Saturday, February 26, 2011

రాంగోపాల్ వర్మపై TV-9 తీరు అభ్యంతరకరం

ప్రేక్షకులు దేవుళ్ళని అన్న ఎన్టీర్ అనుకుంటే...ప్రేక్షకులు వెర్రి వెధవలు, దద్దమ్మలు, చవటలని రాంగోపాల్ వర్మ భావిస్తున్నారన్న ఓపెనింగ్ వ్యాఖ్యలతో చెత్త కథనాన్ని బుధవారం ప్రసారం చేసిన TV-9 ఆ దర్శకుడిని స్టూడియోలో మరింతగా అవమానించింది శుక్రవారం. దర్శకుడిగా కాకపోయినా...ఒక వ్యక్తిగా అయినా వర్మకు విలువ ఇవ్వకుండా...నోటికొచ్చిన ప్రశ్నలు అడిగి యాంకర్ రజనీకాంత్ ఆయనను అవమానించారు. ఇదొక వైపరీత్యం, అన్యాయం, ఆటవిక జర్నలిజం. 

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు...పైత్యం ముదిరి రాంగోపాల్ వర్మ అయ్యారనీ, వర్మ తీసిన సినిమా చూడడం ఏ జన్మలోనో చేసుకున్న పాపమనీ, వర్మకు ఇప్పుడు వాయిస్ ఓవర్ల పిచ్చి పట్టిందని, ఆయన డ్రాం గోపాల్ వర్మ అనీ ....విపరీత వ్యాఖ్యలు చేసిన ఆ చానెల్ పిలిస్తే...స్టూడియోకి వెళ్లి రెండు గంటల పాటు చెత్త ప్రశ్నలు ఎదుర్కోవడం వర్మ చేసిన పెద్ద తప్పు. కామ్ గా కేసువేసి మంచి లాయర్ను పెట్టుకోక...వర్మ ఆ స్టూడియోకి వెళ్ళారు. హద్దులు మీరి అతితెలివి ప్రశ్నలు వేయబోయిన రజనీకాంత్ ను ఆడుకొని రాంగోపాల్ వర్మ ప్రేక్షకులకు కనువిందు కలిగించడం బాగుంది కానీ...టీ.ఆర్.పీ.రేటింగ్ కోసం TV-9 ఇలా వివాదం సృష్టించి చీప్ ట్రిక్స్ కు పాల్పడడం బాగోలేదు. ఇది జర్నలిజం ఏ మాత్రం కాదు. తన తీరును అటు రవి, ఇటు రజని పునఃసమీక్షించుకోవాలి.    

ఏ దర్శకుడి కెరీర్లోనైనా...ఏ మనిషి జీవితంలోనైనా ఎగుడు దిగుళ్ళు సాధారణమే. వరస ఫ్లాప్స్ అనేది ఒక మహా పాపమయినట్లు, ఒక నెగిటివ్ స్టొరీ ప్రసారం చేసి సుద్దులు చెబితే...ఆయన ఆస్కార్ కొట్టేంత ఎదిగిపోతారనట్లు బిల్డప్ ఇవ్వడం బుల్లి తెర వీక్షకులను వెర్రి వెధవలను, దద్దమ్మలను, చవటలను చేసే ఒక విన్యాసం మాత్రమే!

17 comments:

BHASKARA PRASAD BHUVANAGIRI said...

TV-9 has crossed all ethical limits. Ramu should have responded to their call on the very issue. Ramu is very talented and has given excellent films too.
He need not prove himself in mid of his career. Ramu...........All the Best. Leave the Rest!

వేణు said...

ఈ ప్రోగ్రాంని మొదట్నుంచీ చివరిదాకా కాకపోయినా చాలాసేపు చూశాను రాత్రి! ‘స్టూడియోకి వెళ్లి రెండు గంటల పాటు చెత్త ప్రశ్నలు ఎదుర్కోవడం వర్మ చేసిన పెద్ద తప్పు’ అని మీరున్నారు గానీ నాకలా ఏ మాత్రం అనిపించలేదు.

ప్రశ్నలన్నిటినీ వర్మ చాలా సమర్థంగా ఎదుర్కొన్నారు. వర్మ అడిగిన సూటి ప్రశ్నలకు చానల్ నుంచి గానీ, క్రిటిక్స్ దగ్గర్నుంచి గానీ సరైన సమాధానమే లేదు. ఆ రకంగా చానల్ తీరును ఆయన అద్భుతంగా ఉతికి ఆరేసినట్టనిపించింది.

ఇంతా చేసి, చానెల్ తరపున యాంకర్ రజనీకాంత్ వర్మకు శుభాకాంక్షలు చెపుతూ చేసిన ముక్తాయింపు హాస్యాస్పదంగా తయారైంది. తన దృక్కోణంపై స్థిరంగా నిలిచి గెలిచిన వర్మకు హ్యాట్సాఫ్!

Saahitya Abhimaani said...

".....ఇది జర్నలిజం ఏ మాత్రం కాదు...."

అసలు జర్నలిజం అంటూ ఏమన్నా ఉన్నదా మనకి?? ఎప్పుడు ఏ బ్రేకింగ్ న్యూస్ ఇద్దామా, ఏ ఇద్దరి మధ్య ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి చెప్పి పుల్లలు వేసి లేనిపోని రాజకీయ అల్లర్లు చేద్దామా, లేదా విడాకులు తీసుకుందామనుకున్న ప్రముఖుల కూతుళ్ళను/కొడుకులను ఆన్ లైన్లో మాట్లాడిద్దామా అని ఆవటించిపోతున్నాయి ఈ న్యూస్ చానెళ్ళు అన్నీ. ఇవన్నీ జర్నలిజమైనప్పుడు , టీవీ 9 చేసినది జర్నలిజం ఎందుకు కాదు?

ఎప్పుడైతే అంత్యప్రాసల పతాక శీర్షికల వంటి చౌకబారు ఎత్తులతో ప్రజలను ఆకట్టుకుని, ఒక దిన పత్రిక దుందుడుకుగా రంగం మీదకి వచ్చి, పత్రికను ఒక వ్యాపార సంస్థ లాగ నడపటం మొదలు పెట్టి, అప్పటిదాకా సంసారపక్షంగా ఉన్న పత్రికలను పక్కకు తోసిపారేసిందో ఆరోజునే జర్నలిజం అనేది భూస్థాపితం అయ్యింది. ఆపైన "బాకా" పత్రికలొకటి తయారయ్యాయి. పార్టీలకు బాకా పట్టే పత్రికలూ, వ్యక్తులకు బాకా పట్టే పత్రికలు, కార్పోరేట్ సంస్థలకు బాకా పట్టే పత్రికలూ, ఇలా అనేక రకరకాల బాకాలే ఈరోజున కాని పత్రికలేవి? ప్రెస్ కౌన్సిల్ వారు 'బాకా' పత్రికలను నియమత్రించలేరా? ఇదిగో ఇలాంటి ఇలాంటి రిపోర్టింగులు , వార్తలు , వ్యాఖ్యానాలు, సంపాదకీయాలు వ్రాస్తే అటువంటి పత్రికలను "బాకా" పత్రికలుగా గుర్తించి సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పి కొంతలో కొంత తమ సభ్యులు స్వయం నియంత్రణ చేసుకునేట్టుగా నడిపే బాధ్యత ప్రెస్ కౌన్సిల్ మీద లేదా?

యధా దినపత్రికా, తధా న్యూస్ చానెల్ లాగ ఉన్నది ప్రస్తుత పరిస్థితి. కాబట్టి ఈ ఇంటర్వ్యూ తో కొత్తగా పోయినది ఏమీ లేదు.

ఇరవైనాలుగు గంటల ప్రత్యెక న్యూస్ చానెళ్ళు మనకి అవసరమా? అటువంటి చానెళ్ళు 'జర్నలిజానికి" "పత్రికా స్వేచ్చకు" చేస్తున్న సేవ ఏమిటి అన్న విషయం మీద నిష్పక్షపాత చర్చ ఒకటి జరిగితే బాగుండును. కాని ఎవరు చేస్తారు?

brahma said...

it is better to not to watch telugu news channels, omkar programs, kondaviti raja and kotalo rani, idhi kadha kaadu etc.,

brahma said...

it is better not to watch TV9, serials like idhi kadha kaadu, omkar programs, kondaviti raja and kotalo raani, crime news etc.,

vijay said...

No one can mess with RGV.. He played with Rajanikanth like anything.

Pavani said...

I saw that program. ramu gaaru you may change the tittle of this post.Because at no point TV-9 could counter RGV. TV-9 confusion, beating around the bush attitude is in full view nakedely before RGV's razor sharp clarity. TV-9 is in fact a victim here..for a change.!

We may hate your movies..but salute your CLARITY..RGV!

kvsv said...

tv 9 di oka journalism ...rajanikanth oka journalist..??thoo..veedikante kadupu kosam vyabhicharinche sthree ni gavuravincha vacchu...ratings...chivariki dabbu sampaadane kadaa...veella lakshyam....andraa ni naasanam chesaadu ee vedava...[maa aavedana ardham cheskuni..ee comment ni delete cheyakundaa vunchadaaniki prayatninchandi..]

Anonymous said...

దొందూ దొందే.

Anonymous said...

ఏమో ఇది TV9 మరియూ వర్మ ఆడుతున్న పబ్లికిటి డ్రామా నేమో ???

Anonymous said...

రజనీకాంత్ రోజు సమాజం గురించి అర గంటా, గంట ఆలోచిస్తాడట. అలాగే టి.వి.9 కూడా ఆలోచిస్తుందంట. ఇదొక పెద్ద జోక్. ఆయన సామాజిక బాధ్యత గురించి మాట్లాడాడు. అది ఇంకొక తమాషా. వర్మ ఉదయం నుంచి మీరు చూపించే వార్తలు సినేమాల కన్నా ఎక్కువ భయంకరం గా ఉంట్టున్నాయి అని అంటే దానికి సమాధానం ఇవ్వకుండా ప్రశ్నని మళ్ళించాడు. అన్నిటికన్నా సుపర్ కామేడి యండమూరి గారి సలహా. ఆయనకి నాఇష్టం పుస్తకం నచ్చినట్లు లేదు. దానిని గురించి చెపుతూ ఒక కోతి వేషం ఉదాహరణ ఇచ్చాడు. దానికి వర్మ యండమూరిని కోతిలా గా కనిపిస్తున్నాడని అనటమేకాక. ఇటువంటి armchair ఇంటేలెక్త్యువల్స్ ఉచిత సలహాలు తనకు అవసరం లేదు అదానిని , ఆయన తన సమయాన్ని నా బోటివారికి సలహాలిచ్చే బదులు మంచి పుస్తకం రాసి సమయాన్నిసద్వినియోగం పరచుకోవచ్చని చెప్పాడు. వర్మ జవాబుకి యండమూరి గారి మైండ్ బ్లాక్ అయిఉంట్టుందని నేను అనుకొంట్టున్నాను.

Niranjan said...

Hi,
some one wrote that until entry of some news papers the media was family type ...what is he trying to say.. the same family type of media house is the culprit of today's issues in society...dividing the society on caste lines and its agenda was to bring its caste party to power..not more than that..is this definition of family if so let us know...not paying single paise until today as income tax department and claims his wealth is worth 15k crores...is this family type ....great definition boss...

bye
niranjan

Anonymous said...

ఒకసారి అన్ని న్యుస్ చాన్నెళ్ళలో వచ్చే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం మరియు చానళ్ళకు అయ్యే ఖర్చు గమనించండి.... మీకు ఇట్టే అర్ధం అయిపొతుంది మన చానాళ్ళు దేనిమీద బ్రతుకుతున్నది. ఇటువంటి వాటిలో వచ్చే కార్యక్రమాలు విలువలతో కూడిన జర్నలిజం పాటించి, ప్రజావసరాలకు తగిన చర్చలు, కార్యక్రమాలు ఇస్తే మనకు ఎన్ని చానళ్ళు మిగులుతాయో కదా!!! కాబట్టి ప్రజాప్రేక్షకులారా దురాశ పడకండి ఇవి ప్రజలకోసం పనిచేస్తున్నయని....... this is also one of the job to earn money... అంతే......

కొన్నాళ్ళ క్రిందట జొకులేసుకున్న దూరదర్శనే మంచిదని ఇప్పటీకే అనిపించేట్లు చేశాయి ఈ చానళ్ళన్ని కలిసి. అవును, దూర దృష్టి కలిగినదే దూరదర్శన్. మనకు ఎంతవరకు కావాలో అంతే ఇచ్చింది. మనం కుటుంబ సభ్యులందరితో కలిసి చూసినా మధ్యలో ఎవరి కళ్ళు, చెవులు మూయఖర్లేదు, అనవసర ఉద్రేకాలకి లొనై ప్రాణం మీదకు తెచ్చుకొవఖర్లేదు;

రాధాకృష్ణ.
విజయవాడ.

Saahitya Abhimaani said...

Mr. Ramu!

Somebody above commenting magnificently displaying complete ignorance of the history of Telugu news papers in the past 35 years. It appears that it is not known which paper became popular with tactics like just catchy and rhythmic headlines. Sad. Very sad.

The very news paper about which he seems to be lamenting was the root cause of rot in Telugu journalism. When THAT news paper created big hungama during 1979 about Skylab falling down, the publishers of such paper should have been arrested and the paper closed for the havoc created by them in Telangana Districts especially in Karimnagar District.

For those blissfully ignorant individuals, I wish to clarify as follows:

నేను సంసారపక్షపు పత్రికలు అన్నది ఆంధ్ర పత్రిక మరియు ఆంధ్ర ప్రభ కొంతలో కొంత అప్పటి ఆంధ్ర జ్యోతి.

I never thought that such a lengthy explanation is to be given for historical truth which ఇస్ crystal clear for those who care to know and those who can see on their own.

sree n sree said...

సర్ ఫిబ్రవరి 26 నుంచి ఒక్కపోస్టు కూడా చేయలేదు.

మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం....

మీరు ఎంత బిజీ అయినా... కనీసం మూడ్రోజులకోసారైనా పోస్టు చేస్తారని ఆశిస్తున్నాం...

మీ ఆలోచనతో ఏకీభవించినా... విభేదించినా.. మీ పోస్టు చదవాలని... ఏపీమీడియాకబుర్లు రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాం

రెండ్రోజుల్లో మరో పోస్టు ఉంటుందని ఆశిస్తున్నాం...

మీ బ్లాగ్ అభిమాని

Raj Karsewak said...

Come back Ramu , We are waiting .Do update blog regularly.

Unknown said...

sir ramgopal varma pai tv9 kadhanam chala chatha gavundhi

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి