Tuesday, December 22, 2009

విలేకరుల అరాచకం---లగడపాటి పరాచకం

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గారంటే కొందరు నాయకులకే కాకుండా విలేకరులకూ జోకయిపోయినట్లుంది. నాటకీయ పరిణామాల మధ్య పదిహేను గంటల "అదృశ్యం" డ్రామా అనంతరం...సోమవారం పోలీసులు, విలేకరుల కళ్ళు కప్పి నిమ్స్ లోకి లగెత్తుకుంటూ (ఆంధ్రజ్యోతి పేపర్ భాష) వెళ్లి...చటుక్కున ఒక బెడ్ పై వాలిపోయిన రాజగోపాల్ గారు మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశమే ఇందుకు సాక్ష్యం.

రోశయ్య, గిరీశయ్య వద్దని మొత్తుకున్నా...నిమ్స్ కు వచ్చిన లగడపాటి తాను అనుకున్న ప్రకారం 24 గంటలు ఉండి...సోమాజిగుడలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది సాదా సీదా ప్రెస్ కాన్ఫరెన్సు కాదు కాబట్టి సిటీ లోని యావన్మంది రిపోర్టర్లు ప్రెస్ క్లబ్ కు చేరుకోవాల్సి వచ్చింది--మిట్ట మధ్యాహ్నం. మైకుల సర్దుబాట్లు...విలేకరుల హడావుడి అయ్యాక...లగడపాటి...వివరంగా "గాంధీ గారి దీక్ష, కే.సీ.ఆర్. దీక్ష"ల గురించి విపులీకరించారు. అప్పటికి...తాను ఎలా హైదరాబాద్ చేరిందీ చెప్పకుండా విలేకరుల టెన్షన్/ సస్పెన్స్ పెంచుతున్న రాజగోపాల్ ఒక్క సారిగా చరిత్రలోకి జారుకున్నారు.
రాణి రుద్రమ పౌరుషం గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టగానే...ఒక విలేకరికి చిర్రెత్తుకొచ్చింది. "చరిత్ర ఎందుకు..వేరే విషయాలు చెప్పండి. మేము మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయ్," అని ఆయన ఎవరో గానీ పెద్ద కేక పెట్టాడు. నిజమే టైం లేదంటూ ఒకరిద్దరు శృతి కలిపారు. 

ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టిన నేతను అపహాస్యం చేయడం/ శాసించడం చేసినందుకు ఈ విలేకరులను సత్వరమే...ఒక మంచి జర్నలిజం స్కూలుకు పంపాల్సిందే. అది వేరే విషయం. (నిజంగా కే.సీ.ఆర్. గారు ఇలానే...చరిత్ర చెబితే...సాగదీస్తే...మీరు ఇలానే శాసిస్తారా, బ్రదర్స్?) 


ఈ విలేకరుల హడావుడి వల్ల విలేకరుల సమావేశంలో కొంత గందరగోళం చెలరేగింది. ఇక లగడపాటి అందుకున్నారు. "ఎంతసేపు చెప్పాలన్నది మా నిర్ణయం. వినదల్చుకోకపోతే వెళ్ళిపొండి. మీరు మీట్-ది-ప్రెస్ పెడితే వస్తా...అప్పుడు మాట్లాడకుండా సమాధానాలు ఇస్తా," అని ఆయన స్పష్టం చేసారు. 


"ఇది నా ప్రెస్ మీట్. నేను మిమ్మల్ని రౌడీలు, పోలీసులతో బలవంతం చేయించడం లేదు. కేవలం సమాచారం ఇచ్చాను అంతే. వేరే వాళ్ళు రెండున్నర గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఏమీ లేదు కానీ..నాకు కొంత సమయం ఇవ్వలేరా?" అని లగడపాటి ప్రశ్నించారు. "నేను చెప్పేది మీకు కష్టంగా ఉన్నా, ఇష్టం లేకపోయినా దయచేసి వెళ్లిపోవచ్చు," అని ఎం.పీ.గారు తెగేసి చెప్పడంతో...విలేకరులు కిమ్మనకుండా కూర్చున్నారు. 

మీరు ఇలా చేస్తుంటే...నేను మౌనంగా ఉంటా అని...కాసేపు ఆయన మౌనముద్ర దాల్చారు. దాంతో కొందరు విలేకరులు కంగు తిని..."లేదు సార్...మీరు మాట్లాడండి.. లైవ్ నడుస్తున్నది," అని బతిమాలే ధోరణికి వచ్చారు. ఇక అప్పుడు పది నిమిషాలు తక్కువ మూడు నుంచి మూడూ ఐదు నిమిషాల వరకు తాను మాట్లాడతానని, తర్వాత ప్రశ్నలు అడగవచ్చని లగడపాటి చెప్పడంతో అక్కడ కలకలం కాస్త సద్దుమణిగింది. ఇది విలేకరుల అరాచకానికి సంబంధించిన వ్యవహారం.


ఇక చివరికి....లగడపాటి గారి పరాచకం మొదలయ్యింది. తాను చెప్పదలుచుకున్నది చెప్పి..."జ్యూస్ ఉందా?" అని తన పరివారాన్ని అడిగిన లగడపాటి...ఒక గ్లాసెడు గ్లూకోస్ నీళ్ళు పట్టుకుని...కొంత డ్రామా నడిపే ప్రయత్నం చేసారు. "నా దీక్ష ఎప్పుడో విరమణ అయ్యింది..పోలీసుల వల్ల. జ్యూస్ తాగడమే దీక్ష విరమణ అయితే చెప్పండి....ఈ జ్యూస్ తాగి విరమిస్తా," అని ఆయన సెలవిచ్చారు. 

ఆయన జ్యూస్ తాగే ఫోటో కోసం కెమెరా మెన్ సిద్ధమవుతూ, తోపులాటకు దిగగానే...లగడపాటి మరొక చమక్కు వదిలారు. "for your satisfaction" జ్యూస్ తాగుతానన్న ఆయన అప్పుడు ఇలా అన్నారు-- "నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు (జ్యూస్ తాగడానికి). మీలో ఎవరన్న ముందుకు వచ్చి ఈ గ్లాసెడు జ్యూస్ ఇస్తే...తాగి దీక్ష విరమిస్తాను. ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చి తాగించండి."

ఉన్నట్టుండి రాజగోపాల్ విసిరిన కామిడీ తో విలేకరులు కంగు తిన్నారు. ఒక్క నిముషం అక్కడ ఇబ్బందికర నిశ్శబ్దం రాజ్యమేలింది. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అలా కాసేపు ఎదురుచూసిన ఎం.పీ.గారు...ఇక లాభం లేదని జ్యూస్ తాగకుండానే...విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 

తాను 15 గంటల పాటు ఏమి చేసిందీ చెప్పేందుకు ఆయన నిరాకరించారు. "ఆ సస్పెన్స్ అలాగే కొనసాగనివ్వండి, దాని గురించి ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను," అని లగడపాటి చెప్పారు. కామిడీ దీక్షపై ప్రజలను, మీడియాను చైతన్యపరచడానికే తాను కామిడీ చేయాల్సి వచ్చింది...అని లగడపాటి సెలవిచ్చారు. ఇంతకూ...laughing stocks జనమా? విలేకరులా? మన లగడపాటి గారా?

16 comments:

విశ్వామిత్ర said...

మి రాతలలో కొంత నిజాయితీ ఇప్పుడు కనిపిస్తోంది. కాని తాను హైదరాబాదు చేరడానికి తెలంగాణా మిత్రులే సాయం చేసారని ఆయన చెప్పారని రాయడానికి మీకు కొంత ఇబ్బంది కలిగింది కదా? :)

అలాగే ఆమరణ దీక్షలమీద ఆయన చెప్పింది కుడా మీకు నచ్చలేదు.అందుకే ఆ ప్రస్తావన మీరు చేయలేదు. నిజం నిప్పులాంటిదని చెప్పడం సులువే సార్. పట్టుకోవడమే కష్టం. !!

తమిళన్ said...

ఈ కాలం లో ఎవ్వరు ఉద్యమాలు చేసినా వెధవలు అయ్యేది అమాయక జనం మాత్రమే, ఎందుకటే వాళ్ళ బస్సులు వాళ్ళే తగలబెట్టుకుంటూ, వాళ్లకు వాళ్ళే బందులు చేసుకుంటూ, వాళ్ళే ధరలు పెంచుకుంటూ.....చివరికి నాయకులూ కామెడి చేస్తే ఏడుచుకుంటూ....

విరజాజి said...

కాస్తైనా నిజాయితీ గా మీరు విలేఖరుల అరాచకం గురించి ప్రస్తావించారు. టీ.వీ 9 లో కేసీయార్ మాట్లాడుతుంటే ప్రత్యక్ష ప్రసారం ఇస్తున్నారు. గంటలకి గంటలు అతని ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడిన మీడియా మిత్రులకు మిగత అందరూ అలాగే దీక్షలు చేస్తున్నారని తెలీదా? అస్సలు కేసీయార్ అనే మాటలు ఎలా రాస్తున్నారో నాకు అర్ధం కావడం లేదండీ... ఈ రొజు హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా అని అన్నాడు. వాడెవడండీ ... ఈ హైదరాబాదు అందరు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల రాజధాని (ఇంకా తెలంగాణా రాకముందే ఇలా మాట్లాడుతున్నారు, తెలంగాణా వస్తే ఇక్కడ ఉన్న తెలంగాణేతరుల పరిస్థితి ఏమిటి? అని ఎవ్వరికైనా అనిపిస్తుంది కదండీ)

సమైక్య ఆంధ్ర కి అతను అనుకూలం కాకపోవచ్చు. కానీ ఇతరులని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం మాత్రం అతనికి లేనే లేదు. హైదరాబాదు గురించి మాట్లాడితేనే నాలుక తెగ్గోస్తా అనే ఇతనికి అంత కోపం వస్తే, మా ఊరు అనుకున్న హైదరాబాదును తెలంగాణాకి ఇవ్వాల్సిందే అంటే - మిగతా ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ ఇంకెంత కోపం రావాలి? అందరూ మాట్లాడకుండా ఉన్నారు కనుక అతని మాటల్ని ఆమోదించినట్లు కానే కాదు. ఇన్ని రాష్ట్రాల విభజన జరిగినా, రాజధానిని ఎప్పుడూ విభజించలేదు. నిజంగా అందరూ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి, హైదరాబాదు ఇంతగా అభివృద్ధి చెందాక - తెలంగాణాకి ఇస్తే, మన మహా నగరం ఏమి అయిపోతుందో అని భయంగా లేదూ?

విరజాజి said...

కాస్తైనా నిజాయితీ గా మీరు విలేఖరుల అరాచకం గురించి ప్రస్తావించారు. టీ.వీ 9 లో కేసీయార్ మాట్లాడుతుంటే ప్రత్యక్ష ప్రసారం ఇస్తున్నారు. గంటలకి గంటలు అతని ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడిన మీడియా మిత్రులకు మిగత అందరూ అలాగే దీక్షలు చేస్తున్నారని తెలీదా? అస్సలు కేసీయార్ అనే మాటలు ఎలా రాస్తున్నారో నాకు అర్ధం కావడం లేదండీ... ఈ రొజు హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా అని అన్నాడు. వాడెవడండీ ... ఈ హైదరాబాదు అందరు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల రాజధాని (ఇంకా తెలంగాణా రాకముందే ఇలా మాట్లాడుతున్నారు, తెలంగాణా వస్తే ఇక్కడ ఉన్న తెలంగాణేతరుల పరిస్థితి ఏమిటి? అని ఎవ్వరికైనా అనిపిస్తుంది కదండీ)

సమైక్య ఆంధ్ర కి అతను అనుకూలం కాకపోవచ్చు. కానీ ఇతరులని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం మాత్రం అతనికి లేనే లేదు. హైదరాబాదు గురించి మాట్లాడితేనే నాలుక తెగ్గోస్తా అనే ఇతనికి అంత కోపం వస్తే, మా ఊరు అనుకున్న హైదరాబాదును తెలంగాణాకి ఇవ్వాల్సిందే అంటే - మిగతా ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ ఇంకెంత కోపం రావాలి? అందరూ మాట్లాడకుండా ఉన్నారు కనుక అతని మాటల్ని ఆమోదించినట్లు కానే కాదు. ఇన్ని రాష్ట్రాల విభజన జరిగినా, రాజధానిని ఎప్పుడూ విభజించలేదు. నిజంగా అందరూ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి, హైదరాబాదు ఇంతగా అభివృద్ధి చెందాక - తెలంగాణాకి ఇస్తే, మన మహా నగరం ఏమి అయిపోతుందో అని భయంగా లేదూ?

Ramu S said...

viswamitra/ viraajita gaarlaku,
Dayachesi okka vishayam parigananaloki teesukondi. Nenu political developments meeda commentary raayadamledu. anni postulu media related ayitene raastunnanu. media paatrapainane naa focus ani gurtunchukogalaru. viswamitra gaaru, nenu lagadapaati press conferencelo media related partnu veruchesi post chesaanu. press conference vivaraalu repu peparlalo choosukondi.


"konta nijaayitee", "kaasta nijaayitee" ane maatalu koncham ibbandi kaligistunnayi. Nijaayitee kaakapote..baahaatamgaa peroo..vooroo prakatinchakundaa...ananymous gaa picchi raatalu raasevaadini. Please try to understand.
ramu

Anonymous said...

Virajaji garu,
I am accepting what KCR speaks, every body can come to hyderabad and they can live also happily in the hyderabad. What you are forgotten is Mohanbabu comments.

సమైక్య వాదం said...

లగడపాటి చెసింది కామెడి కాదు. దీక్షల గురించి మన నేతలలొ ఉన్న చిలిపితనాన్ని మాత్రమె ఎలెత్తి చూపారు. ఇకనైనా దీక్షల విలువలను కాపాడాలి. నిజం మనమందరము తెలుగు వారము. మీడీయా వారు తెలుగు వారుగా ఉండాలి. వారికి కేసియార్ ఐనా లగడపాటి అయినా ఒక్కలాగె ఉండాలి.

అసంఖ్య said...

a.p should be thankful to lagadapati.

he just out-foxed KCR spectacularly.

he just proved that people can do these fasts and live for 18yrs (theoretically) based on these IVs fluids and how gullible people are

they (fasts) dont have any value. it is a shame we feel proud that movement has gone into the hands of students, who are morons by the way.

KCR just lost his credibility one more time with this master stroke by congress.

now everybody, pack your bags, and focus on your personal development. fight with your self, not with your neighbor. that is the real mantra to prosperity

Anonymous said...

viswamitra... garu lagadapati wake cheppina telangana sayanni meru nijamanna bhramalo unnaru... kastha lagadapati jimmikkulanu kasta gurtuchesukondi... rajagopal charyalu pichivadini thalapinchadam ledu ? 19na diksha viraminchanantu... malli reporters ni juice immani adukkovadam pichithananiki parakashta kadantara ?
virajaji garu... papam telanganapaina kcr paina chala karanga unnatlunnaru... kcr annadi hyderabad nu telangana nunchi \vereu chesenduku kutralu pannu tunnavaruddeshindi... merenduku ulikkipadataru... meko mata kcr ni vadu ani sambodisthe me chetulundavu... jagratta...munduchuputu samaikyandra udyamanni addukokandi.. endukante ee sari telangana state kala neraverakapothe prathi telangana bidda ranarangamlo digutadu... evaru addupaddaro variki buddi cheppenduku... aayudhalu padathadu...
thasmath jagratta...
raju

Apparao said...

టీవీ చాన్నాళ్ళు అన్నీ హైదరాబాడు లో ఉన్నాయ్. ప్రత్యెక తెలంగాణా కి ఎవరన్న వ్యతిరేకం గా మాట్లాడితే ప్రసారం చెయ్యరు, చేస్తే స్టూడియో నాసనం చేస్తారని భయం

విశ్వామిత్ర said...

రామూగారూ
మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. మీరు నిజాయితీగా మీడియాలో జరిగే కుట్రలు కుతంత్రాలు కూడా బ్లాగుల్లోకి ఎక్కిస్తున్నారుకదా, అదే ముక్కుసూటితనం అన్ని విషయాలలో కనిపించాలి. మీ పేరు ఫొటోలతో బ్లాగింగ్ చేస్తున్నారుకాబట్టే కామెంట్లు రాస్తున్నాను. మీరు వద్దనుకుంటే మీ కామెంట్ మోడరనైజేషన్ ఉందికదా....!! :)

Ramu S said...

Viswamitra gaaroo,
Naaku nacchani comments kill chesi, naaku nachhinavi publish cheyadam anaitikamani anukuntunnanu. Meeru kastapadi chadivi...comment raaste daanni kill cheyadam...mimmalni sarigaa gouravinchanatlu anipistundi. sadvimarshalaku sadaa aahvaanam.
cheers
Ramu

kola said...

vilekharulu mudhiri poyaru. meeru cheppindhi correct.

Anonymous said...

rau garu comments emi levvu endukani(about latest issue of telangana- media coverage)

kvramana said...

anna ramu
what you said in your post is correct. but, you should have been there at the press conf. and also should have known the background of that. i was there to see all that tamasha. it was ridiculous. He called us for a press conference. Again he started us giving that lecture on the history of Andhra. When we objected he said it was his press conference and he had a right to say whatever he wants. As a professional journalist, how would you react to that? We kept on insisting that a press conference should be more interactive than a monologue. But he refused. Finally he bargained for time. We told him to wind up his speech in five minutes and give more time for Q&A. But he wanted to take one hour and finally agreed for 15 minutes. You must have also focused on the questions we were asking and his replies. whatever your impression is, we didnt go there for fun. It was our job and it looked as if he was trying to take advantage of the live cameras to spend some time. Secondly, his followers told me, his objective was to say Jai Samaikyandhra in the heart of the city and he knew that wherever he does that there was a danger of some kind of attack from pro-Telangana groups. So, he chose the press club of Hyderabad
ramana

Ramu S said...

ramana bhai,
I closely followed the press conference and heard your question on lack of NIMS-kind of hospitals in Vijayawada. Anna, we all know that he was doing that hangama to grab the attention of national media. He had to talk about Rani Rudrama in a bid to win the hearts of Telangana people.
I sincerely believe that it is unfair on reporters' part to ask him to cut short his speech (on the history). Since he had invited us for the PC, we should give him enough scope to make opening remarks and we shouldn't decide the length of such remarks. We must appreciate him for his open confession that he was deliberately "doing this comedy" to out-fox KCR.
Cheers
Ramu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి