Friday, September 3, 2010

'ఈనాడు' లో రోశయ్య పై శ్రీధర్ కార్టూన్ అభ్యంతరకరం

ఇది ఈ రోజు 'ఈనాడు' పత్రికలో ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్ 'ఇదీ సంగతి' కింద ప్రచురించిన పాకెట్ కార్టూన్. రోశయ్య అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీధర్ ఈ కార్టూన్ వేశారు. కానీ...ఇదీ నాకు అభ్యంతరకరంగా తోచింది. కార్టూనిస్ట్ కు అన్ని అంశాల మీద చురకలు వేసే స్వేచ్ఛ ఉంటే ఉండవచ్చు గానీ...ఒక వయో వృద్ధుడి అనారోగ్యం మీద ఇలా కార్టూన్ వేయడం నాకు అస్సలు నచ్చలేదు. మీరేమంటారు? 

ఇందులో ఒక వైద్యుడు సిరంజితో, మరొకరు థర్మామీటర్ తో ముఖ్యమంత్రి వెనుక నడుస్తున్నట్లు వేశారు. 72 ఏళ్ళ వయస్సు ఉన్నవారికి అనారోగ్యం సహజం. దాన్ని ఇలా ఒక హాస్యాస్పద అంశంగా చేయడం ఎంతవరకు సమంజసం?
(Cartoon courtesy: Eenadu)

43 comments:

Pam said...

కాని 72 సంవత్సరాల వయోవ్రుద్ధుడి పాలనలో మన ప్రజాస్వామ్యం మరియు నాయకుల స్తాయి ఉండటం మన ప్రజలందరికి సిగ్గుచేటు గా చూసినపుదు ఈ కార్టూన్ అభ్యంతరకరంగా ఏంలేదు

Balu said...

ÊØÌsv

ప్రేమిక said...

nakem ala anipinchatledu...

Balu said...

శ్రీధర్ గారి కార్ట్టూన్ సందర్బొచితంగానే ఉంది కదా. ఫ్రస్తుత కాలానికి కావలిసింది అనుభవజ్ఞులే కాని వయో వ్రుద్దులుకాదు. తప్పనిసరిగా రాజకీయాలలొకూడ రిటైరెమెంట్ ఉండాలని నా అభిప్రాయం.

Anonymous said...

tappaa, vappaa anikaadugaanee 100% samrdhaneeyam maatram kaadu.

Rangacharyulu said...

కానీ ప్రజలు వ్యాధులతో బాధ పడినపుదు రోశ(ష)య్య గారు వేసిన సెటైర్లు భావ్యమా

vinod said...

meku general ga eenadu nachhadu so idi nachhaka povadam lo pedda vintha ledu...
naku ite just adi oka carton laga anipinchindi.....
meru laginattu logics lagithe sridar vese prati cartoon ni kindal cheyyochhu..
and migathavallani kindkindal cheyyochhu...

madhuramynakavitalu said...

ఇందులొ హస్యాస్పదం ఏముంది చెప్పండి శ్రీధర్ గారు రొశయ్య గారి ఆరోగ్యం బాగొలెదు ప్రస్తుతం వారు వైద్యుల పర్యవేక్షణలొ ఉన్నట్లుగా చుపించారు.
అంతే కదండి !!

నండూరి వెంకట సుబ్బారావు said...

నచ్చడం, నచ్చకపోవడం వ్యక్తిగతం. అది అభ్యంతరకరమా అంటే చెప్పలేం కానీ, శ్రీధర్ స్థాయిలో లేని మాట వాస్తవమే. వ్యక్తుల భౌతిక బలహీనతల మీద చెణుకులు వేసే స్థితికి ఆయన రావడం ఆశ్చర్యమే. కానీ "ప్రమాదో ధీమతామపి" కదా!

Alapati Ramesh Babu said...

yes it is objectble cartoon but i think so it is make up sick ness

Krishnarjun said...

i felt exactly the same this morning

prakash said...

Yes it is right.... Ramu sir.Ila vayasu meedha comment chese badhulu.edhina vupayogapade viashamlo vesunte chala bagundedhi endhukante athaniki chala mandhi fans vunnaru kabatti konchem prajalaku vupaoga padela governement ku chupiste baguntindi...

PRAKASH

Surya Tej Reddy said...

Konijeti Rosaiah - Born, 4 July 1933 (1933-07-04) (age 77

correct cheyandi saar..

bharath said...

రాము గారు,
మీరు చేస్తున్న క్రుషి అభినందనీయం,
మన సియం గారి వయసు మీరు అనుకుంటున్నట్లుగా 72 కాదు, ఆయన వయసు 77 సంవత్సరాలు.

Vinay Datta said...

I felt exactly the same when I opened the newspaper today. The first thing I read is the cartoon. Today, like never before, it disappointed, hurt and annoyed me.

gajula said...

indulo antha abyanthara vishayamu vundani nenanukovadamu ledu.puttinappudu nunchi chanipoyevaraku yevarikainaa anaarogyamu vundochhu.ikkada aa cartoon kevalam mukyamantri gaarikochhina viralfevernu prathibimbustundi,docterla paryaveshyana kuuda e cartoonlo chuudavachhu.sreedargaaru thana limitslone e cartoon vesaaru.

శరత్ చంద్ర said...

రామూ గారు, ఇది రోశయ్య గారి మీద కంటే వరుసగా అనారోగ్యానికి పాలవుతున్న ఒక వయోవృధ్ధఉని మీద ఆధారపడ్ద కాంగ్రెస్ పార్టీకి చురక అయ్యుంటుందని నా అభిప్రాయం. అయినా కూడా ఇది ఓ వయసులో ఉన్నాయనని హాస్యాస్పదం చెయ్యటమే. కార్టూన్ చురకలు అంటే అవి మన మీద వేసినా, చూసి నవ్వుకోగలగాలి, వీలయితే ఏదయినా నేర్చుకోగలగాలి. ఇది చూసి ఆయన బాధపట్టం తప్ప ఏమి చెయ్యలేరు కాబట్టి, ఇది అభ్యంతరకరం.

అమర్ (Amar) said...

It has nothing to do with his CMs age. If he is 72 years old and not healthy then he is not the right person to lead the state. As per me Sridhar depicted the current state of the CM and its not wrong in my view.

Try to think it this way..As Mr Rosaiah is not keeping well and he is not physically fit coz of his age, he is not addressing the affairs of the state effectively.
He missed the chance to meet PM and talk on various issues like Babli etc..these are the situations where in you can impress people and persuade them to do some favor for the state.

Rama Krishna said...

Hello Ramu,

Mr. Rosaiah is 77 years old.

He was born on 4 July 1933 (1933-07-04) (age 77).

Please check the reference here.

http://en.wikipedia.org/wiki/Konijeti_Rosaiah.

Regards,
Rama Krishna

Malakpet Rowdy said...

Somebody made a similar cartoon on AB Vajpayee a few years back when he was the PM.

When someone else took objection to it, guess what some other people from the Congress party said

"How can he lead the nation when he is not fit and constantly sick? There is nothing wrong with the cartoon"

Ramu S said...

సోదరా వినోద్,
నాకు జనరల్ గా 'ఈనాడు' నచ్చదని నేను మీకు చెప్పానా? ఎందుకు సార్ నాకు బ్రాండ్ వేస్తారు? మంచిని మంచిగా చెడును చెడుగా చూస్తున్నాను. పాత postulu chadavandi.
raamu

seenu said...

I agree with you, but have a look at some channels...Roshaiah rocking, dancing. what is there to feel...Are we protected with this cm? look those US peoples choice...they prefer healthiest president to rule... this is, really ridiculous system of central government...how can we accept this CM? He is not elected by us...standby means, some time... not years together. I appreciate Mr Shrider or Eenadu. Roshaiah must take rest...He needs it.

Anonymous said...

@ Sharat Saahiti
"చురకలు అంటే అవి మన మీద వేసినా, చూసి నవ్వుకోగలగాలి, వీలయితే ఏదయినా నేర్చుకోగలగాలి. ఇది చూసి ఆయన బాధపట్టం తప్ప ఏమి చెయ్యలేరు కాబట్టి, ఇది అభ్యంతరకరం" - Well said.
@ seenu
"He is not elected by us...standby means, some time... not years together" - సోదరా వై.ఎస్ గారైనా, చంద్ర బాబైనా కూడా ముఖ్యమంత్రిగా ప్రజలచే ఎన్నుకోబడలేదు, ం.ళ్.ఆ గా ఒక నియీజక వర్గం వారిచే మాత్రమే ఎన్నుకోబడ్డారు. కాంగ్రేసులో ఎవరెంత కష్టపడి పార్టీని గెలిపించినా అధిష్టానం చెప్పినవారే సి.ఎం అవుతారు. సో, రోషయ్యను స్టాండ్ బై అనకండి. ప్రత్యేక పరిస్తితులలో ఇంకా కొంత కాలం ఆయననే కొనసాగిస్తారేమో? కాకపోతే, వరుస అనారోగ్యాలతో, అంతా అధిష్టానమే చూసుకుంటుంది లాంటి తప్పించుకొనే మాటలతో కోనసాగటం తనకు అవసరమా అనేది ఆయనే ఆలోచించుకోవాలి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

yes.It is in bad taste.

srinivasrjy said...

kaartoonamtE manameeda vEsinaa manam navvukonelaa undaali..
mari ee kaartoon choosi rosayyagaaru navvuthaataa???

Anonymous said...

It is NOT 1) Obscene 2) doesn't hurt sentiments of any section in general 3) Satires are not crime under rule of the law

then why it should be objectionable?! Had earlier congress guys felt the same we would have seen RK Laxman like cartoonists in jails. It is baseless to object for such comments. Even under big lense I couldn't find anything of that sort.

సుజాత వేల్పూరి said...

ఇక్కడి చాలామందితో ఏకీభవిస్తున్నాను! నాకూ ఏమీ అభ్యంతరకరమగా తోచడం లేదండీ! ఇంతకంటే హాస్యాస్పద పరిస్థితుల్లో ప్రజలంతా బతుకుతున్నపుడూ ఈ కార్టూన్లో అభ్యంతర పెట్టాల్సింది ఏముంది? మనమే ఒక్కోసారి మనమీద మీద జోకులేసుకుంటాం!కార్టూనిస్టుకు అందరి మీదా జోకులేసే హక్కు ఉంటుంది కదా!:-))

అందులోనూ ఒక దినపత్రికలో చురకలంటిస్తూ కార్టూనులు వేసే కార్టూనిస్టుకి!


ఇంతకు ముందు శ్రీధర్ ఇలాంటివెన్నో వేశారు.ఆయనో కాదో గుర్తు లేదు కానీ వాజపేయి మోకాళ్ల నొప్పుల మీద కూడా వేశారు.

అసలు రోశయ్య అయినా ఈ కార్టూను చూసి నీరసంగా చిరునవ్వు నవ్వుకుంటారేమో

katta jayaprakash said...

Cartoonist Sridhar should have not cashed on the prsonal health of aged politician Rosiah.Viral fevers are very common in these days and no body is immune to it though only people with poor resistance and age factor are the victims and there is nothing comedy in it to laugh.
It may be recalled that during the flash floods in the state Rosiah had spent nights in the secretariat forgetting his age factor.Instead of showing sympathy to Rosiah cartoonist made his personal health affected by the seasaonal fever a laughing factor but tragically there is nothing to laught at it except a few who are not comfortable with Roasiah.
JP.

Sudhakar said...

మన రాష్ట్రానికి పట్టిన దుస్థితికి ఈ కార్టూన్ అద్దం పట్టింది. అసలు అంత అనారోగ్యం తో చేయలేని పోస్ట్ చెయ్యటం ఎందుకు ? ప్రజలని, పరిపాలన ని చెత్త చెత్త చేయటానికి కాకపోతే? పూర్వం ముసలి రాజులు ఇలానే యదవ పరిపాలనాలతో రాజ్యాలను భ్రష్టు పట్టించారు. ఒక విజన్ లేదు , ఒక లీడర్షిప్ క్వాలిటీ లేదు, ఒక డైనమిక్ బీహావియర్ లేదు, డిసిప్లిన్ అంత కంటే లేదు. ఇలాంటి సీఎం మనకు అక్కరలేదు...కాంగ్రెస్ కు మాత్రమే ఉపయోగం. ఒక ప్లేస్ హోల్డర్ లా .

kattashekarreddy said...

this is cynicism. this cannot be called journalism.

shekar

Unknown said...

No i dont think there is something objectionable. He is trying to convey the whole AP's Health status. Swine flu and other diseases are spreading....
I think in this context Mr sridhar is correct.
Jillanee

Amar said...

వందకు వంద శాతం సమర్థనీయం. సందర్భోచితం.

Krishna K said...

ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మాట్లాడితే డిల్లీ దిక్కు చూస్తూ దండాలు పెట్టే ఓ 77 ఏళ్ల వయసుమళ్లిన నాయకుడు కాని నాయకుడు మీద, రాష్ట్రమంతా జ్వరాలతో అల్లాడుతున్న సమయం లో తనూ మంచం పట్టి, ఎటువంటీ నాయకత్వం జ్వరాలు గురించి కాని, ఇంక దేని గురించి కాని చూపనోడి మీద సంధర్బోచితం గా వేసిన కార్టూన్ ఇది. It shows the current state.

ఇక కార్టూనులో రోశయ్య కాళ్లకు వేసిన షూస్ చూసారా? :))

Anonymous said...

But dis cartoon is indeed d fact...Our CM is falling ill often...! One thing's clear...our politics need young n dynamic ppl...old ppl lyk our CM definitely need to take rest...Not dat am humiliating him...but age n health conditions do matter when it comes to take a responsible job lyk CM...

Prashant said...

Cartoonist has to be satirical.Moreover it has no objectionable or degrading depiction of CM.The man is under supervision of doctors..that's what the cartoon reflects.However it is a fact that CM is old and fragile man who cannot really venture out of his secretariat because of his fragile age and health.Also,CM is a public figure and is bound to face criticism and satirism.

all telugu news said...

idi elanti abyantam ledu... roogandhra pradeshki mukhyamanthi pradhama rogi ani naa bhavana

ram gopal

all telugu news said...

వందకు వంద శాతం సమర్థనీయం. సందర్భోచితం.

Anonymous said...

ఇక్కడ చాలామంది మిత్రులు రోషయ్య అనగానే సి.ఎం పదవికి ఏమాత్రం సరిపోని వయసు మళ్ళిన ముదుసలిగానే పరిగణించడం బాధాకరం. పైగా సి.ఎం అనగానే వై.ఎస్ లాగానో, బాబు లాగానో లేక ఒకే ఒక్కడు సినిమాలో లాగానో ఉండాలనుకుంటున్నారేమోనని నా అనుమానం.
ఇక విషయానికి వస్తే ఎంతోమంది గత సి.ఎం లకు దిశానిర్దేశ్యం (ఆర్ధిక క్రమశిక్షణ లో) చేసిన అనుభవం ఆయన సొంతం. నిజంగా చెప్పాలంటే గత సి.ఎం పాలనలో రియల్ 'బూం' పుణ్యమా అని నాలుగు పైసలు ఖజాణాలో కనపడగానే ఎన్నెన్నో పదకాలు పెట్టుకుంటూపోయి, రోషయ్య మొత్తుకుంటూవచ్చినా వినిపించుకోకుండా ('బూం' కాస్తా 'ఢాం' అయ్యాక) ఖజానా ఖాళీ అయ్యింది. అదే రాజశేఖరుల వారు ఇప్పుడు ఉండియున్నా ఇంతకంటే పైసా పైసా లెఖ్ఖ చూసుకొని ఖర్చ్చు పెట్టాల్సిన పరిస్తితి యుండేది. ఆయన మొట్టమొదటి వీడియో కాన్‌ఫరెన్స్ లోనే నేను(ఓ ప్రభుత్వాధికారిగా) గమనించాను.
రోషయ్యగారిలో పిసినారి తనం అనో, పధకాలకు తూట్లు పొడుస్తున్నారనో అనే వారంతా వై.ఎస్ ఉండగానే భోగస్ రేషన్ కార్డుల ఏరివేత, ఇందిరమ్మ లబ్ధిదారుల కుదింపు, జలయఙం కు నిధుల కుదింపు మొదలయ్యాయని గుర్తించాలి.
వయసు మీదపడటం వల్ల/వైరల్ ఫీవర్ రావడం వల్ల (ఇంకా చెప్పాలంటే వైరల్ ఫీవర్ వస్తే 35 యేళ్ళు ఉన్న నేను కూడా ముసలివారంత వీక్ అయిపోయా) బుర్ర పనిచేయకుండా ఏమీ పోదు. సి.ఎం అంటే రోడ్లపై పరుగులు పెడుతూ పని చేయించడమేమీ కాదుగా? నాకు తెలిసి ఆయన పాలనా వ్యవహారాలు గాలికొదిలి రెస్ట్ తీసుకోలేదు. బెడ్ పై యుండికూడా అన్నీ చూసుకున్నారు. ఒక మిత్రుడు వ్రాసినట్లు పోయిన యేడు వరదలప్పుడు ఆయన సమర్ధత మనకు తెలియలేదా?

Big Data Enthusiast said...

ఈ కార్టూన్ రోశయ్య గారి మీద వేశారని నేను అనుకోవడం లేదు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిస్థితి అని మాత్రమే అని నా అభిప్రాయం. This is just personification of a character.

వయసు మళ్ళిన వ్యక్తి personal life లోకి ఎవరు వెళ్ళినా అభ్యంతరకరమే, కానీ, ఎవరికో వయసు మళ్ళడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఐతే, ఖచ్చితంగా ఇది సమర్ధనీయమే.

Anyhow, I didnt expect such a silly cartoon from the great cartoonist Sridhar gaaru. వారికుండే pressures వారికి వుంటాయి ;)

జయహో రామోజీ

kiran said...

ఏమిటో మీకు ప్రతి దానిలో అభ్యంతరం కనిపిస్తున్నాయి .
మొన్న టీచర్స్ డే లో తప్పులు కనిపించాయి నేడు రోశయ్య cartoon lo.
we should see them as cartoons not as news headlines.

sudhakar reddy said...

Rosayya is unfit for cm post ee cartoon bane vundi..meeru rosayya fan?...

chakri said...

కాటికి కాళ్ళు చాచిన ముసలాళ్ళు పరిపాలించడం మన దౌర్భాగ్యం.
రాజకీయాలకు retirement లేకపోతే దేశమేగతి బాగుపడునోయ్ ??

Anonymous said...

@sudhakar reddy & chakri
C.M పోస్ట్ సమర్ధతకు కొలమాణం ఏమిటి? చరిష్మా/ కరిష్మానా? లేక ప్రజలకు నాలుగు కాలాల తరువాత కూడా పనికొచ్చేవిధంగా నిబద్ధతతో కూడిన పరిపాలన అందించడమా?
కరిష్మాతో ప్రజలను మెస్మరైజ్ చేసి (కొందరు చేసే పద ప్రయోగం 'కుక్కకు ఓ బొక్కేసి తనమానాన తను దోపిడీ చేసే గజ దొంగ తరహా' నేను వాడలేను - అలా అంటే మనలను మనమే కుక్కలు అనుకున్నట్లు అవుతుంది) పనికిరాని ఎన్నో పధకాల పేరుతో దోపిడీ కొనసాగించిన ఎందరో మహా నేతలకన్నా ఆర్ధికంగా కుదేలైన స్థితిలో ఉన్న మన పరిస్తితిని కుదుతపరచడానికి నిబద్ధతతో కృషి చేస్తున్న రోషయ్యే మంచి ముఖ్యమంత్రి అవుతారు. కాకపోతే ఖజానా ఖాళీగా వున్న ప్రస్తుత పరిస్తితిలో (పోయిన ఆయన వున్నా ఇదేపరిస్తితి వుండేది అనేది చేదు నిజం) ఆయన చేస్తున్న వైద్యం మనకు చేదు గుళికలాగానే అనిపిస్తుంది. కానీ, రోగికి చేదనిపించినా రోగం తగ్గాలంటే అది మింగక తప్పదుకదా?
మీరేమనుకోకుంటే ఒక మనవి. మనలాంటి వాళ్ళం కూడా సామాన్యులలా ఆలోచించడం మానుకోనంతకాలం నిజాలను గ్రహించలేం.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి