Wednesday, August 4, 2010

తాడేపల్లి గారూ...మరి ఈ కీచకుడిని ఏమి చేద్దాం?

నిన్న సాయంత్రం రవి ప్రకాష్ గారి ఛానల్ TV-1 లో ఒక క్రైం స్టోరీ చూస్తుంటే...Reproductive Rights, తాడేపల్లి గారు అప్రయత్నంగా గుర్తుకు వచ్చారు. ముందుగా ఆ కథనాన్ని వివరించి, ఆ తర్వాత నాకు అనిపించిన దాన్ని తెలియజేస్తాను.

వాడొక తెలుగు దేశం పార్టీ నాయకుడు. పార్టీ లో ఏదో పదవి వుంది. పెళ్ళైన వాడే. వాళ్ళ భార్య ఎం.పీ.టీ.సీ.సభ్యురాలు కాగా అమ్మ సర్పంచు. అంటే...రాజకీయ అండదండలు కలవాడే. వాడికి మాటి మాటికీ ఆ రైట్స్ గుర్తుకు వచ్చి కాబోలు...వూళ్ళో ఉన్న అమ్మాయిలను ఇబ్బంది పెట్టేవాడని అభియోగం. మొన్నీ మధ్య ఆ వూళ్ళో విద్యా వాలంటీర్ గా చేరిన ఒక యువతి ని కోరిక తీర్చమని అడిగాడట. పైగా...తన దయవల్లనే ఆమెకు ఆ ఉద్యోగం వచ్చిందని ఊళ్ళో చెప్పుకున్నాడట.
ఈ లీడరు గాడి వెర్రి వ్యవహారాన్ని ఆ అమ్మాయి తన ఇద్దరు అన్నలకు వెళ్లి చెప్పింది. ఇద్దరూ చెల్లితో కలిసి వాడి ఇంటికి (లంకంత కొంప) వెళ్లి సారును బైటికి పిలిచారు. విషయం అడిగి పిచ్చ కొట్టుడు కొట్టారు. వాడు ఇంట్లోకి పారిపోతే...వెంటబడి కుర్చీలతో బాదారు. మరొక సారి ఇలా వెర్రిగా ప్రవర్తిస్తావా? అంటూ పంచె ఊడబీకారు. సారు మాన సంరక్షణార్థం కార్పెట్ అడ్డం పెట్టుకోబోతే...దాన్ని కూడా గుంజి పారేసి....వాడిని ఇంటి బైట డ్రాయర్ మీదనే కూచోబెట్టారు. 


వాడిని చూడగానే...నేను గతంలో రాసిన 'ఈ నరరూప కీచకులకు బతికే హక్కు ఉందా?' అన్న పోస్టు, తాడేపల్లి గారి వాదన గుర్తుకు వచ్చాయి. మనసులో మాట ఉన్నది ఉన్నట్టు చెప్పి తన వాదన వినిపించిన సాటి బ్లాగర్ తాడేపల్లి గారిని కించపరచడానికో, హేళనచేయడానికో ఇది రాయడంలేదని గమనించగలరు. దీని మీద ఒక చర్చ జరగాలి.

ఒక జర్నలిస్టు అయి ఉండి...ఈ హింసను సమర్థిస్తావా? నీకు బుద్దిలేదా? అని మీరు అన్నా పర్వాలేదు. చట్టాన్ని చేతులోకి తీసుకోవడం నేరం కదా? అని మీకు అనిపించినా అనిపించవచ్చు. నాకైతే...ఆ ఆమ్మాయి, అన్నలు చేసిన పని పెద్దగా తప్పు అనిపించలేదు. నా అనుకున్న వాళ్ళ పట్ల ఇలాంటి వాడు ఇలానే ప్రవర్తిస్తే....రాజకీయ ఒత్తిడికి తలొగ్గని నికార్సైన ఎస్.ఐ. లేదా ఎస్.పీ. ఉన్నాడేమో చూస్తా. వాళ్ళతో లాభం లేదనుకుంటే మాత్రం....సర్వశక్తులు ఒడ్డి నా 'ప్రయత్నం' నేను చేస్తా. "ఓరినాయనోయ్...ఒట్టిగా రమ్మన్నందుకు (సారీ... ప్రపోజ్ చేసినందుకు)  ఇంత పెద్ద శిక్షా? ఇలాగైతే...నాకు మూడో తరగతి నుంచి ఈ పాటికి ఒక యాభై సార్లు శిక్ష పడి ఉండాలి...." అని అమెరికా బాబులు అన్నా...చట్టాన్ని చేతిలోకి తీసుకున్నందుకు శిక్ష వేస్తామన్న బెదిరేది లేదు.

తాడేపల్లి గారూ.... నేను శీర్షికలో వీడిని కీచకుడు అని పేర్కొన్నా? అది మన వాడికి అతుకుతుందంటారా? మొత్తానికి
ఈ కేసులో మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది.

44 comments:

Anonymous said...

ఆర్యా ! మీరు నన్నుద్దేశించి టపా వ్రాసిన తరువాత స్పందించక తప్పుతుందా ?

మీరు వ్రాసినది సుపరిచితమైన కథే. మన దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పునరావృత్తమయ్యే గాథే. పాత్రధారులు మారతారంతే. ఈ కథలో ఇంకొంచెం ట్విస్టు ఏర్పడి ఇదే అమ్మాయి ఆ వ్యక్తితో లేచిపోతే తదుపరి మూడో ట్విస్టులో ఇదే గుడ్ సమారిటన్ అన్నయ్యలు ఆమెనీ, ఆమె ప్రియుణ్ణీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అప్పుడు ఇదే మీడియా honour killings విషయంలో ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని బజారుకెక్కుతుంది. "ఆడదానికి పుట్టింట్లో కూడా రక్షణ లేకుండా పోయింది మొఱ్ఱో" అంటూ శోకాలు పెడుతుంది. ఎందుకంటే ఈ honour killings లో కూడా జాలి అంతా ఆడదాని జీవితం కోసం, ఆమె ఫీలింగుల కోసం రిజర్వు చేయబడి ఉంటుంది. మగవాడు ఏ శంకరగిరి మాన్యాలు పట్టినా ఎవఱికీ పట్టదు. ఇహ నాలుగో రకం ట్విస్టులో ఈ honour killing సందర్భంగా ఒకవేళ మగవాడొక్కడే చనిపోయి పొఱపాటున ఆడది మాత్రం సర్వైవ్ అయిందనుకోండి. అటుపిమ్మట ఆ అమ్మాయి కోర్టులో ఏమని సాక్ష్యం చెబుతుందనుకుంటున్నారు ? అతను తనని కిడ్నాప్ చేశాడని, తనని తనవాళ్ళు రక్షించడానికి వస్తే అతను దారుణంగా ఎటాక్ చేశాడని, ఆత్మరక్షణ కోసం అతన్ని తనవాళ్లూ చంపక తప్పలేదని చెబుతుంది. మగవాడి ప్రేమకష్టాల గుఱించి, రిస్కుల ఆలోచించేవాళ్లే అఱుదు. అంటే అక్కడ "తప్పు" చేసినది అమ్మాయి కనుక ఆ "తప్పు" (సాంప్రదాయిక విలువల దృష్ట్యా తప్పయినది) చాలా ఉదారంగా exonerate చేయబడుతుంది. ఆ తప్పు చేసిన ఆడవాళ్ళకి చట్టపరంగా రక్షణ కావాలని డిమాండు కూడా చేయబడుతున్నది. చిత్రంగా అప్పుడు ఈ లైంగికనీతులన్నీ ఫటాఫట్ ధనాధన్ అదృశ్యమైపోతాయి. అంటే ఆ అమ్మాయి పురుషాకర్షణలో పడడం, తద్ద్వారా పెళ్ళికాకుండానే గర్భం ధరించడం అనే female reproductive rights కి రక్షణ కల్పించాలని సోకాల్డ్ అభ్యుదయవాదులు గట్టిగా నిలదీస్తున్నారు. కానీ ఈ ఆకర్షణ ఆ స్థాయి దాకా ఫలించడానికి ఆమె కంటే ముందు చొఱవ తీసుకొనే ఒక ప్రధాన పాత్రధారి (మగవాడి) యొక్క Right to courtship కి ఏ విధమైన శాసనిక రక్షణా అవసరం లేదనీ, అది పోకిరీతనమనీ, అంతేకాక ఆ చొఱవ తీసుకున్నందుకు అతన్ని శిక్షించాలనీ, కనీసం అతని పరువు తీసి అతనింకెప్పుడూ ఎవఱినీ ప్రేమించకుండా గట్టిగా బుద్ధి చెప్పాలనీ, అతన్ని చూసి ప్రతిమగవాడూ ఆడదాన్ని ప్రేమించడం ఎంత ప్రమాదకరమో గుణపాఠం నేర్చుకోవాలనీ కోరుతున్నారు.

మీరు వ్రాసిన కేసు గుఱించి కూడా రాస్తాను. ముందు నా stand ఏంటనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. నేనేమంటున్నాను ? - ఈ పై దుర్విచక్షణ నశించాలనీ, మగవాడిక్కూడా ఆడదానిలాగానే ఎదిరి లింగజాతిని ప్రేమించే హక్కు, ఆ ప్రేమని తనకు తోచిన నాగరిక మార్గాలలో ఎన్నిసార్లయినా వ్యక్తీకరించే హక్కూ ఉన్నాయనీ అంటున్నాను. తన ప్రేమకు బాధ్యత వహించే అవకాశాన్ని అతనికి కనీసం ఒకసారైనా ఇవ్వాలని డిమాండు చేస్తున్నాను. నిరాయుధులూ, అతిసామాన్యులూ, గతంలో ఎలాంటి నమోదిత నేఱస్థ చరిత్రా లేనివారూ అయిన నిరపరాధ మగవాళ్ళని - కేవలం ఒక ఆడదాన్ని ప్రేమించారన్న కారణం చేత ఆడవాళ్ళ పట్ల దురాక్రమణదారులు (aggressors) గా, దుష్ప్రవర్తనులుగా చిత్రించే సంకుచిత ధోరణి మారాలని ఆకాంక్షిస్తున్నాను. మగవాడి ప్రేమను లైంగిక పోకిరీతనంగా కాక దాని యొక్క యథార్థ స్వరూపంలో ప్రేమగా అర్థం చేసుకునే సమాజం నాకు కావాలని అడుగుతున్నాను. మగవాడి తప్పొప్పుల్ని ఆడదాని సాక్ష్యం మీదనే సోల్ గా ఆధారపడి అతన్ని నేఱస్థుడుగా నిర్ధారించే ఏకపక్ష, పక్షపాత పూరితమైన ఫెమినిస్టు దుర్విధానం పోవాలనీ, తప్పొప్పుల నిర్ధారణకై (కేవలం ఆడదాని దృక్పథంతోనే కాక) ఉభయ లింగజాతులకూ సమానంగా సమ్మతమైన, అన్నిరకాల పరిస్థితులనూ దృష్టిలో ఉంచుకొన్న, అన్ని రకాల పరిస్థితులకూ అనువర్తనీయమైన, విశాలప్రాతిపదికమైన ఒక (broad-based) జెండర్-న్యూట్రల్ ఆబ్జెక్టివ్ క్రైటీరియన్ ఉండాలనీ కోరుతున్నాను. ఆడదాని కామాన్ని ప్రేమగానూ, మగవాడి ప్రేమను కామంగానూ ప్రచారం చేసే పాత అశాస్త్రీయ రొడ్డకొట్టుడు విధానానికి ఫుల్ స్టాప్ పెట్టి రెంటినీ సమానంగా లైంగిక ప్రేమ (sexual love) గానే అర్థం చేసుకోవాలనీ, ఏదీ రెండోదాని కంటే ఎక్కువ పవిత్రమైనది గానీ, అపవిత్రమైనది గానీ కాదనీ చెబుతున్నాను.

--తాడేపల్లి

Anonymous said...

ఆర్యా ! మీరు నన్నుద్దేశించి టపా వ్రాసిన తరువాత స్పందించక తప్పుతుందా ?

మీరు వ్రాసినది సుపరిచితమైన కథే. మన దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పునరావృత్తమయ్యే గాథే. పాత్రధారులు మారతారంతే. ఈ కథలో ఇంకొంచెం ట్విస్టు ఏర్పడి ఇదే అమ్మాయి ఆ వ్యక్తితో లేచిపోతే తదుపరి మూడో ట్విస్టులో ఇదే గుడ్ సమారిటన్ అన్నయ్యలు ఆమెనీ, ఆమె ప్రియుణ్ణీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అప్పుడు ఇదే మీడియా honour killings విషయంలో ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని బజారుకెక్కుతుంది. "ఆడదానికి పుట్టింట్లో కూడా రక్షణ లేకుండా పోయింది మొఱ్ఱో" అంటూ శోకాలు పెడుతుంది. ఎందుకంటే ఈ honour killings లో కూడా జాలి అంతా ఆడదాని జీవితం కోసం, ఆమె ఫీలింగుల కోసం రిజర్వు చేయబడి ఉంటుంది. మగవాడు ఏ శంకరగిరి మాన్యాలు పట్టినా ఎవఱికీ పట్టదు. ఇహ నాలుగో రకం ట్విస్టులో ఈ honour killing సందర్భంగా ఒకవేళ మగవాడొక్కడే చనిపోయి పొఱపాటున ఆడది మాత్రం సర్వైవ్ అయిందనుకోండి. అటుపిమ్మట ఆ అమ్మాయి కోర్టులో ఏమని సాక్ష్యం చెబుతుందనుకుంటున్నారు ? అతను తనని కిడ్నాప్ చేశాడని, తనని తనవాళ్ళు రక్షించడానికి వస్తే అతను దారుణంగా ఎటాక్ చేశాడని, ఆత్మరక్షణ కోసం అతన్ని తనవాళ్లూ చంపక తప్పలేదని చెబుతుంది. మగవాడి ప్రేమకష్టాల గుఱించి, రిస్కుల ఆలోచించేవాళ్లే అఱుదు. అంటే అక్కడ "తప్పు" చేసినది అమ్మాయి కనుక ఆ "తప్పు" (సాంప్రదాయిక విలువల దృష్ట్యా తప్పయినది) చాలా ఉదారంగా exonerate చేయబడుతుంది. ఆ తప్పు చేసిన ఆడవాళ్ళకి చట్టపరంగా రక్షణ కావాలని డిమాండు కూడా చేయబడుతున్నది. చిత్రంగా అప్పుడు ఈ లైంగికనీతులన్నీ ఫటాఫట్ ధనాధన్ అదృశ్యమైపోతాయి. అంటే ఆ అమ్మాయి పురుషాకర్షణలో పడడం, తద్ద్వారా పెళ్ళికాకుండానే గర్భం ధరించడం అనే female reproductive rights కి రక్షణ కల్పించాలని సోకాల్డ్ అభ్యుదయవాదులు గట్టిగా నిలదీస్తున్నారు. కానీ ఈ ఆకర్షణ ఆ స్థాయి దాకా ఫలించడానికి ఆమె కంటే ముందు చొఱవ తీసుకొనే ఒక ప్రధాన పాత్రధారి (మగవాడి) యొక్క Right to courtship కి ఏ విధమైన శాసనిక రక్షణా అవసరం లేదనీ, అది పోకిరీతనమనీ, అంతేకాక ఆ చొఱవ తీసుకున్నందుకు అతన్ని శిక్షించాలనీ, కనీసం అతని పరువు తీసి అతనింకెప్పుడూ ఎవఱినీ ప్రేమించకుండా గట్టిగా బుద్ధి చెప్పాలనీ, అతన్ని చూసి ప్రతిమగవాడూ ఆడదాన్ని ప్రేమించడం ఎంత ప్రమాదకరమో గుణపాఠం నేర్చుకోవాలనీ కోరుతున్నారు.

మీరు వ్రాసిన కేసు గుఱించి కూడా రాస్తాను. ముందు నా stand ఏంటనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. నేనేమంటున్నాను ? - ఈ పై దుర్విచక్షణ నశించాలనీ, మగవాడిక్కూడా ఆడదానిలాగానే ఎదిరి లింగజాతిని ప్రేమించే హక్కు, ఆ ప్రేమని తనకు తోచిన నాగరిక మార్గాలలో ఎన్నిసార్లయినా వ్యక్తీకరించే హక్కూ ఉన్నాయనీ అంటున్నాను. తన ప్రేమకు బాధ్యత వహించే అవకాశాన్ని అతనికి కనీసం ఒకసారైనా ఇవ్వాలని డిమాండు చేస్తున్నాను. నిరాయుధులూ, అతిసామాన్యులూ, గతంలో ఎలాంటి నమోదిత నేఱస్థ చరిత్రా లేనివారూ అయిన నిరపరాధ మగవాళ్ళని - కేవలం ఒక ఆడదాన్ని ప్రేమించారన్న కారణం చేత ఆడవాళ్ళ పట్ల దురాక్రమణదారులు (aggressors) గా, దుష్ప్రవర్తనులుగా చిత్రించే సంకుచిత ధోరణి మారాలని ఆకాంక్షిస్తున్నాను. మగవాడి ప్రేమను లైంగిక పోకిరీతనంగా కాక దాని యొక్క యథార్థ స్వరూపంలో ప్రేమగా అర్థం చేసుకునే సమాజం నాకు కావాలని అడుగుతున్నాను. మగవాడి తప్పొప్పుల్ని ఆడదాని సాక్ష్యం మీదనే సోల్ గా ఆధారపడి అతన్ని నేఱస్థుడుగా నిర్ధారించే ఏకపక్ష, పక్షపాత పూరితమైన ఫెమినిస్టు దుర్విధానం పోవాలనీ, తప్పొప్పుల నిర్ధారణకై (కేవలం ఆడదాని దృక్పథంతోనే కాక) ఉభయ లింగజాతులకూ సమానంగా సమ్మతమైన, అన్నిరకాల పరిస్థితులనూ దృష్టిలో ఉంచుకొన్న, అన్ని రకాల పరిస్థితులకూ అనువర్తనీయమైన, విశాలప్రాతిపదికమైన ఒక (broad-based) జెండర్-న్యూట్రల్ ఆబ్జెక్టివ్ క్రైటీరియన్ ఉండాలనీ కోరుతున్నాను. ఆడదాని కామాన్ని ప్రేమగానూ, మగవాడి ప్రేమను కామంగానూ ప్రచారం చేసే పాత అశాస్త్రీయ రొడ్డకొట్టుడు విధానానికి ఫుల్ స్టాప్ పెట్టి రెంటినీ సమానంగా లైంగిక ప్రేమ (sexual love) గానే అర్థం చేసుకోవాలనీ, ఏదీ రెండోదాని కంటే ఎక్కువ పవిత్రమైనది గానీ, అపవిత్రమైనది గానీ కాదనీ చెబుతున్నాను. (ఇంకా రాశాను కింద)

--తాడేపల్లి

Anonymous said...

ఇందులో ఇంకా రెండు విషయాలున్నాయి . ఒకటి, స్త్రీపురుష సంబంధాలు ఎలా ఉండాలని మనం అనుకుంటున్నాం ? కానీ, అవి వాస్తవ ప్రపంచంలో ఎలా ఉన్నాయి ? మనం అనుకోవడం ముఖ్యమా ? అవి కన్సిస్టెంట్ గా సర్వేసర్వత్రా ఎలా ఉన్నాయనేది గమనించడం ముఖ్యమా ? మనం ఒకటి ఒకలా ఉండాలని ఆశిస్తే సరిపోదు. ప్రకృతి అందుకు సహకరిస్తుందా ? అని కూడా ఆలోచించాలి. ప్రకృతి సహకరించడం లేదనే కదా, వీరేశలింగం పంతులుగారు బాలవితంతువులకు పెళ్ళి చేయాలని విప్లవం లేవదీసింది. ఇన్ని నీతులు చెబుతున్నా, ఇన్ని శిక్షలు వేస్తామంటున్నా మగవాళ్ళు ఆడవాళ్ల వెంట ఎందుకు పడుతున్నారో ఒకసారి సహానుభూతితో స్థిమితంగా ఆలోచిద్దామా ? వద్దా ? బాలవితంతువుల ప్రకృతి జాలిపడదగినదైతే, మగవాళ్ళ ప్రకృతి మాత్రం నిందించదగినది ఎందుకవుతుంది ?

కాబట్టి మన ముందున్నకర్తవ్యం - బాలవితంతువుల ప్రకృతికి వీరేశలింగం గారు కల్పించిన వ్యవస్థాగత వెంటిలేషన్ ని ఆడవాళ్ళని ప్రేమించే మగవాళ్ళ ప్రకృతిక్కూడా కల్పించడమా ? లేక ఆడదాన్ని ప్రేమించిన ప్రతిసారీ మగవాణ్ణి అందఱం కలిసి చితక్కొట్టేసి చంపేయడమా ? అందఱికీ పొలోమని బలవంతంగా అరేంజ్డ్ మేరేజి, ఏకపత్నీవ్రతం ప్రిస్క్రైబ్ చేయడం వల్ల వచ్చిన సామూహిక మానసిక దుష్పరిణామాలివి. The bitter fact we steadfastly refuse to acknowledge is, one size does not fit all. And things like love, sex, marriage are too personal to lay down a common blanket rule.

Right ro courtship is just one of the many reproductive rights of men.

అయితే ప్రతి హక్కుకూ కొన్ని సానుకూల మునువలయికలు (favourable prerequisites) ఉంటాయి. నేను ఈ హక్కు గుఱించి చెప్పినప్పుడు ఆ అన్ని మునువలయికల్నీ దృష్టిలో పెట్టుకొనే చెప్పాను. వాటి గుఱించి కూడా రాస్తే ఇది ఇంకా పెద్ద వ్యాఖ్య అవుతుంది.

మీరు వ్రాసిన కేసు విషయానికొస్తే - ఆడదాన్ని కాపాడ్డం, ఆడదాన్ని శీలానికి కాపలా కాయడం - ఈ రెండింటి మధ్యా మన జనం కన్‌ఫ్యూజ్ అవుతున్నారని నా అభిప్రాయం. తనను తాను రక్షించుకోజాలని ఆడదాన్ని ఆమె యొక్క ప్రస్ఫుట అభ్యర్థనపై భౌతికంగా కాపాడ్డం మగవాడి బాధ్యత. ఆమె శీలాన్ని కాపాడ్డం మాత్రం అతని డిపార్ట్‌మెంట్ కాదు, అతను ఆమెకు భర్తయినా సరే, అన్నయినా సరే, నాన్నయినా సరే ! అది ఆమె చూసుకోవాల్సిన విషయం. కానీ మన దేశంలో ఈ శీలం గొడవల గుఱించి మగవాడు ఆడదానికి కాపలాదారుడయ్యాడు. పోలీసయ్యాడు. యజమాని అయ్యాడు, శత్రువయ్యాడు. ఎన్నో అయ్యాడు కానీ మిత్రుడు మాత్రం కాలేకపోయాడు. ఈ డ్యూటి నుంచి మగవాడు విరమించుకుంటే తప్ప అతనికీ, ఆమెకీ ఇద్దఱికీ సుఖం లేదు. ఈ కథలో పైన చెప్పిన మూడో ట్విస్టు ఎందుకు తలెత్తుతుందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే అతన్ని ఆమె అన్నయ్యలు ఎందుకు చావగొట్టారో అది కూడా అర్థం చేసుకోవచ్చు.

శతాబ్దాల క్రితం ప్రేమ కోసం చనిపోయిన ఒక మగవాడి పేరిట ఈనాటికీ వాలెంటైన్ డే జఱుపుకుంటున్నాం. ప్రేమ కోసం చనిపోయిన దేవదాసు అనే బెంగాలీ జమీందారు కథని ఎన్నిసార్లు చూసినా తనివి తీఱడం లేదంటున్నాం. తండ్రిగారి ఆస్తుల రూపంలో ఆయన పోషణ రూపంలో అందఱమూ మగవాడి ప్రేమకు వారసులుగా జీవిస్తున్నాం. కానీ మగవాడు ప్రేమమయమూర్తి అంటే నమ్మని ఫెమినిస్టు వాతావరణానికి కృత్రిమంగా మనం లోను చేయబడ్దాం.

ఇప్పటికే చాలా రాశాను సార్. కనుక ఇంతటితో విరమిస్తున్నాను. ఈ అవకాశమిచ్చినందుకు నెనర్లు.

--తాడేపల్లి

katta jayaprakash said...

Regarding the TV1 story about beating a politician for his advances towards local women it is not proper to talw into one's hands.But as police s usual might not take any action the politician and hence the lathi charge.In the same away if a reporter or journalist behaves abnormally through his reporting hurting the people with character assasination the reporter also must be beaten as in the case of TV1 story.We come across many incidents of attacks on doctors and hospital.If Ramu supports the TV1 story of beating a politician in his own house for the criminal activity then the citizens have to physically attack any one who is involed in criminal,unethical,uncivilised way of life.First th reporters who backmail and exort money must be thrashed in the society and so also in other proffessions too if police are negligent.But how can it be justified as every one takes law into their hands creating chaos in the society.
JP

Manjusha kotamraju said...

ఒక అమ్మాయిని అన్యాయం గ ఇబ్బంది పెట్టినవాడికి ఇంకా మాన మర్యాదలేంటండి,,,ఇలాంటి వాళ్ళని ఊరు అంతా ఊరేగించాలి,,వాల్ల అన్నలు మంచి పని చేసారు..

..nagarjuna.. said...

అసలీ యవ్వారమంతా trivialగా అనిపిస్తుంది నాకు. ఓ వ్యక్తికి ఇంకో వ్యక్తి ఇష్టమైతే సహచర్యం కోసం విన్నవించుకునే హక్కు ఉంటుందిగాని నాతో సెక్స్ చెస్తావా అని బలవంతపెట్టడం హక్కు ఏంటో...

ఒకవేళ అలాచేయొచ్చు అనుకున్నా ఆ భావన వాళ్ల సమాజాన్నిబట్టి ఉంటుందిగాని అందరికీ ఆపాదిస్తే ఎట్లా...

Anonymous said...

అతన్ని కీచకుడు అని ముందే ప్రి-జడ్జ్ చేసేశారు. True to media nature. ఇహ చెప్పేదేముంటుంది ? అతను ప్రేమని కేవలం వాచికంగా వ్యక్తీకరించడమేనా ? అంతకంటే ఇంకేమైనా అదనంగా చేశాడా ? అనేది తెలియడం లేదు. నాకు తెలిసినంతవఱకు ఇందులో ఇంకో అంశం ఉంది. సాధారణంగా మన దేశంలోని సామాజిక వాతావరణం దృష్ట్యా తమ కుటుంబస్త్రీలని ప్రేమించిన స్వకులస్థుడికీ, అదే పని చేసిన పరాయి కులస్థుడికీ ఒకే విధమైన మన్నింపు (treatment) ని మనవాళ్ళు ఇవ్వరు. అమల్లో ఉన్న ఛట్టాల ప్రకారం అతనిది తప్పయితే అతన్ని కొట్టడం కూడా వాటి ప్రకారమే తప్పవుతుంది. అతనితో వ్యవహరించడానికి వ్యవస్థాగత ఏర్పాట్లు ఉన్నప్పుడు చట్టాన్ని వారు తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని మీరు హర్షించినా నేను హర్షించలేను. ఈ జబ్బు అన్ని ఇతరరంగాలకూ పాకుతుందనీ, ఇప్పటికే చాలావఱకు పాకిందనీ మీరు మర్చిపోతున్నట్లున్నారు.

మీ చివఱి గద్య (paragraph) లో మీ బాధ్యతని పూర్తిగా disclaim చేసేశారు. ఇహ అక్కడ కూడా చెప్పేదేముంటుంది ? కానీ నా అభిప్రాయం అడిగారు కాబట్టి చెబుతున్నాను. ప్రేమ, పెళ్ళి, శృంగారం - ఇవి రోడ్ల మీద కండబలంతో మొఱటుగా అనాగరికంగా తేలాల్సిన విషయాలని నేననుకోవడం లేదు. వివాహితులు ఇంకో అమ్మాయిని ప్రేమించడం తప్పనేది కూడా నా అభిప్రాయం కాదు. అది వాళ్ళవాళ్ళ కన్వీనియన్సుగా, వాళ్ళవాళ్ళ అంతర్గత సర్దుబాటుగా చూస్తాను. స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ జీవితాల్ని పాడుచేయడం కంటే వారిని ప్రేమించి రెండో పెళ్ళి చేసుకోవడం, కుటుంబంలో స్థానాన్ని కల్పించడం ఎల్లప్పుడూ స్వాగతించదగ్గ విషయమే. Sexual over-drive ఉన్నవాళ్ళ ఎనర్జీ సమాజంలోని మిగతా ఆడవాళ్ళకి అపకారం చేయని విధంగా దాన్ని సరిగా వాహినీకరించడానికి, వారి సావధానాన్ని కొంత ఉన్నతంగా మళ్ళించడానికి, వారిని బాధ్యతాయుతులుగా మార్చడానికీ అటువంటి సాంప్రదాయిక సర్దుబాట్లు తప్పకుండా దోహదిస్తాయి.

తమని వాంఛించే మగవాళ్ళ ఉద్దేశాల్ని సక్రమంగా అర్థం చేసుకొని వారితో నాగరికంగా వ్యవహరించే విధానం మన దేశపు ఆడవాళ్ళకు తెలియకపోవడం వల్ల, అందులో వారికి ఏ విధమైన శిక్షణా లేకపోవడం వల్ల ఆ మగవారు అనవసరంగా విలన్లుగా చిత్రించబడుతున్నారని నేననుకుంటున్నాను. They are completely unprepared, ill-equipped, confused and terrified with the thought of a man approaching them. ఒక మగవాడు తమని ఇష్టపడుతున్నాడని తెలియగానే ముందు మన ఆడవాళ్ళు చాలా టెన్షన్ పడిపోతారు. ఆ టెన్షన్ ని రకరకాలుగా మార్చి తమవాళ్ళతో చెబుతారు. వాళ్ళు ఆమెకి సర్దిచెప్పాల్సింది పోయి, తాము స్వయంగా టెన్షన్ పడిపోయి ఆమె భయాల్ని మఱింత పెంచి "వాడి అంతు చూస్తాం" అంటూ పెద్ద వీరుల్లా బయల్దేఱతారు.

చాలా అపార్థాలు ముఖాముఖీ ఒకసారి మాట్లాడుకుంటే తొలగిపోతాయి. These woman can personally talk to the suitor politely and gently and straightforward tell him their opinions. కానీ ఒక్క ఆడది కూడా ఈ option వాడుకోదు, She just plainly refuses to face him. ఆమె చేసేదల్లా తమవాళ్ళతో చెప్పి అతన్ని కొట్టించడం. వాళ్లు కూడా అంతే బుద్ధిహీనంగా అతనితో ఏమీ మాట్లాడకుండానే అతన్ని కొట్టేస్తారు. What''s so civilized or brainy about this approach ?

ప్రేమవ్యవహారాల్ని మనం అడ్డుకోలేనప్పుడు కనీసం వాటిల్లో తలెత్తే వివాదాల్ని సర్వజనామోదయోగ్యంగా పరిష్కరించడం కోసమైనా ప్రభుత్వం ఒక వ్యవస్థాగతమైన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, Public Registry of Romantic Affairs లాంటిది. ఇలాంటిదానిలో ఉభయసమ్మతి గల ప్రేమికులు రిజిస్టర్ అయితే వారి క్లెయిముల్లో సత్యాసత్యాల్ని పరిశీలించడం సులభమవుతుంది. రిజిస్టర్ కానివాళ్ళు ప్రేమికులు కాదనే భావించాలి. ముఖ్యంగా ఆడవాళ్ళ అభిప్రాయాల/ సాక్ష్యాల మీదనే ఆధారపడి మగవాళ్ళని బలిపశువుల్ని/ విలన్లని చేసి శిక్షించే సంస్కృతి తగ్గుతుంది. అదే సమయంలో లైంగిక వేధింపులనీ, మానభంగాన్నీ అందఱికీ ఆమోదయోగ్యంగా నిర్వచించే చట్టాలు కూడా రావాలి.

--తాడేపల్లి

తుంటరి said...

ఇంతకీ ఆ అమ్మాయి అతని కోరిక తీరిస్తేనే ఉద్యోగం వచ్చిందా? ఆ విషయం మీరు రాయలేదు బహుశా అవసరం లేదనుకునిఉంటారు. ఇక్కడ తాడేపల్లి గారి వాదన అదే, ఒక ఆడపిల్ల ని హింసించారు ఒక ఆడపిల్లని ఏడిపించారు అంటూ వాళ్ళు చేప్పేదానికే importance ఇచ్చి మగవాడిని పెద్ద నరరూప రాక్షసుడిగా చూపెట్టడం ఆమోదయోగ్యం కాదు. అయితే తాడేపల్లి గారు చెప్పినది జరగాలంటే మనుషుల్లో responsibility పెరగాలి. బలహీనులని రక్షించే వ్యవస్థ ఉండాలి. అది మగ అయినా ఆడ అయినా. ఈ case లో మొదట ఆడది బలహీనం గా ఉంది (అనుకుందాం) తరువాత మగవాడు బలహీనం గా ఉన్నాడు. రెండు సార్లు చట్టం పని చెయ్యలేదు ఎవరికి తోచినది వాళ్ళు చేసేసారు. మీరు ఇంకో పది మంది ఆడవాళ్ళ మీద సానుభూతి చూపించేసారు ఇది ఎలా కరక్ట్?

Vinay Datta said...

It is disgusting to read the same old justifications of Tadepally garu again and again. How can anybody name the abnormal behaviour of a man ' prema kashtaalu '? Tadepally garu, please don't reply to this.

Dinakar said...

@LBS తాడేపల్లి గారు: బావా.. అసలు విషయం కొంత... నీ పైత్యం కొండంత కనిపిస్తోంది.. ఇంతకి.. ఆ అమ్మాయి బదులు నీ చెల్లెలిని ఆ MLA అట్లా పిలిచి ఉంటే, నీ చెల్లెలు నీకు చెప్పుకుని బాధపడితే, నీ చెల్లెలి మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ఎం చేసేవాడివి? చెప్పు.. కండబలం ఉంటే కొట్టేవాడివి.. బుద్ధిబలం ఉంటే పోలీసులకు చెప్పేవాడివి.. ఇక్కడ సోది చెప్పేవాడివి కాదు.. ఇక్కడున్న వారందరికి Male Ego ఉంది.. అలాగే.. మితిమీరిన feminism మీద కోపం కూడా ఉంది.. ఆడవాళ్ళు ప్రకృతి రీత్యా శారిరకంగాను, మానసికంగాను పరిమితులు కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఏది ఇస్తే అంతకి పదింతలు తిరిగి ఇస్తారు.. నువ్వు ప్రేమిస్తే, పదింతలు ప్రేమ నీకు తిరిగి ఇస్తారు, ఒక్కసారి వాళ్ళకి సహాయం చేస్తే వంద సార్లు అడగకుండానే సహాయం చేస్తారు.. వాళ్ళ భావాలని కాపాడటం మన పెద్దవాళ్ళు మనకి నేర్పించిన ఒక మంచి లక్షణం.. అలాంటి వాళ్ళ మీద కామాన్ధులు దాడి(Harass) చేయటం, దాన్ని మీలాంటి వాళ్ళు ప్రోత్సహించడం మంచిదేనా?.. ఈరోజుకి కూడా విడాకులు తీస్కున్న భార్యాభర్తల్లో భర్తకి ఉన్నంత మర్యాద స్త్రీకి లేదు.. ఇంక Sexually జెనరలైస్ చేస్తూ అందరికి ఒకటే రకమైన హక్కులు, రూల్స్ కావాలంటే ఇక్కడ (INDIA) లో కుదరదు..

But స్త్రీ parliamentary reservations గురించి మీరు వ్రాసిన articles చదివాను.. బాగున్నాయి.. I like the way you presented..

regards,
Dinakar.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

There are many valid points in Tadepally gaari opinion.

Anonymous said...

//ప్రభుత్వం ఒక వ్యవస్థాగతమైన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, Public Registry of Romantic Affairs లాంటిది. //

హా..హ్వా సలహా బాగుంది.

అలాంటి మంత్రిత్వ శాఖ మంత్రిగా ఎవరుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నా..

Anonymous said...

"...ఆడదాని కామాన్ని ప్రేమగానూ, మగవాడి ప్రేమను కామంగానూ ప్రచారం చేసే పాత అశాస్త్రీయ రొడ్డకొట్టుడు విధానానికి ....."

ఈ ఒక్క వాక్యం లో చెప్పాల్సిందంతా అద్భుతంగా చెప్పారు అనిపిస్తోంది.

తార said...

snkr గారు,

ఇంకెవ్వరూ, తివారి..

Anonymous said...

మాధురిగారూ ! మీరిక్కడ వ్యాఖ్య రాస్తే వద్దని నేనన్నానా ? మఱి మీరెందుకలా అంటున్నారు ? ఒక ప్రత్యేక కేసు గుఱించి కాదు నా గొడవ. అందులో ఎవఱు హీరో, ఎవఱు హీరోయిను, ఎవఱు విలను - ఇది కాదు నా గొడవ. ఈ కేసుల్ని ఏ దృష్టితో చూడాలనేదాని గుఱించే నా గొడవ. రెండోది, ఏమీ అనుకోకపోతే మీకూ నాకూ ఒక ప్రధానమైన తేడా ఉంది. "ఇదిగో పులి అంటే అదిగో తోక" అనే వాళ్ళు ఎక్కువ సమాజంలో ! నేను వారిలో ఒకణ్ణి కాను. మీడియా అందించే ప్రతివార్తనీ వేదవాక్కుగా నేను భావించను. భావించి ఎవఱి మీదా ఆవేశకావేశాలు పెంచుకోను. వాళ్ళు ఒకఱిని ఏదో అన్నంత మాత్రాన నేను కూడా అదే అనేయాలని తొందఱపడను. ప్రతి కథ వెనుక మనకు తెలియని కథ పది రెట్లుంటుందని నా అభిప్రాయం. బయటికొచ్చే ప్రతికథా Tip of the iceberg. ఆ లోగుట్టు ఏంటో తెలిసేదాకా నేనెవఱినీ వేలెత్తి చూపను.

Dina గారూ ! ఏమీ అనుకోవద్దు, మీ ఏకవచన ప్రయోగం నాకు నచ్చలేదు. నేను మీకేమవుతాను, నన్ను ఏకవచనంలో పిలవడానికి ? నేను మీ కంటే ఎక్కువగా స్త్రీల సంక్షేమాన్ని కోరేవాణ్ణే. కానీ న్యాయం అనే పదాన్ని ఆడదానికే కాక మగవాడిక్కూడా విస్తరించాలనీ, నేఱస్థులైన మగవాళ్ళ గుఱించి ఆలోచించేటప్పుడు వ్యవస్థ నిరపరాధులైన, అన్యాయంగా బుక్కవుతున్న, డబ్బుకోసం ఆడవాళ్ళ కేసుల్లో అన్యాయంగా ఇఱికించబడుతున్న మగవాళ్ళ వ్యథనీ, ఒక పేద-మధ్యతరగతి individual మగవాడి కష్టసుఖాల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలనీ కోరుతున్నాను. బహుకొద్దిమంది నేఱస్థులైన మగవాళ్ళ గుఱించి యావత్తు మగజాతి మీదా ఫెమినిస్టులు దుష్ప్రచారం చేయడాన్ని అడ్డుకోవాలని, ఆ ప్రాతిపదిక మీద ప్రతి మగవాణ్ణీ చట్టపరంగా బలహీనుణ్ణి చేసి అతని కష్టార్జితమైన డబ్బును క్రూరంగా దోచుకునే ప్రభుత్వవిధానాలు నశించాలనీ ఆక్రోశిస్తున్నాను.

సమానత్వం నా సిద్ధాంతం ఎప్పటికీ కాదు. అది ఫెమినిస్టుల సిద్ధాంతమే. కానీ ఆ సిద్ధాంతం పట్ల నిజంగా ఫెమినిస్టులకు నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, వారు మగజాతి యొక్క మానవహక్కుల్ని, పౌరహక్కుల్ని హరింపజేసే అనేక చట్టాల్ని కేంద్రప్రభుత్వం చేత ఎనాక్టు చేయించేవారు కారు. ఆడవాళ్ళు మగవాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, వారి అదుపాజ్ఞల్లో ఉంటే మీరు వ్రాసినది కఠోర వాస్తవం. కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఈనాడు మగవాడు ఆడదానికి డిప్యూటీ మొగుడు మాత్రమే. అసలు మొగుడు గవర్నమెంట్. డిప్యూటీ మొగుడు పొఱపాటున ఏమైనా అంటే అసలు మొగుడు రంగంలోకి దిగి అతన్ని చితక్కొడతాడు. కనుక మీరు నా వ్యాఖ్య గుఱించి వాపోతున్నది పూర్తిగా అసంబద్ధమే కాక వ్యక్తిగత నిందాదూషణ కూడా అవుతుంది.

Anonymous said...

రామూగారూ ! దయచేసి ఏమీ అనుకోవద్దండీ. నేనొక పక్కా సీరియస్ రైటర్ ని. కానీ మీ బ్లాగులో సీరియస్ చర్చలకు అవసరమైన వాతావరణం కొఱవడినట్లు కనిపిస్తున్నది, కనుక దీన్నే నా చివఱి వ్యాఖ్యగా భావించవలసినది. ఇప్పటిదాకా దయతో నా వ్యాఖ్యల్ని ప్రచురించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

కిరణ్ said...

మీరు దయ చేసి తాడేపల్లి ని పిలవకండి... చాదస్తపు వ్యక్తీ..

ఇక ... కళ్ళు మూసుకు పోయిన వాడికి కళ్ళు తెరిపించటం లో తప్పేం లేదు ... అతన్ని అన్నలు కొట్టటం తప్పుకాదు... ఎవరైనా అదే చేస్తారు... పట్టణం లో పోలీస్ కేసు వేస్తే సరిపోతుంది... ఊరిలో ఐతే ఇలా పరువు తీయటం కూడా చేయాలి ...

Saahitya Abhimaani said...

Amartyasen did not keep the title for his book as "Argumentative Indian" without reason. In India, you name it, on any act of omission or commission, you will find people eloquently arguing in favour of such activity, howsoever nefarious it may be.

In the intial days of USA as a country which is presently known as bastion of freedom, lawlessness was just a matter of fact and quite routine. Fortunately, that country under such circumstances sprung up some people as good and strong leaders, who took ruthless action with iron hand. They did not even think of looking for the so called other angles of some crime and circumstances under which the crime was said to have been committed. They just punished the crime. After several decades of such rule of law, the Country became the land of Statue of Liberty. But even now, they could not get rid of criminal gangs.

Fortunately, they did not have human rights activists or argumentative Indians or Lilly livered liberals who very selectively support a section of criminals under one pretext or other.

For India also, in the present day society, freedom has become too much rather, there is unnecessary freedom. That is the root cause of all criminal activity. There is no fear of law because its lethargic and moves with a sole motive to beat the snail. There is a dubious name for a Lawyer in Telugu as Nyayavadi. I find that word quite ridiculous because whoever coined that word did not do any justice for the English word Lawyer. Lawyers are 100% responsible for the justice system to degenerate. They are more interested in a point of law rather than justice. There are many more such contributing factors for loafers to become leaders and pester innocent people in the society. Lets call a crime a crime and let the severest punishment be meted out to the perpetrators of such crime and such punishment should be quick and exemplary. Otherwise, naturally people take the law into their hands and such events become TRP earning points for the media.

వీర said...

తాడేపల్లి గారు చాల చాల చక్కగ వివరించారు. దినకర్ ఇక్కడ సోది అనే పదం మీరు రాయటం బాగా లేదు. రాము గారు అడిగారు కనుక తాడేపల్లి సమాధానం చెప్పారు. నీకు జరిగితె అని ఉహాజనిత ప్రశ్నలు వేయటం అర్థ వంతం గా లేదు.

*ఆడవాళ్ళు ప్రకృతి రీత్యా శారిరకంగాను, మానసికంగాను పరిమితులు కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఏది ఇస్తే అంతకి పదింతలు తిరిగి ఇస్తారు.. నువ్వు ప్రేమిస్తే, పదింతలు ప్రేమ నీకు తిరిగి ఇస్తారు, ఒక్కసారి వాళ్ళకి సహాయం చేస్తే వంద సార్లు అడగకుండానే సహాయం చేస్తారు.. *

పైన రాసినది చూసి మీరు పెద్దరాయుడు సినేమాకి గోస్ట్ రైటరేమొ అని అనుమానం గా ఉంది.

*ఈరోజుకి కూడా విడాకులు తీస్కున్న భార్యాభర్తల్లో భర్తకి ఉన్నంత మర్యాద స్త్రీకి లేదు.. *
నాకు తెలిసి ఈ రోజుల్లో విడాక్లు తిసుకున్న స్రీ మాజి భర్త కన్నా ముందరగా రెండొ పెళ్ళి చెసుకున్న వారు చాలా మంది ఎగువ మధ్య తరగతి లో చూసాను. ఎవ్వరు ఖాళీ గా లేరు. ఇంకా చెప్పాలి అంటె మొగ వారికే రెండో పెళ్ళి కావటం కష్టం గా ఉన్నాది. కారణం పిల్ల నిచ్చే వారు ఇతను ఇటువంటి వాడో, మొదటి ఆమే ఎందుకు వదలి పెట్టిందో అనే అనుమానాలు ఉన్నాయి. అదే మీరు చెప్పిన జాబ్ చేసే స్రీ విషయం లో వారు కొంచెం అందాం గా ఉండి, సానుభూతి కలిగే విధం గా నా మొదటి మొగుడు ఎర్ర గులాబీ లో కమల్ హాసన్ లా శాడిస్ట్, సిగరేట్ తో కాల్చేవాడు లాంటి కథ లు చెప్పి సహ ఉద్యోగులనే రెండొ పెళ్ళిలు చేసుకున్న వారిని నేను చాలా మందిని చూశాను.
----------------
చివరిగా ఒక్కటి దినకర్ గారు ప్రేమనేది ఎదో ఆడ వారు మాత్రమే ప్రెమించగలరు మగ వారికి అంత తెలియదు అన్న విధం గా ఉంది మీ వాదన. గతం లో ఒక సారి టి.వీ. లో భార్య భర్తను ఎక్కువ ప్రేమిస్తుందా ? లేక భర్త భార్యను ఎక్కువగా ప్రెమిస్తాడా అనే విషయం పై చర్చించి, చివరికి ఆ షో నడిపిన వారు వాదోపవాదాలను విని ఎటువైపు మొగ్గు చూపలో తెలియక ఒక వృద్దు రాలైన గృహిణి అభిప్రాయమే అంతిమ నిర్ణయం గా తీసుకోవాలని ఆమేని అడిగితే ... ఆమే తన భర్తే తనను ఎక్కువ గా ప్రేమించేవాడని, పురుషులకే స్రీ లంకంటె ఎక్కువ ప్రేమ ఉంట్టుందని చెప్పింది.

Pavani said...

Did you see the main difference between how Tadepalli and othrs who accuse him. Tadepalli gives reason, analysis and example to prove his hypothesis. One my still disagree with him, which is fine. But his approach is sceintific. Those who accuse him go right below the belt and hit there.

Anonymous said...

Test Test qwerty asdf asdf asdf

Anonymous said...

చాలా కాలం తరువాత తాడేపల్లిగారు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నారు. Welcome back Tadepalli gaaru ! మీరు ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయడం మానేశారని విన్నాను. సడెన్ గా ఇక్కడ మిమ్మల్ని చూసి ఆచ్చర్యమేసింది.

ఇప్పుడూ, గతంలో జరిగిన చర్చల్లోను నేను గమనించినదేంటంటే - తాడేపల్లిగారు లేవనెత్తిన పాయింట్లకి ఎవరి దగ్గరా రీజనబుల్ సమాధానాలు లేవు. ఊరికే ఆయన్ని దూషించడం తప్ప ! అయితే అది పూర్తిగా వాళ్ళ తప్పు కూడా కాదనుకోండి. Maybe, this is an unintended communication failure.

ఎవరూ ఏమనుకోకుంటే, తాడేపల్లిగారిలో కూడా ఒక లోపం (?) ఉంది. ఆయన ఒక Elite class thinker. సామాన్యపాఠకుల స్థాయికి దిగిరాడు. ఆయన ఆలోచనలు by themselves, ఒక పెద్ద integrated complex network. ఆయన సైట్ మొత్తం చదివితే అలా అనిపిస్తుంది. అందుకని ఆయన్ని అర్థం చేసుకోటం కొంచెం కష్టంగనే ఉంటుంది. అందుకే వాళ్ళ తప్పు కూడా లేదంటున్నా.

చదువరి said...

ప్రత్యేకించి ఒక బ్లాగరిని ఉద్దేశించి ఈ జాబు రాసారు. సహజంగానే ఆయన స్పందించారు. ఇతరులూ స్పందించారు. హుందాగా ఉన్నంతవరకూ ఓకే! కానీ మీరు ఎవరినైతే పిలిచారో, వారినే బావా గీవా అంటూ సంబోధించి రాయడం, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం ఏం బాలేదు. మీరు చూస్తూ ఊరుకోవడం కూడా బాలేదు.

Ramu S said...

చదువరి గారు,
నిజంగా వారిద్దరూ సన్నిహితులేమో అనుకుని ఆ బావా...కామెంట్ పోస్ట్ చేసాను. తాడేపల్లి గారిని కించపరచడానికి కాదు. ఆయన అభిప్రాయాలు ఆయనవి. ఇకపై అలాంటి వాటి విషయంలో జాగ్రత్త వహిస్తాను.
థాంక్స్
రాము

చదువరి said...

Pavani: సరిగ్గా చెప్పారు.

Anonymous said...

నిజంగా చెప్పాలంటే ఈ తాడేపల్లి గారె(డె)వరో(డో) గానీ చాల పైత్య ప్రకోపిలాగా అనిపిస్తున్నాడు. చూడబోతే మీరు వ్రాసిన చాలామంది కీచకులకన్నా ముదురులా అనిపిస్తున్నాడు. పైన చెప్పిన కేసులొ వీరి అక్కో చెల్లినో ఉండుంటే వీరు ఇవే నీతి వాక్యాలు వల్లించి అతను ప్రపొజ్ చేసినంత మాత్రాన నీ సొమ్మేం పోయిందమ్మా, శ్రుష్టి కార్యం కోసం ప్రపోజ్ చేయడం ఆయన జన్మ హక్కు, నీకు ఇష్టం ఉంటే వెళ్ళు లేకుంటే లేదని చెప్పు అంతే గాని నన్ను వెళ్ళి వాన్ని నిలదీయమని/ తన్నమని చెప్పకూడదని అంటారేమో. మీ ఆడవళ్ళ్లను కించపరిచే వుద్దేశ్యం నాకు లేదు. కానీ విషయం మన వాళ్ళ దాకా వస్తే మనం చెప్పే నీతుల గోతులు ఏమౌతాయో చెప్పడానికే అలా అనవలసి వచ్చింది. నిజంగా తాడేపల్లి గారికి అక్కో, చెళ్ళో లేకుంటే చాలా సంతోషం. బహుషా లేరు కాబట్టే ఆడవాళ్ళంటే ఇంత చులకన భావాలు ఏర్పడ్డాయేమో.
అయ్యా, నిజంగా మీకు అక్కో, చెళ్ళో లేకున్నా కాసేపు వున్నట్లు ఫీల్ అవ్వండి - అప్పుడు తెలుస్తుంది మన వాళ్ళను ఎవరైనా ఏమైనా అంటే కలిగే భాదేంటో.
మరీ డీప్ గా వెళుతున్నాననుకోకపోతే - మరో చిన్న ఉదాహరణతో ముగిస్తాను. అయ్యా, మీరు చెబుతున్న courtship లాంటి సొల్లు కబుర్లు పషువులకు మాత్రమే/ లేదా సమాజం, కట్టుబాట్లు ఏర్పడక ముండున్న పషువులాంటి మనిషికి కూడా వర్తించేవేమో. ఉదాహరణకు, రియల్ courtship అంటే పషువులలో లాగా అదే పషువుకుపుట్టిన కోడె దూడ తల్లి ఆవుతో తిరిగి జతకట్ట్డం. మరి మనుషుల్లో మాట్రం ఇలా ఎందుకులేదు. తలుచుకుంటేనే జుగుప్సాకరంగా ఉంది కదా? courtship గురించి మాట్లాడే వారెవరైనా దీనికి ఏం సమాదానం చెబుతారు.
కాబట్టి, అయ్యా తాడేపల్లి గారూ, దేవుడు మనకేదో ఇంత తర్క బుద్ధి ఇచ్చాడుగదా అని ఏది పడితే అది వ్రాసి జనాల బుర్ర పాడు చెయ్యొద్దని మనవి. కొన్ని సంప్రదాయాలు, కల్చర్ లాంటివి సమాజంలో ఎష్టాబ్లిష్ అయ్యాయి అంటేనే అవి ఎంతోమంది పుణ్యాత్ములు, సంఘ సంస్కర్తలు బాగా అలోచించి విచ్చలవిడితనం (చిత్తకార్తె కుక్కల లాగా ఒక కుక్క వెంట పది కుక్కలు పడడం, వాటిలో దేనికి వీలైతే అది/ అవి courtship చెయగల్గడం) పెరగకుండా వుండేలాగా చేసారు. కాదంటారా?
మరొక విషయం, సంప్రదాయాలు, కల్చర్ లాంటివి ఒక సమాజం నుండి మరొక సమాజంకు మారుతూవుంటాయి, మరియు ఇక్కడి వారికి అక్కడివి గొప్పగా/ attractive గా వుండొచ్చు & vice versaa. మీరు అసహ్యించుకుంటున్న/ వ్యతిరేకిస్తున్న మన సంప్రదాయాలను ఎందరో విదేశీయులు పొగుడుతున్నారనే విషయం మరువవొద్దు.
చివరగా చెప్పొచ్చేదేమంటే, "నలుగురూ నడిచిందే బాట" అనే సామెతలోని రియల్ మీనింగును గుర్తెరిగి నడుచుకోవడమే అందరికీ మంచిది. లేదంటే, విచ్చలవిడితనం తారస్తాయికి చేరి ఎయిడ్స్ అనే ఒక కౌంటర్ చెక్ ద్వారా ప్రక్రుతే సమాజాన్ని balance/ కంట్రోల్ లో పెట్టవలసిన పరిస్థితి వస్తుందని అందరూ గుర్తెరగాలి.

తుంటరి said...

ఒక్క ఆ కామెంటే కాదు వ్యక్తిగత ధూషణ ఉన్న ప్రతీ కామెంటుని moderate చెయ్యాల్సిన అవసరం ఉంది.
మధురి,Dina,కృత ల కామెంట్లు పద్దతి గా లేవు.

Ramu S said...

Mr.RS Reddy,
I can understand your feelings but please don't abuse others while presenting your arguments. Make your point instead of calling others names.
My humble request to the visitors: Please don't hurt others with your abusive language and sweeping statements.
Thanks and regards
Ramu

Dinakar said...

@LBS తాడేపల్లి: మిమ్మల్ని తక్కువ చేసే ఉద్దేశ్యం తో చేసిన వ్యాఖ్య కాదండీ అది.. "ఫలానా మనిషి ఇలా చేసాడు వాడిని ఆ అమ్మాయి వారి తరఫు వారు కొట్టారు" అన్న సందర్భం వ్యక్తిగతంగా మీకు ఎదురైతే మీ సమాధానం ఎలా ఉంటుందో చూడాలని నేను అనుకున్నాను.. అందుకోసం కొద్దిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాను.. న్యాయం అనేది అందరికి సమానమే.. న్యాయవ్యవస్థ ముందు అందరు సమానమే.. కానీ తీర్పు ఇచ్చే మనుషులే వేరు.. రాజీవ్ గాంధీ హత్యా కేసులో పట్టుబడిన నళిని కేవలం లేడీ కావడం వల్ల ఉరి శిక్ష తప్పించుకుంది..అదే మగవాడు అయ్యుంటే కచ్చితంగా ఉరిశిక్ష పడేది.. ఒకసారి చెప్పండి.. ఎంతమంది మగవారు తప్పుచేసి బయట ధైర్యంగా తిరుగుతున్నారు, (100)౧౦౦ లో కనీసం (98)౯౮ మందికి వారు చేసింది తప్పు అయినా పశ్చాతాపం కూడా ఉండదు.. మీరు చెప్తున్న పేద, మధ్యతరగతి విషయానికి వస్తే.. ఆ వర్గం లో ఆడవాళ్ళకి ఎంతమంది కి ఉద్యోగాలు ఉంటాయి ఎంతమంది స్వతంత్రంగా బ్రతుకుతున్నారు, ఎంతమంది మగవారిని అన్యాయంగా బలి చేస్తున్నారు. బహుశా మీరు చెప్తున్నది Upper Middle Class, Rich class ఆడవాళ్ళకి కొద్దిగా నప్పుతుందేమో కాని.. మీరు చెప్తున్న feminsim concept కి ఈ టపా కి ఇస్తున్న వివరణకి ఏమాత్రం సంబంధం లేదు.. కేవలం సినిమాల్లో చూపించే విలనిజం చూసే యువతరం చేడిపోతోంది(ప్రణీత incident, శ్రీలక్ష్మి incident,అమీనా incident).. ఇక ఇలాంటి(Courtman ship, Reproductive rights) వాటిల్లో హక్కులకోసం పోరాడితే అందరు విలన్లే మిగులుతారేమో ఒకసారి ఆలోచించండి.


ఆడవాళ్ళు dominate చేసే సమాజం ఉంటే, ఇంగ్లాండ్ లో సొంత తండ్రి కూతురు పైన 27 ఏండ్లు అత్యాచారం ఎందుకు chestadu .. (Refer link), పాకిస్తాన్ లో ముక్తరాన్ బిబి కి ఎందుకు అన్యాయం జరుగుతుంది.. (Refer link).

పంట పండింది/పండలేదు అంటే అది పంట వేసినవాడి తప్పా లేక భూమి తప్పా?

Dinakar said...

@జెస్సి : మీరు ఆడపేరు పెట్టుకున్న మగవారో.. లేదా.. ఆడవారై ఉండి కూడా మగవారికి పక్షపాతం వహిస్తున్నారో తెలియటం లేదు..

ఇలాంటి విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు మనదాకా వస్తే ఒక రకం.. వేరే వాళ్ళకి జరిగితే ఇంకో రకం సమాధానం చెప్పటం నిజాయతి అనిపించుకోదు..

ఇంకా.. మీరు చెప్తున్నవి చాల తక్కువ సంభావ్యత కలిగిన విషయాలు.. అరుదుగా జరుగుతున్నవి.. నేను చెప్తున్నవి నూటికి ఎనభై శాతం జరుగుతున్నవి..

ఇంకా మీరు తాడేపల్లి గారిని వెనకేసుకు రావాలి అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు..

Regards,
Dinakar

Pavani said...

Tadepalli is proposing gender neutral approach.Current society, media, governament, legal system and of course feminist all are so heavily biased, they do not recognize world is changing and changing a lot.

I do not find it hard to understand. In this special case the man was branded based on the girls's evidence and was humiliated before his near and dear. I read Pandit Nehru had several out of wedlock relationships(not sure he proposed or not)and I didn't here he was abused for that.

If a girl proposes the man for any reason, I do not believe anybody thinks its an issue. Socialagists say-adultery, love marraiages, pre-marital sex and divorces are increasing by leaps and bounds. I do not argue its good or bad.The changes in the attitude of the women about love, marriage, career, sex are fast changing and in every case they move towords the way that boys used to think.

But still, like many here, some of us still believe man is the protector, man alone is the source of all evil in violence,love, sex and adultery, girls will not lie kind of stuff..it is weird.

Here a man proposed the girl in secrecy. Girl didn't like it and the man was abused in public. I see this behavior by film heroes, local goondas and home grown saviors.Any thought was given that the girl might be lieing or misunderstood or the man has kids and it adversely affects on them when their Dad was treated like that before their eyes or the man might have this weakness but he is otherwise a good and intelligent man and helps others etc..? No, right?
Many asked here what you do if it happens to their own sisters or wife.
I want to answer this.1)Will tell him its not appropriate and threaten him to sue 2)Collect evidence and show to his wife 3)File a case 4)as a last resort will go to media with evidence.

Big Data Enthusiast said...

ఇన్ని సుద్దులు చెప్తున్న ఈ ముసుగు వీరులే అవసరానికి 'అనుకూలంగా' స్పందిస్తారు... సూడో ఫెమినిస్ట్స్...

మార్పు...
ముందు హేళన చేయబడుతుంది
తరువాత ప్రశ్నింపబడుతుంది
ఆపైన విమర్శింపబడుతుంది
వేగంగా తిరస్కరింపబదుతుంది
చివరగా... ఒప్పుకోబడుతుంది.

తాడేపల్లి గారూ, గో అహెడ్...

Anonymous said...

వీక్ పాయింటైనా బలంగా బల్ల గుద్ది రాం జఠ్మలానీ లా వాదించడం తాడేపల్లి గారి ప్రత్యేకత అనిపిస్తోంది, మెచ్చుకోవాల్సిన విషయం. ఏమాత్రం ఏమరు పాటుగా వున్న జడ్జి ఐనా డిఫెన్స్ లాయర్ పక్షాన 'కేస్ డిస్మిస్డ్ ' అని ఫైల్ మూసేయగలడు. :)

Nihilist said...

Is there no possibility that girl might be lying?
If police were strict, this guy and likes of him would not have dared to do anything adventurous in first place.
And when they or other institutions fail to do their job, it's free for all. If you believe you are wronged by somebody, go ahead, extract your justice. For those who mentioned punishing bad journalists, who prevented you from doing so if you felt so strongly about it?
To sum it up, if you feel society can correct the wrongs done to you, rely on it. When you don't believe so, do what you want , but with full awareness that others can and will do the same and you lose the right to complain on them.
We lose right to individual interpretation in certain aspects when we are part of society. If one feels, he/she is different, good luck to them.

Srikrishna Chintalapati said...

పెద్దవారు, గౌరవనీయులు అయిన రాము గారు,
ఇలా వ్యక్తులనుద్దేశించి టపాలు రాయడం గర్హనీయం అండీ.

ravi kumar said...

మీరు చెప్పింది మనిషి జీవిథనికి చాల దగ్గరగ ఉంది.
మనిషి అంథ్ర్ముఖంగ విభిన్నగ ఉంటాడు. ఛేతిలొ జపమాల ఉన్నంథ మత్రాన ప్రవర్థనలొ శ్రీరామ చంద్రుడె కానక్కర్లెదు కొరికన్నది ఎప్పుడు కల్గుతుంది ఎందుకు కలుగుతుంది సౄస్తిలొ ఎవరు కనుక్కొలెదు కాని మన్సుతొ అలొచించెదెప్పుడు సుఖాన్ని కొరుకుంతుంది మెదడుథొ ఆలొచించినప్పుడు వావి వరసలు తెలుస్థాయి. భజగొవిందం చదివిన ప్రతి వ్యక్థి సన్యాసి కలెడు అని మొన్నెమధ్యనె బహిర్గథం అయ్యింది. కీచకులున్నచొట భీముడు ఉన్నాడు. మనిషి ఏరొజైథె గొగంగలి పురుగు నుంచి సీతాకొక చిలుకగ మరలనుకుంతె కొసస్థ దస (కకూన్ స్తాగె) తప్పనిసరిగ అదిగమించల్సి ఉంటుంది. ఈ కొసస్థ దస నుంచే ఒక గౌథమ బుద్ధుని గాని, మథెర్ తెరిస్సా గాని, ఓ అబ్దుల్ కలాం గాని వచ్చరని థెలుసుకొ మనవా.....

ఆదే మనిషి యొక్క పరిపక్వథకు మూలం .

కెక్యూబ్ వర్మ said...

ఇన్ని చట్టాలు, కొంతమేరకైనా స్వతంత్ర న్యాయవ్యవస్థ వున్నప్పుడే ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఇక్కడ మేధావులు ఆశిస్తున్న వ్యక్తి స్వేచ్చ వలన సమాజంలో ఇంకెన్ని దారుణాలు చూడవల్సి వస్తుందో? తర్కానికి అందనిది మనిషి ప్రఫృత్తి. దానిని అదుపులో వుంచడానికి ఇన్ని యుగాలు దాటుతున్నా మనిషిలో సమబుద్ధి రాలేదు. మరి ఎవరి గోచీ వారు కాపాడుకోవాలన్న తాడేపల్లి వాదం ఎంతవరకు సమంజసమో నా సామాన్య బుఱకు అందడంలేదు.
I support Dina..

నండూరి వెంకట సుబ్బారావు said...

కోరిక, అభివ్యక్తి, తీర్చుకొనే ప్రయత్నం, ఫలితం పై ప్రతిస్పందన
కీచకుల టపాలపై తాడేపల్లిగారి స్పందనను రామూగారితో సహా చాలా మంది అపార్థం చేసుకోవడం చూసి ఇది వ్రాయాలనిపించింది.
చాలామందికి కోరిక కలగడం, దాన్ని అభివ్యక్తీకరించడం (బయటకు తెల్పడం), దాన్ని నెరవేర్చుకొనేందుకు చేసే ప్రయత్నం వీటి మధ్యలో తేడా తెలియడం లేదు.
వీరిలో అందరూ ఉన్నత విద్యావంతులే కావడం దురదృష్టకరమైన విశేషం.
కోరిక:
మనలో రకరకాల కోరికలు కలుగుతూంటాయి. అన్నీ చట్టాలకూ, సమాజంలో ఉన్న నైతిక సూత్రాలకు అనుగుణంగా ఉండవు. అలా ఉండటం సాధ్యం కాదు. ఇది పరదార మీద కోరిక కావచ్చు, పరధనం మీద కోరికా కావచ్చు. వివాహమైన తర్వాత కూడా పొరుగింటి అమ్మాయిని కోరుకోవడం ఎంత తప్పో, పక్కవాడి ఆస్తినీ, ఉద్యోగాన్నీ, ప్రమోషన్నీ, కీర్తినీ అన్యాయంగా ఆశించడం అంతే తప్పు. నిజానికి మొదటి తప్పు కన్నా మిగతా తప్పులవల్ల ఎక్కువమంది జీవితాలకు కష్టం, నష్టం కలిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇక్కడ చర్చ ఏది పెద్ద తప్పు అనికాదు. అసలు నైతికంగా తప్పుల్లో పెద్దా చిన్నా అనేది ఏది ఉండదు. రూపాయి కొట్టేసినా, కోటి రూపాయలు కొట్టేసినా దొంగే. చట్టంలో మాత్రం తేడా ఉంటుంది. ప్రస్తుత సమాజంలో అది భారతదేశమైనా సరే ఇలా చట్టవిరుద్ధమైన, నైతిక సూత్రాలకు విరుద్ధమైన కోరికలు కలగడం అత్యంత సహజం. అలా కలుగని పరిస్థితి కృతయుగంలో ఉండేదట.
అభివ్యక్తి:
మనది కాని దాని మీద కోరిక కలిగినప్పుడు దాన్ని మనసులో అనుకొని ఊరుకోవడం, సన్నిహితుల దగ్గర బయటపెట్టడం, ఆ వస్తువు యజమాని దగ్గరో, (కోరిక కలిగినది స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు వారి దగ్గరో, వారి జీవిత భాగస్వామి దగ్గరో పరోక్షంగా, ప్రత్యక్షంగా బయటపెట్టడం) జరుగుతుంది. ఇక్కడ వస్తువుల మీద కోరికను వ్యక్తీకరించడానికీ, మనిషి మీద కోరిక అభివ్యక్తీకరించడానికీ చాలా తేడా వచ్చేస్తుంది.
అపార్థాలకు దారి తీయకుండా ఉండేందుకు కొంచెం వివరంగా చెప్తాను.

నండూరి వెంకట సుబ్బారావు said...

కేస్(అ): మనకి ఒక కారు మీద కోరిక కలిగింది. దాన్ని మన ఇంట్లో వాళ్ళ దగ్గరా, స్నేహితులా దగ్గరా చెబుతాం "అబ్బా అలాంటి కారుంటే బాగుండు" దగ్గర మొదలైన అభివ్యక్తి ఆర్థికపరిస్థితులను బట్టి "కనీసం ఒక్కసారి ఆ కారును ముట్టుకుంటే చాలు", "దాన్లో ప్రయాణిస్తే చాలు" ఇలా రకరకాలుగా ఉంటుంది. దీన్ని ఎవరూ తప్పుగా భావించరు. ఆ కారు యజమానికి చెప్పినా గర్విస్తాడు తప్ప మరేమీ అనుకోడు. (ఇక్కడ ఆ కోరిక ఆ కారుకి ఇష్టమా కాదా అన్న ప్రసక్తికి అవకాశం లేదు).
కేస్(ఆ): అదే కారు అనే మాట బదులు "స్త్రీ/ ప్రురుషుడు" అనే మాట పెట్టుకుంటే గొడవలైపోతాయి. (ఇక్కడ కూడా అసలు వ్యక్తికి ఇష్టమా కాదా అని ఆలోచించకుండానే చుట్టుపక్కల వారు గొడవపెడతారు, అసలు వ్యక్తుల ఇష్టాఇష్టాలు, ప్రతిస్పందనల సంగతి తర్వాత మాట్లాడదాం). "మీ ఆయన బాగా మాట్లాడతారు", "సరదాగా నవ్విస్తూ ఉంటారు", "మీ శ్రీమతి చాలా చక్కగా పాడుతుంది". "ఆమెలా కళాకారిణిని చేసుకోవాలని నేను కలలు కన్నాను, కానీ కుదరలేదు" (ఈ మాత్రం మాట్లాడితే అవతల వాళ్ళను ఏమీ అనలేక ఇంట్లోవాళ్లను హింసపెట్టేస్తారు. ఆడవాళ్ళైతే భర్తను ఏమీ అనలేక అవతల ఆవిడను తూర్పారబడతారు.) ఇలాంటి అభివ్యక్తి బహుశా రామూగారి దృష్టిలో కూడా తప్పుకాదనుకుంటాను.
కేస్(ఇ): కానీ అదే మాట మీ ఆవిడ/ ఆయన చాలా అందంగా ఉంటారు. అలాంటి అందమైన వాళ్ళను చేసుకుందామనుకున్నాను కానీ కుదరలేదు అంటే పెద్ద తప్పై పోతుంది. ఒక్కరాత్రి అలాంటివాళ్ళతో గడపగలిగితే అన్నామా బయట వాళ్ళ దృష్టిలో కీచకులు/ శూర్పణఖలు అయిపోతారు.
ఇక్కడే విషయం తప్పుదోవపడుతోంది. ఇలాంటి చట్టవ్యతిరేకమైన, నైతిక వ్యతిరేకమైన కోరికను బయటకు చెప్పకుండా ఉండలేకపోవడం ఒక బలహీనత, కానీ నేరం కాదు. జాగ్రత్తగా చూస్తే మూడు కేసుల్లోనూ పెద్ద తేడా లేదు. కీచకుడినీ, శూర్పణఖనూ కూడా కోరిక వ్యక్తీకరించినందుకు కాక, దాన్ని తీచుకొనేందుకు అనుసరించిన క్రూరమైన విధానాల వలన శిక్షించారు, దుర్మార్గులన్నారు.
(కోరికను వ్యక్తీకరించడం అనే ప్రక్రియ అమర్యాదపూర్వకంగా, అశ్లీలంగా, అవతలిని ఇబ్బంది పెట్టేలా, వారికి శారీరక, మానసిక, ఆర్థిక కష్ట నష్టాలు కలిగించేలా చేసినప్పుడు అది శిక్షార్హమైన నేరమే. (చట్టపరంగానూ, నైతికంగానూ).

నండూరి వెంకట సుబ్బారావు said...

రామూగారి టపాల్లో చెప్పినట్లు అవతలివారికి ఇష్టం లేకపోయినా, (ఇక్కడ అవతలి వారు అంటే న్యాయంగా కోరికకు పాత్రమైన స్త్రీ/పురుషుడు అనుకోవాలి, కానీ మనం వాళ్ళ బంధువులూ, స్నేహితులూ, శీలసంరక్షుకులూ అందరినీ ఈ జాబితాలో చేరుస్తున్నాం) సాంఘిక, ఆర్థిక, రాజకీయ, శారీరక బలప్రయోగాల ద్వారా తమ కోరికను తీర్చుకోవాలనుకోవడం తప్పే. అందులో సమర్థించుకొనేందుకు ఏమీ లేదు. కానీ తాడేపల్లిగారు ఇక్కడ రెండు మంచి విషయాలు చెప్పారు.
ఒకటి: వివిధ ప్రయత్నాల ద్వారా అవతలివారి మెప్పు పొందేందుకు ప్రయత్నించడానికి నేరంగా భావించకూడదు. అది బలప్రయోగం లెక్కలోకి రాదు. నిజమే..అయితే ఈ మానసిక ప్రయత్నం పైన చెప్పిన ఆర్థిక, రాజకీయ, శారీరక, వృత్తిపరమైన బలప్రయోగాలలోకి రాదు, దారి తీయదు అని చెప్పడం ఎలా? దీన్ని గురించి ఆలోచించాలి.
చట్టపరంగా చూస్తే మానసికంగా అవతలి వారి మెప్పించి లైంగిక కలయికకు ఒప్పించడం కూడా తప్పే. చట్టం భార్యను భర్త ఆస్తిగానే పరిగణిస్తోంది. పరాయివాడి భార్యను ఆమె ఇష్టప్రకారం అనుభవించినా అది భారతీయచట్టం ప్రకారం తప్పే. మానసికంగా అవతలివారిని మెప్పించి, అందుకు ఒప్పించడం అనేది నిరూపించడానికి సాధ్యమయ్యే అంశం కాదు. చట్టంలో ఆ కారణంతో తప్పించుకొనేందుకు అవకాశం ఉంటే చాలామంది మగవాళ్ళు ఆ సాకుతో తప్పించుకుంటారు కనుక దాన్ని లేకుండా చేశారు.

రెండు: కోరికా, ప్రయత్నం కేవలం ఏకపక్షమేననీ, అందులో పురుషుడే బలప్రయోగం చేశాడనీ నిరూపించకుండా, అసలు ఆ ప్రయత్నమే చేయకుండా కేవలం కోరిక, అభివ్యక్తులను బట్టి ఆ వ్యక్తిని నేరస్తుడిగా కీచకుడిగా చూడ కూడదు. ఇదీ నిజమే. కానీ నిరూపించడం ఎలా? దానికి అవకాశం ఎంతవరకూ ఉంది? ఇవీ ఆచరణాత్మకమైన ప్రశ్నలు.
కనుక అప్పటి వరకూ వందమంది నిరపరాధులకు శిక్ష పడ్డా, ఒక్క అపరాధీ తప్పించుకోకుండా చట్టం చేశారు.
ఇక మీడియా విషయానికి వద్దాం. ఇలాంటి సున్నితమైన సామాజిక విషయాలను సున్నితంగా డీల్ చేయడం మీడియా ఎప్పుడో మర్చిఫోయింది. ఏది సంచలనమో అదే కావాలి, ఏది నిజమో అది సంచలనం కాకపోతే వార్త కాదు. కోర్టులో విచారణ సమయంలో జరిగే వాదనలనూ ఆరోపణలనూ ప్రసారం చేసే మీడియా, తర్వాత తీర్పునూ ప్రసారం చెయ్యదు(జయేంద్ర సరస్వతి కేసు ఉదాహరణ). ఇది మీడియా బ్లాగు కనుక మనం ఇలాంటి వ్యవహారాలలో మీడియా పాత్ర ఎలా ఉంటే బాగుంటుందో చర్చించాలి. కానీ రామూగారితో సహా అందరూ దాన్ని మర్చిపోయారు. సరే ఆ విషయం మరోసారి చర్చిద్దాం.

Malakpet Rowdy said...

Dinakar

" నేను చెప్తున్నవి నూటికి ఎనభై శాతం జరుగుతున్నవి.."


Do you have any data to support your claim?

Malakpet Rowdy said...

మీరు అసహ్యించుకుంటున్న/ వ్యతిరేకిస్తున్న మన సంప్రదాయాలను
_____________________________________

LOOOOOOOOOOOOOOOL

All these days I have seen people accusing Tadepally of excessively sticking to Indian culture. For the first time I am seeing the opposite .. this is funny!

katta jayaprakash said...

It is most unfortunate that the blog media kaburlu is being derailed.Please see that the track is repaired and allow the routine train of media kaburlu to start the journey with disciline,dignity,decorum and ethical values respecting one another with constructive and civilised criticism or expression of opinions.
JP.

చక్రపాణి said...

LBS:"తమని వాంఛించే మగవాళ్ళ ఉద్దేశాల్ని సక్రమంగా అర్థం చేసుకొని వారితో నాగరికంగా వ్యవహరించే విధానం మన దేశపు ఆడవాళ్ళకు తెలియకపోవడం వల్ల, అందులో వారికి ఏ విధమైన శిక్షణా లేకపోవడం వల్ల ఆ మగవారు అనవసరంగా విలన్లుగా చిత్రించబడుతున్నారని నేననుకుంటున్నాను."

Good insight.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి