Thursday, February 14, 2013

'ఈనాడు' మిత్రులారా...ఒక్కసారైనా స్పందించరా?

జర్నలిస్టులకు, ముఖ్యంగా....'ఈనాడు' లో పనిచేసే మిత్రులకు, ఒక గమ్మత్తైన అలవాటు ఉంటుంది. అదే...తమ చాప కిందికి నీళ్ళు వచ్చే దాకా స్పందించకపోవడం. అన్యాయాలకు వ్యతిరేకంగా వారు రాస్తారు కానీ...తమకు జరిగే అన్యాయాల గురించి పట్టించుకోరు. ఎందుకంటే బతుకు భయం, ఉద్యోగ అభద్రత. 'ఈనాడు' లో పనిచేసే కమ్మ కులస్థులు, 'సాక్షి' లో పనిచేసే రెడ్డి కులస్థులు తమ యాజమాన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడరన్న ఒక వాదన ఉంది. అది నిజమేనేమో అనిపిస్తుంది. స్పందించే గుణం అనేదే జర్నలిస్టులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం. స్పందించడానికి కులం, గోత్రం, ప్రాంతం, లాభ నష్టాలు బేరీజు వేసుకునే జర్నలిస్టులు ఎక్కువ కాబట్టే తెలుగు జర్నలిజంలో నాణ్యత ఇలా ఏడ్చింది. ఇది ఎందుకు రాస్తున్నానంటే... మల్లికార్జున్  ఇంతగా ఇబ్బందులు ఎదుర్కుని  ఫైట్ చేస్తున్నా...జర్నలిస్టులు పెద్దగా స్పందించకపోవడం. 
 
తన ఆర్ధిక ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. జర్నలిస్టుల కోసం ఎన్నో కష్టాలు  అనుభవిస్తున్నారాయన. "మనం కేసు గెలిస్తే...ఈనాడులో ప్రతి ఉద్యోగికి లాభం సార్. ఎలాగైనా సరే ఈ పోరాటాన్ని ఒక కొలిక్కి తేవాలి," అని ఆయన ఎంతో ఆశాభావంతో నాతో అన్నారు. ఆయనపై భౌతిక దాడికి ఒక ప్రయత్నం కూడా జరిగింది. ఈ కేసుల వల్ల తనకు జరిగిన, జరుగుతున్నఅవమానాలకు లెక్కే లేదు. "పిల్లలు బ్రెడ్ అడిగినా కొనివ్వలేని పరిస్థితి," అని ఆయన మాటల సందర్భంగా చెబితే చాలా బాధ అనిపించింది. ప్రస్తుతం 'ఈనాడు' తో కేసు గొడవలో ఉన్నందున మరొక ఉద్యోగం చేసే అవకాశం లేదు తనకు. ఇలాంటి సహోద్యోగిని ఆదుకోవాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది.
ఆయనకు చేతనైన ఆర్ధిక, మానసిక సహాయం చేయడం మన విధి, తక్షణ కర్తవ్యం.
మల్లికార్జున్ ఫోన్ నంబర్:  9441550300
 మల్లికార్జున్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒక మిత్రుడు రామోజీ రావు గారి కుమారుడు సుమన్ దుర్మరణం గురించి ప్రస్తావన తెచ్చాడు. జర్నలిస్టులను ఇబ్బంది పెట్టి సంపాదించింది...చివరకు కొడుకునైనా కాపాడుకోలేక పోయింది...అని. తప్పులకు శిక్షలు ఇక్కడే ఉంటాయనే వాదన నిజమో కాదో తెలియదు. 
ప్రస్తుతం 'ఈనాడు' వ్యవహారాలూ చూస్తున్న కిరణ్ కూ పిల్లలు ఉన్నారు. కుటుంబ బాధలు ఆయనకూ తెలుసు. ఈ బ్లాగ్ కిరణ్, ఆయన సలహాదార్లూ చదువుతారు. వారైనా స్పందించి మల్లికార్జున్ ను మానవత తో ఆదుకోవాలి. కోర్టుకెక్కిన వారు తమకు వ్యతిరేకులు, వారిని నాశనం చేయాలన్న పిచ్చి భావనను వదలాలి.    

8 comments:

astrojoyd said...

స్పందించడానికి కులం, గోత్రం, ప్రాంతం, లాభ నష్టాలు బేరీజు వేసుకునే జర్నలిస్టులు ఎక్కువ కాబట్టే తెలుగు జర్నలిజంలో నాణ్యత ఇలా ఏడ్చింది..../
జర్నలిస్టులను ఇబ్బంది పెట్టి సంపాదించింది...చివరకు కొడుకునైనా కాపాడుకోలేక పోయింది...అని. తప్పులకు శిక్షలు ఇక్కడే ఉంటాయనే వాదన నిజమో కాదో తెలియదు.
ప్రస్తుతం 'ఈనాడు' వ్యవహారాలూ చూస్తున్న కిరణ్ కూ పిల్లలు ఉన్నారు. కుటుంబ బాధలు ఆయనకూ తెలుసు. ఈ బ్లాగ్ కిరణ్, ఆయన సలహాదార్లూ చదువుతారు. వారైనా స్పందించి మల్లికార్జున్ ను మానవత తో ఆదుకోవాలి. కోర్టుకెక్కిన వారు తమకు వ్యతిరేకులు, వారిని నాశనం చేయాలన్న పిచ్చి భావనను వదలాలి. ///వాస్తవాలు రాసినందుకు ధన్యవాదములు..

Unknown said...

కర్మ అనేది బలహీనుడి అతి బలహీన వాదన. పోతావురా ఒరేయ్ అనే పిల్లి శాపనార్థాలు వింటూంటాం. మీరు సుమన్ ప్రస్తావన తీసుకురావడం కూడా అలాంటిదే... దీన్ని ఎవరికైనా వర్తింపజేయవచ్చు, అన్వయింపజేయవచ్చు. ఉదాహరణకు మల్లికార్జున్ గారి గురించి కూడా ఆవలి పక్షం ఇలాంటి కర్మ వాదనే చేయవచ్చు. చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తున్నాడని.... ఒప్పుకుంటారా? ఏదేమైనా మీరు సుమన్ ప్రస్తావన తీసుకురావడం ద్వారా మల్లికార్జున్ గారి పోరాట ఔదాత్యాన్ని తగ్గించారని నా అభిప్రాయం.

Ramu S said...

Naidu garu,
You may be right sir. I was trying to present a much-discussed angle in this post. I'll avoid it in my future writings.
Thanks and regards
Ramu

Unknown said...

"పిల్లలు బ్రెడ్ అడిగినా కొనివ్వలేని పరిస్థితి,"
రామోజీ, కిరణ్ కుటుంబ ప్రస్తావన అనవసర మెమో ... కానీ ఆ జర్నలిస్ట్ ....."పిల్లలు బ్రెడ్ అడిగినా కొనివ్వలేని పరిస్థితి," ... కన్నా రామోజీ ప్రస్తావన బాద కలిగించడం విచిత్రం

Unknown said...

personal comments are not appreciatable...

Unknown said...

no comment...

K V Ramana said...

యాజమాన్యాలు ఇలా ఉద్యోగులను కష్టాల పాలు చేయడం కొత్తేమీ కాదు. పత్రికాధిపతుల దృష్టిలో ఈ సంఘటనలోని వ్యక్తీ "శత కోటి లింగాల్లో..." ఒకడు. వాళ్ళు ఇలాంటి సంఘటలను అంతే తేలికగా తీసుకుంటారు. పిల్లలకు బ్రెడ్ ఉందా లేదా అనేది అస్సలు పట్టించుకోరు. కోర్టుకు పొతే పరిష్కారం దొరుకుతుందా అనేది పెద్ద ప్రశ్న. చాలా సందర్భాల్లో వ్యాజ్యం అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి పనికొస్తుందే తప్ప పెద్దగా ఒరిగేది ఏది ఉండదని నా అభిప్రాయం. శర్మ గారు ఇలా ఇబ్బందులు పడటం బాధాకరం కాని ఆయన అనుకున్నట్లు ఈ కేసు గెలవటం వల్ల ఈనాడు ఉద్యోగులందరికీ మంచి రోజులు వస్తాయన్నది పూర్తిగా నిజం కాక పొవచ్చు. ఒక వేళ శర్మ గారు కేసు గెలిచినా ఆ వెంటనే యాజమాన్యం తనదైన శైలి లో ఉద్యోగ నిబంధనలు మార్చి కథ మళ్ళీ మొదటికి వచ్చేట్లు చేస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం శర్మ గారు న్యాయవాదుల సలహాలు విని కేసుల ఊబిలో ఇరుక్కున్నారనిపిస్తుంది. బాధ అనిపించినా ఇంత కచ్చితంగా నేను చెప్పడానికి కారణం నా వ్యక్తిగత అనుభవం. ఈ పాట్లు అన్నీ మేము ఎ పి టైమ్స్ యాజమాన్యం తో పోరాడినప్పుడు పడ్డవే. ఆ రోజుల్లో మాకూ ఆర్ధిక ఇబ్బందులు తప్పలేదు. ఒక ఇంటర్వ్యూ కోసం నేను జామై ఉస్మానియా నుంచి బేగంపేట్ వరకు నడిచి వెళ్లాను....చార్జీలు లేక. పోరాటం మంచిదే కానీ వెనక ముందు చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. మన వెనక ఆస్తులుంటే కేసులు వేసి ఎంత దాకా ఐన పొవచ్చు. లాయర్ల మాటలు నమ్మి మనము మన కుటుంబం తిండికి ఇబ్బంది పడటం అంత అర్ధవంతం కాదేమో అని అనిపిస్తోంది. నేను దక్కన్ క్రానికల్ లో పనిచేస్తున్న రోజుల్లో ఒక సీనియర్ ఒక మాట అన్నాడు..."ఎడిటర్ కు కోపం వచ్చిన మనమే పోతాం మనకు కోపం వచ్చిన మనమే పోతాం" అని. ఎన్ని సంవత్సారాలైన అది అక్షరాలా నిజమని రుజువవుతోంది. కాస్త పట్టు విడుపు వుంటే మన కుటుంబానికి మంచిది. నువ్వు పనిచేసేది ఈనాడు లోన న్యూ యార్క్ టైమ్స్ లోనా అనేది ఇంట్లో వాళ్లకు పిల్లలకు అనవసరం. నెల తిరిగేసరికి వాళ్ళ అవసరాలు తీర్చడం ప్రధానం. కేసు గెలిచినా ఓడినా వాళ్లకు ఒరిగేది ఏది లేదు. ఆలోచించండి.

Unknown said...

KV ramana garu meeru correct ga chepparu vunnavadu eppatiki vunnavade leni vadu eppatiki leni vade ee desam lo ardika samanatvam vachinappude journalist kaina samanya manavudi kaina nyayam jarigedhi

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి