Monday, December 28, 2009

తివారీ ఎపిసోడ్ నేర్పుతున్న పాఠం ఏమిటి?

రాజ్ భవన్ లో 87 సంవత్సరాల గవర్నర్ నారాయణ దత్ తివారీ చేసిన పాడు పనులను...ఛీ..ఛీ..అని చీత్కరించుకున్న చాలా మంది తామేదో సత్యసంధులన్నట్లు లెక్చర్స్ ఇస్తుంటే...భలే నవ్వు వస్తుంది. పశు వాంఛతో  నిర్లజ్జగా...తమ సహచరులనో, కింది స్థాయి ఉద్యోగులనో ట్రాప్ చేసిన/చేస్తున్న జనం-- అధికార్లు, నేతలు, జర్నలిస్టులు--నీతులు పలికితే!!!

కాస్త చూడటానికి ఎర్రగా బుర్రగా ఉండే ఈ తివారీ తాతయ్య చాలా రోజుల నుంచి ఇలాంటి పాడు పనులు చేస్తున్నాడనీ, తనను ఏకాంతంగా కలిసే కాంతలకు ఏకంగా మంత్రి పదవులు ఇచ్చేవాడని చెబుతున్నారు. తివారీ బృందం నుంచి తనకు డబ్బు రావాల్సిన మహిళ బ్లాక్ మెయిల్ చేయడానికి ఆ ఫోటోలు తీసి...వారిని బెదిరించి...ఇక లాభంలేదని వాటిని ఆంధ్రజ్యోతి ఛానల్ కు అందించింది. ఒకవేళ వారు ఆమె డబ్బు తిరిగి ఇచ్చివుంటే...గవర్నర్ బాగోతం బైట పడేది కాదు గదా! ఇలా దొరకని దొంగలకు మన సమాజంలో కొదవే లేదు.


నిజానికి మన వ్యవస్థలో తివారీలు అడుగడుగునా కనిపిస్తారు. సినిమా జనం, నాయకులు, పోలీసు అధికారులు, వ్యాపారవేత్తలు...ఇలా అన్ని వర్గాల వారూ ఈ తరహా అనైతిక కార్యకలాపాలలో ఆరితేరారు. వీరి గురించి లోతుగా తెలుసుకుంటే...వీళ్ళూ మనుషులేనా? మనుషులు ఇంత ఘోరంగా ఉంటారా? అనిపిస్తుంది. ఆధునికత...ఎవడి ఇష్టం వాడిది...అన్న వాదనలతో మనుషులు పశువులుగా మారిపోతున్నారు, వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారు.
ప్రశాంత జీవనం కోసం నాగరికులమైన మనం ఏర్పరుచుకున్న...ఒక నిబంధనల చట్రానికి లోబడి నైతిక రుజు వర్తనతో ఉండాలన్న స్పృహ కొరవడుతున్నది. ఆదర్శప్రాయమైన వ్యక్తులు తగ్గిపోతున్నారు.


నేను పనిచేసిన ఒక చోట...మెల్లకంటితో దున్నపోతులా ఉండే...ఒక నీచ నికృష్ట కామాంధుడు ఉండే వాడు. వాడికి కులం, కాలం కలిసి రాబట్టి...అనతికాలం లోనే పెద్ద స్థాయికి చేరుకున్నాడు--బుర్ర తక్కువ అయినా. వాడికి అక్కడ ఉజ్జోగం ఊడాక ఇప్పుడు వాడి కులానికే చెందిక ఒక రాజకీయ పార్టీకి ప్రెస్ సంబంధ సేవలందిస్తూ ఆ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడనేది వేరే విషయం. 

భార్య, పిల్లలు ఉన్న వీడు...ఆఫీసు పక్క గల్లీలో ఆఫీసు బాయ్ ఇంట్లో ఒక అమ్మాయిని ఉంచి...సాయంత్రం పూట అక్కడకు వెళ్లి వస్తుండే వాడు. ఆ ప్రాంతంలోనే ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళిన నేను..ఆ అమ్మాయిని చూసాను. ఆమె చిన్న పిల్ల...ఈ ఎదవ కూతురు వయస్సు కన్నా...తక్కువ వయస్సు ఉంటుంది. ఆ అమ్మాయిని సంప్రదించి...ఏ పరిస్థితుల్లో ఈ ఊబిలో చిక్కుకోవాల్సి వచ్చిందో కనుక్కుని హెల్ప్ చేస్తే బాగానిపించింది. ఇంతలో ఆ అమ్మాయి అదృశ్యం అయ్యింది.

ఇలాంటి చచ్చు వెధవలు మీడియా లో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. విచిత్రం ఏమిటంటే...ఈ దుర్మార్గులే...పెద్ద స్థాయిల్లో ఉన్నారు. ఇంకా దుర్మార్గం ఏమిటంటే...ఈ వెధవలంతా...పెళ్ళైన సహ ఉద్యోగినులను ట్రాప్ చేస్తున్నారు. ఎందువల్లనో గానీ..ఈ మహాతల్లులు ఈ ట్రాప్ లో పడి సంసారాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఈజీ ఫేం, ఈజీ మనీ కోసం అమాయకంగా చిక్కుకుంటున్నారు. ఆడది ఒక ఆట వస్తువు...ఈమెను ఎరగా వేసి ఏ పనైనా చేయించుకోవచ్చు...అని నమ్మే...దుర్మార్గులు కొందరు...ఛానెల్స్, పేపర్స్ పెట్టడంతో పరిస్థితి విషమించింది. 


వీళ్ళు తాము టార్గెట్ చేసిన అమ్మాయిలను....చాలా పగడ్బందీగా ట్రాప్ చేస్తారు. ముందుగా వృత్తిలో వారి పనితనాన్ని పొగుడుతారు. ఫోన్లు, ఎస్.ఎం.ఎస్.లు ఎక్కువ చేస్తారు. వారికి మంచి అసైన్మెంట్లు ఇచ్చి ప్రోత్సహించి...తమపై ఆధారపడేట్లు  చేస్తారు. ఆ తర్వాత బైటకు..భోజనానికో, షాపింగ్ కో పిలుస్తారు. గిఫ్టులతో మనసు దోస్తారు. మన పిచ్చి తల్లులు...మిడిమిడి జ్ఞానంతో మీడియా లో ఎదిగిపోవాలని భావిస్తారు కాబట్టి...ఈ ఛీప్ ట్రిక్ లకు పడిపోతారు. ఆ తర్వాత బెదిరింపులకు లొంగిపోతారు. సినిమా సంస్కృతీ తన వంతు దుష్ట పాత్ర పోషిస్తున్నది.

"ఏంటి గురూ...అక్రమ సంబంధాల గురించి తెగ బాధపడి పోతున్నావ్? అది ఇప్పుడు మీడియా లో ఫాషన్ అయ్యింది. నీకు ఇష్టం ఉన్న యాంకర్ ను వాడుకో...అని నాకు బాస్ చెబితే...ఆడపిల్లలు ఇంత తేరగా ఉన్నారా? వాళ్లకు మనసులు లేవా? అనిపించింది. వ్యవస్థ బ్రష్టు పట్టింది," అని ఒక సీనియర్ పాత్రికేయుడు చెప్పాడు.

"సార్...మొఖానికి రంగు పులుముకునే..(మేక్ అప్) ఏ వృత్తిలో అయినా..అక్రమ సంబంధాలు చాలా మామూలు. సంసారులైన మహిళలు ఈ వృత్తికి దూరంగా ఉండడం మంచిది," అని లాయర్ కం కాంట్రాక్టర్ అయిన ఒక మిత్రుడు వ్యాఖ్యానించాడు. పరిస్థితి మారకపోతే...తెలివిగల ఆడపిల్లలను తెలిసి తెలిసీ వారి తల్లిదండ్రులు ఈ వృత్తికి దూరంగా ఉంచుతారు...భద్రతలేని కారణంగా. అది వృత్తిలో జన్డర్ బ్యాలన్సు ను మరింత దెబ్బ తీస్తుంది. కాబట్టి..బాస్ లు స్వీయ నియంత్రంతో...వర్క్ ప్లేస్ లలో నైతికత కు పెద్దపీట వెయ్యాలి. పిచ్చి వ్యవహారాలను ప్రోత్సహించకూడదు.


ఇతర రంగాలలోని వారు...ఇలాంటి కక్కుర్తి పనులకు పాల్పడడం వేరు, మీడియాలో వారు  ఇలా చేయడం వేరు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి...సమాజానికి వీలైనన్ని సుద్దులు, హితాలు బోధించే వీరు కాస్త నైతికంగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఆడపిల్లలు...పిచ్చి ప్రలోభాలకు లొంగకుండా...ప్రొఫెషనలిజం తో మెలగడం నేర్చుకోవాలి. పిచ్చి ప్రతిపాదనలు చేసే బాస్ ల తోలు తీయడానికి చట్టాలు ఉన్నాయి. వారు మీరు అనుకుంటున్నంతగా...చట్టానికి అతీతులు కాదు. చూడండి...తివారీ లాంటి...రాబందు...ఒక్క దెబ్బకు రాలిపోయింది. మెరుగైన సమాజానికన్నా ముందు...మెరుగైన జీవితాలు ఏర్పాటుచేసుకుందాం.

14 comments:

Saahitya Abhimaani said...

Shall I tell you what I feel about this Tiwari affair! When the powers that be decided to remove him and post a strong man to control the state, in case Governor's rule is to be imposed, Tiwari not only would have resisted but would have resorted to black mail in his own way. So the trap was reversed and selectively clues were planted with the eager media and the task was accomplished.

I am sure we shall get a Governor with Military or Police background which in itself is indicative of what the thinking is at the top.

Regarding, traping women, I am of the opinion that it cannot be one way traffic. I am not privy to any first hand information but from what I read and listen, I am of the view that in most of the cases its consensual trying to exploit their position and body.

సుజాత వేల్పూరి said...

చాలా హృద్యంగా ఉంది మీ వ్యాసం!

ఒకవేళ వారు ఆమె డబ్బు తిరిగి ఇచ్చివుంటే...గవర్నర్ బాగోతం బైట పడేది కాదు గదా! ..ఇది చాలా విలువైన పాయింట్!

మీరు చెప్పిన విషయాలు చాలా వరకు తెలిసినవే అయినా ఆడపిల్లలు ఇటువంటి ట్రాప్ లకు, ఆకర్షణలకు ఎలా లొంగిపోతారా అని ఆవేదనగా ఉంది. కొందరు తెలిసే లొంగితే మరికొందరు అమాయకత్వంతో చేస్తారేమో ఈ పనులు! మొత్తానికి పేపర్ వాళ్ళు రాసే "మాయమాటలు చెప్పి బుట్టలోవేశాడు" అనే పాయింట్ ఈ నాటి ఆడపిల్లలకు చాలా మందికి వర్తించదు కానీ ...ఏదో ఒకరంగా మోసపోయే వారిలో ఆడపిల్లలే ఎక్కువ! ఎప్పటికి వివేకం తెచ్చుకుంటారో ,పక్కా ప్రొఫెషనలిజంతో ఎప్పటికి మెలుగుతారో ఏమిటో..దిగులేస్తుంది ఒక్కోసారి!

మీ వ్యాసాలన్నింటిలోకీ ఇది చాలా ఆవేదనతో, కదిలిపోయి రాసినట్లు అనిపిస్తోంది. ఆలోచల వూబిలోకి నెట్టేసేలా ఉంది. అభినందనలు!

"మెరుగైన జీవితాలతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుందని" నీతులు వల్లించేవారు ఎప్పటికి గ్రహిస్తారో!

రవిచంద్ర said...

నిజమే నండీ! మన సమాజంలో ఇలాంటి చీడపురుగుపు చాలా మంది ఉన్నారు. దొరికిన వాళ్ళే దొంగలు. మిగతా వాళ్ళు దొరలుగా చలామణీ అవుతూనే ఉన్నారు.

Kathi Mahesh Kumar said...

నిజమే! చాలా తీవ్రమైన సర్వవ్యాప్తమైన సమస్య.
కానీ ఈ సమస్యకు కేవలం ఒక కోణం మాత్రమే ఉందంటారా? పెల్విక్ ధ్రస్ట్ ఈజ్ ఆల్వేజ్ ఎ గుడ్ కెరీర్ మూవ్ అంటున్న మహిళామణులుమాత్రం లేరూ!

Anonymous said...

బడిలో, గుడిలో, కార్ఖానాల్లో, ఇతర పని స్తలాల్లో ఉన్నంత వ్యభిచారమే మీడియాలో ఉంది. మీ రాతల వల్ల బ్లాగ్ రేటింగ్ పెరగొచ్చు. అదే సమయంలో మీడియాలో ఉన్న ప్రతీ అమ్మాయినీ ట్రయ్ చేయవచ్చనే అభిప్రాయం ఈ ఆథరైస్డ్ మీడియా బ్లాగ్ చదివిన వాడికి అనిపిస్తుంది. సినిమా అమ్మాయిలకు పబ్లిక్ తో ఇంటరాక్షన్ అవసరం లేదు. జనంలో తిరిగే మీడియా అమ్మయిలకు గాసిప్ లు క్రేజ్ కు బదులు కీడే చేస్తాయి. మీరేం మేలు చేస్తున్నారు ఇలాంటి రాతలతో? చేతనైతే బాస్ ల మీద కంప్లైంట్లతో బయటికి వచ్చే లేడీ జర్నలిస్ట్ లకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలను సమాయత్తం చేసి అంబుడ్స్ మన్ లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయించండి.

మీడియా మేల్ డామినేటెడ్. మీడియా సంఘాలూ మేల్ డామినేటెడ్. ఒకప్పుడు మీడియాలోకి వచ్చిన మగాళ్ళూ మిడిమిడి తెలివి తేటలతో వచ్చిన వాళ్ళే. అనుభవంతో సీనియర్లు అయ్యారు. ఇప్పుడే ఆడాళ్ళు మీడియాలోకి వస్తున్నారు. మగ సీనియర్ దగ్గర శిష్యరికం చేసిన మగాళ్ళను చెంచాగిరి అన్నారు. అదే పని చేసే ఆడాళ్ళకు సెక్స్ కోణాన్ని ముందుకు తెస్తున్నారు.

కాస్త ఎదుగు బాస్.

Sujata M said...

చాలా చాలా బావుంది. సుజాత గారన్నట్టు చాలా టచింగ్ గా ఉంది.. అమ్మాయిలు కెరీర్ లో ఎదగడానికి సహకరిస్తున్నట్టుగా నటిస్తూ - కనీసం తమకు ఆ అమ్మాయి చాలా 'క్లోస్!!' అనే భావన ని ఇతరులకు కలిగించడం వగైరా దాకా నేను ప్రత్యక్షం గా చూసాను. అయితే ఈ ప్రవృత్తి అన్ని రంగాలలోనూ ఉంది. కొన్ని రంగాలలో ప్రత్యక్షంగా కొన్ని రంగాల్లో పరోక్షంగా ఉండొచ్చు. సూటిగా వేధింపులకు దిగకుండా ఇలా నెమ్మదిగా 'అట్నుంచి నరుక్కుని రావడం !' గురించి చాలా ఆవేదన తో రాశారు. మీకు అభినందనలు.

MAHESH said...

mada pichi pattina kukkalu society lo chaala mandi vunnaru.dorikite donga dorakkapote dora.media ki ee madhya black mailing yekkuvayyindi.

Anonymous said...

badilo..gudiloo...boss,

maga seniyar daggara sishyarikam cheyadam tappu ani analede yee postulo. sishyarikam chestunnadi kadaa ani "guru seva" cheyinchukuntunnarani, gurvunu nammi bharthaku panganaamaalu pette vaallu yekkuvaayyarani...medialo yevarikainaa telusu. chowdari laanti tuchhulu media loki vachhaka, chittakaarthepu bosslu andalaalu yekkaaka aada pillalaku rakshana ledu. samasyanu charchinchavaddu ante elaa?

saakshi

Anonymous said...

ఇందులో మేల్ డామినేషన్ గట్రా చెత్త టాపిక్కులు ఎందుకు ప్రవేశిస్తాయో నాకు తెలియదు. మన వర్తమాన సమాజంలో రకరకాల ఆడవాళ్ళున్న మాట నిజం.

నిజం మాట్లాడితే తట్టుకోలేని తత్త్వం మన సమాజంలో చాలా ఎక్కువని ఇక్కడ ప్రతిస్పందనగా వచ్చిన కొన్ని వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. చెప్పడానికి ఏమీ లేకపోతే "నీకు ఆలోచన లేదు, నువ్వు ఎదగలేదు, నువ్వు అమాయకుడివి, తెలుసుకో" ఇలా దాడి చేస్తారు. అవతలి వ్యక్తి యొక్క పరిశీలన, అనుభవం కూడా విలువైనవేనని, ఎంతో కొంత నిజం లేకుండా అవతలి వ్యక్తి ఆవేదన వ్యక్తం చెయ్యడని ఈ తెలుగు జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో ?

admin said...

visit once my post..

http://www.innervoice.co.cc/2009/12/ndtiwar-nehru-gandhi.html

Anonymous said...

Ravi

రామూ గారు... మీరు చెప్పింది అక్షరాలా వాస్తవమే... మీడియాలో అనేక మంది అమ్మాయిలను అందునా పైళ్లైన వారిని అవసరాలకు వాడుకుంటున్నవారు చాలా మందే ఉంటున్నారు. మీరన్నట్లు లొంగదీసుకోవడం, ఇతరత్రా కారణాలేవైనా కావచ్చు కానీ దుర్మార్గపు బాస్ ల వల్ల అనేక మంది అమాయకుల జీవితాలు బలవుతున్నాయి. అంతెందుకు తివారీ ఎపిసోడ్ లో స్ర్కీన్ పై కనిపించి, కార్యక్రమాన్ని రక్తి కట్టించిన యాంకర్ సంగతి ఎవరికి తెలియదు. తానేం చక్కటోడా... అంతెందుకు అదే ఛానల్లో పెద్ద హోదాలో ఉన్న ఓ పెద్ద మనిషి కారణంగా ఓ ఫిమేల్ యాంకర్ భర్త ఆత్మహత్య చేసుకున్న విషం ఎవరికి తెలియదు...
ఇదంతా చూస్తుంటే గువింద గింజ సామెత గుర్తుకు రాకమానదు.

Anonymous said...

kids, grow up.

your writing reminds me, "vruddha naari pativrata".

why are we running away from reality?

on one hand, we support feminism, liberal values etc.. then, whats wrong if a woman takes the liberty of pelvic thrust as the best career move?

whats wrong, if a senior throws freebies to attract women?

why should a less brainy in your office accept a more brainy's promotion as reality?

if a person can use brain to get ahead in career, whats wrong to use other bodily parts to get ahead?

Are you not reminded of these great sayings, when the demigod NTR used Laxmi parvati? Those, who cried for that news reader's husband's sucide - do you people remember the name 'veeragandham venkata subbarao'?. He is LP's husband. while he is in marital relationship with LP, NTR used her.

the bottomline is, you all have to get along with the currents. No need of crying that the currents are a little less/more fast now.

Anonymous said...

Ramu garu

One of my friend also fell in trap of one big reputed person's trap, he used her and now he left her, as usually in this media people use girls only for a while which is very heart aching. Sir, I would like to help my friend as I can't see her pain.
But that person is very big and politically influenced. We have to teech them lesson if not justice atleast. Cause my friend will never let that person's name come out in public, cause she is scared
what to do.

Ramu S said...

Hi sir/ma'am
common citizens needn't suffer in silence. If your friend has any proof to nail the so called influential man, it will not be a problem. The problem with our system is we can't fight against such unscrupulous fellows discreetly. One should come out to fight against them.
You may approach Mr.Ramachandra Murthy of Hm-TV to get a better advice. Murthy gaaru is available in his office in the morning hours. Please don't suffer in silence. Extend your full support to your friend and we will be with you.
Ramu
mittu1996@gmail.com

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి