Monday, May 2, 2011

పుట్టపర్తి సాయిబాబాకు నివాళిగా 'రామ్ బాణం'

తియ్యని మాటలతో పబ్బంగడుపుకుంటూ లిప్ సర్వీస్ చేయడం వేరు...స్పందించి ఇతరులకు సహాయపడుతూ, ప్రేమగా ఉంటూ, శాంతిని బోధిస్తూ సోషల్ సర్వీస్ చేయడం వేరు. ఇకపోతే...నాలుగు మంచిపనులు చేసిన వాడి దగ్గర లూప్ హోల్స్ కోసం వెతికి వాడిని భ్రష్టుపట్టించాలని అనుకోవడం మనకు అనుభవైకవేద్యమే. పుట్టపర్తి సాయిబాబా మరణం నేపథ్యంలో వచ్చిన ఆలోచనను నలుగురితో పంచుకోవాలనిపించి...ది సండే ఇండియన్ పత్రికలో 'రామ్ బాణం' కాలమ్ లో ఒక వ్యాసం రాశాను. దేవుడని నమ్మినా, నమ్మకపోయినా సాయిబాబా చేసిన మంచిపనులు, బోధించిన మంచి మాటలను తక్కువ చేయడం భావ్యం కాదని భావిస్తూ రాసిన వ్యాసమది. ఈ ఒక్కపేజీలో నేను అనుకున్నదంతా చెప్పానోలేదో అన్న సంశయంతో చర్చ కోసం ఇక్కడ మీకు ఆ వ్యాసాన్ని అందిస్తున్నాను.12 comments:

astrojoyd said...

good info article sir...

రాజేష్ జి said...

$రాము గారు

ఒక తటస్తునిగా, మానవతా విలువలకు ప్రాముఖ్యం ఇస్తూ మీరు రాసిన వ్యాసం ఆలోచనాత్మకం, అభినందనీయం. మీ రామబాణం చాలా సూటిగా ఉంది :)

ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు

RSReddy said...

అవునవును జై సాయి 'రామ్'!
సినిమానిండా ఎన్ని అనవసరపు ట్విస్టులున్నా, ఎవడెవడు దేనికోసమో తన్నుకు చచ్చినా, చివరి ఐదారు నిమిషాలు నీతి బోధలు చెబితే ఆహా ఓహో అనుకుని వచ్చేద్దాం. ముందు జరిగినవన్నీ మర్చిపోదాం.
ఏ ఒక్క మతాన్నీ ప్రభుత్వం ప్రత్యేకంగా మీదేసుకోని లౌకికరాజ్యం మనదని గొప్పలుచెప్పుకునే మనం, ఏ రాజకీయ హోదాలేని ఓ వ్యక్తికోసం అధికార లాంఛనాలు అనవసరంగా నియోగించబడుతున్నా, జాతీయపతాకం అవమానపర్చబడుతున్నా చూస్తూ ఊరుకుందాం. దేశ జనాభాలో ఓ అయిదారు శాతం మందికి పూజ్యుడైనంతమాత్రాన నియమ నిబంధనలను తుంగలో తొక్కి సర్వ ప్రభుత్వ సేవలనూ ఆయనకోసం పుట్టపర్తిలో నియోగించడాన్నీ హర్షిద్దాం.
అయిదారు కాకపోయినా ఓకటో రెండో శాతం భక్తులు కలిగిన కల్కీలూ, జయేంద్ర సరస్వతులూ, రంజితా నిత్యానందలూ...వీళ్ళందరూపోతేకూడా అధికార లాంఛనాలను యధేఛ్ఛగా నియోగిద్దాం.
(నేనేదో అనవసర వ్యాఖ్యానం చేస్తున్నాననుకోవద్దు. నిజమైన భక్తి అంటే ఏంటో, భక్తుడనేవాడికుండే పరిమితులకు లోబడి ఏం చెయ్యవచ్చో అది మాత్రమే చేసియుండాల్సింది మన ప్రభుత్వాధినేతలు. బహుశా సత్య సాయిని బ్రతికుండగా అడిగినా ఇవన్నీ కోరుకునే వారు కాదేమో.)

జయహొ said...

ఈ మధ్య అతి తెలివి నెల్లూరు పెద్దా రెడ్డిగార్ల సంఖ్య బ్లాగులోకం లో చాలా ఎక్కువైంది.వీరి లక్ష్యణాలు ప్రతి ఒక్కరు దేశం,చట్టం,లౌకిక రాజ్యం గురించి మాటలాడటం. దేవుడి స్థానం లో సైన్స్ ను ప్రతిష్టించటం. ఎవరైనా పొరపాటున సైన్స్ వలన ప్రపంచం లోని మానవులకు అనుకొన్న విధం గా ఎమీ మేలు జరిగిందని రాసిన వెంటనే, సైన్స్ అనేటంతటి వాడివా అని దౌర్జన్యానికి దిగటం లాంటివి. వీరి సైన్స్ జ్ణానం బాబా ఉంగరాల సృష్టిని,వాచ్ల సృష్టిని ప్రశ్నిచటానికి మాత్రం పనికి వస్తున్నాయి. ఎవరైనా మీరు లేవనెత్తిన ప్రశ్నలు సరియైనవి కారు అని అన్నారనుకోండి, మనంప్రశ్నించుకోక పోతే ఈనాడు మానవ సమాజం ప్రగతి సాధించి ఉండేదా అని మొదలుపెడతారు. కాని మన భారత దేశం లో బాబాగారిని మాత్రం ఇలా ప్రశ్నిచటానికి ఒక కారణం ఉందని పిస్తున్నాది. ఆయనైతే ఎమీ అనరు కనుక ఆయనని మనకున్న సైన్స్ నాలేడ్జ్ తో విమర్శించి గొప్ప రేషనలిస్ట్ల మని ఫీలౌవచ్చు. ఆయన తన మేజిక్ల తో అందరిని మోసం చేస్తున్నాడని తెగ బాధ పడిపోవటం దాని మీద చర్చలు జరపటం సాధారణ విషయమైంది.
ఆయన మోసం తరువాత సంగతి కంటి ముందర మన వీధిలో రోడ్లు బాగా ఉండవు, వాటిని వేసినా సరి ఐన క్వాలిటితో వేయరు. ఇటువంటివి రాస్తూ పోతే ఎన్నో వస్తాయి కాని మన ఎదుగురుగా జరిగే ఈ చిన్న మోసాల మీద ఎంత మంది ప్రశ్నిస్తున్నారు? నోరు మెదిపి, కాంట్రాక్టర్లు చేసే మోసాలా పై పోరాడుతున్నారు? అనేది ఒకసారి నిజాయితి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి?
Request you to read below interview

The Extended Interview given by Bhagawan Sri Sathya Sai Baba to the Senior Editor, Sri R.K. Karanjia of Blitz News Magazine in September of 1976
http://www.saibabaofindia.com/blitz.html

prastuta mIDiyaa vaari gurinci gollapooDigaaru raasina vyaasam cadivEdi.
కుక్కమూతి పిందెలు
http://www.koumudi.net/gollapudi/050211_kukkamuti_pindelu.html
ఓ గుండయ్య కథ
http://www.koumudi.net/gollapudi/041811_gundayya_katha.html
-----------------------------------
ఇక్కడోక నెల్లురు పెద్దా రెడ్డిగారు లౌకిక రాజ్యం గురించి తెగ బాధపడి పోతున్నారు. మహాశయా జాతీయ జెండా ని సాయి బాబా మీద కప్పినంత మాత్రాన భారతదేశం లో లౌకిక స్వభవానికి వచ్చిన ముప్పు ఎమీ లేదు. తెలుగు వెలుగు అనే గాసిప్ పేపర్ చదివి మీరు అనవసరం గా బుర్రని పాడుచేసుకొంట్టున్నారు. మీకు తేలుసోలేదో ఆ రేండు తెలుగు పేపర్లకు ఆమట కొస్తే ఏ తెలుగు పేపరుకు ఈ మధ్య ఏమాత్రం విశ్వసనీయత లేదు.
----------------------
రాము గారు,
నేను ఇక్కడ రాసినది స్పేసిఫిక్ గా ఈ టపా కి సంబందిచినదికాదు. కాని బాబా మీద చాలా మంది తమకు తెలిసిన అతి తక్కువ వివరాలతో అంతా తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు. ఇలా విమర్సించే వారిలో 90% మందిలో ఇప్పటివరకు పుట్టపర్తి కనీసం ఒక్కసారి కి కూడా పోయివుండరని నా అభిప్రాయం. పేపర్ లో బాబాను గురించి చదివి అభిప్రాయలు ఏర్పరచు కొంటారు.

katta jayaprakash said...

A good comment.If an one goes through and studies Sri SAthya Sai Baba's life and His message and His humanitarian service with spiritual background very seriously with positive mindset I am sure every one definetely treats Him God and avataara purusha like Sri Rama.Krishna,Buddha,Shirdi Sai Baba,Jesus Christ,Mohammad etc as they too were born as ordinary human beings with human qualities.It is very easy to have negative mindset and criticise any one but it requires great intelligence,wisdom and personal experience to appreciate anything any one whose life itself a message to every one.

JP.

I, me, myself said...

people are missing out important point in RS Reddy's comment.....we are a secular country which means government should not have any role in the matter of religion then why was he given state funeral. Baba might be god to 90% of the people even then its not right on the part of government to indulge in those (religious) activities.

Sudhakar said...

i agree with RS Reddy. I dont understand what is the issue with Mr/Mrs/Miss Jayaho here. Everyone has right to talk and I dont think RSReddy's comment discusses or proposes something beyond our world. నిజం మాట్లాడితే కాలిందంటే...ఒక్క సారి చూస్కో..నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావెమో..అని అధ్యాత్మిక బాబాలే చెప్పారు.

Sai baba is just a part of this society and system. Why should he be treated specially ? if the money donated or the service is the reason, we have many such people in india who did not wore good clothes but achieved megasese awards...shutup if you dont understand the system and pray the babas in orange nighties and on golden chairs.

జయహొ said...

బ్రహ్మీ సినేమాలో పోలీసు వాళ్ళు కనిపించినపుడల్లా నెల్లూరు పెద్దా రెడ్డి తెలియకుండా ఇన్ని రోజులు డిపార్ట్మెంట్ లో ఎలా పని చేస్తున్నారయ్యా? ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దా రెడ్డి రైట్ నౌ అని అంట్టుంటారు. పాపం పోలీసువారు బిక్కమొహమేసుకొని, ఎవరా నేల్లూరు పెద్దారేడ్డి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంట్టూంటారు.అలా ఇక్కడ కొంతమంది బ్లాగులోకపు నెల్లురు పెద్దారేడ్లు బ్లాగులో సాయి బాబా మీద ఎవరైనా పాసిటివగా రాసిన వేంటనే రాసినవారికి భారత దేశం, సెక్యులరిజం, ప్రభుత్వ భాద్యతలు, డబ్బుల ఖర్చు, పేదరికం, మిగతా ఆధ్యాత్మిక గురువుల మీద ఉన్న ఆరోపణాలు మొదలైనగుర్తుకు వస్తాయి. వ్యాసం రాసినవారికి వీటి పైన ఏ మాత్రం అవగాహాన లేదనే విధంగా వ్యాఖ్యలు రాయటమేకాక, మనదేశం లౌకికరాజ్యం ఐతే ఇలా ఎందుకు ఆయనని ప్రత్యేకం గా చూడాలి అని "జాతీయపతాకం అవమానపర్చబడుతున్నా చూస్తూ ఊరుకుందాం." లాంటి ప్రశ్నలను ఇక్కడ సంధించారు. ఇక్కదే కాదు చాలా బ్లాగులలో ఇవే ప్రశ్నలు.
అయ్యా నా బోటీ సామాన్యులకు పశ్చిమ దేశాల నుంచి అరువు తెచ్చుకున్న లౌకిక రాజ్యం గురించి పెద్దగా తెలియదు గాని, బాబా ఎమీ క్రిమినల్ కాదు. ఆయన మీద జాతీయ పతాకం కప్పితే ఆపతాకాన్ని అవమానించటం అంటే కొంచెం బాధ అనిపించింది. నేను సామాన్య మానవుడిని (సినేమా భాషలో చెప్పాలంటే పోలిసుని) మీరు నెల్లూరు పెద్దారేడ్డి లాంటి వారు అడిగిన వాటిలో లోతప్పేమి అని నన్ను ప్రశ్నించే బదులు, మీరు బాబా కు ఆ మర్యాదలు ఏర్పాటు చేసిన ప్రధాని, ముఖ్యమంత్రిని లౌకికరాజ్యం గురించి వారికి చెప్పి , రాజకీయ హోదాలేని ఓ వ్యక్తికోసం అధికార లాంఛనాలు ఎందుకు ఎర్పాటు చేశారో అని అడిగితే బాగుంట్టుంది. సినేమా క్లైమాక్స్ లో బ్రహ్మీ గారికి నేల్లురు పెద్దారేడ్డి పోలిసు రికార్డ్ ఫైల్ చూపించినట్లు, మీకు మన ప్రభుత్వం లౌకిక రాజ్యమైన మనదేశంలో, బాబా గారికి అధికారిక లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు ఎర్పాటు చేశారో, సమాధానం చెపితే ఆవిషయాలు మాతో పంచుకొండి. చదివి తెలుసుకొంటాం.
--------------
గమనిక: నెల్లూరు పెద్దారెడ్డి అని అనటం ఇతరులను అవమాన పరచటానికి కాదు అని నా మనవి.

RSReddy said...

@Jayaho!
I have nothing left to discuss/ argue with you. As an individual devotee C.M or P.M, you & me would have paid homages to Baba. But, giving state funeral is definitely wrong. Why wrong, what wrong are all those questions one has to put to his own self and before that one should make himself known to whom the same would be given. Asking C.M or P.M is not ur or my headache(for that some one has already filed a PIL and the Govt.is the one to respond).
u also failed to respond on Nityananda/ Kalki. They were also treated as Good God men until they were exposed? Would they too be offered state funeral suppose if their followers raises by 500 to 1000% of what they are today by the time they die??
@J.P garu
I respect most of ur comments & they r very relevant too on many occasions. But, sir - as u wrote - b.coz many people (say 99.99%) sees Baba as Rama, Krishna etc., can we make him the God of the Nation (like Gandhi as Father of Nation) - which in turn is nothing but declaring our nation a Hindu Raj instead of a Secular Nation?

Ramu S said...

జయహో గారూ...
దయచేసి కులాలకు సంబంధించి కామెంట్లు చేయకండి. మీరు చెప్పదలుచుకున్నది ఒక పద్ధతి ప్రకారం చెప్పండి. దయచేసి ఇతరులను నొప్పించకండి.
డియర్ ఆర్.ఎస్.రెడ్డి గారూ...
సోదరా...సాయిబాబాను దేవుడని అంతా అనాల్సిందే అని నేను చెప్పలేను కానీ...నేను ఆ ఆర్టికల్లో చెప్పినట్లు ఆయన గొప్ప మనిషి. కోట్లు ఖర్చుపెట్టి మనోళ్లకు మంచినీళ్లు అందించినందుకైనా...జాతీయ పతాకాన్ని ఆయన మీద కప్పవచ్చని నా అభిప్రాయం. మీరు ఆయన్ను హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిగా చూడటం వల్ల సమస్య వస్తున్నది. మతాల పిచ్చిలో పడవద్దని హితవు పలికిన ఆధ్యాత్మిక గురువు మన కాలంలో ఇంకెవరైనా ఉంటే నాకు చెప్పండి. సర్వమత సారాన్ని, శాంతిని బోధించిన ఆయన పట్ల అంత వ్యతిరేకత ఉండాల్సిన పనిలేదని నేను అనుకుంటున్నాను.
ఛీర్స్
రాము

జయహొ said...

రాము గారు,

నేను కులం పేరుతో చిన్న బుచ్చాలని కామెంట్ రాయలేదండి. ఆయనతో నాకు ఎటువంటి పేచిలు లేవు. కాకపోతే మీరొక బాలెన్స్డ్ ఆర్టికల్ రాశారు. దానిని చదివిన వారు వేరే కొణం లో నుంచి చూసి లౌకిక రాజ్యం ఐన మనదేశం ఇలా చేస్తే ఎలా అంటె ? దాని అర్థమేమిటి మీలాంటి సినియర్ జర్నలిస్ట్ కి లౌకిక రాజ్యం అనేదాని గురించి తెలియకుండా ఎలా ఉంట్టుంది? ప్రధాన మంత్రికి, ముఖ్య మంత్రులకు లౌకిక రాజ్యం మీద అవగాహన లేదనా? వారు ఇటువంటి వాటికి వచ్చారు అంటె ప్రభుత్వంలో ఉండే అధికారుల, రాజ్యంగ నిపుణల సలహాలు తీసుకొని వస్తారని నేను అనుకొంట్టాను.
అసలికి బాబా భక్తులలో చాలా మంది ఇతర మతాలకు సంబందించిన వారు ఉన్నారు. ఆయనే నిజమైన లౌకిక వాదికి ఉదాహరణ.

అదీ కాక ప్రధాని, ముఖ్య మంత్రులు బాబాను చూడటానికి వచ్చారు అంటే వారికి ఆయన గురించి ఎంతో సమాచారం తెలిసి ఉండబట్టే వస్తారు. ఆయన మీద చెడ్డ రిపొర్ట్ ఉంటే వారెందుకు వస్తారు? కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు ప్రభుత్వం వద్ద వుండవా? దాదాపు 60సం|| గా ఆయన పుట్టపర్తి లో ఉంట్టు ఉంటే ప్రభుత్వాల దగ్గర ఎన్ని నీవేదికలు ఉండాలి. బాబా గారి దగ్గర వోటు బాంక్ ఎమీ లేదు కదా, వారు వచ్చి ఆయన భక్తులను బుట్టలో వేసుకోవటానికి, లబ్ది పొందటానికి. ఆయనని తీసుకొని వచ్చి కర్నూలు బాల సాయిబాబా, కల్కి, నిత్యానందతో ఎలా పోలుస్తారు? వారిని గురించి ఇంకెపుడైనా మాట్లాడుకొందాం. నేను baabaa గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. పైన ఇచ్చిన లింక్ లు చదివితే అర్థమౌతుంది.
---------------------------
Ramu గారు,నేను పైన రాసిన కామేంట్స్ ఒక్కరిని ఉద్దేశించినవి కాదు. నేను రాసినది ఇతరులను బాధిస్తే క్షమించవలసినది గా కోరుతున్నాను. ఎందుకంటె బాబా గారు జీవితకాలం మనుషుల మధ్య ప్రేమ కొరకు పాటుపడ్డారు. ఆయన మీద జరిగిన ఈ చర్చలో నా వాదనా పటిమను ప్రదర్సించి ఇతరులను డామినేట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు.

RSReddy said...

రామన్నయ్యా!
నాకున్నది ఈ బాబా పట్లో, మరో బాబా పట్లో వ్యతిరేకత కాదు. వారు చేసిన మంచి పనులపట్ల నాకూ ఒకింత సంతోషమే. ఆయన్ను పరోపకారిగానో, మానవతావాదిగానో ఒకడుగు ముందుకేసి దేవుడిగానో ఎవరైనా పిలిచినా నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ, వ్యక్తిగత నమ్మకం వేరు, వ్యవస్థ వేరు. ఒక ప్రజాస్వామ్య, సెక్యులర్ వ్యవస్థలో ఏ ఒక్కరి నమ్మకాన్నో అందరి అభిప్రాయంలా అనిపించేలా రుద్దబడకూడాదని మన రాజ్యాంగం కూడా నిర్దేశించిన విషయాన్ని మీవంటి విజ్ఞులకు నాబోటివారు చెప్పాల్సినంత అవసరం లేదు:) స్టేట్ ఫ్యూనెరల్ విషయంలో మీరుకూడా సమర్ధ్జించేలా మాట్లాడడం ఆశ్చర్యకరం.
నాడు దైవ ప్రతినిధిగా పిలువబడ్డ (దేవతగా పిలవబడకున్నప్పటికీ) మదర్ థెరెసా విషయంలో కావచ్చు, నేడు సత్య సాయికి కావచ్చు, రేపు మరో కల్కీకో, నిత్యానందకో కావచ్చు. ఎవరికైనా ఒక ప్రయివేటు వ్యక్తికి స్టేట్ ఫ్యూనెరల్ అనేది ఖచ్చితంగా తప్పే.(కనీసం ఓ చట్టాన్ని తెచ్చి ఎలాంటి వాళ్ళకు అలా ఇవ్వవచ్చో నిర్ణయిస్తే తప్ప).
సత్య సాయికి ఒక ఆశ్రమమూ, ఓ ప్రత్యేక వ్యవస్థా ఉన్నాయిగా? (హిందూ మత ప్రబోధకుడా సర్వమత ప్రబోధకుడా అన్నది అప్రస్థుతం). అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎంతమంది పోలీసులనైనా మోహరించడంవరకూ ఓ.కే. కానీ అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం వ్యవహారాన్నీ తన భుజాలపై వేసుకుని చేయడం ఎలా కరక్ట్ అవుద్ది??
మొన్నామద్య మీడియాలో తెగ రఛ్చ అయిన కల్కీ బాబానో, మరో నిత్యానందో మరిన్ని కోట్లు వెచ్చించి ప్రజలకోసం ఏదో చేసేస్తే వాళ్ళుపోతేకూడా ఇలాగే చేసేద్దామా? పోనీ ఎంతెంత పెద్ద పనులు చేస్తే ప్రయివేటు వ్యక్తులకైనా స్టేట్ ఫ్యూనెరల్ చెయ్యొచ్చో ఓ చట్టం తెమ్మందామా? అన్నట్లు రేపు మన హసన్ అలీ భాయ్ కూడా ఓ ఆశ్రమం పెట్టేసి ప్రజోపయోగ పనులు చేసేస్తే ఆయనకూ ఈ గౌరవాలన్నీ ఇచ్చేద్దామా?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి