Friday, February 4, 2011

సమస్యల మీద సమస్యలు...ఇదేంట్రా నాయనోయ్....

సమస్యలు అన్నీ ఒక్కసారిగా మూట కట్టుకుని వచ్చిపడతాయి... కుంగ తీస్తాయి. ఒక్కటంటే ఒక్కటీ వర్కవుట్ కాదు. తాడును పట్టుకుంటే పామై కూర్చుంటుంది. గత రెండు రోజులుగా నేను పరిస్థితినే ఎదుర్కుంటూ...నన్ను నేనుపరీక్షించుకుంటున్నాను. ఒక పక్క పరిశోధన, మరోపక్క టీచింగ్, కొత్త కోర్సుల రూపకల్పన, అనారోగ్యం....ఇల్లుమారాలనే ఆలోచన...ఓనర్లతో చీకాకులు. సమస్యల మధ్య ఆటవిడుపుగా ఉంటుందని పోస్టు రాస్తున్నాను. సమస్యల క్రమం ఇలా ఉంది.

ఇల్లు మారడం: మనకున్న జాగాలో ఇల్లు కట్టుకునే దాకా ఇల్లు మారకూడదనుకుని హైదరాబాద్ వచ్చిన కొత్తల్లోఅనుకున్నా. కానీ...ఇల్లు ఆధునీకరిస్తానని ప్రస్తుత ఓనర్ చెప్పడంతో ఐదు నెలల నుంచి వెతుకుతున్నా. ఒక ఇల్లు పక్కకాలనీలోనే దొరికింది. అక్కడ అడ్వాన్స్ ఇచ్చే ముందు...ప్రస్తుత ఓనర్ గారికి విధిగా తెలియజేశాను. 'సర్..మీరు ఆధునికీకరిన్చుకుంటా అంటే...నేను వుండడం బాగోలేదు. ఇప్పుడు ఒక ఇల్లు దొరికింది...మీకు చెప్పి అడ్వాన్స్ ఇద్దామనివచ్చాను' అని ఒక పదిహేను రోజుల కిందట చెప్పాను. సరే...అన్న పెద్దమినిషి... తీరా ఖాళీ చేద్దామని తట్టాబుట్టాసర్దుకునే సమయానికి....'రెండు నెలల ముందు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి నీకు రావలసిన అడ్వాన్స్ రాదు' అని చెప్పాడు.

ఇది ఒక బుర్ర తిరిగే వ్యవహారం. మరొకటి ...కొత్త ఓనర్ తో. ఆయన కథనం ప్రకారం...హైదరాబాద్ లో ఆయనకు ఒక ఎనభై ఇళ్ళు ఉన్నాయి. అద్దెల మీద బాగా సంపాదిస్తున్నాడు. చేరబోయే ఇంట్లో వంటింట్లో డెస్కుల చానెల్స్ తుప్పు పట్టి....లాగితే రావడం లేదన్న విషయాన్ని ఆయన దృష్టికితెస్తే..."వచ్చే మూడేళ్ళు వుండేది నువ్వు కాబట్టి...సొంత ఖర్చుతో మార్చుకో.." అన్నాడు. ఆ బిల్లు నేను భరించేది లేదంటే..."అయితే..నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో" అని ఒక హోటల్ లో పూరీ తింటూ అంటే...నాకు కాలిపోయింది. చివరకు తొంభై శాతం ఆయన, పది శాతం నేను భరించేలా ఒప్పందం కుదిరాక....'వెళ్లి ఎగ్రిమెంట్ కోసం స్టాంప్ పేపర్ తే..' అని సెలవిచ్చాడు. నేను బ్యాంక్ చెక్ ఇచ్చి...సరే అని హడావుడిగా పాఠం చెబుదామని వస్తుంటే....'మీ బాబు హెల్త్ బాగోలేదు..' వచ్చి తీసుకువెళ్ళండి అని స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. వెడితే...వాడికి జ్వరం, వాంతులు. పులి మీద పుట్రలా మీద పడి విసిగించిన మరి కొన్ని అంశాలు ఈ క్రమంలో లేకపోలేదు.

వెర్రి ఎక్కించిన బ్లాగు: ఈ వివాదాలు ఇలా వుండగా...నిన్న రాత్రి ఎవడో పంపిన లింక్ ఓపెన్ చేసి అవాక్కయ్యాను. వాడెవడో నా మీద, బ్లాగు మీద విషం కక్కుతూ...పచ్చి అబద్ధాలతో ఒక పోస్ట్ పెట్టాడు. నేను సాధారణంగా విమర్శలను ఆహ్వానిస్తా కానీ....వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేసిన వాడిని వదల దలుచుకోలేదు. నేను ఏ అంశం మీదనైనా ఐదు నిమిషాలైనా మాట్లాడలేనని అంటే పరవాలేదులే అనుకున్నా. పలు అభియోగాలు చేస్తూ....బూతులు బాగా మాట్లాడతానని వాడు ఇష్టం వచ్చినట్లు రాసాడు. ఇది నాకు చాలా బాధకలిగించింది. 'థిస్ ఈస్ అన్ ఫెయిర్" అని మెయిల్ ఇస్తే వాడు స్పందించలేదు. అందుకే....వాడిని అమ్మనా బూతులు తిట్టడం మొదలెట్టా. ఆ పనిని సమర్ధంగా చేయగల అబ్రకదబ్రకు పూర్తి అధికారాలు అప్పగించా. మనవాడు రెచ్చిపోతున్నాడు. దయచేసి కామెంట్స్ చదవవద్దని సభ్య సమాజానికి విజ్ఞప్తి. దూర ప్రాంతంలో ఉన్నా కదా అని ఇష్టమొచ్చినట్లు చెలరేగే దొంగ నాయాళ్ళకు చిత్ర హింస ఎలా వుంటుందో చూపించే ప్రయత్నమే తప్ప ఇది మరొకటి కాదు. బూతులలో వ్యుత్పత్తిని చూసి మహిళలను కించపరుస్తున్నారని అనుకోవద్దని విన్నపం. ఆ భాష వాడడం దారుణమని...తెలిసినా నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వున్నాను. ఆ దారుణాన్ని స్పేర్ చేసే స్థితిలో ఇప్పుడు నేను లేను. హేమ, వేణు లాంటి వాళ్ళు 'నువ్వు ఆ తప్పు చేయవద్దు...' అని హితోక్తులు చెప్పారు. అయినా...ఈ బూతు పర్వాన్ని ఇంకొన్ని రోజులు సాగించే బాధ్యతను అబ్రకదబ్రక (మన ఆల్టర్ ఈగో) గాడికి అప్పగించాను.

మధ్యలో వచ్చి చరసాల ప్రవీణ్ శర్మ కూడా నన్ను విసిగించాడు. నన్ను దుర్మార్గుడిగా చూపే ప్రయత్నం చేసాడు. ఆయనకు నా శీలం మీద ముందు నుంచే అనుమానం ఉందని ఒక చెత్త ఉదాహరణ ఇచ్చాడు. ఆయనకు...మెయిల్ చేశా, ఫోన్ లో మాట్లాడా. ఫోన్ మధ్యలో...'నేను కంప్యూటర్ స్పెషలిస్టును....రికార్డ్ చేస్తున్నా...' అంటున్నాడు. నా గురించి రాసిన వాడిని నేను తిడితే.... "నన్ను తిట్టావ్" అని అంటాడు ఈ మనిషి.
మనలను విలన్ చేసిన వాడు అమెరికాలో ఒక చోట నుంచి పోస్ట్ చేస్తున్నాడని ఒక మిత్రుడు చెప్పాడు. వాడి కత తెల్చేపని కొందరికి అప్పగించాను. పేరు పెట్టుకోకుండా...రాసే వెధవల గురించి ఇంతగా స్పందించడం ఎందుకని మిత్రమండలి చెబుతున్నది కానీ....వాడి కాలో చెయ్యో విరిచే ఏర్పాటు చేయడం మంచిదని నాకుంది. అయ్యా...చరసాల శర్మ గారూ...సంభాషణను బట్టి చూస్తే...మీరు నన్ను అపార్థం చేసుకున్నట్లు ఉంది. నేను బండబూతులు తిట్టింది వాడిని, మిమ్మల్ని కాదు. మీరు నా మీద పిచ్చి కామెంట్స్ పెడితే మాత్రం మిమ్మల్నీ అంతకన్నా ఘోరంగా తిడతాననీ, చట్టపరంగా చర్య తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా...ఎవరైనా...నా చేతలు, రాతల పట్ల అభ్యంతరాలు వుంటే....ఎత్తిచూపే హక్కు మీకు ఉంది. అలాగని నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే...సహించాను. ఐ.పీ.అడ్రసులు, ఇంటి అడ్రసులు కనుక్కోవడం కష్టం కాదు, కసి తీర్చుకోవడానికి చాలా మార్గాలు వున్నాయి. మనకు ఆ గొడవ వద్దు. ప్రజాస్వామ్యయుతంగా బతుకుదాం. ఎవడి గోల వాడు రాసుకోక...వ్యక్తిగత దాడులు మనకు వద్దు.

ఇదిలావుండగా...ఒక మహిళా బ్లాగరు 'రాముతో కన్వర్సేషన్ ' అని ఒక పోస్టు పెట్టారు. అది చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అదొక గమ్మత్తైన గొడవ. తనకు రావలసిన అవార్డు...నేను ఎత్తుకుపోయానని ఆమె నన్ను తప్పు పడుతున్నారు. అదొక అవార్డు! దాని మీద వివాదం!!
తన మెయిల్ కు స్పందిస్తూ నేను పంపిన జవాబులను ఆమె నా అనుమతి లేకుండా...పోస్ట్ చేసారు. అది నాకు నచ్చలేదు. ఆమెకు నేను మెయిల్ పంపి చాలా సేపు అయినా...స్పందించలేదు కాబట్టి...మాత్రు సమానురాలైన ఆమెకు నేను పంపిన లేఖను దిగువ ఇస్తున్నాను...మీ కోసం.

గౌరవనీయులు, తల్లి సమానురాలైన -----...
నమస్కారం.
మీకు నాకు మధ్య జరిగిన సంభాషణను మీరు పోస్టు చేసారని తెలిసి చూశాను. మీరు చేసిన పని నాకు అభ్యంతరకరంగా ఉంది. నేను మిమ్మల్ని వేధిస్తేనో, మీకు అసభ్యపు మెయిల్స్ పంపితెనో, ఇతరత్రా ఇబ్బంది పెడితేనో మీరు అది పోస్ట్ చేయవచ్చు కానీ...సాధారణ సంభాషణను ఇలా బహిరంగ పరచడం (నాకు తెలియజేయకుండా) బాగో లేదు.
మీరు ఏ కాంటెక్స్ట్ లో అది పోస్టు చేసారో కూడా నాకు తెలియలేదు.
మీకు అవార్డు కమిటీ నిర్ణయం పట్ల అభ్యంతరం ఉంటే...వారికి నేరుగా మీ నిరసనను తెలియజేయండి. అంతేకాని నన్ను ఇందులోకి లాగడం బాగోలేదు. అవార్డు పట్ల నాకున్న అభిప్రాయాన్ని నేను ఒక పోస్టులో తెలియజేశాను.
మీరు నాకు అడ్రస్ తెలియజేస్తే....ఆ అవార్డు మీకు పంపిస్తాను. మీకు అది అవసరం లేకపోతే....ఆ పక్కన వున్న మురికి కాలవలో పడెయ్యండి. దయచేసి నాకు అడ్రస్ పంపండి. నన్ను బద్నాం చేయాలని ప్రయతిస్తే మాత్రం బాగుండదు. నా అనుమతి లేకుండా మెయిల్స్ బహిరంగ పరచడం సంస్కారం కాదు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను....
నమస్కారాలతో
రాము

25 comments:

Pam said...

http://apmedia.blogspot.com/ this voice silenced somehow. Because of the objective analysis on the media and bring out issues i searched similar blogs on blogs and came here first. Later I am disappointed with the bias, shortsightedness, subjectivity etc. I posted my comments pointing out my criticism which u published but not agreed and followed. I tried to search the content to understand u r grievance and find out and finally it lead to find out ur REAL SELF not the FORMER HINDU JOURNALIST, EENADU JOURNALIST. Henceforth I will not visit ur blog and declare that I will not believe any more that all the bloggers real self and created self is not the same. Thank you - Shiva

Ramu S said...

You are 75 percent true. Sorry for disappointing you. If you are anonymous, you can do lot of adventures, but not as an open blogger. Let me give some time to go back to normalcy.
Cheers
Ramu

katta jayaprakash said...

Ramu garu,
Very sorry for the state of your personal affairs and headache from bloggers.Donot get dishertened as tey are just passing clouds and every cloud never rains.So be bold and face with bravery and leaving rest to Almighty if you believe.
Please practice praanayam.Good luck to face any adverse situation.

JP.

Vinay Datta said...

I empathize with you. Iam sure all sincere bloggers and readers are with you.

How is Snehith? Pls post about him once he recovers.

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి said...

రాము సార్ ఇలా బ్లాగ్ లలో చెత్త కామెంట్స్ పెట్టడమే కాకా అసభ్యి పదజాలం ఉపయోగించే మనస్సులను పాడు చేసే కొందరిపై యుద్దం చేయాల్సిన సమయం వచ్చింది...ఏక్కడోఉన్నాం మనల్నీ ఏమీచేయలేరని ఓ పిచ్చిబ్రమలో ఉన్నారు మహీళా బ్లాగర్ లా ....( మగ బ్లాగర్లు )వస్తున్నవారు ఉన్నారు..అందుకే సైబర్ క్రైం పోలీసుల సహాయంతో ఓ వెబ్సైట్ క్రియేట్ ఛేసి డిజైన్ సైబర్ క్రైం.ఐటి యాక్టు లగురించి వివరిస్తూ..అవి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి..మిమ్మల్ని ఇంటర్నెట్ లలో ఇబ్బంది పెట్టేవారి పై ఎలాంటి చర్యిలు తీసుకోవాలి అనే దాని పై అవగాహన మేము దగ్గరుండి వారికి సహాయపడతాం..దీనికి కంప్యూటర్ ఎరా ఎడిటర్ శ్రీదర్ గారు అన్నివిదాలుగా సహకరిస్తున్నారు..ఇప్పటికేప్రయత్నం మొదలు పెట్టాను..http://cybercrimehelp.com/ క్రియేట్ చేసి సైబర్ క్రైం అడిషినల్ ఎస్పి గారి సహకారంతో ఈ పనులు చేస్తున్నాం..రాముగారు మాకు మీ లాంటి మీడియాలోని పెద్దల సహకారంకావాలి ఒక్క బ్లాగర్ల్ విషయమేకాదు..అన్ని సైబర్ క్రైంల పై ముద్దం మోదలు పెట్టాం ..రాము సార్ కొంతమంది ఫెస్ బుక్ ఆర్కూట్ లనుంచి ఫోటోలను దొంగలించి అసభ్యికరమైన కామెంట్స్ తో కొన్నివెబ్సైట్ లు వచ్చాయి ..మీడియాలోని వ్యక్తులుగా మీ సహకారంతో ఇలాంటి వారి పనిపట్టేందుకు ముందుకు వెలుతున్నాం

Anonymous said...

ఆర్యా ! ఈ గొడవేంటో నాకు తెలియదు. కానీ చరసాల అనే పేరుతో గత ఆఱేళ్ళుగా బ్లాగ్‌లోకంలో ఒక్కఱే ఉన్నారు. ఆయన అమెరికాలోనే ఉంటారు. నాకు తెలిసి చరసాలశర్మ పేరుతో మాత్రం ఎవఱూ లేరు. అనవసరంగా చరసాల ప్రసాద్ గారి మీదికి నిందలొస్తాయేమోనని నేనిది వ్రాస్తున్నాను. సీనియర్ బ్లాగరైన శ్రీ చరసాల ప్రసాద్ గారికీ నాకూ కొన్ని విషయాల మీద వేఱువేఱు అభిప్రాయాలున్నాయి. కానీ ఆయన ఇలా చిల్లఱ మల్లఱ, మిస్టర్ హైడ్ పనులు చేసే వ్యక్తి కాదు. బహుశా ఈ చరసాల శర్మ అనే పేరు ఒక కల్పితనామం అయ్యుండాలి. ఎందుకంటే చరసాల అనే ఇంటిపేరున్న "శర్మ"లెవ్వఱూ మీకు ప్రపంచంలో దొఱకరు. ఈ మాఱుపేరు పెట్టుకుని వ్రాస్తున్నవారెవఱో గానీ బహు పిఱికిపందలు.

ఈ సందర్భంగా నేనొక విషయం మనవి చేయాలి. ఈ రోజుల్లో IP చిరునామా ద్వారా కూడా అపరాధుల్ని జాడపట్టడం కష్టం. ఎందుకంటే ప్రాక్సీ సాఫ్టువేరుల్ని ఉపయోగించి ఒక విదేశీ IP చిరునామా నుంచి పంపుతున్నట్లుగా నమోదు చేస్తూ తమ ఇంటి నుంచే సందేశాలు పంపడానికి ఈ రోజుల్లో పూర్తి అవకాశం ఉంది. మనం అరటిపళ్ళు తిని ఆ తొక్కలు పక్కింట్లో వేయడం లాంటిదిది. కనుక మీకు లభించిన IP చిరునామాలు కూడా సత్యమని నమ్మొద్దు.

Anonymous said...

^ @innareddy
కింది పద్య రత్నాలని ఓ సారి స్మరణకి తెచ్చుకుని
నేను ఈ మాటలు మీకెందుకని వ్రాస్తున్నానో (!?)
కాస్సేపు ఆలోచించే ప్రయత్నం చేయండి :)

* ... తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా ...
* ... ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా ...ధన్యవాదములు

Anonymous said...

@ Ramu S
"...కాలో చెయ్యో విరిచే ఏర్పాటు చేయడం మంచిదని నాకుంది"
దయచేసి అలాంటి పొరపాటు పనులని ఎప్పుడూ చేయవద్దని మనవి.
అలాంటి పిచ్చి ఆలోచనలని మీరు నియంత్రించుకోగలరు.

ఇక శ్రీLBS అన్నట్లుగా చరసాల శర్మ లేక చెరసాల శర్మ అనేది
సరైన పేరూ కాదు. అతని పేరు ప్రవీణ్ శర్మ.

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి said...

కదా ఓసారి గురిగింజ సామెతకూడా గుర్తుకు తెచ్చుకో manavaani ..గురిగింజ తనకింద మచ్చని చూసుకోకుండా అందరి మచ్చలనూ చూపి హేలన చేయాలని చూస్తుందట అలాంటి వాళ్ళు బ్లాగర్లలో చాలా మందివున్నారు మీడియాలోని మాకు ఒకరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు నోరుపారేసుకూటే మీకే నష్టం

Malakpet Rowdy said...

Tadepalli garu

Its not Charasala PRasad .. "CHERASALA SARMA" is our beloved MARTANDA :)

He wrote a story called Cherasala and he is fond of the tag Sarma and hence Cherasala Sarma


Innareddy garu,

Cool. Thats a good effort. But do recognize that plagiarizing the literary stuff is a crime as well.

Anonymous said...

"మీడియాలోని మాకు ఒకరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు నోరుపారేసుకూటే మీకే నష్టం"
_________________________________

hmm..,
మీడియాలోని వారు సర్వజ్ఞులా
లేక ఏమి చేసినా చెల్లుతుందా !!

ఈరోజు కాకున్నా మరో రోజైనా మీ మీడియావారి తప్పులూ బయటపడతాయి సుమా... ఇక
ఇక్కడ వాదోపవాదాలు అనవసరం. Thanks
for the earlier kind response

Malakpet Rowdy said...

నోరుపారేసుకూటే మీకే నష్టం
_______________________

చేసిన పని కాకుండా ఇక్కడ నోరుపారేసుకుంటోంది ఎవరో తెలుస్తూనే ఉంది అందరికీ. Whom are you trying to threaten? - go ahead. Do you know what the law of the land in the US says about filing false cases against those women?

Malakpet Rowdy said...

Innareddy, lemme ask you this:

Do you agree that what you are doing in your blog is illegal? YES/NO

If not, whats your defense? Why are you talking about everything on the planet except that?

Also whats your response to the allegations about harassing the women on the net for pointing out a wrong thing?

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి said...

ok Than k you malakpet Friend

Mass said...

Ramu garu,

I hope everything will be fine in coming days. just ee fewdays koncham oppika gaa sahanam tho undandi.

vin vin properties said...

Ramu garu, why dont you disable comments on your blog spot ?? it makes life happier for you and for some of us.

Saahitya Abhimaani said...

ఏమిటి రామూ గారూ. మీరు నిగ్రహం కోల్పోయి అలా వ్యాఖ్యలు చెయ్యటం??!!చాలా బాధగా ఉన్నది.

Ramu S said...

shiva garu,
Though I lost my sense while making such vulgar comments, It has helped me to some extent. The smoke forced the snake in the hole to come out partially. Wait and watch.
Sorry for causing pain to people like you. I am really sorry to the womenfolk who may find objection to that filthy language.
Ramu

Ramu S said...

Mr.Inna Reddy,
I am coming to Zee-TV office today as I have some work in Sports desk. I'll give you a call before coming. I want to see the story your channel made on the kiladi blogger.
Ramu

Saahitya Abhimaani said...

".....మీడియాలోని మాకు ఒకరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు....."

పైన ఇవ్వబడి న ఆ "విలువైన" అభిప్రాయంతో మీరు ఎంతవరకూ ఏకీభవిస్తారు! మీదీ అదే అభిప్రాయమైతే, ఇక ఆంధ్ర ప్రదేశ్ మీడియా కబుర్లు బ్లాగ్ మూసేయ్యచ్చు.

ఏమంటారు రామూజీ.

Ramu S said...

I don't agree with it. I'll talk to him about this today.
Despite that I am planning to close the shop soon. I don't want to strain people like you, sir.
Ramu

Saahitya Abhimaani said...

రామూజీ,

మీరు అటువంటి అభిప్రాయాలతో ఏకీభవించరని నాకు తెలుసు మాష్టారూ. కాని అలాంటి అభిప్రాయాన్ని మీరు ఖండించకుండా ఎలా ఉన్నారా అని ఆశ్చర్యపోయి అడిగాను అంతకంటే ఏమీలేదు. మీరు షాపు మూసెయ్యటం దేనికి??!! నిబ్బరంగా కొనసాగించండి. కొంత ఓర్పు, సంయమనం, నిగ్రహం అలవరుచుకోవాలి.

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి said...

siva garu meelati vallan Nenu analeedu Meeru feel ayitye i am very sorry..neenu ala anataniki karanam vunhdi twarao anni vivaristaanu sir

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి said...

నా కామెంట్స్ వల్ల ఎవ్వరైనా ఫీల్ అయితే I am very Sorry భట్ నేను ఇలా అనటానికి కారనం వుంది త్వరలో సాక్ష్యాదారాలతొ వివరిస్తా...

KumarN said...

శివ గారూ, సూటిగా అడగాల్సిన ప్రశ్న అడిగిన మీరూ, అంతే నేరుగా నిర్ధ్వందంగా ఆ వ్యాఖ్య నాకు అంగీకారం కాదు అని చెప్పిన రాము గారు అభినందనీయులు.

అభినందనలు.

ఇన్నారెడ్డి గారూ,
మీరు చివర్లో చెప్పిన సారీ, కేవలం శివ గారికి కాకుండా, మీరు చేసిన ఆ వ్యాఖ్య గురించి అయితే, మీకూ నా అభినందనలు. ఒక్కోసారి చిన్న సారీ, మనల్ని చాలా దూరం తీసుకెళ్తుంది ఇన్నారెడ్డి గారూ. మీరు పనుల హడావిడిలో ఉండి కవితలకి క్రెడిట్ ఇవ్వలేకపోయాను, సారీ అనే ఒక ముక్క ఎక్స్ప్లనేటరీ టోన్ లో కాకుండా, నన్నే ప్రశ్నిస్తారా, కేసేస్తా అన్న ధిక్కారం లో చెప్పేసరికి, మీ మీద నెగెటివ్ అభిప్రాయం ఇంకా ధృడపడడానికి ఆస్కారం ఇచ్చింది. అంతే తప్ప ఇక్కడ ఎవ్వరూ మీ మీద యుద్దం ప్రకటించేవాళ్ళు లేరు.

పోతే కెలుకుడు గాళ్ళంటారా నా ఉచిత సలహా ఏంటంటే, వాళ్ళు ఓ పరిధి దాటనంతవరకీ, Ignore and move forward with what you are, and regular people like me will always follow you.KumarN

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి