Tuesday, July 20, 2010

బాబ్లీ వ్యవహారంపై Studio-N వెర్రి యానిమేషన్

సరే...చంద్రబాబు నాయుడు గారు దండు సమేతంగా....బాబ్లీ దగ్గరకు వెళ్లబోయారు. అక్కడి పోలీసులు, ఉస్మానియా యూనివర్సిటీ లో మాదిరిగా ఓవర్ యాక్షన్ చేశారు. లాఠీలకు పనిచెప్పారు. పసుపు దళం పథకం పారింది, స్థబ్దుగా ఉన్న తెలుగు దేశం శ్రేణులు ఒక్క సారి జవజీవాలు పోసుకున్నాయి. ఇదే అదనుగా...చంద్రబాబు గారి పార్టీ అన్నా, వారి కులమన్నా ఆదరించి అక్కున చేర్చుకునే ఛానెల్స్ తెగ రెచ్చిపోతున్నాయి. పండగ చేసుకుంటున్నాయి. 'యాక్టివిస్ట్ జర్నలిజం' పెచ్చరిల్లింది. బాబు గారి కుమారుడి ఆధ్వర్యంలో నడుస్తున్న Studio-N విశ్వరూపం చూపిస్తున్నది.

ఆ ఛానెల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇప్పుడు లోకమంతా పసుపు పచ్చగా కనిపిస్తున్నది. వారి వెర్రి వికటించింది అని చెప్పుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఆ ఛానల్ ప్రసారం చేసిన ఒక యానిమేటెడ్ సీన్. 

అందులో ఒక నలుగురు పోలీసులు...వెల్లికిలా పడివున్న (పసుపు పచ్చ దుస్తులు ధరించి వున్న) వారిని లాఠీలతో పిచ్చకొట్టుడు కొడుతుంటారు. ముగ్గురు దంచుతుంటే ఇన్స్పెక్టర్ లాంటి వాడు ఒకడు...ఇంకా కొట్టమని మిగిలిన వారిని ఉసిగొల్పుతుంటూ ఉంటాడు. ఆ పక్కనే ఇద్దరు ఖాకీలు మరొక పచ్చ దుస్తుల వాడిని రెండు చేతులు పట్టుకుని నేల మీద లాక్కుంటూ వెళ్తుంటారు. ఆ వెనుకనే....ఒక పెద్ద విమానం వుంటుంది. ఇదంతా....Studio-N లో వార్తలు వస్తుండగా....ప్రసారమైన యానిమేటెడ్ కథనం. 

ఎంత పసుపుదనం అయితే మాత్రం ఇంత పైత్యం అవసరమా? నిన్నటి దాకా...సాక్షి, ఎన్-టీ.వీ. తదితర ఛానెల్స్ జగన్ భజన్ చేసాయి. ఓదార్పు అంటే ఇంత ఘనంగా ఉండాలి కాబోలు.... అని జనం తెలుసుకుంటూ ఉండగానే...ఇంతలో బాబు బృందం అగ్గిరాజేసింది. దానికి పోటీగా వైరి పొలిటికల్ ఛానెల్స్ కు బాబ్లీ ఒక అవకాశం తెచ్చి పెట్టింది. ఎవడి గోల వాడిది, జర్నలిజం గాలికి!

బాబ్లీ అక్రమం, పోలీసులు కొట్టడం, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినడం నిజమే...కానీ మీడియా పరిధులు మించి జనాలను రెచ్చగొడుతూ ఉందేమో అనిపిస్తుంది. రవి ప్రకాష్ ఛానెల్ TV-9 సహా...దాదాపు అన్ని ఛానెల్స్ చంద్రబాబు కటకటాల వెనుక ఉన్నట్లు తెర అంత పెద్ద ఫోటో చూపి జనం సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసాయి.  ఉన్నది ఉన్నట్లు చూపకుండా...అగ్గి రాజేసి పెట్రోలు పోసి మంట పెడితే కష్టం. మనకు 24/7 ఛానెల్స్ ఉన్నాయి కాబట్టి....ఇరవై నాలుగు గంటలు ఏదో మసాలా ఉండాలి కదా మరి!

13 comments:

Raja said...

Ramu garu

mana telugu media lo coming up next...CBN Oodarpu yatra.

babu gari dayaneeya sthithi chusi oka 20 mandi varaku chanipoyaruta.

Raja

హరి said...

రాము గారు,

మీడియా ఉద్దేశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. పచ్చ చానేల్లే కాక మిగారావి కూడా బాబు భజన చేశాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణాలో చంద్రబాబుని ప్రాజెక్ట్ చేయడం, తద్వారా తెలంగాణా వాదాన్ని నీరుగార్చడం వీరి ఉద్దేశం. వాళ్ళు విమానంలో తీసుకొచ్చి హైదరాబాదులో వదిలినందుకు చంద్రబాబు నాయుడు తప్పకుండా హతాశుడై ఉంటాడు. ఈ సందర్భంగా ఈటీవీ రిపోర్టరు కథనాన్ ఇలా వుంది. 'మూడు రోజులుగా చంద్రబాబుని అరెస్టు చేసి చీకటి కొట్టు లో పెట్టి ఇప్పడు తెచ్చి హైదరాబాదులో పడేశారు'.

Unknown said...

Ramugaru, I am sorry to say that you are turning out no different from other people. I had a very high opinion of you. But even you are getting carried away by these caste equations. Do not forget that these very "caste" channels took up telangana issue and carried it. Please for gods sake don't get sucked into this.

Saahitya Abhimaani said...

నువ్వు తమలపాకుతో కొడితే నేను తలుపు చెక్కతో కొడతా అన్నట్టుగా ఉన్నది మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన పని. ఇక్కడ మన రాష్ట్రంలో కాంగ్రేసు వాళ్ళు గగ్గోలు పెడుతున్నట్టుగా ఇది రాజకీయ ఎత్తుగడే ఐతే, మహరాష్ట్ర పోలీసులు తమ పాత్ర అద్భుతంగా నిర్వహించారు. అదే స్టుడియో ఎన్ వాడు చూపించి ఉంటాడు, విజువల్స్ లేక ఏనిమేషన్ చేసి ఉంటాడు. రాజకీయ ఎత్తుగడే కావచ్చు కాని, మహరాష్ట్ర పోలీసులు ఆ విధంగా ప్రవర్తించటం శోచనీయం.

చదువరి said...

హరి దోర్నాల గారూ, మీరు అన్ని ఛానెళ్ళనూ అలా అనెయ్యడం తప్పని నా ఉద్దేశం -మీరు హెచ్చెమ్ టీవీ చూసినట్టులేరు. ఈ ఘటన మొత్తానికి వాళ్ళు కూడా మంచి కవరేజీ ఇచ్చారు. కానీ అనుచితంగా అనిపించలేదు. రాము గారూ, మీ ఉద్దేశంలో కూడా అన్ని ఛానెళ్ళూ ఒకే గాటన నడిచాయా- హెచ్చెమ్ టీవీతో సహా?

అసలైనా, హరి గారూ.. ఒక్క నాయకుడు నిరాహారదీక్షకు కూచుంటేనే అల్లరల్లరి చేసి, నానాచెత్తా చేసిన చానెళ్ళు సార్ మనవి. అలాంటిది ఇప్పుడు డెబ్భై మంది నాయకులు ఒక నిజమైన సమస్య కోసం పరాయి రాష్ట్రం పోయి ఐదార్రోజులు నానా కష్టాలు పడి, పోలీసుల దెబ్బ్బలు తిన్నారంటే ఇంక ఎంత హడావుడి చెయ్యాలి చెప్పండి. ఆ నిరాహార దీక్ష సమయంలో వాళ్ళు చేసిన హడావుడితో పోలిస్తే ప్రస్తుత హడావుడి చా...లా తక్కువ!

katta jayaprakash said...

24 hours masaala is the trade secret of the print and electronic media.Without masaala,sensations,rumours and other unproffessional things no media survives and these are the bread and butter of media and the journalists.Saakshi and Stdio 1 channels are entirely in a different track of their selfish political and individual interests and we need not bother about them as they are publicly supporting their owners without any hesitation or shame and it is their right too as they had invested heavily for promoting their own interests openly.
But in the case of Chandra Babu and Babli yatra the Chavan's government had behaved inhumanly without any civic sense and law of the land.Infact the concerned irrigation minister of Maharashtra should have met the TDP delegation and taken Chandra Babu along with some MLAs to the project and should have explained their state's stand and should have invited them for a meeting with PM for an all party meeting.But unfortunately the behaviour of the govt as well as the police is condemnable by every one as it is not the question of one individual or political party but a question of self respect of Telugu people as well as their constitutional right as a citizen of the country and as a peoples representatives to visit any place in the country unless it is prohibited for security reasons.Being a devotee of Sri Sathya Sai Baba who preachers to love all serve all and to help ever and hurt never Ashok Chavan had totally reversed his GOD,s preachinghs by showing his hatred and violent attitude towards the TDP delegation who are the guests for his state who are supposed to be respected as athidhi devo bhava. But Chavan and hios govt's police force had shown their animal nature towards the human beings who visited as guests.
JP.

Unknown said...

ippudu ap media general media kadhu. kulala, pranthala, vargala media.Thanks to remote controll.
Indiara

Chow said...

total issue lo maharastralo ashok chavan hero ayyadu.. aplo tdp leaders herolayyaru.. prajalanta pichhollayyaru..intha hadavudi valana emina labham jariginda antey okka paisa ledu.evadi uniki kosam vadu poratam... antey..

హరి said...

చదువరి గారు,

నా ఉద్దేశంలో అన్ని ఛానల్సు అంటే పచ్చనివి, ఆకుపచ్చనివి అని. హెచ్చెం, రాజ్ టీవీలు మినహాయించండి.

Anonymous said...

i think bcoz of this babli issue, all the other issues such as telangana struggle, jagan's yatra and all such....have gone into oblivion...! is it a political trick? to mislead media n public? i bet almost everyone 4got other issues now...i remember media raising the swineflu issue once again...especially tv9...n now no one ever speaks of it...sorry if i quoted anything wrong...mine is just a doubt...kindly clarify...!

tarakam said...

ur looking @ all the events by wearing the caste glasses.ysr has taken the state to the feudal days where ur followers&cronies are rewarded & the voices of dissent are eliminated.as the society degenerates all the other ingrediants will also follow.that explains all the degeneration including the media.

CH.DURGA PRASAD said...

సార్, ఈ రోజు నాకో విషయం తేలిసింది.నేను కాకుండా చాలా మంది ఈ ఛానల్ చూస్తున్నారని.వాటే పిటి!

Srikrishna Chintalapati said...

రాము గారూ సూటిగా ఒక ప్రశ్న. మిమ్మల్ని అడిగేంత పెద్దవాడ్ని నిజం గా కాను, కానీ మీ బ్లాగులని తప్పక చదివే ఒక సామాన్య పాఠకుడిగా

వారం రోజుల ముందు అడ్డంగా నరుకుతాననీ అది మా తలెంగాణా వూతపదం అని కాసేపు హాస్పిటల్లొ వున్నాననీ. నా చీర చింపేసారనీ, అసభ్యంగా మాట్లాడారనీ, ప్రభుత్వం నాకు సారీ చెప్పాల్సిందే అనీ నా రణరంగం చేసి యాగీ చేసి. అరెస్టులకి భయపడమంటారు, అర్రెస్ట్ చేయవస్తే వందమంది అడ్డు నుంచుంటారు. టీవీ9 ఈ విషయంలో ఎంత అతి చేసిందో ఎవరూ గమనించలేదా. చివరికి జైల్ గోడల మధ్య కెమేరా పెట్టి ఆ వార్తని అదే అదే వంద సార్లు విజయశాంతి పర్సనల్ కెమేరా లాగా. ఆమెకూడా అప్పటిదాకా బాగానే వున్నదలా, కెమేరా ముందుకురాగానే వీరంగం చేయడం. ఒక్కసారి ఆ క్లిప్పింగ్స్ చూడమని మనవి.

ఆసమయంలో ఇంత పెద్ద వ్యాసం రాయకపోయినా ఒక్క చిన్న మాట ఒక్క ప్రస్తావన తెచ్చి వుంటే సగటు పాఠకుడిగా చాలా సంతోషించేవాడ్ని.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి