Tuesday, August 24, 2010

.....రాఖీ పర్వదిన శుభాకాంక్షలు.....

'రాఖీ పండుగ స్పెషాలిటీ తెలుసా?' అని అడిగింది నా కూతురు మైత్రేయి...ఎలాగైనా ఈ రోజు ఏదో ఒక పోస్టు రాయాలని కూర్చోగానే.
నేను పండుగ ఉద్భవానికి కారణాలు మదిలో వెతుకుతుండగా...అలగ్జాండర్-పురుషోత్తముడి కథ గుర్తుకు వచ్చింది. ఇంతలో ఆమే చెప్పింది.
  
"ఏమీ లేదు...ప్రతి రోజు ఆడపిల్లలు రోడ్డు మీద నడవడానికి భయపడతారు కానీ రాఖీ రోజు మాత్రం మొగపిల్లలు రోడ్డు మీద నడవడానికి భయపడతారు....ఎవరొచ్చి రాఖీ కడతారో అని...," అని జోకు పంచుకుంది.   

మొత్తానికి....ఆరంభంలోనే అందరికీ ముందుగా రాఖీ పర్వదిన శుభాకాంక్షలు.

మొన్నామధ్యన జరిగిన 'ఫ్రెండ్ షిప్ డే' ఉత్సవాలు జనం ఎలా జరుపుకున్నారో చూశాను. మూడో తరగతి స్కూలు పిల్లవాడి నుంచి మధ్యవయస్కుల వరకు అంతా...ఆ సంబరాన్ని జరుపుకున్నారు. ఫ్రెండ్షిప్ బ్యాండులు వగైరాలు కొని హడావుడి చేశారు. దానితో పోలిస్తే....ఈ రాఖీ పండుగ అంత ఉత్సాహంగా జరిగినట్లు నాకైతే అనిపించలేదు. టీ.వీ. డ్రివెన్ బతుకులు కాబట్టి...ఆ ఫీలింగ్ కలిగిందో...ఏమో, తెలియదు.


ఇదే...మీడియా ఒక రకమైన హైపు సృష్టించి....హడావుడి చేస్తే..జనం అంత బాగా పండగలు జరుపుకుంటారు. మీడియా ప్రాముఖ్యమివ్వకపోతే....ఎంత పెద్ద విషయం అయినా...అప్రాముఖ్యమైపోతుంది. అలా బుల్లి తెర అదృశ్య చేతుల్లో మన బతుకులు తెల్ల వారుతుండడం విషాదం.  

మీడియా సంగతి ఎలా వున్నా...ఉదయాన్నే ఫిదెల్ చెప్పినట్లు విని అక్కతో రాఖీ కట్టించుకున్నాడు. హేమ రాఖీ కట్టడానికి ఈ.సీ.ఐ.ఎల్.వెళ్లి అన్నయ్య శంకర్ కు రాఖీ కట్టి వచ్చింది. ఫిదెల్ కు రాఖీ కట్టడానికి తమ్ముడి ముగ్గురి కూతుళ్ళు రాత్రికి వస్తారు. వాళ్లకు ఇవ్వడానికి హేమ గిఫ్టులు కూడా రడీ చేసింది.

స్వీట్ల హడావుడి బాగానే జరిగింది. ఈ ఏడాదీ రాఖీ కట్టించుకోకుండానే నాకు ఈ పండుగ ముగిసింది. నిజంగానే...ఒక్క అక్కో, చెల్లో మా ముగ్గురు మగ వెధవలతో పాటు పుట్టి ఉంటే బాగుంది కదా... అని అప్పుడు అప్పుడూ అనిపిస్తుంది. కిందటేడాది...తమ్ముడి కూతుళ్ళు (వాళ్ళ నాన్న లాగా... రామన్నయ్యా అని పిలుస్తారు) నన్ను అన్నయ్య గా భావించి రాఖీలు కట్టారు. వారు మరి కాసేపట్లో రాబోతున్నారు. ఏమి చేస్తారో చూద్దాం. 

మొత్తానికి నాకు అనిపించింది ఏమిటి అంటే...ప్రతి ఒక్కడు రాఖీ పండుగ స్ఫూర్తితో బాధ్యతాయుతమైన సోదరుడిలా మెలిగితే...రోడ్డు మీద నడవడానికి ఆడపిల్లలు భయపడరని.

32 comments:

katta jayaprakash said...

Raksha Bandhan is celebrated in our area very enthusiastically and love as almost all the streets are not that busy and even some shops nevrr opened today and it is looking like a major festival this year unlike in the past.It indicates how our brothers have become most lovng towars their sisters to stand by them in all circumstances.Indeed it is a very good transformation in the mindset of our brothers community as most of the times these relationships have become commercial with money mind with all sorts of differences,fights and landing in the courts for property disputes etc without any rspect to the blood relationship and love.I am very happy that our brothers and sisters have got a very good,pleasant an affectionate day today and I hope this will continue till the next Raakhi and so on.Love is God and God is love and let us live in love which leads to divinity.Hearty ongratulations to all the brothers and sisters.But I am very unfortunate that I could not tie Raakhi to my only sister as my brother in law is no more but I just met her and presented a sweet box and I tasted the sweet prepared by her to make our relationships more sweet with mutual understanding and goodwill in the days to come.God bless her.
JP.

katta jayaprakash said...

In my last mail it shoulD have been that I am most unfortunate that my sister could not tie Raakhi to me.......Due to emotional feelings I just did a mistake.Sorry for it.
JP.

Krishnarjun said...

Janata - a new Telugu channel launched today.

Saahitya Abhimaani said...

"...రాఖీ పండుగ అంత ఉత్సాహంగా జరిగినట్లు నాకైతే అనిపించలేదు...." How it would be celebrated! After all its an Indian festival. For Indian Festivals, there is no sponsorship from the ad agencies and thereby from Media.

These ad agencies try to propogate only alien life styles.

sai said...

sir,
any info about new news channel janata tv?

ts website address?

Vinay Datta said...

Don'tworry Ramu garu, Next year you'll surely get a Rakhi from me. This thought (whole heartedly) occured to me after reading your post referring to your 'maga vedhavalu'.

Ramu S said...

Madhuri garu,
Thanks a ton. I'll wait for the next year Rakhi festival.
Ramu

Anonymous said...

డియర్ రాము,
ముందుగా రాఖీ పర్వదిన శుభాకాంక్షలు.
'ప్రతి ఒక్కడు రాఖీ పండుగ స్ఫూర్తితో బాధ్యతాయుతమైన సోదరుడిలా మెలిగితే...రోడ్డు మీద నడవడానికి ఆడపిల్లలు భయపడరని' వ్రాసారు బాగానే వుంది. కానీ, మళ్ళీ తాడేపల్లి గారి శిష్యబృందం లోంచి ఎవరైనా ఒకరు వచ్చి ఆడపిల్లలు రోడ్డు మీద నడవడానికి అన్నయ్యలు ఎందుకు? అని అడుగుతారేమో చూడండి.

kvramana said...

@JP garu
Sorry if am making an unsolicited comment...but I had an argument of sorts with my mother on this issue. My father's sister too is a widow and hence she is not eligible for tying rakhi...is my mother's argument. But, I feel we should be willing to break it. Sister is more closer to us in relationship than her husband. At least I have never read or heard of this trend of making her ineligible. My mother said my aunt is not eligible since she can not touch kumkum for tying rakhi. Then she can tie rakhi without touching kumkum. After all, rakhi is only wish the brother good luck and prosperity. Does her being a widow make her ineligible for wishing us good luck too?
I am extremely sorry for writing this...but I thought I should put it out even if you don't like it since I have gone through this only yesterday. My sister is a single mother and my brother in law does not stay with her. Then how is she eligible if the relationship is linked to her husband?
K V Ramana

nareshnunna said...

రామూ గారు!

మీ పోస్టులు కొన్నింటి పట్ల నాకు (వ్యక్తిగతంగా) ఏదో తెలియని బెరుకు కలుగుతుంది. ముఖ్యంగా ఆడవారి అంశాలు ముచ్చటించినప్పుడు మరీనూ -
అవి నన్ను చిత్రమైన న్యూనతకి గురిచేస్తాయి. వాటిల్లోని అలవిమాలిన 'మంచితనం' 'సభ్యత', 'సంస్కారాల' వల్ల కాబోలు నేను కొంత కుచించుకు పోతుంటాను. అవి నన్ను moral blackmailing చేస్తున్నాయనిపిస్తుంది.
నేను కొద్దో గొప్పో తెలుసు కాబట్టి, మీకు చెప్పనక్కర్లేదు గానీ, కొత్తగా చదువుతున్న బ్లాగ్ పాఠకుల సౌలభ్యం కోసం నా గురించి సంక్షిప్త పరిచయం. నా వయస్సు 43 సంవత్సరాలు. ఒక జర్నలిస్టుని. సామాజిక భద్రత, గౌరవం ఇత్యాదుల వల్ల కాకుండా, ఆర్ధిక అబలత్వం వల్ల బొత్తిగా కాకుండా, సనాతన భారతీయ ప్రాతివ్రత్య కారణాల వల్ల ఎంతమాత్రమూ కాకుండా, పూర్తిగా నిష్కామంగా, 'నన్ను నన్నుగానే' ప్రేమిస్తూ, 17 ఏళ్ళుగా భరించే ఓ భార్య, వాళ్ళ టీచర్ల సౌందర్యాన్ని తేరిపారా చూస్తున్నానని గ్రహించే వయసుకు వచ్చిన ఇద్దరాడ పిల్లలు (పెద్ద పాప టెన్త్‌కి వచ్చేసింది, కూడానూ.).
తెల్లవారు జామున వాకింగ్‌కి వెళ్ళే మా అపార్ట్మెంట్ ground floor కరుణగారు (పేరు మార్చాను) మొదలు, చెవికింద కమ్మలతో పాటు చెవి మీద helix, చెవి మధ్యలో snugs అలంకరించుకొని వచ్చే మా పనిమనిషి నుంచి, తెల్లతామర నవ్వులతో పలకరించే మా పాప స్కూలు head mistress నుంచి, మా ఆఫీసు ఐదు ఫ్లోర్లని తమ స్వయం ప్రకాశక దీప్తులతో వెలిగించే డజన్ల కొద్ది స్త్రీ మూర్తుల నుంచి, రాత్రి పడుకోబోయే ముందు ఎదురింటి టెర్రస్ మీద 'సెల్' యేరులై ఉరికే అభిసారికల వరకూ ఎందరినో చూస్తూనే ఉంటాను. జీవితానికి అది కాకుండా, మరో వ్యాపకం ఉండటాన్ని తిట్టుకోని క్షణం ఉండదు. బ్రతుకు కోసం, భుక్తి కోసం ఉద్యోగం చేయాల్సిన తప్పనిసరితనాన్ని కూడా నిందించుకోని ఘడియ కూడా ఉండదు. ఇంత మంది స్త్రీ మూర్తులు రోజులో తారసపడుతుంటారు. ఇంత వరకూ ఎవరినీ 'సోదరీమణి'లా భావించలేదు, 'బాధ్యతాయుతమైన సోదరుడి'లా ఏనాడూ మెలగలేదు. కానీ, నా బోటి ప్రవర్తన ఉన్నా కూడా 'ఆడపిల్లలు రోడ్డు మీద నడవడానికి భయపడక' పోవచ్చేమోనని నా వైపు నుంచి ఒక చిన్న ప్రతిపాదన. చుట్టూ ఉన్న నిస్సారమైన, నిరలంకారమైన సృష్టిని తమ అస్తిత్వంతో, కేవలం తమ ఉనికితో ఇంత సొగసు, సోయగం, అందంతో నింపుతున్న వారి పట్ల- వారి సోదరులైనా పురుష సహజమైన పెడసరంతో చిరాకు పడతారు, కోప్పడతారు, కట్టడి చేస్తారేమో గానీ, నా బోటి వాడు (వాళ్ళు) మరింత కృతజ్ఞతతో, వినమ్రంగా ఉంటారని స్వానుభవపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను.
- నరేష్ నున్నా

Anonymous said...

అయ్యా, నరేష్ నున్నా/ సండే ఇండియన్ గారూ!
మీరు కాస్త కవి మనసుతో వ్రాసినా కొన్ని నిజాలు ఒప్పుకున్నారు. ముందుగా మీతోపాటు అందరికీ ఒక్క మనవి. ఈ బ్లాగు లో గతంలోనూ, ఇప్పుడూకూడా ఆడవారిని సమర్ధిస్తూ వ్రాసేవారందరూ మీరు చెప్పిన "అలవిమాలిన 'మంచితనం' 'సభ్యత', 'సంస్కారాల'" తో కాదు. మీకు మీరు చెప్పుకున్న మంచి లక్షణం లాంటి అవలక్షణం గురించి (వాళ్ళ టీచర్ల సౌందర్యాన్ని తేరిపారా చూస్తున్నానని గ్రహించే వయసుకు వచ్చిన ఇద్దరాడ పిల్లలు ఉండికూడా.....) కూడా కాదు. ఎందుకంటే మీరు చెప్పుకున్న (అవ)లక్షణం ఉన్నవారు చూసి (వీలైతే మనసులో ఎంజాయ్ చేసి - పక్కన భార్యా, పిల్లలున్నా సరే) వదిలేస్తారు. అంతవరకు తామేదో వాళ్ళను అలా వదిలేసి (ఇంకా ముందుకు వెళ్ళనందుకు??) ఎంతో మేలు చేసినట్లు భావిస్తారు. ఇది ఒక ఎత్తు.
కానీ, ఇక్కడ విషయం ఇందుకు రివర్స్ గా ఉండే పర్ఫెక్ట్ అవలక్షణాల వ్యక్తుల గురించి, అదేనండీ - ఒట్టిగా చూస్తేనే ఏమొస్తుందిరా మామా? నాలుగైదుసార్లు వెంటపడి వేధించైనా పటాయించాలి ---- లాంటి టార్గెట్ లను పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో ఆడుకొనేవాళ్ళ గురించి. ఇక్కడ జీవితాలతో అంటే - శ్రీ లక్ష్మి ని నరికి చంపిన మనోహరే కానక్కర లేదు. పిచ్చి పిచ్చి కామెంట్లు భరించలేక, పిరికితనంతో బయటకు చెప్పుకోలేక (కొందరి విషయంలో అమ్మా, నాన్నలకు చెప్పుకున్నా అలా వాళ్ళ, వీళ్ళ ద్రుష్టిలో పడడం/ పడేంత అందంగా తయారవ్వడం వాళ్ళదే తప్పనట్లు మాటలాడే సగటు తల్లి దండ్రులు ఉన్న మన సమాజంలో) చదువులు మానేస్తున్న/ ఒక్కోసారి తమను తామే అంతమొందించుకుంటున్న పరిస్తితులకు కారణమౌతున్న వారిగురించి.
ఇక మరో ధారుణమైన కోణం: ఇలాంటి చర్చ వచ్చినప్పుడల్లా ఫెమినిస్మ్ ను/ స్త్రీ వాదాన్ని విమర్శించేవాళ్ళంతా అదేదో రేపిస్ట్ లు, ఈవ్ టీజర్లు మీరే అని మేమేదో వాళ్ళను అన్నంత పౌరుషానికి ఎందుకు వస్తారో నాకర్ధం కాదు. ఎందుకంటే స్త్రీల పైన, వారికి సమాజంలో తరిగిపోతున్న గౌరవంపైన ఆవేదన పడుతున్న వాళ్ళమెవరమూ వారిని ఇళ్ళల్లొనే పెట్టి ఎవరినీ చూడనీయకుండా దాచుకోవాలనే వోవర్ పొజెసివ్‌నెస్ తో మాట్లాడడం లేదు. స్త్రీ పురుషుల మధ్య వుండవలసిన సహజాకర్షణా, (ఇద్దరికీ) నచ్చినాక జరిగే తతంగాల గురించీ (ఎవరి ఇండివిడ్యువాలిటీ/ నైతిక విలువల స్తాయిని బట్టి-తప్పుకాదనుకొంటే), సహజ సిద్ధమైన కోర్ట్‌షిప్ హక్కుల గురించీ కాదు. అలా కాకుండా అసహజమైన, సభ్య సమాజం సిగ్గుపడేలా ఉండే పైత్యపురాయుళ్ళ విపరీత ప్రవర్తనల గురించే.
అమ్మాయి కనిపించిందంటే అదేదో తమకోసమే పుట్టిన వాడకపు వస్తువైనట్లు, నలుగురిలో ఉండికూడా అదేపనిగా ఎక్కడెక్కడో గుచ్చిగుచ్చి చూడడం, ఒక్కోసారి నోటి దూల తీర్చుకోవడం చేసే నయా కీచకుల గురించే మా అందరి బాధా. రేపటి రోజున నా కూతురు (ఇప్పుడు రెండో క్లాసు) ఇంత అయ్యాక ఒకడు ఇలాగే చుస్తూ, కామెంట్లు చేస్తున్నాడని చెప్పిన నాడు నేనిక్కడ చెప్పిన కోర్ట్‌షిప్ హక్కులు ఇతర నీతి సూత్రాలు గుర్తుంటాయా లేక వాడికి బుద్ధి చెప్పకపోతే నా కూతురు మరో శ్రీ లక్ష్మి కావచ్చేమో అని రక్తం సల, సలా మరిగిపోతుందా?
జీవితానికి 'అది' కాకుండా, మరో 'వ్యాపకం' ఉండటాన్ని తిట్టుకోని క్షణం ఉండదు. బ్రతుకు కోసం, భుక్తి కోసం ఉద్యోగం చేయాల్సిన తప్పనిసరితనాన్ని కూడా నిందించుకోని ఘడియ కూడా ఉండదు లాంటివన్నీ బహుషా మీరు పొయెటిక్ గానే వ్రాసినట్లు నాకనిపిస్తోంది. It seems you did'nt really mean it.
కేవలం వాదన కోసం ఎవరెన్ని చెప్పినా, కారణాలేవైనప్పటికీ స్త్రీని విలాస వస్తువుగా చూడటం పెరిగిపోయిన నేటి పరిస్థితులలో మన లాంటివారం వారి సమస్యల గురించి చర్చించేటప్పుడు మనలో నిద్రాణంగా ఉన్న సహజమైన స్త్రీ వ్యతిరేకతను బయటపెట్టుకోవడం సబబు కాదు. చిన్న ఉదాహరణ: ఏదైనా ఉద్యమం కోసం ఒకరు ఆత్మ హత్య చేసుకున్నారనగానే, అవునట/ అయ్యో అంటాం, కానీ ఆత్మహత్య కాదేమో???? లాంటి అలోచనేదయినా వచ్చినా బయటపెట్టం. ఎందుకని?? అక్కడవుండే పరిస్తితులైనా గానీ, లేక ఆ సంధర్భంలో ఉండాల్సిన మానవత్వపు అలోచన గానీ కావచ్చు. మరి ఆ మాత్రం సానుభూతి మహిలలపైన ఎందుకు చూపం? మేల్ ఇగోనే కారణం అయ్యుండొచ్చేమో? if so, let us all try to come out of it.

Big Data Enthusiast said...

ఇప్పుడు మీకు తాడేపల్లి గారు మరియు వారి శిష్యబృందం ఎందుకు గుర్తుకు వచ్చారు ఆర్ యస్ రెడ్డి గారూ? వారు గుర్తుకి వస్తే వెళ్ళి వాళ్ళ బ్లాగ్ చదవండి. వారి ప్రమేయం లేని విషయం లోకి తాడేపల్లి గారిని లాగడం బాధాకరం.

రాము గారూ, మీరు మీ బ్లాగ్లో ఇలా hatred ని ప్రోత్సహించడం భావ్యం కాదు. మీరు పోరాటం చేస్తున్న కల్తీ మీడియాకీ ఇలాంటి వాళ్ళకి ఏమి తేడా లేదని నా అభిప్రాయం. మీరూ ఆలోచించండి. ఎవరినైనా నొప్పిస్తే క్షమించండి.

katta jayaprakash said...

Thank you very much Ramana garu for responding to my view on Raakhi.Infact i am always ready to get Raakhi tied but my sister refuses as it is not good to tie raakhi with widowhood and she never agreed inspite of pressure from me and my wife..So I just get satisfied by presenting her sweet.
I would like toshare an incident with you that that on the tenth day of death of my brother in law the women relatives stated as usual breaking the bangles and removing the kumkum of my sister but I harshly argued with them not to remove these things from her as they are there since her birth and nothing to do with marraige or her husband.But I was lonely to fight against these sentiments.After removing all these a white saree is given to her and the women there asked us to see her face as a sentiment but I just shouted at them and refused to see her face an every one felt I was a bit extremistic but I was helpless.I feel we cannot break these iron rules of our women as long as women are indifferent for reforms.
JP.

Anonymous said...

@ yagna
కల్తీ మీడియాకీ ఇలాంటి వాళ్ళకి ఏమి తేడా ఉందో లేదో తరువాత చూద్దాం గానీ, పై టాపిక్ కు నేను వ్రాసిన విషయానికి లింక్ లేదని మీరెలా డిసైడ్ చేస్తారు. లింక్ లేకపోయుంటే రామూ గారే దాన్ని పబ్లిష్ చేయకుండా ఉండే వారేమో కాదా? అంటే ఈ బ్లాగు కి మోడరటర్ గా రాము గారి బదులు మీరుంటారా? ఒకరి పేరున శిష్య బ్రుందం అని పేర్కొనడం నచ్చకపోతే అంతవరకు ఖండించండి. అంతేకానీ "వారి ప్రమేయం లేని విషయం లోకి తాడేపల్లి గారిని లాగడం బాధాకరం. మీ బ్లాగ్లో ఇలా hatred ని ప్రోత్సహించడం భావ్యం కాదు. మీరు పోరాటం చేస్తున్న కల్తీ మీడియాకీ ఇలాంటి వాళ్ళకి ఏమి తేడా లేదని నా అభిప్రాయం" అని వ్రాయడం ద్వారా మీరెందుకు భుజాలు తడుముకున్నట్లో?

Thirmal Reddy said...

@Yagna

I agree with you. Let us not drag Tadepalli garu or for that matter any other individual who is not part of this discussion, unless they initiate themselves.


@Shiva garu

I liked the way you pointed out media's indifference to some Indian festivals. It's unlike other discussions which go off the course. Please keep them coming.

@Ramu

Sir jee, every other discussion is somehow circumventing or ending up around non-media related issues. I agree this is an open forum and we all believe in 'freedom of expression', but I sincerely request you appeal to participants to stick to the discussion initiated and not stray away.
Thanks for all your posts, have been really interesting.Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Kathi Mahesh Kumar said...

@నరేష్ నున్నా: మీ సౌందర్యారాధనా, కళాపోషణకు జోహార్లు. చాలా అసూయగా ఉంది మాష్టారూ!

nareshnunna said...

R.S. Reddy గారు!

మీకు చిన్న వివరణ

"చూసి (వీలైతే మనసులో ఎంజాయ్ చేసి) వదిలేస్తారు"

ఎంజాయ్ చేయడం అనే phase మాత్రమే తెలుసు మీకు. మరో కోణం self referential precedence నుంచి:

నేను పనిచేసే Planman Group లో Media కాకుండా ఇంకా చాలా Wings ఉన్నాయి. మా ఫ్లోర్‌లో మార్కెటింగ్, HR, BPO...ఇంకా ఏవో విభాగాలున్నాయి. ఎవరు ఎందులో చేస్తున్నారో నాకు తెలియదు. మా ఈ విభాగాల మధ్య Iron Curtains ఉంటాయి. నా ప్రవృత్తిలో భాగంగా నేను రోజూ చాలా మందిని చూస్తుంటాను ( I really mean my account in my earlier post). ఒక అమ్మాయి (ఇరవై రేండేళ్లు మించక పోవచ్చు). వృత్తి ధర్మంలో భాగంగా తను నా కాబిన్ ముందుగా నడుస్తూ వెళ్తుండేది. నా కాబిన్ అద్దాలు cristal glassతో చేయడం వల్ల కాబోలు ఆమె 'పెక్కు నీవులు''గా విస్తరించి, తడి నాపరాయి గచ్చు మీద రాలిన నూనె చుక్క ఇంద్ర ధనస్సు రంగులుగా దోబూచులాడినట్లు ఆమె నవ్వు ఆ అద్దాల మీద వక్రీభవించేది. Centralised A/c వల్ల బిగుసుకుపోయి మొత్తం అష్టదిగ్బంధనమైన మా కాబిన్ ముందు ఆమె నడిచి వెళ్తుంటే, కళ్ళు మూసుకున్నా తెలిసిపోయేది, బుద్ది జనిత జాడ్యాలకు అర్థంకాని పరిమళం సోకి. ఏ కారణంగానైనా తను కనిపించలేదో, ఆ రోజు రోజంతా ఆఫీసు పని అంగుళం కదిలేది కాదు.

ఆ మధ్య కొద్ది రోజులు వరసగా ఆమె దర్శనం లేదు. ఇక ఉండబట్టలేక కనుక్కుంటే, తనకి చెన్నై ట్రాన్స్‌ఫరై వెళ్ళిపోయిందని తెలిసింది. ఎంత దిగాలు పడిపోయానంటే, రెండ్రోజులు ఆఫీసు ముఖం చూడలేకపోయాను. ఏమైందని అడిగిన ఇంట్లో వాళ్ళకి, బైట వాళ్ళకీ ఏమీ చెప్పులేకపోయాను. ''స్త్రీల పైన, వారికి సమాజంలో తరిగిపోతున్న గౌరవంపైన ఆవేదన పడుతున్న'' మీ బోంట్లు- (ఎంజాయ్‌మెంటు గురించి సరే,) నాలా బాధ, దిగులు పడే వారి గురించి ఏమంటారో అని నా సందేహం.

- నరేష్ నున్నా

Big Data Enthusiast said...

ఇక్కడ భుజాలు తడుముకోడానికి నేను తాడేపల్లి గారి ఫాన్ ని కాదు మరియు మీరు అక్కడెక్కడో పోస్ట్ చేసినట్టు వారి బావమరిదినీ కాదు. First learn how to behave in a public forum.

Ramu gaaru, Mr. Reddy is thinking that he has not committed any mistake by dragging others into this chain, because you had not said it wrong. I appreciate your opinion on this.

Thanks

Ramu S said...

Yagana garu,
In fact it was my fault. After sending a comment on Tadepalli garu, Mr.Reddy sent another mail saying that his comment may be removed. But inadvertently I let it go. From now onwards, I'll avoid such comments on fellow-bloggers.

Cheers
Ramu

Anonymous said...

రాము గారు,
ఇంత క్రితం జరిగిన చర్చను దృష్టిలో ఉంచుకొని రాస్తున్నాను. అచ్చం ఈ టపాగురించి కాదు. నేను క్రితంసారి తాడేపల్లి గారిని సమర్ధిస్తూ రాశాను. తాడేపల్లి గారి బ్లాగులో ఆయన రాసినవి అందరిలా నేను చదవటం తప్పించి నాకు వ్యక్తిగతం గా పరిచయం లేదు. నేను బ్లాగులు రాయను. నేను రాసినవి అందరు చదివి అభినందించటానికి గ్రూపిజం చేయవలసిన అవసరం లేదు.

కొత్త పాళీ said...

@ నరేష్ నున్న, మీ ఆఖరి వ్యాఖ్య చదివి, రాజిరెడ్డి మధుపం పుస్తకంలో మొదటి వ్యాసం గుర్తొచ్చింది.

WitReal said...

>> In fact it was my fault.

It is not your fault.

Your actual fault was NOT publishing other replies to such r.s. reddy. You did reject couple of comments on the previous post.

Ramu S said...

Dear WitReal,
I generally don't kill comments unless and until they make nasty allegations against me. If you counter the argument of others in the form of comments, why should I have a problem in posting them?
Cheers
Ramu

Vinay Datta said...

@ Naresh Nunna

I appreciate your sincere confessions, if they have to be named so. There's nothing wrong as long as you appreciate physical beauty and draw inspiration and enthusiasm. I'm sure even your wife likes to see beautiful women and men and say to herself, 'hey! the person is charming', 'what a smiling face', 'looking at the person itself is a treat to the eyes', 'can I get one more opportunity to see him/her?', etc. That doesn't affect her love for you. But I think you should only learn to let go once those people move away from you. Iam successfully learning.

nareshnunna said...

@Mahesh: Thanks 4 ur compliment, saying that u r envious is a complement to ur comment.

@కొత్త పాళీ garu: Thank u. It seems, wittingly or unwittingly my writings, including my poetry anthologies నీడల్లేని చీకట్లో (1994)and మిణుగురులు (1998), in which 'woman' is the common subject, might have been influenced by Mr. Raji Reddy's writings.

Anonymous said...

@yagna, thirumal, sreekar
sorry friends, i really did'nt mean to drag others names-i thought the comment "ప్రతి ఒక్కడు రాఖీ పండుగ స్ఫూర్తితో బాధ్యతాయుతమైన సోదరుడిలా మెలిగితే...రోడ్డు మీద నడవడానికి ఆడపిల్లలు భయపడరని" of Ramu might again bring back a debate between the two ideologies as in earlier case. i would have not mentioned somebody's name. agreed.
@yagna
@"మీరు అక్కడెక్కడో పోస్ట్ చేసినట్టు వారి బావమరిదినీ కాదు"-sorry, i didn't use that comparison anywhere. i only used 'అన్నో, తమ్ముడో'
@thirumal
guruji! time and again u are insisting for this blog not to drift away from media related issues? i wonder whether media kaburlu means it has to roam around the useless gossips in media or something like that only? for that matter any social issues are related to media only or to take it the other way all such issues are to be discussed in this blog. in my opinion this blog need not be reserved for happenings in media only.

Anonymous said...

@madhuri
"There's nothing wrong as long as you appreciate physical beauty and draw inspiration and enthusiasm" - well said.
My point was against those who crosses this Laxmana Rekha and abuses/ harasses the innocent girls for their appearing beautiful/ natural beauty. i too agreed that 'uncles' (having got married/ having children) may not go beyond 'see and enjoy' (the word 'appreciate' used by you may not fit for some persons).
@Sunday Indian
my serious objection among all your comments was to the following sentence - "వాళ్ళ టీచర్ల సౌందర్యాన్ని తేరిపారా చూస్తున్నానని గ్రహించే వయసుకు వచ్చిన ఇద్దరాడ పిల్లలు (పెద్ద పాప టెన్త్‌కి వచ్చేసింది, కూడానూ.)". The big question here is will those little minds digest their father's attitude towards their teacher. I did not mean you have any bad intension behind your looks, you might be only appreciating their external beauty as a 'beauty' lover.

Vinay Datta said...

@ RS Reddy

Thanks.I understand your agony. I experienced many unwanted situations. Thank God! I've successfully crossed all that and am prepared to courageously confront any nonsense in future. It's the education system that has to change drastically to bring about the needed change in the world. I wish a few more women had participated in this discussion.

Thirmal Reddy said...

@RS Reddy

Absolutely Not. Why do you relate Media news only to useless gossip. If you observe most of the media posts in this blog have plain news or revolve around non-gossip or pure facts. Nothing personal, but I sincerely regret the way you perceive media kaburlu as only gossip. There's more to it, otherwise why would so many from the media fraternity look forward for posts from Ramu gaaru.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Anonymous said...

@thirumal
elsewhere in this blog Ramu himself expressed the same feeling that not all the time we can keep posting on media issues only as there is nothing much/ good to take from/ talk about media and he won't prefer to post on gossips. i too didn't mean media related issues be under weighed, at the same time other social issues need not be excluded from this blog. coz, after all the media and every one else here are ought to take part in arriving at solutions to/ analyze the social issues.

Thirmal Reddy said...

@RS Reddy

So when did I mention you commented only about gossips or Ramu ji did write only about them. I was just reminding you that media is not just about gossips but ALSO about other human SELF beings. Just that, I wanted intellectuals like you to heed to issues of lesser morals like us in the media. Of course, lives of media personal have become a gossip which I'm trying to elevate to a position to be discussed even remotely, which will draw your attention. And I hope to do so.

Thanks RS Reddy ji, for the follow up. I appreciate your response.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Anonymous said...

@thirumal
agreed. thanks

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి