వాళ్ళ నాశనం అయిపోతున్నారు..నరేంద్ర ఛానల్ తీస్కున్న దగ్గర నుంచి ఇంత వరకు ఒక్క పైసా కూడా జీతాలు పెంచలేద టా . hardcore ప్రోగ్రాం , buletins చూస్తుంటే ఎవరికైనా వాళ్ళు గగుర్పొడుస్తుంది..పైన పటారం లోన లొటారం అంటే ఇదేనేమో ...ayina

ఈ మధ్య కొత్త చానల్స్ గురించి ఎవరు రాయడం లేదేం..ABC ఛానల్ కి ట్రై చేస్తే వాళ్ళు షిఫ్ట్ incharge కి కూడా పదివేలకి మించి ఇవ్వదలుచుకోవడం లేదట..ఇక నిజంగా బతకలేక బడిపంతులు సామెత , బతకలేక జర్నలిస్ట్ అని మార్చాలేమో అన్పిస్తుంది ఇలాంటి విషయాలు వింటే..

మీ బ్లాగ్ లో రాసిన జుస్తిసు గారి సూచనలపై ఫాలో అప్ ఏది మాస్టర్ రామ్?

nani said...

సాక్షి మొదట్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. పెద్దాయన ఉన్నపుడు ఉన్న పేరు ఇప్పుడు పడిపోతుంది. సాక్షి బయట న్యూస్ కాకుండా ఒక్క జగన్ కోసమే ఉంది అని మండిపడుతున్నారు. స్టూడెంట్స్ ఐతే అసలు సాక్షి లో న్యూస్ ఉండదు వేస్ట్ అనుకునేలా అయ్యింది. దీనికి కారణం వెతకడం కన్నా మంచి న్యూస్ ని ప్రజలకు అందివ్వడానికి ప్రయత్నించండి.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి