Wednesday, November 4, 2009

zee న్యూస్ కు TV-9 ఫాలో అప్..భేష్

తనను తాను 'ద లీడర్" గా చెప్పుకునే టీ.వీ.-9 ఇతర ఛానెల్స్ ఇచ్చిన కొన్ని వార్తలు ఫాలో అప్ చేయడానికి వెనుకాడడంలేదీ మధ్య. అంశాల లేమి వల్ల ఇలా చేస్తున్నదని చెప్పలేము కానీ...దీని వల్ల మాత్రం కొందరు బాధితులకు మేలు జరుగుతున్నది.

గత నెలలో రాజమండ్రిలో ఒక ప్రేమోన్మాది అనూష అనే పద్దెనిమిది సంవత్సరాల కాలేజి అమ్మాయి తల్లిదండ్రులను చంపి, ఆ అమ్మాయిని దారుణంగా గాయపరిచాడు. ఈ దురాగతం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. ఆటో డ్రైవర్ అయిన తండ్రి, కంటికి రెప్పలా చూసుకునే తల్లి హత్యకు గురవడం...తన ప్రమేయం లేక పోయినా...తన మూలంగా ఇలా జరగడం అనూషను కుంగదీసింది. తనకు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు.  తోలుమందం సర్కారు అప్పటికప్పుడు ఏవో హామీలు గుప్పించింది కానీ అనూష వెతలు తీరలేదు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసటగా వుంటానని అనూష దగ్గరకు వెళ్లిమరీ చెప్పి వచ్చారు కూడా. కానీ పెద్ద ప్రయోజనం లేకపోయింది.  



మానవాసక్తికర వార్తలు తనదైన శైలిలో...మనసు కదిలించే స్క్రిప్టు తో ప్రసారం చేసే "జీ-24 గంటలు" అనూష కేసును ఒక మూడు రోజుల కిందట చాలా సేపు ప్రసారం చేసింది. ఆ కథనాలు చాలా మందిని కదిలించాయి. అనూష ను స్టూడియో కు రప్పించి...ప్రత్యక్షంగా ఆమె వేదనను ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా...శైలేష్ గారి నేతృత్వంలోని విలేకరులు చొరవ చూపి ఆమెకు మేలు జరిగేలా చేసారు. కొందరు వున్నత స్థాయి వ్యక్తులను కలిసే అవకాశం అనూషకు కల్పించారు. దీనివల్ల  లభించిన ఆర్ధిక సాయం కన్నా...జనం కష్టకాలంలో తనతో ఉన్నారన్న ఊరట ఆమెకు, చెల్లెళ్ళకు ప్రయోజనకరం. 


ఏమయ్యిందో ఏమో కానీ..ఒక రెండు రోజుల తర్వాత...ఉన్నట్టుండి "TV-9" ఇదే స్టోరీని ఆర్భాటంగా ఫాలో అప్ చేసింది. సాధారణంగా ఒక ఛానల్ దున్ని వదిలేసిన కథనాన్ని ఇతర ఛానెల్స్, ముఖ్యంగా 'TV-9', పెద్దగా పట్టించుకోవన్న వాదన వుంది. కాని...  ఈ కేసులో
"జీ-24 గంటలు" కథనాన్ని మాత్రం ఆ ఛానల్ కాపీ కొట్టింది. అది నిజానికి తప్పు కాదు. మంచి పరిణామం. 

అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చింది. మంగళవారం ప్రసారం చేసిన కార్యక్రమాల పరంపరలో "TV-9" మాటి మాటికీ తన వల్లనే అనూష కేసుకు ఇంత స్పందన వస్తున్నదని చెప్పుకుంది. పాస్ బుక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి...అనూషకు సాయం చేయండని చెప్పడం బాగున్నది కాని...ఈ ఫాలో అప్ స్టొరీలో మరీ సొంత డబ్బా కొట్టుకోవడం కొంచెం ఎబ్బెట్టు గా వుంది. 
కొందరు ఆస్థాన గెస్ట్ లు సైతం ఈ సందర్భంగా ఆ ఛానల్  మానవత్వాన్ని పొగిడి పారేశారు...వీర లెవెల్లో. రెండు రోజుల కిందట "జీ-24 గంటలు" చూసిన వీక్షకులు ఈ కొత్త హడావుడి చూసి ఏమనుకుని వుంటారో గదా!

11 comments:

Anonymous said...

టీవి9కి ఇది కొత్తేమి కాదు, 10 పైసలు సాయంచేసి 10 రూపాయల డప్పుకొట్టుకోవడం వాళ్లకి ఎప్పుడైనా ఉన్న అలవాటే కదా.

రవిచంద్త said...

వరదలప్పటి నుంచీ చూస్తున్నాను టీవీ 9 ఈ సొంతడబ్బా కొట్టుకోవడం. దీని వెనక ఉన్న సంగతేంటో మాత్రం నాకు భోధపడడం లేదు.

Anonymous said...

let them claim it ,but ultimately Anoosha should get benefitted.

Anonymous said...

Mr. Ram, your comments are clearly indicating your apt for zee and shailesh and spewing venom against TV9.

Ramu S said...

Dear sir/ma'am,
Don't judge me by reading one post. Its an issue and I believe I've dealt it accordingly. My comments would be issue-based and I don't mind making an adverse comment against Zee or Mr.Sailesh, if I don't find any merit in their story/stories or comment or stand. It doesn't mean that Ravi Prakash is my enemy. Got my point? Neellaku neellu..paalaku paalu veru chesi chooddamu. OK?
ramu

Anonymous said...

nice mr .ramu iam so happy there is blog which is observing the things in channels ...continue this all the bes....

regarding the tv9 i always see that channel never show the truth but only pumping themselves......they do nothing they spoil the relatioships of the people... last time also there was one case in hyderabad which channel dealt very unethically without knowing the facts and blammed the girl... the girl was anable move .....these tipe things are freQvent intv9........

Anonymous said...

ante kaadu..anita o anita pata raasina naagaraju storyni kuda tana styllo kotta rangu pulimindi. zee 24 gantalu aa okka paatanu base chesukoni show nadipiste.. aa paata pondu parichina cd lo migata rachayitalanu oka vedika paiki techhi.. naagaraju vaarini marachinatlu.. atanedo kotlu sampadinchintlu donga katha allalani chudatam vicharakaram.. vastavaniki tv9 showki vachina nagaraju mitrulevarooo atanni nindincha ledu.. kaani presenter matram vaaricheta ala palikinchataniki vishwa prayatnam chesaru... programm nu kaapi kottavachu leda follow kavachu... kaani nagaraju imagenu dammage chese kuyatnam sari kadu.. endukante zee24 show kevalam aa okka pata paine sagindi.. albumnu vaaru prastavinchaledu.. a pata kosame chesaru.. migata paatalapai tv9 show cheste ibbandi undedi kadu.. kani ee peruto o peda kalakaruni blame cheyatam sari kadu

Anonymous said...

Mr. Ram, I am nothing to do with the tv9 and zee. after reading your comments where you are wrote that MANASULNU KADILINCHE SCRIPT TO PRASARM CHESE ZEE 24 GANTALU...
I saw many stories on zee and most of the stories were not treated well and in your sweeping statement shows that zee is like tulasi in news channels.when i gone through your comments most are against tv9.

govind

Anonymous said...

anitha pata album click ayyindi. aa album venakala unna singers ni bayataku teste problem emito.It seems tv9 touched other side of the story in anitha o anitha.
by the way zee lost trps this week after they took anusha issue.
govind

Ramu S said...

Dear Govind gaaru,
Most of the posts would be on TV-9 and Eenadu because they are the leaders. Though TV-9 is committing grave mistakes, I am avoiding highlighting them since people like you think that I am doing it deliberately. I am an impartial commentator. You will understand it slowly.
thanks
ramu

Telugu Movie Buff said...

ఈ మధ్యకాలంలో నేను tv9 చూడలేదు కానీ వాళ్ళ వ్యవహార శైలి ఎలా వుంటుంది అంటే
పక్కవాడు ఏదైనా మంచి పనికి విత్తనం నాటితే ఆ మొక్కకు పువ్వు పూచే సమయానికి దానిని కోసుకు పోయి హంగులు అద్ది మాటి మాటికీ వాడే దానికి కర్త కర్మ క్రియ అని చెప్పుకుంటాడు.
మీరు రాసిన సంఘటన దీనికి ఉదాహరణ.
ఇంక పూలవనాన్ని వాడు పాడుచేస్తూ కూడా ఆ నిందని ఇంకోడి మీదకు నెట్టుతాడు.
దీనికి ఉదాహరణ, Director రాంగోపాల్ వర్మని interview చేస్తూ మాటల మధ్యలో tv9 అలాంటి కార్యక్రమాలు (crime based) ప్రసారం చెయ్యదు అని clarification ఇవ్వడం. మరి crimewatch ఎవరు ప్రసారం చేస్తునారో?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి