Saturday, December 26, 2009

ABN- ఆంధ్రజ్యోతి: నీతిమాలిన నీలి జర్నలిజం

కామపిచ్చి గవర్నర్ నిజ స్వరూపం బైటపెట్టానని నిన్న అంతా జబ్బలు చరుచుకున్న వేమూరి రాధాకృష్ణ గారి ABN-ఆంధ్రజ్యోతి ఛానల్...ఆ స్టోరీ కి ఫాలోఅప్ గా శనివారం ప్రసారం చేసిన కార్యక్రమాలలో ఫక్తు నీలి జర్నలిజానికి పాల్పడింది.

ఫాలోఅప్ గా ప్రసారం చేసిన ఒక కార్యక్రమంలో సెలిబ్రటీ భామలు బ్రాలు  చూపించే దృశ్యాలు, ప్రియులతో వారు కులుకుతున్న ఫోటోలు, ముద్దు సీన్లు కర్ణకఠోరమైన మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో తెగ చూపించారు. మధ్య మధ్యలో తివారి గారు...తన ప్రియురాలితో ఉన్న ఫోటో లు చూపించారు. ఇది దిక్కుమాలిన...నీలి జర్నలిజం. తివారి చేతులో....ఆయన ముని మనుమరాళ్ళ లాంటి వాళ్ళు బలయ్యారని గుండెలు బాదుకున్న ఈ ఛానల్...తివారీ లాగానే ఆడదాన్ని పూర్ లైట్ లో చూపించడం సమర్ధనీయమా? తివారీకి, ఈ ఛానల్ కు పెద్ద తేడా ఏమున్నది? 


తివారీ అధికారాన్ని దుర్వినియోగం చేసి...సొంత తీట తీర్చుకున్నాడు. ఈ ఛానెల్స్ టీ.ఆర్.పీ. తీట తో ఆడపిల్లలను అర్థనగ్నంగా--కాదు..కాదు..95 పర్సెంట్ నగ్నంగా--చూపిస్తున్నాయి. ఇది నీతివంతమైన జర్నలిజం అని  నమ్మాలని జనాన్ని ఆదేశిస్తున్నాయి. 


తివారీ ఎపిసోడ్ నేపథ్యంలో...N-TV కూడా ఒక రసవత్తరమైన కార్యక్రమం ప్రసారం చేసింది. అందులో నేతలకు, ప్రముఖులకు ఉన్న సంబంధాలు, అక్రమ సంబంధాలను సమీక్షించారు. వారు కూడా... హాట్ హాట్ సీన్లు చూపే ప్రయత్నం చేసారు. 

నిజానికి...ఫిమేల్ ఎలిమెంట్ ఉంటే..చాలు ఈ ఛానెల్స్ కు పండగే పండగ. అర్థ నగ్న, నగ్న దృశ్యాలు, వెకిలి పాటలూ, సినిమా సీన్లు చూపిస్తూ ఒక కార్యక్రమం రూపొందిస్తారు. దీనివల్ల...సకుటుంబ సపరివారంగా టీ.వీ.చూసే పరిస్థితి లేకపోయింది.

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రామోజీ రావు గారి ఛానల్ లో మరీ ఇంత బరితెగింపు కనిపించదు.  'ఈనాడు' సినిమా పేజీ లో మాత్రం బ్రాలూ, బొడ్లూ,  (భాషకు క్షమించాలి), వంపు సొంపులు చూపిస్తున్నారు. పిచ్చి పోటీలో పడి..త్వరలో...వారూ నీలిచిత్రాల ప్రదర్శనకు పాల్పడరన్న గ్యారెంటీ లేదు.

తమిళ ఛానెల్స్ మాదిరిగా నీలి బొమ్మలు టీ.వీ.కార్యక్రమాలలో చూపే తెగులు  తెలుగునాట TV-9 రాకతో ప్రారంభమయ్యింది. డైనమిజం పేరిట...రవి ప్రకాష్ బృందం...మన డ్రాయింగ్ రూం లలోకి...నీలి వెలుగులు ప్రసరింపజేసింది/ చేస్తోంది. ఈ ఛానల్  ఫ్యాక్టరీ ఉత్పత్తులే...అన్ని ఛానెల్స్ డెస్క్ లలో కీలక స్థానాలలో ఉన్నారు. ఆ ఛానల్ లో బూతును వ్యవస్థీకృతం చేసి...మరో రెండు ఛానెల్స్ మారిన ఒక 'మేక వన్నె పులి' జర్నలిస్టు...తన తిక్క, వక్ర, కలుషిత ఆలోచనలతో జనం మెదళ్ల మీద దాడి చేస్తున్నాడు. దీన్ని ఆపే నాథుడేడీ?  


నాకు ఈ సంధ్యక్క...వంటి మహిళామణులను చూస్తే జాలి కలుగుతుంది. ఆడపిల్లలపై దాడుల గురించి, తివారి తిక్క పనుల గురించి...వీళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు. స్ఫూర్తిని ఇచ్చే పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతారు. కానీ...అదే టీ.వీ.ఛానెల్స్ ప్రసారం చేస్తున్న...బూతు గురించి వీరు పట్టించుకోరు. రాజ్ భవన్ దగ్గర సంధ్య బృందం...ఆంధ్రజ్యోతి ఛానల్ కార్యక్రమానికి స్పందించి ధర్నాకు దిగినప్పుడే...ఇక్కడ ఈ ఛానల్ లో బూతు బొమ్మలు యథేచ్ఛగా ప్రసారమవుతున్నాయి.

అక్కా...సమస్యపై పోరాడడం కాదు...దానికి మూలం ఏమిటో...అధ్యయనం చేసి సమాజాన్ని ఆదుకోండి. పసి హృదయాలను కలుషితం చేస్తున్న...ఈ దివాలకోరు టీ.వీ.కార్యక్రమాలకు, వాటిని రూపొందిస్తున్న జర్నలిస్టులకు చెక్ పెట్టాలి. జనానికి నచ్చేదే చూపుతామంటూ....బూతు కార్యక్రమాలు ప్రసారం చేసే ఛానెల్స్ లో సూక్తిముక్తావళి చేయడం...బూతు పనులతో జర్నలిజం మెట్లు పైపైకి ఎక్కుతూ గొప్పవారిగా చలామణి అయ్యే వారితో అంటకాగడం దారుణం, హేయం.

10 comments:

Anonymous said...

అందరికి ఆడది కావాలి... తివారి డైరెక్టుగా కనబడుతున్నాడు.. ఈ ఛానల్ వాళ్ళు ఏదో ఆడది దేవత అన్న రేంజ్ బిల్డప్ ఇస్తూ.. ఇన్ డైరెక్టుగా దురద తీర్చుకుంటున్నారు.... ఏదైనా ఒక న్యూస్ దొరకాలి.. ఇంక కుక్కల్లా ఆ రోజంతా అదే మొరుగుతూ ఉంటారు...

Saahitya Abhimaani said...

మీరు వ్రాసినదంతా బాగున్నది. కాని, గొంగళిలో తింటూ, వెంట్రుకలు రాకూడని అనుకోవటం ఎంతటి అమాయకత్వమో,ప్రస్తుత న్యూస్ చానెల్సు క్రమశిక్షణతో మెలగాలి అనుకోవటం అంతకంటే పెద్ద అమాయకత్వం. చేపల మార్కెట్టులోనన్న కొంత క్రమశిక్షణ కనపడుతుంది. మీడియాలోనా..... వార్తా ప్రసారాలు వ్యాపారపరంగా చేస్తున్నప్పుడు, ఇలాంటివి చూపకపోతే జనం వాళ్ళ చానెల్ చూడరని, ఈ మీడియాలో ఉండే వ్యాపార సంభంధమైన మానేజర్ల భయం! నిజమేమో కూడ.

వీటన్నితో పోలిస్తే, మన దూరదర్శన్ వార్తా ప్రసారాలు ఎంత బాగుండేవి, లేదా వృధ్ధనారి ప్రతివ్రతలాగానా, ఎందుకంటే అందులోనే పనిచేసి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న రాజ్దీప్ సర్‌దేశాయి (సి ఎన్ ఎన్ ఐ బి ఎన్) నిర్వహిస్తున్న చానెల్ ఎంత అద్భుతంగా నడుస్తోందో చూసేవారికి అనుభవమే కదా|| వారి నిస్పక్షపాత ధోరణికి రెండుకళ్ళు రెండు చెవులు చాలటంలేదు ప్రేక్షకులకు.

VENKATA SUBA RAO KAVURI said...

adbhutamgam meeru raasimdamtaa mahaa satyam. neanoo maedia vaadinea. aiyinaa naa koorika ee tv lannimti nooru nokkeayaali...patrikalannimtinee mooteayaali. appududugaanea ee deasam baagu padadu.

Unknown said...

ramuగారు నాలుగో క్లాసు చదువుతున్న మా అబ్బాయి డాడి రాసలీలా అంటే ఏంటి?గవర్నర్ ఏం చేసాడు అంటే గతి లేక చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకున్నాడు స్కూల్ కి పోనియ్య కుండా అనితప్పించుకున్నా .రేపు వీడు స్కూల్ లో టీచర్ ముందు రాసలీలా చెయ్యడం తప్పుకదా టీచర్ అంటే మా పరువేం కాను దేవు డోయి

durgeswara said...

నీతాపిండాకూడా!
ఆదశను మనం దాటి ముందుకెళ్ళిపోతున్నామేమో నని భయం కలుగుతుంది . కలి విశ్రుంఖలత్వం కామపిశాచి పట్టినవానిది,అది విని చూసి తృప్తిచెందేవానిది కూడ .

Unknown said...

పత్రికా స్వాతంత్ర్యం అంటే ఎంతో మనసుపడే నాక్కూడా ఈ పత్రికలకూ , టి.వీ.లకూ సెన్సార్షిప్ ఉంటే బాగుంటుందేమో నని అనిపిస్తూంది.

Santosh Padala said...

'కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు' మోటుగా చెప్పాలంటే 'కుక్కకు బొక్క దొరికినట్టు' abn చానెల్ వాళ్ళకు ఈ తివారీ స్టొరీ దొరికింది ( బాధితురాలు రాధిక సదరు వీడియో footage ని అన్ని చానెల్స్ కి అందించిందట) కానీ abn చానెల్ కి దమ్ము ఎక్కువ కదా అందుకే ముందుగా, దైర్యంగా ..నైతిక విలువలను(!?) పాటిస్తూ ప్రసారం చేసింది. ఇక రోజంతా , వేరే వార్తలపైన దృష్టి పెట్టకుండా తివారి స్టోరిని అరిగిపోయేలా చూపిస్తూ, వివిధ ప్రాంతాల ప్రజల స్పందనలతో, చర్చా కార్యక్రమాలతో TRPs పెంచుకునే ప్రయత్నం చేసింది. సేన్సేషనలిజమే (sensationalism) ధ్యేయంగా సాగుతూ మన న్యూస్ చానల్స్ ఉనికి చాటుకుంటున్నాయి. 'ధ్వంసాలను, దాడులను పదే పదే చూపించొద్దు' అని మన గౌరవ ముఖ్యమంత్రి వేడుకునే స్థాయికి దిగజారింది మన చానల్స్ వైఖరి. ఇలాంటి కామ పిశాచులు రాష్ట్రంలోనే కాక, దేశంలో( పార్లమెంటు సభ్యుల రూపంలో) కూడా చాలా మంది ఉన్నారని abn పేర్కొంది. మరి వాళ్ళ సంగతి ఏంటో ? ప్రస్తుతం మన వ్యవస్థలోని ఎన్నో రంగాలు ఎంతో అవినీతి, ఎన్నో అక్రమాలతో నిండి ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. ఇక ముందు ఇలాంటి దమ్మున్న కధనాలు ఎన్ని వస్తాయో వేయి కళ్ళతో ఎదురుచూడాలి. చరిత్రలో కొన్ని చానల్స్ ప్రారంభించిన కొన్ని రోజులు ఇలాంటి సెన్సేషనల్ కధనాలతో రేటింగ్స్ పెంచుకుంటూ, సంబంధిత అవినీతిపరుల్ని, అక్రమార్కుల్ని బ్లాక్ మెయిల్ చేసి కోట్లు దండుకున్నట్లు మీడియా లోని ఒక వర్గం కోడై కూసింది. నిన్న జరిగిన' ప్రజలను ఉసిగొలిపే బృహత్తర కార్యక్రమం' లో abn చాలా వరకు సఫలీకృతం అయ్యిందనే చెప్పవచ్చు. ఇంకా ఎన్ని రోజులో ఈ మీడియా ఆగడాలు !!

jai hoo ap media
Santosh Kumar (సంతోష్ కుమార్ పడాల)

kvramana said...

anna ramu
i also heard that the Tiwari sting was part of a larger strategy to take away the focus from the Telangana movement. Interestingly, if there was no Tiwari story that day, the focus would have been on the joint action committee. for the first time veterans like G Venkataswamy and Ch Rajeshwar Rao were on the same dais. But, that was not highlighted on that day, courtesy N D Tiwari.
ramana

Amar said...

ఏమయ్యా రాము గారు మీరు ఎ.బి.ఎం. ఆంధ్రజ్యోతి అమ్మాయిలను అలా చూపించారు..ఇలా చూపించారు అంటూ పెద్ద నీతిభోద చేసేస్తున్నారు . ఇంతకీ వాటిని మీలాంటి ప్రభుద్దులు 'ఇంత' విశ్లేషనాత్మక ధోరణితో చూస్తూ ఆదరిస్తున్నందునే వారు అలా టెలికాస్ట్ చేస్తున్నారు . తప్పు ఒక్కరిది కాదు . మారుతున్న సమాజ వైకరిది. గవర్నర్ లాంటి 'పెద్ద' మనిషి తప్పును పట్టించుకోకుండా .. ఆ తప్పును తేరా పైకి తెచ్చిన చానెల్ను విమర్శించడం భావ్యామా?

akshara said...

you are doing good job by spending lot of time on motivating journalists for better values to improve the society and to be more close to the reality. Conduct some seminars and meetings also to bring like minded people to one dias and share their views on various aspects of Journalism ethics.
Encourage women journalists treating them as your own sisters and give them more courage and moral support.
wishing all the best to your Blog.

Akshara

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి