Monday, December 21, 2009

లగడపాటి: విలేకరుల పాట్లు....పొరపాట్లు

పోలీసుల కన్నుగప్పి విజయవాడ ఎం.పి. లగడపాటి రాజగోపాల్ గారు అర్థరాత్రి "అదృశ్యం" కావడం...పోలీసులకే కాకుండా విలేకరులకూ కంటిమీద కునుకు లేకుండా చేసింది. కొన్ని ఛానెల్స్ లో అత్యుత్సాహవంతులైన విలేకర్లు...అందుబాటులో ఉన్న కెమెరామెన్ ను సైతం నిద్రపోనివ్వకుండా...లగడపాటి వేట మొదలుపెట్టారు. మాటిమాటికీ లైవ్ లో అప్ డేట్స్ ఇవ్వడం వల్ల పాపం...విజయవాడ N-TV రిపోర్టర్ గొంతు బొంగురు కూడా పోయింది. 

లగడపాటి ఎటువెళ్లి ఉంటారన్న దానిపై చాలా ఊహాగానాలు చేసారు. ఈ అంశంపై విలేకరులు లైవ్ ల మీద లైవ్ లు ఇస్తుండగా...లగడపాటి చెప్పులేసుకుని...పరిగెత్తుతూ...పోలీసులను తప్పించుకుని, విలేకరుల కళ్లుగప్పి నిమ్స్ లో Acute Medical Care అనే వార్డ్ లో ఒక బెడ్ మీద దూకి కళ్ళుమూసుకుని విశ్రమించారు. లగడపాటి స్వతహాగా టేబుల్ టెన్నిస్ ఆటగాడు...కావడం వల్ల కావచ్చు...ఆర్రోజులు నిద్రాహారాలు మానినా...పదిహేను గంటలు ప్రయాణించి నిమ్స్ లో చికిత్స కోసం వచ్చారు. 
ఆయనను నిమ్స్ కు  రావద్దని అనడం మాత్రం బాగోలేదు. ఆయన వస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని వాదించడం కూడా భావ్యం కాదు. తెలంగాణా ఏర్పడినట్లే అని ప్రకటించిన వారే...ఒక ఎం.పీ.చికిత్సకు వస్తే..నిరాకరించడం...'గో బ్యాక్' అనడం ఏమి సబబు?


సరే...ఈ అభిప్రాయలు, వాదోపవాదాలు ఎలా ఉన్నా...సోమవారం సాయంత్రం నుంచి ఛానెల్స్ అన్నీ లగడపాటి మీదనే దృష్టి కేంద్రీకరించాయి. ఆయన నిమ్స్ లో చేరిన కొద్ది సేపటికే..అంటే.. 2.40 ప్రాంతంలో "ABN- ఆంధ్రజ్యోతి" ఛానల్ లో ఒక "బిగ్ స్టోరీ" ఇలా సాగింది.
(స్టూడియో నుంచి) యాంకర్ మూర్తి: లగడపాటి రాజగోపాల్ నాటకీయ పరిణామాల మధ్య  నిమ్స్ లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అక్కడే ఉన్నా మా రిపోర్టర్ వంశీ ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
మూర్తి: వంశీ..చెప్పండి..ఎలా ఉండి రాజగోపాల్ పరిస్థితి?
వంశీ: మూర్తీ...లగడపాటి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. కే.సీ.ఆర్. గుండెకు సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నదని అంటున్నారు. షుగర్ నిష్పత్తి కూడా పడిపోయింది. కే.సీ.ఆర్.ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు...
మూర్తి: వంశీ...లగడపాటి...లగడపాటి రాజగోపాల్...
వంశీ: ఆ..ఆ...సారీ...లగడపాటి.....
(కొద్దిసేపు లగడపాటిని కే.సీ.ఆర్. అన్న రిపోర్టర్...యాంకర్ సవరించాక కూడా మరొకసారి లగడపాటి బదులు కే.సీ.ఆర్. అన్నాడు.)
*******                      *****              ****
ఇక అదే సమయంలో...N-TV లో నగు మోముతో...యాంకరింగ్ చేస్తున్నారు...శ్వేతా రెడ్డి. నిజానికి "అద్భుతం" అనే కార్యక్రమంలో శ్వేత తన చక్కని యాంకరింగ్ తో జనం మది దోస్తున్నారు.
శ్వేత: రామచందర్ గారు...చెప్పండి..రాజగోపాల్ చాలా సస్పెన్షన్ క్రియేట్ చేసారు...
రామచందర్: శ్వేతా...ఇప్పుడు...
శ్వేత: అదే....సస్పెండ్ క్రియేట్ చేసారు (నిజానికి ఆమె సస్పెండ్ అన్నారో సస్పెన్స్ అన్నారో సరిగా వినిపించలేదు)

11 comments:

Mitra said...

అన్నయ్యా,
అసలు లగడపాటి పట్టుపట్టి నిమ్స్ కు రావాల్సిన అవసరం ఉందా? టెన్షన్ క్రియేట్ చేసినట్లు కాదా? విజయవాడ లో మంచి వైద్యం దొరకదా? పత్రికల పతాక శీర్షికలకు ఎక్కాలన్న దుగ్ద కనిపించడం లేదా? స్పోర్ట్స్ మెన్ అయినంత మాత్రాన ఆరు రోజులు దీక్ష చేసిన వ్యక్తి అంత ఫిట్ గా ఉంటారా?

ashok said...

...లగడపాటి చెప్పులేసుకుని...పరిగెత్తుతూ...పోలీసులను తప్పించుకుని, విలేకరుల కళ్లుగప్పి నిమ్స్ లో Acute Medical Care అనే వార్డ్ లో ఒక బెడ్ మీద దూకి కళ్ళుమూసుకుని విశ్రమించారు. లగడపాటి స్వతహాగా టేబుల్ టెన్నిస్ ఆటగాడు...కావడం వల్ల కావచ్చు...ఆర్రోజులు నిద్రాహారాలు మానినా...పదిహేను గంటలు ప్రయాణించి నిమ్స్ లో చికిత్స కోసం వచ్చారు.

what a joke sir...

Ravi said...

పాపం తొందర్లో అలా "అప్పు తచ్చులు" చేసేస్తుంటారు :-)

Anonymous said...

meeru kabatti intha opikaga vinnaru.
perigina channels poteelo evaru emi chebuthunnaro elanti vaarthalu isthunnaro evarikee artham kaavadam ledu vaarthanu thondaraga ivvalanna aathruthe thappa saraina vaartha ivvalanna badha evariki undadamu ledu . anchor adigedi okati aithe reporter cheppedi marokatiga undadame ivvalti vaarthala style . neti channels pokadanu choosi meeru badha padadamu anavasaramu. ee vyavastha eppatiki maaradu

Anonymous said...

Mee obseravationki Hats off...

కొత్త పాళీ said...

భలే!
మొన్నామధ్య స్టార్నైట్లో చేసిన కూకట్‌పల్లిలో కుక్క లైవ్ కవరేజిని తలపించారు మన వార్తాహరులు!!

Ramu S said...

dear kotta paalee gaaru...
would you please explain this "kukka live coverage in star night?". I am sorry I didn't follow it and hope many of our friends had missed it. Please elaborate it for us.
Cheers
Ramu

kvramana said...

annayya
i know you did not take much time to post this. but i also heard that the MP had used a TV channel's OB van to reach hyderabad. i know the name of the channel too. but it is immaterial hear. The channel's OB van picked him up midway on the outskirts of Vijayawada and brought him safely to Hyderabad. The OB van is an Innova. Any guess
ramana

పానీపూరి123 said...

@Ramu garu,
This is the dialog version, Video link kanabadutaledu

http://nagrockz.blogspot.com/2009/01/tv9-kukka-kuntudu.html

Anonymous said...

Please see this link to about the comment by kottapali.

http://www.youtube.com/watch?v=jzDPczUp_vA

(You can watch from 0:45 sec)

Ali said...
This comment has been removed by a blog administrator.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి