Monday, April 1, 2013

'ప్రజాశక్తి' కి డాక్టర్ రెంటాల జయదేవ

హైదరాబాద్ లో 'ఈనాడు' లో, చెన్నై లో 'ఇండియా టుడే' లో రెండు దశాబ్దాల పాటు పనిచేసిన డాక్టర్ రెంటాల జయదేవ మొన్నీ మధ్యన 'ప్రజాశక్తి' లో చేరారు. ఆయన 'ప్రజాశక్తి' లో ఫీచర్స్ ఎడిటర్ గా నియమితులయ్యారు. 
పనిలో పనిగా 10 టీవీ, వారి పబ్లిషింగ్ హౌస్ పనులూ కొన్ని తను పంచుకోవాల్సి ఉంటుందని అనుకుంటా.

'ఈనాడు జర్నలిజం' స్కూల్ లో మా బ్యాచ్ లో మాతో పాటు చదువుకున్న జయదేవ ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ గారి కుమారుడు. ఈ మధ్యనే జయదేవ సినిమా సమీక్షలకు నంది అవార్డు వచ్చింది. మా వాడు మళ్ళీ హైదరాబాద్ రావడం ఈనాడు లో పనిచేసిన మిత్రులకు చాలా ఆనందం కలిగించింది. ఆ మదరాసు లో ఎన్ని రోజుల్రా నాయనా? అని జయదేవను సతాయించిన వారిలో నేనూ ఒకడిని. మన పిల్లలు బాల్యంలో హాయిగా మన నేల మీద పెరగాలని, పెద్ద చదువుల కోసమో, రెక్కలొచ్చాకనో  అవకాశాల కోసం రాష్ట్రం, దేశం దాటడంలో తప్పులేదని నాకు అనిపిస్తుంది. 

తెలకపల్లి రవి గారు సంపాదక బాధ్యతలు స్వీకరించాక 'ప్రజాశక్తి' లో మార్పులు బాగా జరుగుతున్నాయి. నాణ్యత పెంచే క్రమంలో భాగంగా పెద్ద జీతాలు ఇచ్చి అయినా సరే సరుకున్న జర్నలిస్టులను నియమించాలని కామ్రేడ్లు భావిస్తున్నారు. 

గోపాల రమేష్ 

జీ 24 గంటలు ఛానెల్ హెడ్ శైలేష్ రెడ్డి సేన లో ప్రముఖుడైన గోపాల రమేష్ ABN- ఆంధ్రజ్యోతి ఛానెల్ లో చేరాడని సమాచారం. కష్టపడి చదువుకుని ఉస్మానియాలో పొలిటికల్ సైన్స్ లోనో, ఎకానమిక్స్ లోనో గోల్డ్ మెడల్ సాధించి జర్నలిజం లోకి వచ్చిన రమేష్ 'ఈ టీవీ' లో పనిచేసాడు. జీ టీవీ లో కీలక బాధ్యతలు పోషించాడు. జీ ని సత్తిబాబు కొన్నాక రమేష్ లాంటి జర్నలిస్టులు ఇబ్బంది పడ్డారు. స్పార్క్ ఉన్న జర్నలిస్టులలో రమేష్ ఒకడు. 

వల్లూరి రాఘవరావు

మా బ్యాచు లో చదువుకున్న వల్లూరి రాఘవరావు కూడా ABN- ఆంధ్రజ్యోతి ఛానెల్ లో చేరాడట. 'ఈనాడు' నుంచి వెళ్లి ఎడిటర్ అయిన అతి కొద్ది మంది జర్నలిస్టులలో ఒకడు రాఘవ. 'ఈనాడు' లో కంట్రిబ్యూటర్ గా జీవితం ఆరంభించి  సాహిత్యం లో దిట్టగా మారి 'ఆంద్ర ప్రభ'కు రాఘవ ఎడిటర్ అయ్యాడు. తర్వాత ఎన్ టీవీ లో, స్టూడియో ఎన్ లో పనిచేశాడు. సమకాలీన తెలుగు జర్నలిజం లో బెస్ట్ పెన్నులలో రాఘవది ఒకటి. 

బాలభాస్కర్ 

'ఈనాడు' వదిలి వెళ్లి బైర్రాజు ఫౌండేషన్ లో కీలక బాధ్యతలు పోషించిన జర్నలిస్టు పిల్లలమఱ్ఱి బాలభాస్కర్. ఈనాడు లో వసుంధర పేజీని ఒక స్థాయికి తెచ్చిన జర్నలిస్టులలో తను ఒకడు. సత్యం కంపెనీ లో విపరిణామాల నేపథ్యం లో ఆ ఫౌండేషన్ వదిలి ఎన్ టీవీ లో కొంతకాలం, ABN- ఆంధ్రజ్యోతి ఛానెల్ లో కొంతకాలం పనిచేసాడు. ఏబీఎన్ లో భాస్కర్  డిజైన్ చేసిన 'కాఫీ విత్ కాంతం' నాకు కొద్దిగా నచ్చేది. తను మళ్ళీ 'ఈనాడు' వారి నెట్ ఎడిషన్ లో చేరినట్లు సమాచారం. 

తను ఈశ్వర్ 

నిన్న 10 టీవీ కి సంబంధించి నాకు గుర్తు రాని యాంకర్ పేరు 'ఈశ్వర్'. తను జీ 24 గంటలు లో ఉండే వారు. మొదట్లో ఆయన్ను చూసి ఈయన యాంకరా? అని అనుకున్నాను. ప్రతిభను పెంచుకుంటూ తనకు మంచి యాంకర్ గా ఎదిగారు. ఇలా ఇష్టపడిన ఫీల్డులో కష్టపడి పైకి వచ్చిన వారు మార్గదర్శకులు. 

నోట్: మిత్రులారా... పత్రికలూ ఛానెల్స్ లో మార్పులు చేర్పులు గురించి మరి కొన్ని పోస్టులు రాయబోతున్నాను. మీ మిత్రులకు సంబంధించిన లేదా జంపింగ్స్ గురించి మీకు తెలిసిన సమాచారం ఉంటే దయచేసి నాకు మెయిల్ చేయండి. మెయిల్ ఐడి: srsethicalmedia@gmail.com      

6 comments:

krshnrao said...

మన తెలుగు వాళ్ళు ఇంటి పట్టున సరే కుమ్మేస్తుంటారు.కాని ఇంగ్లీష్ జర్నలిస్ట్ లుగా జాతీయ స్థాయిలోనో,అంతర్జాతీయ స్థాయిలోనో ఎందుకని పేరుతెచ్చుకోలేరు...? మళయాళీ ల మాదిరిగా,బెంగాలీల...తమిళుల మాదిరిగా దూర ప్రదేశాలు వెళ్ళి రాణించే మెళుకువలు తెలియకనా..?!

మన హైదరాబాద్ ది వీక్ కరస్పాండెంట్ గా లలితా అయ్యర్ అని తమిళ్ పేరు వినిపిస్తుంది.ఇండియా టుడే అంటే అమరనాద్ మీనన్ అని వినిపిస్తుంది.మరి అదే మాదిరిగా వారి states లో మన తెలుగు జర్నలిస్టుల పేర్లు వినబడవు..? ఎందుకో మరి..!

Ramu S said...

Rao garu,
It is an interesting valid point. You will be surprised to see lobbying of Mallus and Bengalis in newsrooms. I'll write a post on it soon.
Ramu

astrojoyd said...

వల్లూరి గారి సెల్ నెంబర్ ఇవ్వగలరు ..అయన పూర్వాశ్రమంలో నాకు క్లైంట్ ..ఎవరు అడిగారని అడిగితే సాక్షి చెన్నై రిపోర్టర్ చల్ల.జయదేవ్ అడిగినట్లుగా తెలుప గలరు...నా సెల్ నెంబర్ 09884675329

katta jayaprakash said...

Oun Telugu journalists,corrospondents,reporters can not get national recognition and cannot survive outside as they can not get under table payments as they wait for extra payment after the press meets.
JP.

Unknown said...

interesting discussion. Anyhow there are any number of Telugu journalists in national media who have already made their mark. k.v.prasad is now resident editor of the tribune. muralidhar reddy, former Islamabad and colombo correspodent is at present the national bureau chief of the hindu. laxman is an editor with HT. Parsa Venkateswara Rao Junior is an editor with the DNA (could have changed the organization now). problem is not that telugus dont find a place. Yes, politics are always a reason. Basically unlike in other professions, I have observed that we dont go out and experiment. I have seen several Telugu friends who move out only to go back. Some complain they miss their friends and places. I never had any problem working outside AP and I have no complaints. Malayalees, tamils, punjabis, marathis, bengalis..all are here stay put. But, my Telugu friends send their children back and always keep their bags packed to go back once their stint is over. That is the real problem, I feel.

Unknown said...

I disagree. At least I have survived. There is KV Prasad as RE of The Tribune, Parsa Venkat Jr as editor of DNA (think he shifted the organization now), laxman in a senior position as editor (agriculture), with HT, Muralidhar Reddy and Sainath are always there. There are several others anyway. The problem is not elsewhere. It is within us. Our people usually dont (in our profession) like to move places and even if they do, they do so only to go back. There is always a retirement plan working on the back of mind. Our people send their children back to Hyderabad for studies. A malayalee or a tamil or a bengalee or a punjabi never does it. He settles down happily outside. I have done the same anyway and have become a Delhiite. I have as many friends here. It is more ones attitude dudes. Cheer up.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి