Friday, July 9, 2010

ABN- ఆంధ్రజ్యోతి వార్తల్లో రాజకీయ వ్యాఖ్యలు

జనాలకు మీడియా మీద నమ్మకం పోవడానికి ప్రధాన కారణం--వార్తకు, వ్యాఖ్యకు మధ్య ఉన్న రేఖను జర్నలిస్టులు తుడిచిపారెయ్యడమే. ఆ పని చేస్తున్నది జర్నలిస్టులు అనడం కన్నా పత్రికలు/ఛానెల్స్ యాజమాన్యాలు చేయిస్తున్నాయని అనడం మంచిది. అలా చేయకూడదని యాజమాన్యాలకు చెప్పే దమ్మున్న జర్నలిస్టులు కరువయ్యారు. వార్తల ముసుగులో వ్యాఖ్యలు చొప్పించి తమ భావాలకు లేదా అజెండాకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలనుకోవడం ఒక క్రిమినల్ నేరం.

'సాక్షి' పేపర్ లేదా ఛానల్ లో ఇలా వార్తకు, వ్యాఖ్యకు తేడా లేకుండా రొడ్డ కొట్టుడు కొడితే జనం పెద్దగా పట్టించుకోరు-అది కాంగ్రెస్ ఎంపీ సంస్థ కాబట్టి. 'మీడియా-ఆత్మశోధన' అంటూ సొల్లు కబుర్లు చెప్పే వేమూరి రాధాకృష్ణ, ఆయన ఎంచుకున్న జర్నలిస్టుల బృందం డేరింగ్ జర్నలిజం అనుకుని...వ్యాఖ్యకు, వార్తకు తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నది. 'సాక్షి' వాళ్ళ మాదిరిగా తెర మీద నారా చంద్రబాబు బొమ్మ పెట్టుకుని ఈ పనిచేస్తే ఇబ్బంది వుండదు కానీ....శ్రీ రంగ నీతులు చెబుతూ...ఇలాంటి తిక్కల పనులు చేయడం సమజసం కాదు.

శుక్రవారం రాత్రి ఒక రెండు గంటల పాటు ABN- ఆంధ్రజ్యోతి ఛానల్ చూసిన ఎవ్వరికైనా వేమూరి టీం ఎంత రాజకీయ దిగజారుడు జర్నలిజానికి పాల్పడుతున్నదో అర్థమై వుంటుంది. ఒకవేళ...రాజకీయ పరిణామాలపై వ్యాఖ్య ఇవ్వదలిస్తే...'ఓనర్ కామెంట్' అనో 'ఎడిటర్ కామెంట్' అనో లోగో వేసుకుని నోటికొచ్చింది చెప్పుకోవచ్చు...రాజకీయ తీట తీర్చుకోవచ్చు. కానీ వార్తల ముసుగులో జనాలను మోసం చేయడం పధ్ధతి కాదు.  

ముందుగా 'మా నాన్న గాంధీ' అనే పేరు మీద ఒక ప్రోగ్రాం ప్రసారం చేసింది ఈ ఛానల్. తన తండ్రిని జాతిపితతో జగన్ పోల్చడాన్ని తూర్పారపడుతూ చేసిన కార్యక్రమం అది. అంతవరకూ పర్వాలేదు. మరీ పెద్దగా కామెంట్స్ చేయకుండా....పలువురు పార్టీ నేతల అభిప్రాయాలతో దాన్ని వండి వార్చారు. పిత్రోత్సాహంతో...జగన్ అదుపుతప్పి చేసిన పిచ్చి కామెంట్ పై సహేతుకమైన కథనమే అది. అందులో కూడా రిపోర్టర్ ఆత్మ కొన్ని వాక్యాలలో ప్రస్ఫుటం.

దాని తర్వాత వార్తలలో...జగన్ కు కాంగ్రెస్ కు మధ్య పంచాయితీని రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో జగన్ పార్టీ పెట్టుకునేందుకే ఈ యాత్ర చేస్తున్నారని కూడా తీర్మానించారు...వార్తల్లో. ఇదే మాట చెప్పదలిస్తే...'వార్త వ్యాఖ్య' అనే శీర్షికతో ఒక కార్యక్రమంలో చెప్పుకోవచ్చు గానీ....వార్తలలో విపరీతమైన కామెంట్స్ చేయడమేమిటి? 

పలు రాజకీయ కామెంట్స్ ను న్యూస్ రీడర్ చదువుతూ పోవడం ఎబ్బెట్టుగా వుంది. ఇది సంసారపక్షపు జర్నలిజం కాదు...దీన్ని 'అజెండా జర్నలిజం' అంటారు. జగన్ యాత్ర ముగిసే లోపు ఈ దుర్లక్షణం ముదురు పాకాన పడే అవకాశం వుంది. అయ్యా...వేమూరి గారూ...మీరు వ్యాఖ్యలు చేయదలుచుకుంటే....వార్తలతో కలిపి దంచిపారెయ్యకండి. ఆ Mahaa-news వెంకట్రావు గారి లాగా పెద్ద మనిషి తరహాలో కొంత సమయం మీ అమూల్యమైన వ్యాఖ్యలకు కేటాయించండి. అంతే గానీ....జనం గొర్రెలని భావించి...జర్నలిజాన్ని మరింత బ్రష్టు పట్టించకండి. ప్లీస్...మీడియా ఆత్మశోధన సంగతి తర్వాత....ముందు మీరు అర్జెంటుగా ఆత్మశోధన చేసుకోండి.

12 comments:

డి.వి.యస్.అబ్బులు said...

"సాక్షి" దినపత్రికలో "కడప" జిల్లా సంచిక కనపడడంలేదేమిటా అని చూశా. వాళ్ళు దానికి "YSR" అని నామకరణం చేసేశారు. మరీ ఇంత ఘోరంగా వాళ్ళ భావాలనూ, ఇష్టాలనూ ప్రజల మీద బలవంతంగా రుద్దెయ్యడమే! దీని గురించి పాత్రికేయులు ఏమనుకుంటున్నారో కాస్త చెబుతారా, రామూగారూ?

భవదీయుడు
అబ్బులు

Krishnarjun said...

అయ్యా అబ్బులు గారూ, ఈనాడు తదితర పేపర్లు ఇంకా పేరు మార్చలేదని వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉంటే మనం ఆశ్చర్య పోవాలి గానీ దీనికెందుకు.

katta jayaprakash said...

The need of the hour for Radhakrishna is for Athma shodhana for himself and I have already addressed a letter to him for his atma shodhana before inviting views on it from the readers in his columns.So far he has been mum for the allegations of extracting money from Bala Sai Baba to stop the story on him.Saakshi paper and TV channels have become nauseating with irritability as they are just promoting his owner like an actor promoting his son irrespective of his talent.Thev day is not far away where the people hate such such type of flooding of news on one person without respecting the views of the readers.Probably the circulation might get affected soon.
JP.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Saakshi is Jagan's personal pamphlet. If you want news avoid it.

ranjani said...

అబ్బులు గారూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కడప జిల్లా పేరుని మార్చిందట!!
ఈ వార్త వినలేదా - మీడియాలో ప్రచారం/కవరేజి జరగలేదు కాబోలు - రాష్ట్ర గెజిట్ లోనూ వైయెస్సార్ జిల్లా అని పేరు వస్తుందిక :(

maharshi said...

రాము గారు
ఎవరికీ వారికి ప్రత్యేక అజెండా పెట్టేసారు
మీరు ఒకసారి యాంకర్ల పై చేసినట్టు ఈ జర్నలిస్ట్ యాంకర్ల పై అభిప్రాయ సేకరణ జరిపితే బాగుంటుంది... ఎలాగు tv9 లో రవి, రజని ఉన్నారు. ఇక etv లో నో ఛాన్స్. ఇపుడు ntv లొనూ ఎవరు లేరనుకుంట... tv5 లో ఎగ్జయిల్డ్ జర్నలిస్ట్ వెంకట కృష్ణ, inews లో అంకం, మహా టీవీ లో కేశవ్, స్టూడియో న్ లో కందుల, రామచందర్, సాక్షి లో మురళి కృష్ణ,
జీ 24 లో శైలేష్, abn లో మూర్తి ఇలా చాలా మంది ఉన్నారు... వీళ్ళంతా బేసిక్గా జర్నలిస్ట్లు తర్వాత యాంకర్స్...
వీళ్ళ styles పైన ఒక రిపోర్ట్ చేస్తే బాగుంటుంది....
-మహర్షి

G.ACHARYA PRADYUMNA said...

అంధ్ర జ్యోతి అర్కె గారు రామోజి రావు గారి వలె కింగ్ మేకర్ ను అవ్వాలని అనుకుంటూండవచ్చు,కాని అది అయ్యే పని కాదు.ఈ మధ్య కాలం లో అంధ్ర జ్యోతి ప్రమాణాలు దిగజారుతున్నవి.
ఎడిటర్ కె.ఎస్. గారు ఒకే ధ్రుక్పథము తో(కమ్యూనిస్టు) వ్రాసే సంపాదకీయాలు.౨.ప్రాంతీయ భేదాలను సర్క్యులేశన్ పెంచుకునే విధంగా ఉపయోగించుకోవటము వగైరా ౩.నాసిరకము పేపర్ . ఎవరైనా ప్రతి రోజు మోసపోరు కదా..?

kvramana said...

If I remember it correctly, Kadapa was renamed as YSR Kadapa on the lines of Potti Sriramulu Nellore. But, certainly it is not just YSR. Anyway, did anyone watch a programme called Yatha Praja Tatha Raja on ABN? The way the owner of the channel was addressing the participants in singular (nuvvu...neeku, etc) was irritating.

maharshi said...

eee article chudandi!!


http://www.prajasakti.com/coverstory/article-126939

Raja said...

Ramu garu profile pic keka la undi :)Raja

premade jayam said...

only ysr jilla.

kadapa town keeps its name.

Anonymous said...

sad that the best news channel has biased opinions on few issues

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి