Thursday, November 12, 2009

"అనుబాంబు", "మజ్జం" గురించి మీకు తెలుసా?

ఈ రోజు (November 12) కాస్త తీరిక ఉండి...రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల దాకా...తెలుగు చానెల్స్ మార్చి మార్చి గిరిగిరా తిప్పుతూ రంద్రాన్వేషణ కార్యక్రమం చేశాను. దాని వివరాల మాలికే ఈ పోస్టు...
"పెద్ద ఛానెల్స్" గురించి రాస్తూ...చిన్న వాటి గురించి పట్టించుకోవడంలేదని ఒక తమ్ముడు నసిగిన విషయం గుర్తుకు వచ్చి..."స్టూడియో-ఎన్"తో పయనం ఆరంభించాను. "ఫోకస్" అనే పేరిట...త్వరలో నిర్వాసితులు కానున్న ఒక మత్స్యకారుల గ్రామంపై ప్రత్యేక కథనం అది. యాంకరమ్మ మొదలెట్టింది.

"అక్కడి జనం అనువనువునా వనికి పోతున్నారు....వారికి అనుబాంబు భయం పట్టుకుంది"...అని గడగడా చదివారామె. అన్ని పదాలూ సరిగ్గానే పలికారు కానీ..."ణ" వచ్చినప్పుడు మాత్రమే దాన్ని "న" చేసారు. "అను విద్యుత్ కేంద్రానికి...ఈ గ్రామం ఎందుకు అనువుగా వుంది?" అని కూడా ఒక సారి చదివారు. ఈ స్టొరీకి మంచి విజువల్స్ వాడారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా కాపీ బాగా రాసారు కానీ "న"తోనే చిక్కు వచ్చింది. పక్కనే వున్న TV-9 కు ఛానల్ మార్చాను. "సిటీ జెన్స్" పేరిట ఒక సీనియర్ రిపోర్టర్ చేస్తున్న కథనం వచ్చింది. ఆమె "మౌళిక సదుపాయాల" గురించి మాట్లాడారు. ఇంగ్లీషును ధారాళంగా గుప్పించారు. ఆ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక మహిళా మ తల్లి గడగడా మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే...ఆమెకు  మంచి రిపోర్టర్ అయ్యే లక్షణాలు వున్నాయనిపించింది.
"Zee-24 గంటలు"కు వెళ్లి అక్కడ ఒక యాంకర్ "ఎంటర్ టైన్మెంట్ టాప్ టెన్" లో "మళ్ళీ" కి బదులు "మల్లీ" అనడంతో కంగు తిని మళ్ళీ "TV-9" కు వచ్చాను. అప్పటికి అక్కడ రిపోర్టర్లు దడ దడా వార్తలు చదివే "news express" అనే కార్యక్రమం సాగుతున్నది. ఏదో రాహుల్, రాజ్ బబ్బర్ ల వార్త చదివిన ఒక మోడరన్ రిపోర్టర్ "సక్సెస్స్ కాగలడా?" అన్న ప్రశ్నతో తన వంతు వార్తను ముగించారు. "విజయం సాధించ గలడా?" అనో "సక్ సెస్స్ సాధించగలడా?" అనో సెటిల్ అయిపోతే బాగుండేదేమో?
మధ్యలో ఒకటి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి కనక మన "టీ వీక్షణం" కొంత పొడిగించబడింది. అప్పుడే తొమ్మిది గంటల వార్తలకు వేళయింది.
"N-TV" లో హిమబిందు, వరప్రసాద్ లు ముఖ్యాంశాలు చదవడానికి భలే ఇబ్బంది పడ్డారు. ప్రాంటర్ పనిచేయలేదేమో...సగం చూసి సగం చూడకుండా..చదివేందుకు వారు చేసిన ప్రయత్నం తెరపై ప్రస్ఫుటం.
"I-News" వారి స్టార్ యాంకర్ రవి అన్న తెర మీద అప్పటికే సిద్ధంగా వున్నాడు. "మజ్జం" ధరల గురించి ఆయన మంచి చర్చ పెట్టాడు. 
"ఈనాడు" లో చాలా చాలా కీలమైన పదవిలో వుంది..."ప్రతిధ్వని" భారాన్ని ఇటీవలనే..భుజానికి ఎత్తుకున్న...డీ.ఎన్. ప్రసాద్ గారి మొడరేషన్ విని ఆంగ్ల భాషా పిపాసి అయిన నా రిమోట్ పనిచేయడం మానేసింది.
"నియో రిచ్", "రిచ్" ల దగ్గర  డీ.ఎన్. గారి మొదటి ప్రశ్న మొదలయ్యింది. "డెమోక్రాటిక్ ఇన్ స్టిట్యూషన్"ల గురించి రెండో ప్రశ్న వేసారు. "ఇది సమాజం మీద ఎలాంటి దుశ్చర్య వుంటుంది" అని ఒక దశలో ఆయన అడిగినట్లు నాకు వినిపించింది. అను నిచ్చం...మల్లీ మల్లీ...థిస్ టైప్ ఆఫ్ పోస్ట్లు రాయమని నాకు రిక్వెస్ట్ చాయకండే!?     

4 comments:

నరేందర్ జవ్వాజి said...

Namasthe Ramu Bhayya,
I think your Nalgonda HINDU ramu, am i correct? endukante nee french gaddamtho polchukovdam kastam avutundi. anyhow nee blog + dadapu anni postlu ( including Vijayadasami post ) chadivanu. iam very satisfied with your blog. this is the right thing your doing . it is an eye opener to all. i hope you will maintain it

yours,
Narender,SI

Anonymous said...

చాలా బాగా పరిశీలించారండీ టి.వి. ఛానళ్ళని.బాగుంది.

మీపోస్ట్ లో మూడవ పంక్తిలో చానల్స్ లో చా కి, రంద్రాన్వేషణ లో ద్రా కి ఒత్తు ఉండాలండి.

అలాగే "ఈ స్టొరీకి మంచి విజువల్స్ వాడారు." లో "స్టోరీ" కదండి.

"కంగు తిని" ని "ఖంగుతిని" అని రాయాలనుకుంటానండీ.

"సక్సెస్స్" లో "స్" కి ఒత్తు అవసరంలేదండీ.

"పదవిలో వుంది" - "ఉండి" అనుకుంటాను.

అను నిత్యం, మళ్ళీ మళ్ళీ ఇటువంటీ పోస్ట్లు రాయండి కానీ మీరు ఏ తప్పులు వెదుకుతున్నారో అవే తప్పులు మీరు చేయకండి..

ధన్యవాదములు.

- వల్లి

మంచు said...

మజ్జం = మద్యం ??
వీళ్ళెక్కడ ఏంకర్లండి బాబు..

సుజాత వేల్పూరి said...

బావుందండీ! నిజానికి విసిగి పోయాము ఈ తప్పుల్తో! కొన్నాళ్ళకి ఇక ఇవే కరక్టనుకుని, సరిగ్గా చదివితే తప్పు చదువుతున్నారనుకుని పళ్ళు కొరుకుతామేమో!

వీలుంటే నా బ్లాగులో ఈ టపా ఒకసారి చూడండి.
ఇదే సబ్జెక్టు మీద రాశాను.

http://manishi-manasulomaata.blogspot.com/2009/10/blog-post_19.html

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి