Wednesday, February 1, 2012

"భారత్ గెలిస్తే దిసమొల (naked)తో డాన్స్ చేస్తాం"

భారత్, ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో మొదటి టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ చివరి ఓవర్ ముగియగానే...వీక్షకుల్లో ఒకడు...ఒక ప్లకార్డు పట్టుకుని ఉరుకుతూ కనిపించాడు. అప్పటికే ఆస్ట్రేలియా తుక్కురేగకొట్టి...ఇరవై ఓవర్లలో  కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆ ప్లకార్డు మీద ఈ కింది మాటలున్నాయి:

If India wins...we will dance naked. 

భారత్ చచ్చినా గెలవదన్న ధీమా ఇందులో కనిపించింది. ప్రపంచ ఛాంపియన్లం జనాలకు ఎంత చులకనై పోయాం.  టెస్టు సిరీస్ లో భారత్ ఘోర పరాజయం పొందటంతో మనోళ్ల మీద ధీమా ఏర్పడి ఆస్ట్రేలియన్ క్రీడాభిమాని ఈ ప్లకార్డు దుస్సాహసం చేశాడు. దీన్ని మనోళ్ల వమ్ము చేసి ప్ల కార్డు వీరుడి బట్టలూడతీస్తారో...లేక...తస్సుమనిపిస్తారో ఇంకొన్ని గంటలు వేచిచూడాలి.
మొన్నీ మధ్య అబుదాభిలో ఇంగ్లండ్...పాకిస్థాన్ ల మధ్య టెస్టు మ్యాచు జరుగుతుంటే...ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుత కామెంటేటర్ అయిన బాయ్ కాట్ ఇలాగే ఒక కూత కూసి దొరికిపోయాడు. ఈ టెస్టు మ్యాచ్ లో మా జట్టు ఓడిపోతే...నాకున్న మూడు ఇళ్లూ అమ్మిపారేస్తా...అని స్టేట్ మెంట్ ఇచ్చాడు...పరమ ధీమాతో. కానీ నాలుగో రోజు పాకిస్థాన్ ను అల్లా కరుణించి ఇంగ్లండ్ ను 72 పరుగుల తేడాతో మట్టికరిపించాడు.
"I have lost all my houses, you stupid England team. I'm kidding but this was a terrible performance," అని బాయ్ కాట్ తర్వాత అన్నాడట. ఈ వ్యవహారం ఎలా ఉన్నా...భారత్ జట్టు కనీసం టీ ట్వంటీ పోటీల్లో అయినా ఇంగ్లండ్ మీద గెలవకపోతే...అక్కడ నగ్న డాన్సుల సంగతేమో గానీ...ఇక్కడకు రాగానే భారతీయ క్రికెటర్ల బట్టలూడేలా కొట్టేట్టున్నారు...క్రికెట్ పిచ్చోళ్లు.

10 comments:

Subba Reddy said...

బాగా చెప్పారు రాము గారూ...!!! కాక పోతే చివరి వాక్యం లో ఒక చిన్న కరెక్షన్ సార్... ఇంగ్లాండ్ మీద గెలవటం అని రాసారు, ఆస్ట్రేలియా మీద అని ఉండాలి సార్...!!!

Anonymous said...

మనవాళ్ళు పాపం చాలా మంచివాళ్ళు... ఆ అవసరం లేకుండా రక్షించారు...

katta jayaprakash said...

Why this kolaveri about the cricket? When India lost it's prestige in hockey for decades no body commented nor cried at it including media.Why this madness for cricket? There are many other games and sports to be recognised and encouraged.Ofcourse it is the money power that controls the cricket.Had there been empty stands in cricket stadiums it would have been a different picture.money makes many things.

JP.

sudheer said...

sir meru bagachaparu sir

ddtv said...

Offtopic: regency ceramics lo em jarigindo meekunna sources tho kanukkuni maaku cheppagalara?

company VP ni evaru champaru, alage union leader ni, I am not asking too much.

katta jayaprakash said...

Off the topic in public interest:It is most tragic that when Regency ceramics had done a lot to the people and the villages in every field as per news reports the workers had destroyed their own bread and butter by damaging the company resultin in lock out.Late Chandrashekar VP of the company is most popular in the company and he had contributeed a lot for the welfare of the workers as well the people of the area.It is still a mystery how the tragedy started and who started and why! As CBI has entered the truth will come out soon.This incident shows that humanitarian service has no value among the trade unionists as they always desire And invite trouble in the working place for their existence.
Sorry for this post but I was moved by the statement of Mrs.Chandrashekhar who recalled the services rendred by her husbands for many years and she felt it is better to leave the place where there is no value and recognition for humanitarian service and she had to leave the place with the dead for the services rendered by the same when it was alive.
It is most astonishing media is just keeping calm without any support either to company or people like late Chandrashekhar.
JP.

ddtv said...

JP,
కంపెని వైస్ ప్రెసిడెంట్ ను ఎవరు చంపినా అందరూ ఖండించవలసిందే. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ను కార్మికులు చంపారని అనుకున్నా మరి కార్మిక నాయకుడిని ఎవరు చంపినట్టు? యాజమాన్యం చంపిందా లేక కార్మికులే చంపారా? ఏదో జరిగింది, కంపెని తెలుగు దేశానికి చెందిన 'నాయుడు' ది. కార్మిక వర్గానికి సపోర్ట్ చేస్తున్నది కాంగ్రెస్ ఎంపి హర్ష కుమార్. 1985 ప్రాంతం లో స్థాపించబడ్డ కంపెని లో కార్మికులు సంఘటితం కాకుండా 2007 వరకు యునియన్ ఏర్పాటు చేసుకోనివ్వలేదని వినవస్తున్న మాట. చివరగా కార్మిక నాయకుడి మృతి ని కూడా ఖండించాల్సిందే.

Krishna A said...

Media doesn't dare to support management...no matter whatever is the truth. They simply can not afford to face the backlash from red gang and their sympatizers.

Might is right..as simple as that.

katta jayaprakash said...

No one knows how the union leader MUralimohan died.Whatever may be he demands of the workers killing a seniormost staff as a revenge for the death of the union leader is unfortunate.The sudden death of the leader is regrettable and if in the hands of police it is highly condemnable and the guilty police personnel must be punished.Chandrashekhar is nothing to do with the death of muralimohan and then why he was killed in cold blood?It all looks mysterious and confusing and let CBI come outwith investigations for the truth.

JP.

raja said...

రీజెన్సీ ఎపిసోడ్ లో ఇరుపక్షాలదీ తప్పుందనిపిస్తుంది. కంపనీలో మూడు దశాబ్దాలుగా యూనియన్ లేకపోవటం/ఉండనివ్వకపోవటం యాజమాన్య వైఖరిని చెప్పకనే చెపుతుంది. రీజెన్సీది యానాంలో ఇంతకాలం ఒన్ మాన్ షో. యానాం మొత్తం బూభాగంలో 1/6th రీజెన్సీదే. స్థానికులనుండి ఆణాకీ అర్ధణాకి కొనుక్కొంది. ఇది ఈ నాడు ఒక్కో ఎకరం కొన్ని కోట్ల రూపాయిల విలువ. ఇక జీతాలు కార్మికులకు రెండువేలనుంచి ఇంజినీర్లకయితే అయిదారువేలకు మించి ఇవ్వరు. యానాంలోనే ఉన్న రెడ్డి లాబ్స్ కార్మికుల జీతాలు వీరిజీతాలకంటే మూడునాలుగు రెట్లు అధికం. పైన ఎవరో కామెంటు చేసినట్లుగా రీజన్సీ యాజమాన్యం యానాన్ని చేసిన మానవీయసేవలు ఏమీ లేవు. వాళ్ళు వ్యాపారం కోసం చిత్తూరునించి యానాం వచ్చి, ఈ ప్రాంతం కేంద్ర పాలిత ప్రాంతం కావటంతో పెద్ద మొత్తాలలో టాక్స్ బెనిఫిట్స్, చవక కరంటు పొందుతూ వ్యాపారం చేసుకొన్నారు, బాగుపడ్డారు. అంతే తప్ప వారు యానానికి చేసిన మేళ్ళేమీ లేవు. యానానికి ఇండస్ట్రీస్ ఆర్ధిక సాయం చేయాల్సిన అవసరం ఉండదు ఆంధ్రాలోలాగ. ఎందుకంటే పండ్స్ కొరత ఉండదు ఈ చిన్ని ప్రాంతంలో. స్కూళ్ళు, కాలేజీలు కూడా కంపెనీకి అనుభంధ సంస్థలే తప్ప ఉచిత విద్య/సబ్సిడీ మీద విద్యనందించే సంస్థలేమీ కాదు.
స్థానికి ప్రజాప్రతినిధి గతఎన్నికలలో అధికారాన్ని కోల్పోయి ప్రత్పక్షంలో కూర్చోవటం రీజెన్సీకి పెద్ద దెబ్బ. ఎందుకంటే కార్మిక సమస్యలు నయానా భయానా ఆయన సమక్షంలో సర్ధుమణిగేవి.
కాగా గత కొన్నేళ్ళుగా రీజెన్సీ ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే తూగోజిల్లాలోనే పెద్దాపురం వద్ద రాక్ సిరామిక్స్ అనే ఓ పెద్ద ఫాక్టరీ పోటీని తట్టుకొని రీజెన్సీ టైల్స్ మార్కెట్ లో నిలబడలేకపోతున్నాయి. గత సంవత్సరం సుమారు మూడు కోట్ల్ ఆర్ధికపరమైన నష్టాన్ని రీజెన్సీ తన వాటాదారులకు పంచింది. పదిరూపాయిల షేర్ ఇప్పుడు నాలుగు రూపాయిల లోపుకొచ్చింది. కనుక ఈ గొడవల కారణంగా కంపెనీ లాకౌట్ కంపెనీ పరంగా తప్పని సరి
ఇక కార్మికుల వాదన ప్రకారం జీతాలు పెంచమన్నాం, యూనియన్ పెట్టుకొంటామంటే ఒప్పుకోలేదు. ఉద్యోగాలలోంచి తీసేసారు, నాయకుడిని చంపేసారు ఇవే వినపడుతున్నాయి. వాళ్ల కోర్కెలేమీ అసంబద్దమైనవి కావు. స్థానిక పోలీసులు కార్మికనాయకుడిని కొట్టుకొంటూ తీసుకువెళ్లటం, అతన్ని పోలేసులే అపస్మారక స్థితిలో హాస్పటల్ కి చేర్చటం కళ్లారా చూసిన కార్మికులు కొంతమంది మిత్రుల (???) సాయంతో విధ్వంశానికి, కంపెనీ ప్రతినిధి హత్యకు కారణమవ్వటం దుందుడుకు చర్యగా అనిపించక మానదు.
రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఎవరో పొయిటిక్ జస్టిస్ జరిగింది అని వ్యాఖ్యానించారు. ఇదీ అలాంటిదే.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి