Sunday, April 25, 2021

నో ఐపీఎల్ కవరేజ్: ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్ణయం

కొవిడ్-19 రెండో తరంగం సృష్టిస్తున్న భయానక బీభత్సకాండ ప్రతి ఒక్కరినీ కుదిపివేస్తోంది. ఆపన్నులను ఆదుకోలేక చేతులెత్తేస్తున్న సర్కార్ వ్యవస్థ, దండుకుంటున్న కార్పొరేట్ వైద్య రంగం, ఆసుపత్రుల్లో బెడ్ల లేమి, ఆక్సిజన్ కొరత వంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య ఎలాగోలా బతికితేచాలని జనం నిస్సహాయంగా అనుకుంటున్నారు. కొవిడ్ కరాళ నృత్యంతో ప్రతి ఇంట్లో ఇప్పుడు విషాదం అలముకున్నది. 

ఈ దారుణ పరిస్థితుల్లో... జనం ఒక మతంగా భావించే క్రికెట్ పండగ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీ ఎల్) జోరందుకొంటోంది. జనం చస్తుంటే ఈ క్రికెట్ టోర్నమెంట్ కు కవరేజ్ ఇవ్వడం భావ్యంకాదని భావిస్తోంది.. ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక. తెలుగు జర్నలిస్టు జీ ఎస్ వాసు గారు ఎడిటర్ గా ఉన్న ఈ పత్రిక ఈ మేరకు... ఆదివారం సంచికలో ప్రముఖంగా ఒక సింగిల్ కాలం ప్రకటన చేసింది. 


 .  

 చావులు, ఆర్తనాదాలు మధ్య క్రికెట్ పండగను కవర్ చేయడం సముచితంగాలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని పత్రిక ప్రకటించింది. అయితే... అసలే వైరస్ భయంతో ఉన్న జనాలకు క్రికెట్ కొద్దిగా ఆటవిడుపుగా, మనసు దృష్టి మరల్చేదిగా ఉందని అనుకునే వారూ ఉండవచ్చు. దీని మీద ట్విట్టర్లో చర్చ, రచ్చ మొదలయ్యింది. దానికి ఎడిటర్ వాసు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్ ఈ పైన ఇచ్చాం. 

ఆ ఆనౌన్స్మెంట్ పూర్తి పాఠం ఇదీ: 

“India is going through its worst phase of the Covid pandemic. Hundreds of thousands of people are struggling, many in vain, to exercise their right to live, as a ramshackle universal healthcare system proves that it has no answers to the challenges posed by a creepy bug. The health ministry's daily bulletin of fresh positive cases and fatalities has hit the stratosphere, so have SOS messages from individuals and hospitals seeking oxygen refill and lifesaving medicines. Hospitals refuse fresh admissions for want of Covid beds. The rush at crematoriums is heart-breaking. Most of us already have friends or relatives who have succumbed to Covid-19 or are battling for life.

In such a tragic time, we find it incongruous that the festival of cricket is on in India, with layers of bio bubbles creating protection. This is commercialism gone crass. The problem is not with the game but its timing. Cricket, too, must accept that we are passing through an unprecedented crisis. In the circumstances. The Sunday Standard and The Morning Standard will suspend IPL coverage in the newspaper with immediate effect till a semblance of normalcy is restored. This is a small gesture towards keeping the nation's attention focused on life and death issues. We are sure that our readers will see the point. These are times when we must stand as one nation with one resolve. -ఎడిటర్” 

4 comments:

విన్నకోట నరసింహా రావు said...

// “ నో ఐపీఎల్ కవరేజ్” //

అసలు ప్రభుత్వం నో ఐపిఎల్ అంటే ఇంకా బాగుండేది.

విన్నకోట నరసింహా రావు said...

ఈ కరోనా కాలంలో ఈ క్రికెట్ జాతరను కవర్ చెయ్యం అని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని తమ సామాజిక స్పృహను చూపించుకున్న వార్తాపత్రిక వారిని అభినందిస్తున్నాను.

మేం ఏం తగ్గించుకోం, కరోనా మాత్రం తగ్గిపోవాలి అని అనుకుంటున్నట్లుగా ఉన్న జనాలకు కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం.

bonagiri said...

దేశమంటే ఎన్నికలు కాదోయ్,
దేశమంటే మనుషులోయ్...

దేశమంటే IPL కాదోయ్,
దేశమంటే మనుషులోయ్...

విన్నకోట నరసింహా రావు said...

Well said, Bonagiri garu 👏,

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి