Friday, December 25, 2009

వార్నీ...తివారీ: వెల్ డన్...ABN-ఆంధ్రజ్యోతి

"వార్నీ...తివారీ"...అని ప్రాస కోసం శీర్షిక పెడుతుంటే...ఒక చిలిపి ఆలోచన కూడా వచ్చింది. "షేన్ వార్నే...ఈ షేం..షేం..తివారీ" అని కూడా శీర్షిక ఇవ్వవచ్చని అనిపించింది...ABN-ఆంధ్రజ్యోతి క్రిస్మస్ శుభదినాన ఉదయం నుండీ ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని చూశాక. "'టైగర్' రూపంలో గవర్నర్...మన తివారీ సార్"...అని కూడా అనిపించింది...ఈ మధ్యన రాస లీలలు బైటపడి పరువును, భార్యను, స్పాన్సరర్లను పోగొట్టుకున్న టైగర్ వుడ్స్ గుర్తుకు వచ్చి. 

వలచి మనువాడిన బంగారం లాంటి పెళ్ళాం కొంపలో ఉన్నా...ఒళ్ళు కొవ్వెక్కి... ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్, అమెరికన్ గోల్ఫర్ వుడ్స్ కామ కక్కుర్తి ప్రదర్శించి జీవితాలను నగుబాటు చేసుకున్నారు. 87 సంవత్సరాల వృద్ధుడు...ఈ తివారికి ఏమిపుట్టింది? అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి...కురు వృద్ధుడు ఏకంగా రాజభవన్ లో ఇంత దారుణంగా తన ముని మనమరాళ్ళ వయస్సున్న పిల్లలతో కామకేళికి దిగడం...దాన్ని కెమెరా లలో చిత్రీకరించడం దారుణం (ఒక వేళ చానెల్ కథనమే గనక నిజమైతే). 


ఇప్పటికే...ఒక నాయకురాలిని తల్లిని చేసి మొహం చాటేసిన కేసులో చావు తప్పి కన్ను లొట్ట బోయిన తివారి ఇప్పుడు ఇలా అడ్డంగా దొరికిపోయారు. ఈ విజువల్స్ సంపాదించి...సాహసోపేతంగా ప్రసారం చేసిన ఈ ఛానల్ కు అభినందనలు. ముఖ్యంగా...ఈ స్టోరీ కి ప్రాణం పోసిన సీ.వీ.ఎల్.ఎన్.ప్రసాద్, ఉదయం నుంచి సాయంత్రం దాక దీనిపై అద్భుతంగా యాంకరింగ్ చేసిన మూర్తి కూడా అభినందనీయులే. కాకపోతే....ఈ స్టోరీ రాసిన విధానం నాకు పెద్దగా నచ్చలేదు. పిచ్చి పాటలు బ్యాక్ గ్రౌండ్ లో వేయకుండా...ఇంకాస్త టైట్ గా కాపీ రాస్తే బాగుండేది. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. కానీ...మధ్యలోనే...కోర్టు ఉత్తర్వుతో కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. దాని మీది కూడా పోరాడనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇది ఆసక్తికరమైన మలుపు తిరగబోతున్నది.


87 ఏళ్ళ వ్యక్తికి కామపరమైన కోరికలు ఉండకూడదని కాదు. వేరెవ్వరికీ అక్రమ సంబంధాలు లేవనీ...అంతా సత్యసంధులనీ కాదు. శ్రీరంగ నీతులు చెప్పి దొమ్మర గుడిసెల్లోకి దూరే నాయకులు, అధికారులు, జర్నలిస్టులకు మన దగ్గర కొదవే లేదు. దొరికినోడే దొంగ ఇక్కడ. "అబ్బబ్బ...అసలు గవర్నర్ ఇలా చేసారంటే నాకు ఎలానో ఉందండీ," అని ఆ ఛానెల్లో స్పందించిన ఒక నేత...కాంగ్రెస్ నేతలకు పడకలు ఎలా వేసేదీ అందరికీ తెలుసు. అలాగే...ఈ స్టోరీ ప్రాసెస్ చేసిన ఒకరిద్దరు జర్నలిస్టుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న మచ్చల గురించిన చరిత్రా మీడియాలో ఉన్న ఎవ్వరికీ కొత్త కాదు. 



కాకపోతే...ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి రాజ్ భవన్ కు పిలిపించుకుని...కోరికలు తీర్చుకోవడం...అసభ్య దృశ్యాలను వారి సిబ్బంది వీడియో తీయడం ఘోరం, అభ్యంతరకరం. సంధ్య గారు తదితరులు అన్నట్లు...ఇలాంటి గవర్నర్ ను వెంటనే...కేంద్రం రీ కాల్ చేయాలి.
మొత్తం మీద...ఈ వార్త ABN-ఆంధ్రజ్యోతి ఛానల్ కు మంచి బ్రేక్ ఇచ్చేదే!

12 comments:

యంగ్ ఇండియన్ said...

సభ్యసమాజం తలదించుకొనేలా మన రాష్ట్ర ప్రథమ పౌరుడు చేసిన రాసలీలలు ఒక సామెత ను గుర్తుకుతెస్తున్నది " ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే...... ఇంకా దేనికొ ఇంకోడు ఏడ్చాడట ". నీతులు చెప్పడం,సూక్తులు వల్లెవేయడం,భావోద్వేగంతో అప్పుడప్పుడు కన్నీల్లు పెట్టుకోవడం చూసి చాలా మోసపోయాం.గతంలో ఒక ఢిల్లీ అడ్వకేటు నా తండ్రి ఇతగాడే అంటె కూడ నమ్మలేదు.ఇప్పుడు ఇంత పచ్చిగా మనుమరాల్ల వయసు అమ్మాయిలతో అదీ ఉద్యోగం ఆశ చూపి వాడుకొవడం కడుపులో దేవినట్లవుతుంది.ఇలాంటి ముసలి కామపిశచిని ఇంత కాలం భరించామా అనిపిస్తున్నది. ఏది ఏమైనా ఖద్దరు బట్టల వెనుక ఉన్న నీలి వాస్తవాలను బయటపెట్టిన ఏ.బి.యన్. నీకు హేట్సాఫ్.

నాగబ్రహ్మారెడ్డి said...

నిజ్జంగాఇదినమ్మలేని నిజం ఒకరాష్ట్ర ప్రధమపౌరుడు అది85సంవత్సరాలకురువ్రుద్దుడు మనరాష్ట్ర పరువు నట్టేటముంచేశాడు.ఏమైపోతుందో మనవ్యవస్త పది మందికిఆధర్శంగా ఉండవలసినవారే వాటిని తుంగలోతొక్కుతుంటే ఇకఏమనాలోనాకు అర్దంకావడంలేదు
ABNచానల్ వారి దైర్యానికి దమ్ముకి నా అభినందనలు

మధు said...

నేను పొద్దునే టీ.వీ. లో చూసాను. ఇది నిజమే కనుక ఐతే వెంటనే ఆయన్ను తొలగించాలి. ఇలాంటి ముసలి దుశ్శాశనులను వూరికే వదలకూడదు. నిన్న ఒక టీ.వీ. లో వార్త చూసాను .ఆయనే స్వయంగా నన్ను తొలగించి మరొకరిని తన స్తానంలో నియమించాలని కేంద్రానికి లేఖ రాసారంట. ఇక గవర్నర్ పదవి లో ఎక్కువ రోజులు తనను ఉంచరని ముందే అర్థం అయినట్లుంది.

తెలుగు వెబ్ మీడియా said...

టి.వి.లో వీడియోలు చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. ఇంత పెద్ద మనుషులు కూడా ఇలాంటి పనులు చెయ్యడం ఏమిటి?

Anonymous said...

Ha ha ha... Ramu garu...! Meeru chala telivaina varani marosari prove chesukunnaru. E storyni process chesina varini pogidinatte pogidi, vari machala gurinchi medialo evariki teliyanidi kaadani bhale mukthaimpu icharu... Gud Luck... Mari vari charitra gurinchi kuda rayochu kada...?

కెక్యూబ్ వర్మ said...

ఇలాంటివి ఎన్ని చూపినా జనం ఆక్షణమే చూసి ఆహా అంటు మరిచిపోతున్నారు. అయినా ఇది తివారి ఆఖరి అంకంగా ముగియాలని ఆశిద్దాం. అసలే సంక్షోభంలో వున్నా రాష్ట్రంలో ఇది మరో సంచలనం. మీ పోస్ట్ వివరణ బాగుంది.

Unknown said...

రాముగారు మీరు ఆ footage గమనిస్తే అందులో తివారి కళ్ళుమూసుకుని పడుకుని వుంటే
పక్కన అమ్మాయిలు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే తీసి నట్టు గా వుంది . ఇందులో ఆ osd పాత్రే ఉందేమో?
85 ఏళ్ళకి వయాగ్రా కూడా చేతులు ఎత్తేస్తే యింకా యీయన చేతలు ఏమి వుంటాయి?

Saahitya Abhimaani said...

I missed this breaking news, as we do not get that channel in Bangalore in our area. What I wonder is why other channels did not que up before Rajbhavan and try to pester everybody there including the gardner as to what they might be knowing or what they think they know!!! I understand there is a Court order from showing any further on this item. I hope somebody gets a Court order preventing these rogue channels from showing all the violence, dead bodies, bus burnings, live telecast of agitations, all of which is creating illwill across the state and prompting similar action somewhere, many times totally unconnected, places.

Anonymous said...

అలాగే...ఈ స్టోరీ ప్రాసెస్ చేసిన ఒకరిద్దరు జర్నలిస్టుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న మచ్చల గురించిన చరిత్రా మీడియాలో ఉన్న ఎవ్వరికీ కొత్త కాదు. baagaa cheppaaru. dammmunna ani radha krishna cheppukuneamduku nijamgaa arhata pomdaalamtea tivaareeki yaemaatram teesipooni n tv anchor himabindu mogudu srinivas hantakudainee, cheera kanapaditea chaalu chonga kaarche moortinee bayataku tooleasteanea saadhayam

సుజాత వేల్పూరి said...

అదృష్ట వశాత్తూ ఈ న్యూస్ నేను చూడలేదు. కానీ ఈ న్యూస్ వెంట మిగతా ఛానెళ్ళు పరిగెత్తడం కానీ, ఇవాళ పొద్దున్న మిగతా న్యూస్ పేపర్లలో ఈ వార్త రావడం కానీ జరగలేదు. దీనికంతటికీ కోర్టు ఆర్డరే కారణమా?(నిజంగా తెలియక అడిగిన ప్రశ్నే ఇది)

ఈ వీడియోలలో నిజం ఎంత అనే రవిగారి ప్రశ్న పట్టించుకోదగింది. ఇంతకు ముందు ప్రకాష్ రాజ్-శోభారాణి ఎపిసోడ్ లా జరిగే అవకాశం ఉందా?

ఒకవేళ తివారీ ఇలాంటి దౌర్భాగ్యానికి పాల్పడి ఉంటే అతడిని రీకాల్ చేయడం కాదు, శిక్ష పడాలి!

ఎందుకంటే ఈ వీడియో బయటికి రావడం వల్ల అతడికిపోయేదేమీ లేదు. జీవిత చరమాంకంలో ఉన్నాడు! రాజకీయంగా గానీ, వ్యక్తిగతంగా కానీ అతనికి పొయేదేం లేదు. ఈయన్ని గుర్తు పెట్టుకునే తీరిక దేశ ప్రజలకు ఎవరికీ కూడా లేదు. అందువల్ల వాడికి నష్టం ఏమీ లేదు.(అవును--"వాడే")!కాబట్టి తప్పు చేసి ఉంటే రీకాల్ చేయడం కాదు, శిక్ష పడాలి!


అదలా ఉంచితే..ఇదంతా నిజమే అయిన పక్షంలో రాష్ట్రం రావణ కాష్టమై తగలబడిపోతుంటే, జనం ఇలా అల్లాడిపోతూ ఉంటే ఇలా నీరో ఫిడేలు వాయించినట్లు ప్రవర్తించడానికి వాడు మనిషా కాదా అనే విషయం ఆశ్చర్యపరుస్తోంది!
శివగారూ,
చక్కగా చెప్పారు. ఇది ఒక పెద్ద మనిషి అందునా రాష్ట్ర ప్రధమ పౌరుడి పరువుకు సంబంధించిన సమస్య కాబట్టి వెంటనే గంటల్లో కోర్టు నుంచి కాయితం పుట్టించగలిగారు. అదే హింసకు సంబంధించో,అశ్లీల దృశ్యాల గురించో కోర్టు కాయితం ఇంత తేలిగ్గా పుడుతుందా?

ముఖ్యంగా ఇటువంటి సమయంలో అల్లర్లు, ఆందోళనలకు సంబంధించిన వీడియోలు చూపించకుండా అడ్డుకునేలా ఎవరైనా మీడియా ఛానెళ్ల గురించి ఒక కోర్టు కాయితం తేవాలి.ఇంతకు ముందు ఈ బ్లాగరే మీడియా ఛానెళ్లు ఇటువంటి వార్తా ప్రసార విషయాల్లో కూచును మాట్లాడి సంయమనం వహించేలా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఒక టపా రాశారు చూశారా? మంచి సూచన కాదూ అది?

కానీ మరి పిల్లి మెడలో గంట ఎవరుకడతారు చెప్పండి?

Saahitya Abhimaani said...

Madam Sujata,

Our poor Chief Minister had a meeting with all the Media Moghuls of the State requesting them to show restraint when they are covering the present agitation. Whether anybody complies with the request?? I doubt. Unless there is reaction from the population, (which is by and large impervious to anything happening around them) wakes up and each one sends one angry e mail or post one post card to such channel condemning what they are showing in an improper manner. Very Tall Order in our society full of Intellectuals, who can justify any damn thing when it suits them and condemn them when it is not convenient to them. The rot in the media is too deep and can very well be traced to the society itself in which we are all part.

Anonymous said...

last january lo bloglokamlo tana snehituralito kalisi ikkada edo peekutaa, telustaa ani dhoom peruto blaagu terichi veerangam srushtinchindi ee prasad kada.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి