Sunday, January 8, 2012

బూతు బొమ్మలే ఆంగ్ల పత్రికలకు ఆక్సిజన్..................you too "ది హిందూ"

ఆడపిల్లల డ్రస్సులకు సంబంధించి జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ కేంద్రంగా వస్తున్న ఐదు ఇంగ్లిషు పత్రికలను తిరగేశాను. అవి-The Hindu, Sunday Times, Deccan Chronicle, Sunday Express, The Hans India.

ఇందులో కొన్ని పేపర్లు అమ్మాయిలను నీచంగా, దారుణంగా చూపించాయి. అవి సభ్యతను మరిచి గీత దాటాయి.  Sunday Express, The Hans India తప్ప మిగిలిన పత్రికలు ప్రచురించి ఫొటోలు చూస్తే అసహ్యమేసింది. ఆడపిల్లలను ఇంత దారుణంగా చూపించాల్సిన అవసరం లేదు. పైగా...బూతు బొమ్మలకు, సర్క్యులేషన్ కు సంబంధం ఉందని ఏ సర్వేలో అయినా తేలిందా? పత్రికలు అమ్ముకోవాలంటే మహిళలవి ఇలాంటి బొమ్మలు వేయాలా?
నిజంగా చిత్త శుద్ధి ఉంటే...డీజీపీ మీద టీవీ స్టూడియోలలో లెక్చర్లు దంచే  మహిళా సంఘాలు నాయకురాళ్లు...ఈ పత్రికల ఎడిటర్లకు లెటర్లు రాయాలి. ఇంకా దమ్ముంటే...వాటి ప్రతులను టాంక్ బండ్ మీద తగలబెట్టాలి. ఫెమినిజం అంటే...ఛానళ్ల స్టూడియోలలో తియ్య తియ్య కబుర్లు చెప్పడం కాదు సిస్టర్స్.
ఇంతకూ ఆ పత్రికలు మహిళలను ఎలా ట్రీట్ చేశాయో చూడండి.

సండే టైమ్స్
భారతదేశంలో జర్నలిజం విలువల వలువలూడదీసి జర్నలిజం అర్థాన్ని మార్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా దారుణంగా రెచ్చిపోయింది.
1) రెండో పేజీలో "It's all fair" అన్న శీర్షికతో పచ్చి బూతు ఫొటోలు ప్రచురించారు. The Silk Route అన్న కథనంలో వాంపుల వయలు నిస్సిగ్గుగా ప్రచురించారు. కసిచూపుల, భారీ వయ్యారాల ముమైత్ ఖాన్ ఫొటో కూడా ప్రచురించారు. ఈ వార్తలు రాసింది...రోలీ శ్రీ వాస్తవ, నిఖిల హెన్రీ అనే మహిళా జర్నలిస్టులు. వారు రాసిన స్టోరీలలో అంత మసాలా లేకపోయినా...పాఠకుడిని ఆకర్షించేందుకు పిచ్చి బొమ్మలు వేశారు.
2) Intersections అనే పేజీలో హోమో ఎరాటిక్ ఆర్ట్ అనే కథనంలో బొమ్మలు కూడా ఆర్టు పేరుతో అసభ్యత ప్రదర్శనగా అనిపించే అవకాశం ఉంది
3) స్పోర్ట్సు పేజీలో ఇచ్చిన మసాలా వార్తల్లో కూడా బూతు ప్రదర్శనే
4) విచిత్రమేమిటంటే...షోబిజ్, హాలీవుడ్ పేజీలలో ప్రచురించిన ఫొటోలు కాస్త సభ్యతతో కూడినవై ఉండటం

ది హిందూ
భారతదేశంలో నైతిక విలువలతో కూడిన జర్నలిజం నెరుపుతున్నామంటూ...డబ్బా కొట్టుకునే ది హిందూ వారి సినిమా ప్లస్ సప్లిమెంట్ దారుణంగా ఉంది.
1) పేజి టైటిల్ పక్కనే ఒక అందాంగి బొమ్మ కవ్విస్తూ కనిపిస్తుంది
2) అమీ జాక్సన్ అనే అమ్మాయి ది పెద్ద ఫొటో వేశారు మొదటి పేజీలో. తొడల నుంచి ఎలాంటి వస్త్రాచ్ఛాదం లేకుండా ఆ పిల్ల కనిపిస్తే...ఇది హిందూ పేపర్లో వచ్చిన ఫొటోనా అని విస్తుపోవడం జనం వంతవుతుంది.
3) నాలుగో పేజీలో అమలా పాల్ పెద్ద సైజు బొమ్మ వేశారు కానీ  అది అమీ అంత ఘోరంగా లేదు.
4) మాగజీన్ సెక్షన్ లో కల్పనా శర్మ గారి స్టోరీకి అంత దారుణమైన బొమ్మ వాడటం అవసరమా? అని నాకనిపించింది. తెలల్లటి ఛాతి మీద "Don' t touch!" అని రాసున్న ఒకమ్మాయి బొమ్మ వేశారు.
5) Wayfarer అనే పేజీలో బ్రెజిల్ గురించి రాస్తూ బికినీ భామ కుక్కపిల్లను సముద్ర తీరంలో షికారుకు తీసుకుపోతున్న బొమ్మ వేశారు


డెక్కన్ క్రానికల్ 
1) మొదటి పేజీలోనే బుల్లి నిక్కర్, నల్ల బ్రా వేసుకున్న అమ్మడు ఫోజిచ్చిన స్టాన్జా అనే అడ్వర్ టైజ్ మెంట్ దర్శనమిచ్చింది. మిగిలిన పేజీలు సంసార పక్షంగా ఉన్నాయి.
2) సండే క్రానికల్ స్పెషల్ సప్లిమెంట్ లో మొత్త అందాల ఆరబోతే.  "Dzyne" అనే పేజీలో ఒక మోస్తరుగా ఈ జబ్బు "Showbiz" లో రెచ్చిపోయారు. విజయ బాలన్, కత్రినా కైఫ్ ల కవ్వించే ఫోటోలు పెద్దవి వేశారు.

5 comments:

I, me, myself said...

i dont think its fair to link DGP comments and the pics published in some of the print media.

DGP comments are defnetly uncalled for as he seems to be supporting the rapists. the way a woman dresses up is her wish. No one should be controlling are trying to find faults with others dressing.

And coming to media publishing those pics. Media has only published which those women who have willingly posed to......

Ramu S said...

A blogger has sent me the link of The Hans India in which an obscene picture is seen. I don't know how I missed it before writing this post. I take objection to publishing such pictures. Sorry for having overlooked the objectionable picture. I've to check whether The Hans published the picture on Sunday.
Let me reiterate it that I don't have any bias when it comes to making a comment in my blog.
I couldn't post the comment of the particular blogger as I didn't like the way he made some comments against me.
cheers
Ramu

Praveen Mandangi said...

నేను డిజిపి వీడియో చూశాను. అతను రేపిస్ట్‌లని సపోర్ట్ చేసేలాగానే మాట్లాడాడు. అసలు విషయానికొద్దాం. విశాఖపట్నంలో అందాల పోటీలు ఒకప్పుడు జరిగేవి. ఏ అందాల పోటీలలో అయినా ఆడవాళ్ళని చెత్తగా చూపిస్తారు, విశాఖపట్నంలోనూ అదే జరిగింది. విచిత్రమేమిటంటే అందాల పోటీలని నిర్వహించేది ఆడవాళ్ళే. వైజాగ్‌లో అందాల పోటీలు జరుగుతోన్న ఆడిటోరియంపై ఒక మహిళా సంఘంవాళ్ళు దాడి చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. ఆ అందాలపోటీల నిర్వాహకురాళ్ళు ఇది ప్రైవేట్ కార్యక్రమం అని చెప్పి మహిళా సంఘంవాళ్ళని పంపించేశారు. అది ప్రైవేట్ కార్యక్రమమైతే దాని గురించి పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం ఎందుకు? ఈ జ్ఞానమే ఆ నిర్వాహకురాళ్ళకి లేదు. బూతుని సమర్థించే స్త్రీలు ఉండడమే ఇక్కడ అసలు సమస్య. ఒళ్ళు చూపించుకోవడానికి ఆడవాళ్ళకే లేని అభ్యంతరం మనకెందుకు అనుకుని మగవాళ్ళు చూస్తారు. పత్రికలలోనైనా అంతే. బూతు పోజ్ ఇచ్చే మోడల్ ఆడదే. ఆమె అనుమతి లేకుండా ఎడిటర్ ఆమె బూతు ఫొటో వెయ్యలేడు.

rangs said...

she is not vijaya balan. vidya balan.

Ramu S said...

మీరే కరెక్టు. అప్పుతచ్చు.
థాంక్స్
రాము

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి