Wednesday, June 19, 2013

మీడియా కబుర్లు... అవీ... ఇవీ...

"ది హిందూ' బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్ గా శ్రీనివాస రెడ్డి 

'ది హిందూ' పత్రిక కోసం హైదరాబాద్ లో చాలా కాలంగా పనిచేస్తున్న కె.శ్రీనివాస రెడ్డి గారిని ఆ పత్రిక యాజమాన్యం బెంగళూరు కు రెసిడెంట్ ఎడిటర్ గా పంపింది. క్రైమ్ రిపోర్టింగ్ లో దిగ్గజం లాంటి శ్రీనివాస రెడ్డి చాలా కాలంగా హైదరాబాద్ లో సిటీ ఎడిటర్ గా ఉన్నారు. బెంగళూరు ఎడిషన్ ను చక్కబెట్టే బాధ్యతను  ఆయనకు యాజమాన్యం అప్పగించింది. ఎంతో సమర్ధుడు, మృదు స్వభావి అయిన శ్రీనివాస రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఘన విజయం సాధిస్తారని ఆశిద్దాం. అదే సమయంలో హైదరాబాద్ బ్యూరో చీఫ్ నగేష్ కుమార్ కు  కూడా రెసిడెంట్ ఎడిటర్ హోదా ఇచ్చారు. నగేష్ రిటైర్ అయ్యాక మళ్ళీ శ్రీనివాస రెడ్డి గారు హైదరాబాద్ వస్తారా? లేక ఇక్కడ ప్రమోషన్ లైన్ లో ఉన్న వెంకటేశ్వర్లు గారికి పదోన్నతి ఇస్తారా? అన్న అంశాలపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. 

'మెట్రో ఇండియా' ఎడిటర్ గా ఎ.శ్రీనివాస రావు

'నమస్తే తెలంగాణా' పత్రిక అధిపతి రాజం గారు ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఒక ఇంగ్లిష్ దిన పత్రిక (మెట్రో ఇండియా) ను తే బోతున్నారు. అందుకు సిబ్బంది నియామకం జరుగుతున్నది. న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్, డెక్కన్ పోస్ట్, మెయిల్ టుడే లలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు ఏ. శ్రీనివాస రావు గారు ఎడిటోరియల్ అధిపతి గా నియమించారు. నేను మెయిల్ టుడే లో ఒక ఆరు నెలలు పనిచేసి వదిలేసి అమెరికా వెళ్ళే ముందు శ్రీనివాస రావు గారు ఆ పత్రికలో చేరారు. ఆయన అక్కడ సమర్ధంగా పనిచేసారు. రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత జరిగిన చావులపై ఆయన రాసిన పరిశోధనాత్మక కథనం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈనాడు, న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్, ది హిందూ, ది హన్స్ ఇండియా, పోస్ట్ నూన్ లలో పనిచేసి సొంతగా ఒకటి రెండు వెబ్ సైట్స్ నడుపుతున్న కాకలు తీరిన జర్నలిస్టు సాయ శేఖర్ ను, టైమ్స్ ఆఫ్ ఇండియా, టీ వీ నైన్ గ్రూప్, ది  న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో పనిచేసిన అద్భుతమైన ఎడిటర్ రామ్ కరణ్ లతో కూడా రాజం గారు చర్చలు జరిపాక... రావు గారిని ఎంచుకున్నారు. 
రావు గారితో పాటు బీ ఎస్ రామకృష్ణ గారు కూడా మెట్రో ఇండియా లో చేరారు. డెక్కన్ పోస్ట్ అనే పత్రికకు మంచి పేరు రావడంలో వీరిద్దరి పాత్ర చెప్పుకోదగినది. స్పోర్ట్స్ ఎడిటర్ పోస్ట్ ఇస్తే వీరితో పనిచేస్తే బాగని గట్టిగా అనుకుని నేను భంగపడ్డాను. మొత్తం మీద మెట్రో టీం కు మేలు జరుగుగాక!

ఐ-న్యూస్ లో చేరిన రామ్ కరణ్ 

హైదరాబాద్ కేంద్రంగా ఇంగ్లిష్ లో పక్కా ఎడిటర్ లక్షణాలు ఉన్నవారు చాలా తక్కువ మంది. తెలుగు చానెల్స్ లో అయితే ఎవ్వడైనా ఎడిటర్ అయిపోవచ్చు....ఇరగదీయవచ్చు. ముక్కు మీద కోపం జాస్తి అన్న అపవాదు ఉన్నా... అద్భుతమైన ఎడిటర్ రామ్ కరణ్ గారు. ఉస్మానియా లో జర్నలిజం విద్య అభ్యసించిన ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అంతకు ముందు ఏమి చేసారో తెలియదు. తర్వాత టీ వీ నైన్ గ్రూప్ లో, రీసెంట్ గా ది  న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో పనిచేసారు. తన సహాధ్యాయి అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు రామ్ కరణ్ గారు ఐ న్యూస్ లో పెద్ద హోదాలో చేరారు. నేను ఇండియన్ స్కూల్ అఫ్ జర్నలిజం లో పనిచేస్తున్నప్పుడు రామ్ కరణ్ గారిని 'ది హన్స్' కు ఆహ్వానించాలని మా సారు అనుమతితో అడిగాను కూడా. కానీ ఏవో కారణాల వల్ల ఆయన రాలేదు. రామ్ కరణ్ గారి లాంటి మంచి ఎడిటర్ ను ఇంగ్లిష్ జర్నలిజం కోల్పోవడం బాధాకరం. 

'ది హన్స్ ఇండియా' టాబ్లాయిడ్

కపిల్ గ్రూప్ వారి 'ది హన్స్ ఇండియా' ఈ మధ్యన హైదరాబాద్ వార్తలకోసం ఒక టాబ్లాయిడ్ ను ముద్రించడం ఆరంభించింది. 'హైదరాబాద్ హన్స్' అని దీనికి నామకరణం చేసారు. హన్స్ ఎడిటర్ (ఒకప్పటి డీ సీ వీరుడు) పీ ఎన్ వీ నాయర్ స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ది హన్స్ మెయిన్ పేజీలను గల్ఫ్ పేపర్లలో పనిచేసి వచ్చిన మధుసూదన రావు గారు చూస్తున్నారు. నిజానికి ది హన్స్ ఇండియా ను టాబ్లాయిడ్ రూపం లో తేవాలని ముందుగా భావించారు కానీ అది కుదరలేదు. 

కందుల రమేష్ సారధ్యంలో ఇంగ్లిష్ ఛానెల్ 

సీ వీ ఆర్ సంస్థ వారి న్యూస్ ఛానెల్, వైద్యం చానల్ ఇప్పటికే పేరు తెచ్చుకున్నాయి. తెలుగు ఛానెల్స్ విప్లవం ఆరంభమయ్యాక టీ వీ-5, ఐ -న్యూస్, స్టూడియో ఎన్ లలో పనిచేసిన కందుల రమేష్ గారు సీ వీ ఆర్ న్యూస్ లో చేరారు మొదట్లోనే. మొదట్లో ప్రింట్ లో ఉండి, అందరి కన్నా ముందు ఆన్ లైన్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉన్న జర్నలిస్టు ఆయన సారధ్యంలో సీ వీ ఆర్ గ్రూపు ఒక ఇంగ్లిష్ ఛానెల్ తేబోతున్నది. దాని బాధ్యతలను యాజమాన్యం కందుల రమేష్ గారికి పూర్తిగా అప్పగించినట్లు సమాచారం. గతంలో ఎన్ డీ టీ వీ, టైమ్స్ నౌ ఆంగ్ల చానెల్స్ కోసం పనిచేసిన సునీల్ పాటిల్ కూడా ఆ పని మీదనే ఉన్నారు. 

4 comments:

JE said...

అయ్యా
సి వీ అర్ లో ఏమి లెదు అంత గొప్పగ. ఇప్పుడు మల్లి ఇంగ్లీష్ ఒకటి నడుకు బబు.. న్యూస్ వరకు ఇస్తారు బాగానే ఉంది ప్రతి జిల్లలో ఇంగ్లీష్ లో రిపోర్టింగ్ చేసేవాళ్ళు కావద్దా ?
బ్రెఅకిన్స్ సరె... ఫోన్ ఇన్ ఇంగ్లీష్ లో ఇచెవల్లు కావద్దా? ఎందుకీ వృధా ప్రయాస అంటే సిటీ వరకే అయితే ఫర్వాలేదు కానీ స్టేట్ ఎలా బాబు ???
రామ్ కరణ్ ఇనెవ్స్ లో జాయిన్ అయి 3 నెలలు అవుతున్ది.. కాస్త మాబోటి వాలల updates తీస్కోండి ..
inews లో రిక్రూట్మెంట్ అంటూ ఇద్దరు ముగ్గురు బాగా హడావుడి చేసి వాళ్ళకి కావలసినవ వాళ్ళని బాగా దింపే సుకుంటున్నారుట ... అవును దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలిగ నారాయణా .. వాసుదేవనా ...! రామ్ కరుణ కర కటాక్ష వీక్షణలు ఉన్నంత వరకు వాళ్ళ ఇష్టం మరి.

99 , తులసి ఎప్పుడొస్తాయో తేలిక జుట్టు పిక్కున్తున్నారు జనమ్.. ఆల్రెడీ తులసి నుంచి బయట చానల్స్ కి ఇంటర్వూస్ కి కూడా వెళ్తున్నారు జాయిన్ అవుతున్నరు. మరో ఆద్రి ఛానల్ అవుతుందేమో అని కంగారు పడుతున్నారు అక్కడి జొఉర్నలిస్త్స్.
ap 9 లో తులసి పథ కాపులు ఇద్దరు జాయిన్ అయ్యరు. ఇక బ్రేకింగ్ అనబడు బీ న్యూస్ లో హడావుడి మొదలైందని తల్క్. ఎన్ టీవీ నుంచి టెన్ టీవీ కి అరుణ జంప్ కొట్టారు
మహా టీవీ old టీవీ 5 ఆఫీసు లో కి ఇంకో నెలలో షిఫ్ట్ అవబొతున్ది. అయిన జీతాల సంగతి
మాత్రం అడగొద్దు ..
జీ 24 లో శివప్రసాద్ అండ్ కో హాయిగా ఆడింది అట పడింది పాట ... ఫేస్బుక్ లో చత్తింగ్.. అమ్మాయిలతో చాంబర్స్ లో భేటింగ్ .... నిజం కాకపోతే అదగన్ది. ఇన్నారెడ్డి కూడా చీ వీ అర్ లో జాయిన్ అయిపోయడి సత్యనారాయణ అండ్ టీం రాక తో ...
తెలుగు టీవీ ఇంఫో అని ఓ సైట్ నడుపుతున్న వ్యక్తి కి రామ్ కరణ్ ఇంకా రెడ్డి అనుకున్తున్నదు.. ఇది చూసిన మర్చుకున్తదేమో

abn టైర్ వేరు ktr పై ఇవాళ రెచి పోయి స్టొరీ కొట్టాడు . ఐన జీతల పెంపు మాత్రం అదగొద్దత.. ఇక్కడ నుంచి ముగ్గురు సెనిఅర్లు ఐ న్యూస్ కి వెళ్ళారు ..inews లో ఓ గురుడి నాసా తట్టుకోలేక 2రిపోర్టర్స్ జుమ్ప్.. మిగిలిన వారిదే అదే దరి.

Unknown said...

Ram Karan gaaru Times ku mundu DC lo kontha kaalam taruvatha Express lo chaalaa kaalam pani chesaru. Arudaina journalist gaa chebutaaru. Kontakalam kalisi panicheste yekkuvamandi yekalavya sishyulaipotarani aayana to panichesina vallu antaaru. Times ku vellinanka Doorvasa Muni gaa konta apavaadu mutakattukunnaru. English ku nastamaina, INEWS ku manchi jarugutundani aasiddam.

Ika Metro India... Title baagane undi gaani, Deccan Post pathanaaniki kaaranamaina dwayame ikkadaa saaradhyam vahinchadam visesham. Deccan Post yaajamanyam vaarini guddiga nammithe, ninda muncharani vaari pai aaropana. Aithe, Raajam gaaru ilanti vishyallo chakachakyam guntarani chebutaaru. Punaravrutham kaadani korukundam.

Hans -- 'India' ainaa, 'Hyderabad' ainaa, daani khyaathi 'Anupuram colony' daati bayatiki raavatledanedi nagna satyam. Enta takkuva maatlaadukunte anta manchidi.

Ramu S said...

వెంకట్ గారూ... డెక్కన్ పోస్ట్ కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నది. ఈ ఇద్దరు జర్నలిస్టులు మంచి జాబ్స్ వదిలి అందులో చేరి దానికి ఆ మంచి పేరు రావడానికి కారణం అయ్యారు. అలాంటిది పత్రిక పతనానికి వీరు ఎలా కారణం అవుతారు, చెప్పండి. నాకు తెలిసినంత వరకు యాజమాన్యం ఆర్ధిక కారణాలు దాని పతనానికి కారణం. పత్రిక పెట్టగానే యాడ్స్ రావు కదా!
రాము

Unknown said...

ఆయ్యా రాము గారు

మునగదానికి, ముంచదానికి తెదా తెలిసె ఆ ప్రస్థావన చెసానండి. జౌర్నలిస్ట్ గా మీకు సొర్సెస్ ఉన్నయి. ఓక్కసారి వాకబు చెయండి… డెక్కన్ ఫొస్టు ఎలా పథనమయ్యిందొ… ఎవరు ఎవరిని ముంఛారొ, యాజమాన్యానికి ఎంత మెరకు షెవింగ్ చెసారొ తెలుస్తుంది.

ఆద్స్ లెక డెక్కన్ ఫొస్టు చతికిలపదలెదు. ఫత్రికలొ పెట్తిన నిధుల దగ్గరనుంచి, వచ్చె కొద్దిపాటి ఆదాయం వరకు, పూర్తిగా పక్కదారి పట్తడం వల్లెయ్ కూలింది. ఆరంభంలొ పూర్తి స్వెచ్చ నిచ్చిన యాజమాన్యం, సదన్ గా వీరిద్దరి తొకలు కత్తిరించి పగ్గాలు తీసుకొవదనికి కారనం ఇదె.

“డెక్కన్ ఫొస్టు’ కొద్ది కాలం లొనె మంచి పెరు తెచ్చుకుంది…”. ఆదెదైనా ఉంతె, కష్త్తపది పనిచెసిన టీము కు దక్కుతుందె గానీ, రొజంతా పైరవీలతొనె కాలక్షెపం చెసిన ఈ ద్వయం కు గాదు.

వెంకట్


Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి