Monday, August 16, 2010

థాంక్ యూ....తెలుగు మీడియా...

తెలుగు ప్రజలను కర్తవ్యోన్ముఖులను చేసి మైనంపాటి శ్రీరామ చంద్ర కు అపూర్వ సత్కారం దక్కటానికి తెలుగు మీడియా చేసిన కృషి ప్రశంసనీయమైనది. అందుకు అన్ని చానల్స్ వారికి అభినందనలు. చానల్స్ ఈ మధ్య చేసిన పాజిటివ్ పనులలో ఇది చెప్పుకోదగ్గదిగా కనిపించింది. కీప్ ఇట్ అప్, బాసులూ. 

నిన్న రాత్రి పనులన్నీ పక్కనపెట్టి 'సోనీ' వాడు పెట్టిన నరకాన్ని భరించి ఫైనల్ ఫలితం చూసి చాలా ఆనందం వేసింది. ఈ సోనీ వాడు, వాడి ప్రోగ్రామింగ్ నాకు అస్సలు నచ్చలేదు...ఏదో మనోడికి కష్టపడినందుకు ఒక యాభై లక్షలు, ఒక కారు, ఒక బైకు వచ్చాయని సంతోషించాం గానీ. ఒక ప్లాన్ లేదు, పాడూ లేదు. మంది యాడ్స్, సొంత యాడ్స్ తో ఒళ్ళు చిర్రెక్కించాడు. ప్రోగ్రాం సాగపీకి విసుగు తెప్పించి చంపాడు.

ముందుగా...విజేత పేరున్న కవరు అమితాబ్ కు ఇచ్చారు....ఆయన ఒక బ్రేక్ అన్నారు...తర్వాత ఒక సాంస్కృతిక ప్రోగ్రాం...ఆ తర్వాత అమితాబ్ బటన్ నొక్కితే....శ్రీ రాం బొమ్మ వచ్చింది. నేను, హేమ ఊపిరి పీల్చుకున్నాం. ఆ ఇద్దరు పరాజితులను అస్సలు పట్టించుకోకపోవడం కూడా మాకు నచ్చలేదు.  కనీసం ఓటింగ్ వివరాలైనా చెప్పలేదు. ప్రోగ్రాం అనుకున్నంత బాగా లేదు. 

అటు ఫైనల్స్ జరుగుతుండగానే...శ్రీ రాం ఇంటి దగ్గరి నుంచి జీ- 24 గంటలు, స్టూడియో-ఎన్ తదితరులు లైవ్ ఇచ్చారు. అది ఎంతో బాగుంది. 'సాక్షి' ఛానల్ వాడు పోటీ ముగియగానే...వేదిక మీద నుంచి విజేతతో లైవ్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎంతో బాగుంది కానీ...ఆ రిపోర్టర్ చెత్త ప్రశ్నలు వేసి అమూల్యమైన అవకాశాన్ని దెబ్బతీసుకున్నాడు. శ్రీ రామ్ అమ్మ గారితో అక్కడి నుంచి తెలుగు లో మాట్లాడిస్తే బాగుండేది. 

ఈ అంశంపై...వెంటనే స్పందించి డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి గారు పంపిన మెయిల్ దిగువ ఇస్తున్నాను. జే.పీ.గారు నల్గొండ పట్టణంలో ఒక వైద్యుడు, సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Dear Ramu garu,
We are all happy and jubilant that our Telugu singer Sreeram Chandra has become an Indian idol 5. His talent, sincerity and dedicated efforts and hard work with cool mind without any emotional outbursts (unlike the Northerners) with  a goal to  win the Indian Idol 5 are most appreciable.

The most vital point is the support given by the viewers all over the country and the AP citizens in particular. In this connection the main hero is the Telugu media as it has extensively covered the SMS campaign by educating the people on SMS as our previous AP contestants narrowly lost just because of poor SMS from the people even though they were talented. 
I salute the media both print and channels for coming together and help the AP singer to become INDIAN IDOL 5.This unity in the media is worth appreciating. Thank you media.
JP Reddy

12 comments:

Thirmal Reddy said...

@Ramu

Sirjee, I highly commend the role played by our media in promoting Sreeram and making people respond to the SMS poll. Infact, in the Indian Idol season 2, when Karunya was in the finale, media did try to promote him. However, the Indian Idol fever didn't catch up much at that time. If I understand correctly, most people (read Telugu audience) came to know about this contest only a few days before the finale. The reason is that the second season started on November 21, 2005 and concluded on April 22, 2006. Now if we look at this date range, there were only two news channels in Telugu (ETV2 and TV9). Both of the channels were just two years old and were mostly running on traditional news or article format. Features seldom covered any television shows earlier. It was for the first time any television show had been promoted in news and people needed time to sync that in. (Telugu audience were just getting used to 24hr news channels).

But now, the scenario has changed. We have almost 15 news channels. Moreover the format of news has taken a paradigm shift. Television shows, daily topic based shows, one-on-ones, reality shows, live coverage is the new format in all the news channels. Infact the stereotypical "reading news" no longer exists. I think these phenomenal changes in the perception of news has helped Sreeram a lot to win the season 5. Of course his talent has no match.

Kudos Telugu media

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Anonymous said...

గత కొత కాలం నుంచి రాజకీయ గొడవలు,వర్గ పోరాటాలు, ప్రాంతీయ భేదాలతో, ఉద్యమాల తో కొట్టుకుంట్టున్న తెలుగు వారందరిని వయస్సులో ఎంతో చిన్నవాడైన శ్రీరామచంద్ర తన పాటలతో, ప్రతిభతో యావత్ తెలుగు జాతి వారినందరిని ప్రాంతీయ భేదాలు లేకుండా ఏకం చేశాడు. ఇటువంటి వారి అవసరం ప్రస్తుతం మనకు చాలా ఉంది. శ్రీ శ్రీరామచంద్ర గారికి ,వారి కుటుంభ సభ్యులకు మీ బ్లాగు ద్వారా అభినందనలు తెలుపుతున్నాను.

మధు said...

maa MYNAMPATI vaadu

Vinay Datta said...

Hearty Congratulations to Sreeramachandra.

seenu said...

Thank god Shreeram became nation pride idol atlast...but this is his effort of four years of struggle...we appreciate the people who voted...Atleast in this issue pl dont write where and who he belongs...HE BELONGS TO INDIA AND HE IS INDIAN IDOL...i think you got my point or view...Jayaho Shreeram...

Anonymous said...

గురువుగారూ! ముందుగా శ్రీరాం కు ప్రత్యేక అభినందనలు.
అయితే ఈ లైవ్ షోల గోలల్లో పడి మనం ప్రజలకు జరుగుతున్న ఒక తీవ్ర అన్యాన్ని గుర్తించడంలేదు. అవి పార్టిసిపెంట్స్ లో వుండే ప్రత్యేక ప్రతిభలను బయటికి తెస్తున్నాయి - సంతోషమే. కానీ మెల్ల మెల్లగా మనను వీటికి అడిక్ట్ & ఇన్వాల్వ్ అయ్యేలా చేసి, శంశ్ ల పేరుతో మన జేబులకు చిల్లులు పెట్టటం మాత్రం సరికాదు. దీనిని మనమందరం ఖండించాలి. వీలైతే కోర్టుల ద్వారా ఆపించాలి. నిజంగా పార్టిసిపేంట్స్ ప్రతిభను ప్రేక్షకులే జడ్జ్ చేసేట్లయితే మంచిదే. కానీ, పెద్ద పెద్ద పోటుగాళ్ళయిన జడ్జ్ లను అక్కడపెట్టుకొని మనలను శంశ్ లు అడగడం అంటే ఖచ్చితంగా ఆ పేరుతో దోచుకోవడమే/ లేదా నిజమైన ప్రతిభను గుర్తించడం ఆ జడ్జ్ లకు చేతగాని పనిగా భావించాలా? పైగా ఒక్కొక్కరు ఒక శంశ్ కన్నా ఎక్కువ చేయవచ్చట-అంటే మన ఎలెక్షన్లలో ఒక్కొక్కడు పదేసి దొంగ ఓట్లు గుద్దినట్లు. అప్పుడు ఆ వోటు విలువ ఎంత? ఒక 5 లక్షల శంశ్ లు ఒక 5 వేలో, 10 వేలో సిం కార్డులతో ఒక్కొక్కటి 3 రూ.చొప్పున అంటే రూ.15 లక్షలతో విజేత అయిపోవచ్చా? దీనికి నిర్వాహకులు ఠక్కున చెప్పే సమాదానం-శంశ్ లు ఒక్కటే కాదుగదా జడ్జ్ ల నిర్ణయాలతో కలిపి విజేతను నిర్ణయిస్తాం అని. అంటే ప్రశ్న మల్లీ మొదటికి వస్తుంది. జడ్జ్ కరక్ట్ అయితే శంశ్ ఉండకూడదు, శంశ్ (వీక్షకుని ఓటు) కరక్ట్ అయితే జడ్జ్ అక్కరలేదు+ఒక్కొక్క వీక్షకుడికి (మొబైల్ కు) ఒక్క వోటే వుండాలి. అలా లేదు కనుక ఇది దోపిడీయే. పోనీ, ఒక్క 3రూ.లతో శంశ్ పంపినంతమాత్రాన మన సొమ్ము లూటీ ఎందుకనుకోవాలనుకుంటే - అపరిచితుడు లో చెప్పినట్లు పైసా పైసా కలిస్తేనే రూపాయ అవుతుంది. నిర్వాహకునికి రేటింగ్స్ రూపంలో, యాడ్స్, స్పాన్సర్స్ ఇన్నిరూపాల్లో వచ్చే డబ్బులు చాలక సగటు ప్రేక్షకుడి జేబుకు డిరెక్ట్ గా బొక్కపెట్టడం ఏం న్యాయం? మనకు నచ్చిన పోటీదారు గెలిచేందుకు (ఉదాహరణకు నిన్న మన శ్రీరాం) ఒక్కొక్కరం పదేసి శంశ్ లు ఇచ్చిన వారుకూడా మనలో వున్నారు కాదా. పైగా మన మీడియాకూడా విపరీతంగా ఊదర కొట్టిందాయె. పద్ధతి అలా ఏడిచింది కనుక శ్రీరాం కోసం మనం అలా చేయవలసిరావడం ఇక్కడ తప్పలేదు. దానికెవరం బాధపడనవసరం లేదు. కానీ, ఈ పద్ధతే తప్పు. పైగా ఇవ్వాళ, రేపు లెఖ్ఖకు మిక్కిలిగా వచ్చిన మన పనికి రాని న్యూస్ చానళ్ళవారు వారు చెప్పాల్సిందంతా చెప్పేసి యస్సా? నో నా అనేది శంశ్ చెయ్యగలరు అంటూ అదో రకం బాదుడు చేస్తున్నారు. ఇవ్వన్నింటి నేపధ్యంలో ఫ్రీగా చెత్తా చెదారం ప్రోగ్రాం లన్నీ చూసిపెట్టి ఈ దరిద్రపుగొట్టు చానళ్ళను పోషించడమే మనం చేస్తున్న అతి పెద్ద మెహర్భానీ అని గుర్తించకుండా ఏకంగా మన జేబులకే బొక్కలు పెట్టే ఈ శంశ్ ల నీచ పద్ధతి పోవాలని ఆశిద్దాం. చివరగా, ఇదంతా వ్రాసి మన శ్రీరాం ప్రతిభను తగ్గించి చూపే వుద్దేశ్యం లేదు గానీ రియాలిటీ షో ల వెనుక మరో కోణాన్ని ఎక్స్పోజ్ చెయ్యడమే నా ఉద్దేశ్యం.

Anonymous said...

I fully agree with rs reddy. many times I argue with my friends that this is wrong thing and do not try to vote him or such programmes. first of all indian idol title it self wrong. because if a singer becomes indian idol what about our jawans at borders? even that singer him self is not a creator any raagam.he just singing others songs.in any way sreeram or other participents of this type of programmes arr not indian idols.

CH.DURGA PRASAD said...

on behalf of srikakulam citizens I heartfully congratulate Sriram on his success. i thank one and all who sent sms request which helped him to create a wonder.

Anonymous said...

క్షమించాలి. నా పోస్ట్ లో SMS బదులు శంశ్ అని పడింది.

Ramu said...

I am totally agree with Mr.R S Reddy and Jayahoo Bharth. Also,it is a way of exploiting regional patriotism (pradeshika Desa Bhakthi). People were asked to Vote Sriram because he is a Telugu guy. It is shame on us to send SMS based on the region or religion he belongs to. Please keep in mind that other participants are also Indians, after all they belongs to other part of our country.

Krishnarjun said...

ఈ సంధర్భంగా మన చానెళ్ళను ఒకందుకు మెచ్చుకోవాలి, రామచంద్ర ను తెలంగాణా వాడా, ఆంధ్రా వాడా, తెలంగాణా సమర్ధకుడా లేదా సమైక్యాంధ్రా సమర్ధకుడా అని వివాదాస్పదం చేయనందుకు. సం యమనం పాటించినందుకు.

Anonymous said...

Well said R.B.Sharma gaaru and Krishnarjun gaaru.
ప్రపంచమంతా ఒక కుగ్రామం లా మారిపోతున్న ఈ రోజుల్లో మన ప్రాంతం, మన కులం లాంటి ఇరుకు ఆలోచనలలోకి వెళితే బయటకు రాలేం. ముఖ్యంగా ఇలాంటి వాటికి దూరంగా ఉండాల్సిన, మనకు చెప్పాల్సిన మీడియానే ప్రాంతీయ దురభిమానం వైపు అడుగులువేయడం సోచనీయం. ఒకవేళ, వీళ్ళు చెబుతున్నట్లుగా నార్త్ వాళ్ళు ప్రాంతీయ దురభిమానం తో వాళ్ళవాళ్ళకు ఎక్కువ ఎస్.ఎం.ఎస్ లు ఇచ్చి గెలిపించుకుంటున్నారు అనుకుంటే, మనమూ అలాగే చేద్దమనుకునే బదులు ఆ పద్ధతినే తప్పు పట్టి మానిపించేది ఉండే.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి