Tuesday, July 13, 2010

వేధించే బాసుల్లారా....ఈ బుక్ లెట్ మీరు చూసారా?

వర్క్ ప్లేసులలో అవకాశాలు అందివచ్చి అందలాలు ఎక్కినవారు నలుగురికి ఆదర్శంగా ఉండేలా మెలగాలి కానీ...కింది ఉద్యోగులను అనుక్షణం ఉండేలు దెబ్బలకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందకూడదు. బాసిజంతో అందరినీ భయపెట్టి వేధించి నంజుకుతినకూడదు. అలా వేధించి, ఉద్యోగాలు పీకించి అమానుషంగా వ్యవహరించిన వారు కచ్చితంగా చరిత్రహీనులవుతారు. 

సహజంగానే 'బాస్' అనగానే చాలా సందర్భాలలో 'యాస్ (గాడిద)' లా వ్యవహరిస్తారన్న అపవాదు ఉంది. ఏదో పని ఒత్తిడి వల్లనో, తప్పును భరించలేకనో అసహనం-కోపంతో అలా మృగంలా ప్రవర్తించినా....తన మాటల ఈటెల వాడి వేడికి తల్లడిల్లుతున్న ఉద్యోగికి సాయంత్రానికి ఉపశమనం కలిగేలా ప్రవర్తిస్తే పర్వాలేదు. లేకపోతే...బాసు బాధితుడు...తలలో నరాలు విస్ఫోటన స్థితికి జేరగా కొంప జేరి ఆ కోపాన్ని నిర్బలురైన భార్య మీదనో సంతానం మీదనో తీర్చుకుని ఇబ్బంది పడతారు. సుఖశాంతులు కోల్పోతారు. 

ఇప్పటికీ తెలుగు జర్నలిజంలో ఉన్న అలాంటి పిచ్చి కుక్క, గుంటనక్క ఒకడి కింద నేను ఒక ఏడేళ్ళు పనిచేసి చాలా చాలా చాలా కోల్పోయాను. వాడు పెట్టిన టార్చర్ కు కొన్ని రోజులు మాటలు నత్తి నత్తిగా వచ్చాయి, ఆ మనోక్లేశం తో మాటి మాటికీ జ్వరం వచ్చేది. ఇప్పటికీ జ్వరం వస్తే...వాడినే తిడుతూ కలవరిస్తానట. మనిషిగా బతకడానికి వీడు ఒక్కడు అనర్హుడు అని నాకు బాగా అనిపించి.... ఈ ఎదవను లేపేస్తే...మనం జైల్లో ఉన్నా మిగిలిన సాటి ఉద్యోగులు సుఖంగా ఉంటారు కదా...అని అనిపించిన రోజులు బోలెడు. అయితే...ఈ క్యారెక్టర్ లేకపోతే...నేను ఇంగ్లిష్, జర్నలిజం కోర్సులు చేసే వాడిని కాదు, 'ది హిందూ' లో పనిచేయాలన్న కల నెరవేరేది కాదు. అక్కడి నా మొదటి బాసు దాసు కేశవరావు గారు  నిజంగా దైవ సమానులు. ఆయన లాంటి బాసుల కింద పనిచేయడం ఒక అపూర్వమైన వరం. 


అయితే...ముందుగా అనుకున్నవాడితో పోల్చినందుకు ఆ పిచ్చికుక్క, గుంటనక్క నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదరు మా మాజీ సార్ లో పరివర్తన వచ్చి మనిషిగా మారి కింది ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూసుకునే మంచి మనసు ప్రసాదించాలని సకల దేవతలను ప్రార్ధిస్తూ....అసలు విషయంలోకి వస్తాను. 

పెద్దిభొట్ల శివ సుందరం అనే సీనియర్ జర్నలిస్టు ఈ మధ్యన చనిపోయారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్ర ప్రభలలో ఆయన మాట వేదవాక్కు అనే వారు. ఆయన....ఉద్యోగులను నీచంగా చూసే వాడని, జాబులు పీకి పారెయ్యడంలో దయాగియా లేకుండా వ్యవహరించాడని కర్ణాకర్ణిగా విని ఉండడం వల్ల కాబోలు ఆయన మీద ఒక పోస్ట్ రాయడానికి నా మనస్సు అంగీకరించలేదు. ఈ లోపు జగన్ అనే జర్నలిస్టు 'ఆంధ్రజ్యోతి' లో 'అక్షరబద్ధుడు సుందరం' అనే శీర్షికతో June 19 న ఒక వ్యాసం రాసారట.

అది చదివి...ఒళ్ళుమండి 'పాత్రికేయ విలువల విధ్వంసకులకు నివాళులా?' అన్న శీర్షికతో ఒక నలుగురు సీనియర్ జర్నలిస్టులు--కే.వీ.కూర్మనాథ్, పతకమూరు దామోదర్ ప్రసాద్, నామాల విశ్వేశ్వర రావు, నున్న నరేష్--ఒక 22 పేజీల బుక్ లెట్ తెచ్చారు. అది చదివితే....సుందరం గారు ఎంత దారుణంగా వ్యవహరించేవారో తేలిగ్గా అర్థమవుతుంది. 'జర్నలిస్టు ఎలా ఉండకూడదో..." అనడానికి ఈ మహానుభావుడు ఒక ఉదాహరణ అని కూర్మనాథ్ చెబితే, 'అక్షర భక్షకుడికి బానిస నివాళి" అని రావు దుమ్మెత్తి పోశారు. మృతుల మీద బండలు వేసే కుసంస్కారులు కారు కాబట్టి...వారి వాదన తప్పని, వారి బాధ అర్ధరహితమని అనుకునేట్టు లేదు. 

ఈ నలుగురు ఎవరో చెత్త జర్నలిస్టులో, జర్నలిస్టు యూనియన్ నేతలో అయితే...నేను పట్టించుకునే వాడిని కాదు. కానీ...ఎన్నో కష్టాలు పడి వృత్తిలో నిలదొక్కుకున్న వారు వీరు. అందుకే ఆ బుల్లి పుస్తకంలో కొన్ని పేజీలు  ఇక్కడ ఇస్తున్నాను. మరణించిన వారి గురించి తప్పుగా అనుకోవడం మన సంప్రదాయం కాదని తెలిసీ...ఆంధ్రప్రదేశ్ జర్నలిజంలో నిజంగానే కుక్కలు, తోడేళ్ళను తలపించే బాసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో ఈ పని చేయక తప్పడం లేదు. నాది బ్యాడ్ టేస్ట్ అని అన్నా...పర్వాలేదు.

ఉద్యోగులను వేధించుకు తినే మీడియా బాసుల్లారా! మీ కింది ఉద్యోగులు మనుషులు. వారిని మంచి మానవ వనరులుగా తీర్చి దిద్దకుండా సాధించి వేధించి చంపుకు తినడం వల్ల ప్రయోజనం శూన్యం. నిజానికి ఈ బుక్ లెట్ మీకొక గుణపాఠం. ప్రభ వెలిగినన్ని రోజులు మీరు కింది ఉద్యోగులను నంజుకుతిని, వారి జీవితాలలో ఆనందాన్ని ఆవిరి చేస్తే...మన ప్రభ ఆరాక మన బాధితులు చూడండి...ఎంత కడుపు మంటతో బుక్ లెట్ తెస్తారో!


13 comments:

kvramana said...

I dont know much about Sri Sundaram since I never worked in "his" newspaper. But, once I went for a job after AP Times was shut down. I joined AP Times from DC. Mr Nair was DC's editor that time. I was desperate to do some job that time since my old parents (both in early 70s that time) depend on me. I knew that there was some issue between Mr Nair and Mr Sundaram. Still, he called me for an interview and abused me and Mr Nair as well in some filthy language. I couldnot bear with it and walked out. Though there was a lot of folk lore about Mr Sundaram by that time, I had an opportunity to experience it first hand. That was for the first time, I saw the other side of an editor.
Thanks Mr Sundaram, please don't indulge in politics and encourage groupism wherever you are...hell or heaven.

Suraj said...

Bossism gurinchi cheppalante butulu tappa maroti rayalem. Kodukul kallu kovvuto musukoni poyi untai. Bossism gents, ladies vishayamlo different ga untundi. Paper lo, tvllo mahila sadhikarata, samana avakashalu ani sollu vese kodukulu… work place lo matram kichakulai potaru. Media lo ladies pai unnanta himsa ekkada undadu. Bhuswamyamlonu kanapadadu. Reporting lo oka vidhamaina torture unte Desk naluggodala mdhya bayatiki tiliyani, cheppukoleni himsa untundi. Boss to chanuvuga, solluvestu vadu touch chestunna (chetulu narakalani pistadi) lite tisukuntu gadidanu (ass) pogudutuntene manchi beet, assignment estadu. Ledante ptoc cut, offline reporting. Eka Desk lo aite.. matalatone kadu.. script tonu vedhistaru. Rape case lu, bharya bhartanu champina case ela vedhinchadaniki e script dorikite adi. Lakunte matalatu, chupulato himsistaru. Ammaila munde butu charitralu vipputaru. (cinema lo, politics lo illegal relations gurinchi sollu). Edanta okettaite sexual harassment media lo bariteginchindi. Media lo sexual harassment pai lotaina charcha jaragali. Alanti gadidalanu bajarukedchali.

vaanachinuku.blogspot.com said...

Patrikala sankya perigithe nirankushatvam taggutundi.
Ee rojullo idi sadhyam kademo?

Krishnarjun said...

నా జీవితంలో కూడా నాకు ఇటువంటి వాడొకడు తగిలాడు. కానీ నా ఖర్మ కాలి వాడు కంపనీ MD .సంపాదన కంటే ప్రశాంతత ముఖ్యమని భావించేవాడిని కనుక అక్కడ ఆరు నెలల కంటే పనిచేయలేదు. ఉద్యోగమేమీ దొరకక పోయినా బయటకు వచ్చేసా.

రెడ్డీస్ లో పనిచేసేటప్పుడు మాకొక Vice president ఉండేవాడు. మీటింగులలో కోపంతొ మా మీద అరచినా అది పని వరకే. అంతలోనె మర్చి పోయేవాడొ ఏమొ కానీ, ఈ బిస్కట్లు బావున్నయి ఇంటికి వెళ్ళేప్పుడు తీసుకెళ్ళు, మీ ఇల్లు దూరం కనుక తొందరగా వెళ్ళు అని ఆప్యాయత కనబరిచేవాడు. I really loved working under him. ఇప్పుడు నా జూనియర్లతో నెను అలాగే ప్రవర్తిస్తాను. I am greatly influenced by him.

vaanachinuku.blogspot.com said...

Y.S.Jagan gaariki M.L.A.la support peruguthondi. Ninna sumaru 15 mandi M.L.A.lu Yathralo palgonnaru. Maro 4,5 rojullo rashtra rajakeeyallo asakthikaramga marabothunnaya?

sai said...

"అయితే...ముందుగా అనుకున్నవాడితో పోల్చినందుకు ఆ పిచ్చికుక్క, గుంటనక్క నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ"
sir ,i feel u made a mistake in above stmt.i feel it has to be like this-

"అయితే...ముందుగా అనుకున్నవాడితో పోల్చినందుకు దాసు కేశవరావు గారు నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ"
am i right.if not i'm sorry.

Sudhakar said...

అతి హీనమైన బతుకులు మనకు మనమే ఎలా సృష్టించుకుంటామో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. దేవుడిని నిందించి లాభం లేదు. ఆ నలుగురు చిత్రం గుర్తుకొచ్చింది. మన కోసం మన తర్వాత కూడా తపన పదే, కన్నీళ్ళు కార్చే ఆ నలుగురు లేకపోయినా పర్వాలేదేమో గానీ, బతికుండగా అందరిని వేధించి సంతోషపడితే చచ్చాక జరిగేది ఇదే. ఈ కధనం చాలా మందికి కనువిప్పు కావాలి.

ఈ చిన్ని పుస్తకం మొత్తం పేజీలు పెట్టొచు కదా? మీ గుంట నక్క బతికున్నప్పుడే వాడి గురించి రాయొచుకదా..

vipravinodi said...

కోటి సుందరాలు ఈజ్ ఈక్వల్ టూ
ఒఖ్ఖ ఎం వీ ఆర్ శాస్త్రి ...

ఆ చచ్చినోడి గోల మనకేల?

ఈ దొంగ సచ్చినోడి పని పట్టాల..

శాస్త్రి బాధితులు ఇక తగులుకోవాల!

Thirmal Reddy said...

@Sudhakar

మీరు చెప్పింది నిజమే. మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. నిజానికి ఇలాంటి బాసుల వేధింపులు భరించడమే బాధితులు చేసే పెద్ద తప్పు. నేను కూడా ఇలాంటి పొరపాటే చేసాను. ETV2 లో ఇలాంటి "సుందరం" చేతిలో వేధింపులకు గురికాని జర్నలిస్టు లేడంటే అతిశయోక్తి కాదు. ఆ "సుందరుడు" చేసిన అరాచకాలకు వాణ్ని ఏమి చేసినా పాపం లేదు అని ఇప్పటికీ వివధ చానళ్ళలో పని చేసే వారు అంటూనే ఉనారు. పైన పేర్కొన్న బుక్లెట్ లాంటిది ఒకటి కాపి తీసి వాడికి పంపితే కనీసం ఇప్పటికైనా బుద్ది వస్తుందేమో.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Ramu S said...

సోదరా...
ఆ 'సుందరుడు' ఎవరు?
రాము

Unknown said...

oka mvr sastry
oka vasu
oka vijayababu migile vunnaru

MVR SASTRY badha padaleka ladies chachipothunnaru. prasthutha priyadarsini incharge dikku thochaka kottu mittaduthundi

VIJAYABABU andhra prabha idiot
kuda ladies ni edipisthunnadu.
Veella pani kuda pattali.

VASU indian express ayithe cheppakkarledhu. thagi office ki vachi lady staff tho asahyamga behave chesthunnadu.

INDIARA

Anonymous said...

తిరుమల్ రెడ్డీ గారు వ్రాసారు-నిజానికి ఇలాంటి బాసుల వేధింపులు భరించడమే బాధితులు చేసే పెద్ద తప్పు. నేను కూడా ఇలాంటి పొరపాటే చేసాను అని. కానీ నేను మాత్రం ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాను. మా చెత్త బాస్ గాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాను. నా వల్ల ఇంకా నలుగురు యాక్టివ్ అయ్యి చివరికి వాడికి పెన్షన్ కూడా రాకుండా చేసారు. అఫ్కోర్స్ పొట్టకొట్టడం కాదు లేట్ అయ్యేలా అన్నమాట. ఫిబ్రవరీ లో రిటైర్ అయితే ఇంకా పెన్షన్ కోసం గవర్న్మెంట్ చుట్టూ తిరిగేలా చేసాం. రేపో ఎల్లుండో రావచ్చు. కానీ దాని కోసం వాడు పడుతున్న టెన్షన్ చూసాక అయినా ఇప్పట్లో మా డిపార్త్మెంట్లో మరో కుక్క గాడెవ్వడూ సబార్దినేట్స్ ను వేధించేందుకు ధైర్యం చేయరు.

Krishnarjun said...

ఈ "చచ్చినోడి" గురించి 16 జూన్ నాడు నేను ఈ బ్లాగ్ లో ( కెమేరా ముందు లైవ్ లో ...) కామెంట్ కింద వ్రాసినప్పుడు ఎవరూ స్పందించట్లేదేమిట్రా ? బహుశా అంత ప్రముఖుడేమీ కాదేమో అనుకున్నాను. ఇప్పుడు తెలుసుకున్నాను.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి