Monday, August 27, 2012

అమ్మకానికి....జీ-24 గంటలు?


కొద్దో గొప్పో ప్రొఫెషనల్స్ పనిచేస్తున్న ఛానల్స్ లో  జీ-24 గంటలు ఒకటి. వార్తలను కొత్త కోణంలో చూపించాలన్న తపన ఉండీ నిజం నిప్పు లాంటిదని నమ్ముతున్నట్లు కనిపించే సంపాదక సిబ్బంది అందులో ఉన్నారు. వీరు చాకుల్లాంటి జర్నలిస్టులని  నేను నమ్మే మంచి మిత్రులు అక్కడ పనిచేస్తున్నారు. 

సీనియర్ జర్నలిస్టు లేష్ రెడ్డి రెక్కల కింద ఇన్నాళ్ళూ ఇబ్బంది లేకుండా ఉన్న అక్కడి జర్నలిస్టులు, టెక్నీషియన్లలో ఉద్యోగ అభద్రత పట్టుకున్నది. నెలకు కోటి రూపాయలకు పైగా నష్టాలలో వున్నట్లు చెబుతున్న ఈ చానెల్ ను జీ న్యూస్ యాజమాన్యం అమ్మకానికి పెట్టి చర్చలు జరుపుతున్నది. బేరం కుదరక పోతే...ఒకటి రెండు నెలల తర్వాత భారాన్ని భరించే పరిస్థితిలో యాజమాన్యం లేదని జీ న్యూస్ సీ ఈ ఓ బరున్ దాస్ స్పష్టం చేసినట్లు సమాచారం. 
గత శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన ముందుగా శైలేష్ బృందంతో, తర్వాత ఉద్యోగులతో మాట్లాడి ఈ కఠినమైన కబురును అందించినట్లు తెలిసింది. 

చానెల్ హెడ్ గా ఉన్న శైలేష్ ఒకరిద్దరు ఇన్వెస్టర్ల తో కలిసి చానెల్ ను కొంటారన్న ప్రచారం ఒక రెండు నెలల కిందట జరిగింది. తర్వాత రాంకీ సంస్థ జీ న్యూస్ తో దాదాపు ఒప్పందం ఖరారు చేసినట్లు కూడా అన్నారు. ఇంతలో బరున్ దాస్ చావు కబురు చల్లగా చెప్పడం వింతగా అనిపించింది. జీ తెలుగు చానెల్ లాభాల బాటలో వుండగా దాని కవల  లాంటి  జీ 24 గంటలు చానెల్ ను మూసేస్తున్నట్లు మాట్లాడడం కూడా బాగోలేదు. 

జీ ఆల్ఫా పేరిట జీ గ్రూప్  తెలుగు చానెల్ ను ఏర్పాటు చేసింది...దాదాపు తొమ్మిదేళ్ళ కిందట.  జీ ఆల్ఫా ను జీ తెలుగు గా మార్చారు. అందులో కొన్ని న్యూస్ బులెటిన్లు ఉండేవి. ఆ తర్వాత జీ 24 గంటలు ఏర్పడింది. 
ఎవరైనా...మంచి పెట్టుబడిదారుడు  ఈ చానెల్ ను కొనాలని...అక్కడ ఉన్న జర్నలిస్టు మిత్రులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఈ బ్లాగ్ మనస్పూర్తిగా కోరుకుంటున్నది. 

"ఒకటి రెండు నెలల్లో మూసేస్తున్నట్లే మాట్లాడుతున్నారు. ఆఫీసులో అనిశ్చితి వాతావరణం ఉన్నది. ఇన్ని చానెల్స్ వున్నా ఎవరూ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. పైగా మా పరిస్థితి చూసి తక్కువ జీతాలు ఇస్తామని అంటున్నారు. ఎవరైనా చానెల్ ను కొనకపోతే...పరిస్థితి కష్టమే," అని ఒక ఉద్యోగి చెప్పినప్పుడు నాకు బాధేసింది. We believe that Sailesh can do something to tide over the situation.

5 comments:

Unknown said...

నేను ఒక జీ 24 గంటలు ఉద్యోగినే, మాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని కలలో కూడా అనుకోలేదు.. నేషనల్ ఛానల్ కదా మంచి future ఉంటుంది అని అనుకున్నాం, ఏదో ఒక సాకు చెప్పి మా ఛానల్ ను తీసేద్దాం అని అనుకుంటున్నారు.
మా ఆశ, మా ధైర్యం అంత మా బాస్ shylesh reddy సర్ పైన ఉంది... ఆయన కూడా చాలా ట్రై చేస్తున్నారు. మా అదృష్టం ఎలా ఉంటుందో మరి, మా ఛానల్ లో ఏ ఒక్క employee మొహం లో కల లేదు, అందరు కొండంత ఆశతో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు, ఏదైనా మంచి వార్త వినకపోతమా , మా ఛానల్ పూర్వం లాగే నడువకపోతుండా అనీ....
మాకు నమ్మకం ఉంది మా బాస్ సాదిస్తారు అనీ, ఆపైన దేవుడి దే భారం...


JE said...

అవును అందులోని వాళ్ళందరూ సీవీఆర్ ఛానల్ కి క్యు కడుతున్నారు ...కానీ అనవసరం అక్కడ పనిచేయదమంత బుద్దీ తక్కువ
పని ఇంకోటి ఉండదు..జీ ఛానల్రు ఎం మూయరు అనవసరం గ కంగారు పడకుండా..మంచి ఛానల్ లో జాయిన్ అవ్వండి..inews , న టీవీ ఉన్నాయి
అక్కడ ట్రై చేయండి..అంతే కానీ దిక్కుమాలిన చానల్స్ కి వెళ్ళకండి. హైదరాబాద్ లో రోడ్ పక్కన బజ్జీలు వేసుకున్న బతోకోచు. ఇప్పటికే చాలామంది బళ్ళు పెట్టుకున్నారు కదా..మన దగ్గర ఎవరు తింటారు అనుకోకండి..ఈ సిటీ లో ఎన్ని చోట్ల, ఎన్ని ఫాస్ట్ ఫుడ్ సెంత్రేస్ ఉన్న నడుస్తాయి.
జౌర్నలిస్త్స్ ని అవమానిస్తారా అని ఫీల్ అవ్వొద్దు. ఎందుకంటే సీవీఆర్ లో అంతకంటే ఘోరమైన పరిస్తితిలు ఉన్నాయి..చెప్పిన వినకుండా
జాయిన్ అయ్యారో..ఇక అంతే సంగతులు. చిత్తగించవలెను. రోజు వారి కూలిల్ల వరసగా నిలబడి , పేరు వచ్చిన తర్వాత జీతాలు తీస్కోవడం ఎక్కడైనా చూసారా, అలానే తలుపులు ముసి ఛానల్ లో పని చేయించడం చూసారా? 15 మంది పని ౩ గ్గురి చేత చేయించడం చూసారా? ఏ క్షణాన management కి మీ పై కోపం వస్తే అప్పుడు మీ designation change చేయడం చూసారా వీటన్నిటికి మీరు రెడీ అయితే సీవీఆర్ కి వెళ్ళండి..
అంతే కాకుండా..మిగిలిన డొక్కు చానల్స్ చుట్టూ కూడా తిరగోడ్డు..వాల్లాడే బేరాలకి కన్నీళ్ళు వస్తాయి.. టెన్ టీవీ, తులసి ఉన్నాయి కదా కాస్త ఊపిక పట్టండి.. బ్రదర్స్ మీకు ఇబ్బంది ఏమి లేదు....తప్పకుండ మంచి రోజులున్నాయి మీకు

JE said...

ippudemo evariana manchi pettubadi dharudu antaru..tarvata emo ye labham lekunda vaadu e channel enduku kontadu...aa yajamani ala e yajamani ila ani rastaru..anduke channels owners gurinchi rase vishayam lo kasta balanced ga undandi..ntv narendra gurinchi ilane rasaru konthamandi..ayane konkapote inews paristiti enti ippudu?

Unknown said...

manchi channels lo g 24 gantalu okati , m post chadivaka bada anipistondi, any way, g 24 gantalu channel ku manchi rojulu ravalani , andulu vunna employees kuda manchi ga vundalani kurukuntunnamu

evadaite enti said...

అంతే ..మీడియా జాబ్స్ వేస్ట్ ...ఎవరికైయన్ తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం..అందుకే బాస్ ...management కి కాకా పట్టేది
ఎవడైఅన అంతే కానీ నైతికత లేక కాదు, తెలీక కాదు..మడి కట్టుకుని కూర్చుంటే ఈ నీతులు చెప్పేవాళ్ళు మన నెల వారి సరుకుల్లు ఇంటికి పంపిస్తారా ??? ఎవరి ఫ్యామిలీ వారికి ముఖ్యం..ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపొండి..అసలు ఈ రోజుల్లో నీతులు, జౌర్నలిసం విలువలు ఎవడు గురు పాటించేది..మిగిలిన వాళ్ళు నన్ను దుమ్మెత్తి పోసిన సరే..ఇది కటోర సత్యం..ఇది కూడా ఓ వృతి..అంతే ...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి