Thursday, April 25, 2013

ప్రేమ వ్యామోహమా?: N TV లో చెత్త "ఫోకస్"

N TV లో "ప్రేమ బంధమా? పేగు బంధమా?" అన్న శీర్షికతో ఈ రోజు ఉదయం 'ఫోకస్' అనే కార్యక్రమం వచ్చింది. ఇది నాకు నచ్చలేదు. కని ఇరవై ఏళ్ళు పెంచిన తండ్రి హృదయాన్ని... నిన్న కాక మొన్న పరిచయం అయిన వాడికోసం గాయపరచడం భావ్యమా? అన్న పిచ్చి వాదన దాని సారాంశం. 

కాలేజ్ లో ఆరేళ్ళు ప్రేమించి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకున్న వాడిగానే కాకుండా ఒక జర్నలిస్టుగా నేను ఈ స్టోరీ లో వాడిన కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ ను హర్షించలేక పోతున్నాను. ఇంత సీరియస్ చర్చలో సినిమా క్లిప్స్ వేసి పలచన/చులకన చేయడం కూడా నాకు మంచిగా అనిపించలేదు. టీ వీ జర్నలిజం బుద్ధి పోదుకదా! ప్రేమ అనే అద్భుతమైన అంశాన్ని డీల్ చేసే పధ్ధతి ఇదా? ఎం ఎల్ ఏ ఈలి నాని గారిని ఊరడించడానికి చేసిన ప్రయత్నం గా ఇది ఉంది. 

నిజమైన ప్రేమ వ్యవహారాన్ని సమాజం సరిగా డీల్ చేయడం లేదు (ఎన్ టీవీ వాళ్ళ లాగా). ప్రేమ మధురం అంటారు కానీ... నిజానికి, జీవితాంతం కలిసి ఉండాలనుకునే రెండు లేత హృదయాలు పడే ఘర్షణ, మూగ వేదన అది. ప్రేమికులు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం, లవ్ లెటర్స్ రాసుకోవడం, పార్కుల్లో తిరగడాన్ని ఎక్కువగా హై లైట్ చేస్తారు గానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు పడే తపనను అర్థం చేసుకోరు. ప్రేమికులు కూర్చొని గంటల తరబడి మాట్లాడే దాంట్లో ఏమి ఉంటుందో ఎవరూ పట్టించుకోరు. 
"పెద్దలను ఒప్పించడం ఎలా?" అన్న అంశమే వాళ్ళ చర్చల్లో సింహభాగంగా ఉంటుంది. ఎన్ టీవీ వాళ్ళు అనుకుంటున్నట్లు కంటి రెప్పలు కంటిని కాటేయ్యాలని అనుకోవు, నిజమైన ప్రేమికులు గడప దాటి తల్లి దండ్రుల గుండెల్లో గునపాలు గుచ్చాలి అనుకోరు, వారిని రాక్షసులు అనుకోరు. తండ్రి గుండె కోతకు అంతెక్కడ? అని ఎన్ టీవీ ప్రశ్నించింది. ప్రేమించిన పాపానికి... పెళ్ళైన ఐదేళ్ళ తర్వాత కూడా తండ్రి పెట్టిన నిర్బంధం లో ఉన్న ఆ అమ్మాయి గుండె కోత గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. 

పెద్దలను ఎలా డీల్ చేయాలో తెలియక, అందుకు కావలసిన కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, ధైర్యం చాలక ప్రేమికులు ఇబ్బంది పడతారు.  తమ జీవన యానంలో కన్నవారిని తోడుగా తీసుకుపోవాలని వారు పడే తపన ఎవరికీ అర్థం కాదు. ప్రేమ వ్యామోహం, ఒక స్వార్థం, తండ్రిని కాదని ప్రేమ పెళ్లి చేసుకుంటే నష్టం అనుకోవడం పూర్తిగా తప్పు, అవగాహనా రాహిత్యం. ఒక వైపు ప్రేమికుడు, మరొక వైపు కని పెంచిన తల్లి దండ్రుల మధ్య బాగా నలిగేది ప్రేమికురాలే. ప్రేమికులకు పేరెంట్స్ కు మధ్య ఉద్విగ్న పరిస్థితి, ఘర్షణ వాతావరణం మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అందుకు కావలసిన చారిత్రిక సాక్ష్యాలు బోలెడు ఉన్నాయి. తల్లి దండ్రుల మూర్ఖత్వానికి బలైన అమర ప్రేమికులకు, పేగు బంధాన్ని తృప్తి పరచడానికి మనసు పడిన వాడిని వదులుకుని రాజీపడి పెళ్లి చేసుకుని బతుకుతున్న వారికీ కొదవ లేదు. అలాగని అందరిదీస్వచ్ఛమైన ప్రేమ అనడం గానీ, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు మంచివి కావని అనడం కానీ నా ఉద్దేశం కాదు. వాస్తవాలను మరిచి వన్ సైడెడ్ స్టోరీలు ప్రసారం చేయడం, సమస్య ను అన్ని కోణాలలో నుంచి చూడకపోవడం తప్పంటాను.    

సినిమాలు, టీవీ సీరియళ్ళు, సోషల్ నెట్ వర్క్ లు జీవితాలు శాసించే ఒక దిక్కుమాలిన యుగం లో మనం బొర్లుతున్నాం. ఇక్కడ ఎలా బతకాలో మన పిల్లలకు నేర్పడం వినా మనకు వేరొక దిక్కు లేదు. మంచి ప్రేమికుడిని/ప్రేమికురాలిని ఎంచుకునే శక్తి సామర్ధ్యాలు, సొంత కాళ్ల మీద నిలబడే శక్తిని మన పిల్లలకు అందించడం మినహా మనమేమే చేయలేము. అది సాధ్యం కాదు. ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు కాకుండా... అయ్య చెప్పినట్లు వినకపోతే చచ్చి ఊరుకుంటారని బోడి సలహాలు ఇవ్వడం మంచిది కాదు. 

ఈలి నాని చేసిన బుద్ధితక్కువ పని...  

టీ వీ వాళ్ళ లైవ్ షోలకు రావడం ఎం ఎల్ ఏ ఈలి నాని చేసిన పెద్ద తప్పిదం, బుద్ధి తక్కువ పని. నిన్న సాయంత్రం TV 9 లో దీప్తి వాజ్ పేయ్ ఒక పక్క ఆయన్ను మరొక పక్క ప్రేమికులు కం నవ దంపతులను చూపి అర్థ గంటకు పైగా ప్రత్యక్ష ప్రసారం కానిచ్చారు. తండ్రీ కూతుళ్ళను కలపాలన్న తాపత్రయం దీప్తి గారిలో కనిపించింది కానీ ఆమె వేసిన ప్రశ్నలు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు ను పెంచేవిగా అనిపించాయి. ఇలా లైవ్ లో కాకుండా...వాళ్ళను ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి సముదాయిస్తే సమస్య పరిష్కారం అయ్యేదేమో అనిపించింది. 

తండ్రి పరువు కాపాడాలన్న తాపత్రయం నాని గారి కూతురిలో స్పష్టంగా కనిపించింది. లైవ్ షో లో నోటికొచ్చింది మాట్లాడి నాని తన అక్కసు వెళ్లగక్కుకున్నారు. అమాయకంగా ఆయన చేసిన ప్రకటనలు చూస్తే..అయ్యో పాపం అని కూడా అనిపించింది. లైవ్ షో లకు ఒప్పుకుంటే... గోరుతో పోయేది గండ్ర గొడ్డళ్ళు పెట్టినా పోదన్న సత్యాన్ని ప్రజలు గుర్తించాలి. ఐదేళ్ళు ప్రియుడు కోసం ఎదురుచూసి చివరకు అంత పవర్ ఫుల్ తండ్రిని ఎదిరించి అనుకున్నది సాధించిన నాని గారి కూతురుకు ఈ పోస్టు అంకితం. ఈ జంటకు కావాలంటే మనో బలాన్ని, న్యాయ సహాయాన్ని, జన బలాన్ని అందించడానికి ఈ బ్లాగు సిద్ధంగా ఉంది. 
నిజమైన, నిస్వార్ధమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. 

16 comments:

JE said...

గురు గారు
ప్రేమ వ్యామోహమ? అన్న డి తప్పేమో కని..నాని మాట్లాడిన మాటలు కానీ లైవ్ కి రావడం కానీ మీరో నేనో చెప్పేది కదు. అక్కడ కూతురు తండ్రిని విల్లన్ చేస్తుంటే తన వెర్షన్ తను విన్పించోడ్డ?? ఏదో టీవీ 9 బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు బిల్డ్ అప్ ఇవ్వడం ఎందుకు? ప్రేమలు వాటిలో బలం గురించి ఎందుకు discusion .? అన్ని ప్రేమ కథలు ఒకలా ఏడుస్తున్నాయ? అసలు ఈ ఎపిసోడ్ ఇంతటితో అవలెదు.రేపు ఆ సందీప్ గారు రమ్య గారిని ఎలా చుసుకుంటారో తేలుతుంది లెన్ది.. ఆ రోజు చిరు కూతురు బయటకి వెల్తె.. ఇలానే హుంగమ చేసి ఏదో వాళ్ళ ఫమిల్య్ అంత విల్లనలు ... శిరీష్ సర్ చాల మంచొదు.. పవన్ రౌడి అన్నట్లు తెగ కలరింగ్ ఇచరు.. రెండేళ్ళు అయ్యయి.. ఇప్పడా పెళ్లి ఏమైంది సర్/??? టీవీ 9 తెగ బ్రేక్
చేసింది కదా న్యూస్ ని.. వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దలేక పోయిన్డెం మరి? అంటే ఇష్టం వచ్చిన రోజులు అమ్మాయిని ఎంజాయ్ చెసి.. ఆస్థి దోచేసి తర్వాత మోజు తీరగానే వదిలేస్తే తిరిగి
పుట్టింటి వాళ్ళు ఆదరిచల? అంతే కానీ ముందే తండ్రి ఓ మంచి ఫ్యూచర్ కోసం కటువుగా వ్యవహరించడం తప్ప? ఈలి నాని ..కి చెప్పి వాళ్ళ కూతురు బయటకి వెళ్ళింద? లెదు.. కన్పించకపోతే కంప్లైంట్ ఇస్తరు.. అనుమానం సందీప్ మిద కాబట్టి బొక్కలో కూడా తొస్తరు. 5 ఏళ్ళు నిర్బంధం అన్తున్నరు. మరి ఈ 5 ఏళ్ళు సందీప్ ఎం గడ్డి పికుతున్నాడు? కనీసం ఎ రోజైన టీవీ 9, సహా ఉన్న 13 చానల్స్ లో ఏదైనా ఒక్క దాన్ని అయిన ఆశ్రయించాడ? లెదు.
ఇప్పుడు వాళ్ళ ఆవిడా అని చెప్పబడుతున్న రమ్య బయటకి వస్తే కానీ మొహం బయట పెట్టని సందీప్ దరింగ్ ఫెలో న? రేపు ఈయన గారు ఆమె ని పోషిస్తాడ? అసలు పెళ్లి అయింది అని చెప్పబడుతున్న టైం కి రమ్య వయసెన్థ.? అప్పుడే పెళ్లి అయితె.. మల్లి నిన్న ఎందుకు
పెళ్లి చేసుకున్నారు? మైండ్ యు నేను నాని కి కానీ ఎన్ టీవీ కి కానీ ఫ్యాన్ ని కాదు ..ఒ తిరుపతి
వెళ్తూనే డ్యూటీ మైండెడ్ జర్నలిస్ట్ అని ఓ శిర్షిక పెట్టిన జర్నలిస్ట్ గారికి ఇది తట్టదా ... న బ్లాగ్ న ఇష్టం అనుకునే వాళ్ళకి వేరే వాళ్ళ పర్సనల్ అందులోను ఓ తండ్రికి ఇంత కన్నా అవమానం ఉందని ఎపిసోడ్ లో లైవ్ లోకి రావడం బుడ్డి తక్కువ అని సలహా , అభిప్రాయం వ్యక్త పరిచేవారికి ఎందుకు ఆలోచన రాదు? మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన
ప్రతి లవ్ మ్యారేజ్ సక్సెస్ ..ఽ అలానే ఉంటుందని ఏంటి నమ్మకం?
ఓ సారి ఇలానే మీ ఇంట్లో ఫోన్ ఫోతే .. పని మనిషి ని అనుమనించొదూ అంతే generalization చేశి చావా గొటొద్దు అని గింజుకున్నారు తర్వాత ఏమైంది? ఎవరి పెర్చెప్తిఒన్ వారికీ ఉన్తున్ది. అసలు పర్సనల్ విషయాలపై చర్చలు అనే అంశం ఎవరి వీలుని బట్టి వారు మార్చుకుంటూ పోతార?
మీ శిర్షిక లో బిడ్డలా భవిష్యత్తు గురించి ఆలోచించే ఎవరైనా నాని మాటలనే సమర్ధిస్తారు
కాదు అంటే ఏదో పెద్ద లవర్స్ అందరికి రోల్ మోడల్ లనొ. ఐకాన్ అనో అనుకున్తరనుకుంటే వారి భ్రమ మాత్రమే

Bullabbai said...


టివి షోలు నే చూసినా సార్. ఆ పెద్దాయన్ని చూస్తే జాలేసింది. ఆయన టివి కి రావటం మీరన్నట్టు బుద్ధితక్కువ పని.

కాపోతే, మీరిదంతా ఒక పాత ప్రేమికుడి దృక్పధంలో రాసినట్టున్నరు. ఒక ఆడపిల్ల తండ్రిలా కాదు అనిపిస్తోంది.

ప్రేమికులందరూ బృందావనంలో బుడ్డ ఎంటీవోడు, కాజల్ కాదు.... మొన్నామధ్య జరిగిన కవిత కూతురు లాంటి కథలు కూడా అవుతాయ్.

Praveen Mandangi said...

What's wrong if she elopes with her lover? She is a major and she has freedom to do so.

Unknown said...

నిరన్‌జన్ రావు గారు మీరు చెప్పింది అక్షరాల నిజం

chakravarti said...

రాము గారు ప్రేమికులకి అండగా నిలుస్తాను అన్నందుకు మీకు జే జే లు పలకాలి.
అయితే పెద్దింటి అమ్మాయిలపై ప్రేమ వల విసిరి మీడియా అండతో బ్లాక్ మెయిల్ చేసే దగుల్బాజీలు మన మధ్య లేరు అంటారా? పెద్దవాళ్ళ ఇంటి వ్యవహారం అనగానే మీడియా కూడా ఉత్సాహపడుతుంది. ప్రచార దురద వుండే పౌర సంఘాలు, మహిళా నేతలు కెమెరా ముందుకి వచ్చి వాగుతారు. వల విసిరినవాడి వెనక వున్నవాళ్ళు పిల్ల కుటుంబ సభ్యులతో బేరసారాలు సాగిస్తారు. బేరం సెటిల్ అయితే గమ్మున వుంటారు. పెద్దింటి అమ్మాయిలని ప్రేమించే మాఫియా ఒకటి వుంది. దాని గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి హైదరాబాద్ వదిలి ఈ ప్రేమ బాగోతాలు గురించి అధ్యయనం చేయండి. మనం ఇక్కడ కూర్చొని ఒకటి రెండు కేస్ స్టడీలతో నిజమైన ప్రేమ, వాటి గొప్పతనం, అమ్మాయి కన్నవాళ్ళే విలన్లు అంటూ తీర్మానాలు చేయొద్దు సర్. గ్రౌండ్ రియాలిటీస్ చూడండి
chakravarti

Ramu S said...

అయ్యా... నేను అందుకే 'నిజమైన ప్రేమికులు' అని వాడాను. అపార్థం చేసుకోకండి.
రాము

chakravarti said...

రమ్య - సందీప్ ... నిజమైన ప్రేమికులు అని మీరు ఓ నిర్ధారణకి వచ్చారన్న మాట. వాళ్లకి న్యాయ సహాయం చేసేందుకు కొన్ని 'సంఘాలు' వున్నాయి. జన బలం కూడగట్టే ఛానళ్ళు వున్నాయి. మీరు మనో బలం ఇవ్వాల్సింది ఈలి నానికి... కూతురు చేసిన పనికి అన్ని విధాలా దెబ్బ తిని ఉన్నాడాయన. కాసేపు మీరు... జర్నలిస్ట్, సంఘ సేవకుడు, సామాజిక స్పృహ వున్న విద్యావంతుడు, ప్రేమ పెళ్లి చేసుకొన్న వ్యక్తి అనే విషయాలు పక్కన పెట్టి - ఆడ పిల్లని కన్న సగటు తండ్రిగా (ఖమ్మం, రామగుండం లాంటి వూళ్ళో ఘనమైన బందు గణం వుంది అనుకొందాం) ఆలోచించండి. ఆ తరవాత మీరు ఎవరికీ సాయం చేయాలో ఓ నిర్ణయానికి రండి.

శరత్ కాలమ్ said...

టపా బావుంది. నిజమయిన ప్రేమికులకు మీరిచ్చే మాద్దతు హర్షణీయం.

శరత్ కాలమ్ said...

టపా బావుంది. నిజమయిన ప్రేమికులకు మీరిచ్చే మద్దతు హర్షణీయం.

Sitaram said...

వాళ్ళు నిజమైన ప్రేమికులు అనుకోవడానికి కారణాలు ఉన్నాయి. ప్రేమించి పెళ్ళిచేసుకున్న తర్వాత ఐదేళ్ళ పాటు తండ్రి నిర్బంధంలో ఉంచినా భరించింది. మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోవో చూస్తా అని తండ్రి బెదిరించిన తర్వాత, భర్త మాయమయినట్లు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆమె మీడియాను ఆశ్రయించింది. తండ్రి పలుకుబడి గురించి, తాను ఏమి కోల్పోతున్నదో తెలిసి కూడా ప్రేమించిన వాడితోనే ఉండాలని ధనికుల అమ్మాయి నిర్ణయించుకోవడం మామూలు విషయం కాదు. ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
సార్... ఇక్కడ ఈలి నాని గారి బాధా అర్థం చేసుకోదగినదే. ఏ కన్న తండ్రికీ ఈ పరిస్థితి రాకూడదు. ఈ విషయాన్ని ఆయన సరిగా డీల్ చేయలేదని నాకు అనిపిస్తున్నది. అమ్మాయి ఐదేళ్ళు మొండి పట్టు తో ఉన్నప్పుడైనా... అల్లుడిని అక్కున చేర్చుకుని సహకరిస్తే బాగుండేది. అబ్బాయి హంతకుడో, దోపిడీ దారో కాదు కదా! అనవసరంగా ఆయన మీడియా విషవలయంలో చిక్కుకున్నాడు. లైవ్ లో ఆ అబ్బాయి, అమ్మాయి చాలా పద్దతిగా మాట్లాడారని నేను అనుకుంటున్నాను. 'ఈలి నాని మాట తప్పుడు, వాళ్ళతో నాకు సంబంధం లేదు,' వంటి ఎం ఎల్ ఏ గారి డైలాగులు అనవసరమని నా ఉద్దేశ్యం.
అయ్యా... నేను బాధ్యతా రహితంగా ఇది రాయలేదు. నాకూ ఒక కూతురు ఉంది. ఈలి నాని గారి లాంటి పరిస్థితి రేపు నాకు రాదని నేను అనుకోవడం లేదు. మారిన దేశ కాల మాన పరిస్థితుల ప్రకారం మనం మొండి పట్టును విడనాడాలి, తప్పదు. పిల్లలకు విశ్లేషణ శక్తి, తమ కాళ్ళ మీద తాము నిలబడే శక్తి ఇవ్వడం ఒక్కటే ఇలాంటి సమస్యకు పరిష్కారం అనిపిస్తున్నది.

థాంక్స్
రాము

Bullabbai said...


ఏందిది శరతన్నా, మీ బావతో ఏకీభవిస్తన్నావా?

ఒక్క ప్రశ్న అడుగుతాండా సమాధానం చెప్పు.. నీకు తెల్సినోల్లెవరైనా మార్తాండతో ఎలోపింగ్ కి అలోచిస్తంటే అప్పుడు కూడా ఇట్టానే 'హర్షణీయం' అంటావా?

బేతాళ కథల్లో లాగా నిజమే చెప్పు..అబద్ధం చెబితే తల వెయ్యి వక్కలవుద్ది! :)

Bullabbai said...

రాము అన్న, నిజమైన ప్రేమ.. అబద్దమైన ప్రేమ ఎంటండి బాబు?
ఇరవై ఏళ్ళు పెంచి, ఏది మంచో ఏది చెడో చెపుతున్న తండ్రి ది అబద్ధపు ప్రేమ అంటారా?

పిల్లలకి నేర్పాలి అన్నారు. ఆ పెద్దాయన చెస్తున్నది అదేకద. ఆ అమ్మయి వినటం లేదు.

మీ వాదన ఎట్టావుందంటే.. చాక్లెట్లెక్కువ తింటున్న పాపని మానమని చెపితే, చాక్లెట్టిచేంతవరకు అన్నం తిననని కూచుందనుకోండి.. ఆమెకి చాక్లెట్టంటే నిజమైన ప్రేమ అని, వాళ్ళ నాన్న చాక్లేట్లని అక్కున చేర్చుకుని ఆయనకూడా తినటం మొదలెట్టాలని అన్నట్టుంది.

మిమ్మల్నందరిని నార్వే ఫ్లైట్ ఎకించాలి.

K V V S MURTHY said...

చాలా విదేశాల్లో ప్రేమలకి,ఇక్కడి ప్రేమలకి పొంతన పెట్టకూడదు.అక్కడ ప్రేమ fail అయినా ఎవరి జీవితాన్ని వారు లాక్కొస్తారు.అదే మన దగ్గర..ఉడుకు తగ్గినాకా..ప్రియుడు మొహం చాటేస్తే మళ్ళీ ఆదుకోవలిసింది తల్లిదండ్రులే..! చిరంజీవి లాంటి మెగా స్టారుకే దిక్కు లేదు ఈ విషయంలో...అదీ మన సామాజిక పరిస్తితి..!కనక పిల్లలు కూడా మారుతున్న కాలాన్ని బట్టి స్వతంత్రంగ జీవించడం నేర్చుకోవాలి.అంతే తప్ప వయసు లో ప్రేమించి ఆనక విషాదాంతమైతే తల్లితండ్రులపై ఆధారపడకూడదు.

సామాజికులు కూడా మారుతున్న కాలాన్ని ..విలువలను గుర్తించి single గా వుండే తల్లులని చిన్న చూపు చూడటం మానుకోవాలి.కాపురం అంటే కలకాలం చేసేది అనే భ్రమల లోనుండి బయట పడాలి. అసలు పెళ్ళి అనే concept చాలా అసహజమైనది..ప్రక్రుతికి వ్యతిరేకమైనది..ఓషో చెప్పాడని కాదుగాని నిజాయితీగా..నిర్భయంగా యోచిస్తే పతి ఒక్కరికి తెలుస్తూనే వుంటుంది.

GMR said...

రాము గారు మీ పొస్త్ చేసిన పొస్తులలో అత్యంత చెత్త పొస్త్ ఇదే మీరు ప్రెమించి పెల్లి చేసుకుని సంతొషంగా వున్నంత మాత్రాన ఇలా రాయదం ఎమి బాగా లెదు, మీరు సమాజానికి ఎంథ దూరంగా మీ అలొచనలు వున్నయో తెలుసుకొవలి.

Praveen Mandangi said...

I am not against love marriages and elopings. Both of them are married but they did not date for temporary enjoyment as lovers in Kambalakonda park do. So, you need not talk bad about their private life.

Kishor said...

రాముగారి వాదన ఆదర్శవంతంగా ఉంది. కొందరు నాని వైపు వాదించారు. అందులో గ్రౌండ్ రియాలిటీ ఉంది. ఆపోజిట్ వాదనలే అయినా రెండు వాదాల్లోనూ సత్యాలున్నాయి. అయితే మీడియా విషయంలో మాత్రం దాదాపు అందరి అభిప్రాయం ఒకటే అయింది. అంటే... ఈ ప్రేమ కథలో మీడియాయే విలన్ అని భావించడానికి ఎవరికీ అభ్యంతరం లేనట్టుంది. ప్రేమ కథ సక్సెస్ అయినా ఫెయిలయినా జరిగే ప్రమాదం కంటే మీడియాకి ఎక్స్ పోజ్ కావడం వల్ల జరిగే ప్రమాదమే ఎక్కువని జనం గుర్తించారన్నమాట!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి