Sunday, February 24, 2013

విచారం... విచారణ: ఇదే మన బతుకు గ్రహచారం?

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లతో మా అబ్రకదబ్ర గుండె మండింది, బుర్ర చెడింది. రెచ్చిపోయి ఆవేశం తో ఇది పంపాడు..... రాము 
------------------------------------
ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పుట్టినందుకు ఆనంద పడాలో, ఏడవాలో ఒకొక్కసారి అర్థం కాదు. మనది డెమోక్రసీ కాబట్టి... మనం ఒక పధ్ధతి ప్రకారం పోవాలని, లా బుక్కు ను తు.చ. తప్పకుండా అనుసరించాలని అనుకోవడం తప్పు కాదు. కానీ... మనం ఇలా మడి కట్టుకుని కూర్చుంటే...మత పిచ్చితో బాంబులు పెట్టి నిండు ప్రాణాలను తీస్తున్న వారు వారి పని వారు చేసుకు పోతున్నారు! ఎన్ని సార్లు సాధారణ జనం దారుణమైన బాంబు దాడులకు  బలి కావాలి? ఎంత కర్మ దేశమైతే మాత్రం... ఎన్నాళ్ళు ఇలా మన ఖర్మ అనుకుని కూర్చోవాలి? దీనికేమైనా వినూత్న పరిష్కారం ఉన్నదా? 

దిల్ సుఖ్ నగర్ లో ఉగ్రవాదులు బాంబులు పెట్టారు. హిందువులతో పాటు  ముస్లిం లు కూడా నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వంద మంది అమాయకులు గాయపడ్డారు. చచ్చీ చెడీ ఒకరిద్దరు తుగ్లక్ వెధవలను పట్టుకుంటారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి...వారి ముఖాలకు నల్లటి తొడుగులు తొడిగి వారిని విలేకరులకు చూపిస్తారు. ఆ తర్వాత వారిని కోర్టులకు అప్పగిస్తారు. పరమ పవిత్రమైన న్యాయ వాదులు... వృత్తి ధర్మం ప్రకారం వారి తరఫున వకాల్తా పుచ్చుకుంటారు. ఇక కోర్టుల్లో డ్రామా మొదలవుతుంది. 

ఇంతలో..ఆ దొరికిన వారు చచ్చేంత అమాయకులని, పోలీసులు పనిలేక పట్టుకున్నారని వాళ్ళ మతానికి చెందిన గ్రూపులు వాదిస్తాయి. అప్పుడు హక్కుల గ్రూపులు రంగంలోకి దిగుతాయి. దేశ రాజధానిలో టీ వీ స్టూడియోలలో కూర్చున్న సుసంపన్నమైన, విద్యావంతులైన అయ్యలు అమ్మలక్కలు "రాజ్య హింస", "రాజ్యం దరిపే దాడి" మీద ఎడతెగని డిబేట్లు జరుపుతారు. అలా జరపకపోతే మేధావి కింద లెక్క కాదు మన పుణ్య భూమిలో. మత పరమైన ఓట్ల కోసం వారి మత నేతలు ఆ నిందితుల కోసం పోరాటాలు చేస్తారు... కోర్టు బైటా లొపలా. ఇంతలో కోర్టు కేసులు మొదలవుతాయి. వాయిదాల మీద వాయిదాలు పడతాయి. జనం ఎర్రి పప్పల్లా తుది తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాల చక్రం గిర్రున తిరుగుతుంది. మన కర్మ బాగోలేకపోతే.... ఈ లోపు మరొక బాంబు పేలుతుంది. 

చూశారా... నోట్లో వేలుపెట్టినా కొరకలేని వారిని తీవ్రవాదులుగా ముద్ర వేశారని దేశభక్తి లేని చచ్చు పుచ్చు గాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు. దానికి ప్రభావితులయ్యే వర్గం మతోన్మాదం తో రగిలిపోయి పిచ్చి పిచ్చి వాదనలు చేస్తుంది. వారు నిజమైన యుద్ధ వీరులుగా నీరాజనాలు అందుకుంటారు. నిందితులకు భద్రత పేరిట కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేస్తాం. ఇలా ఒక ఐదు లేదా ఆరేళ్ళు జరిగాక... నేరం రుజువు కాక వదలడమో, కింది కోర్టు శిక్ష వేయడమో అవుతుంది. నిందితులు పై కోర్టులకు వెళతారు. స్టే తెస్తారు. ఇలా మరి కొద్ది పుణ్య కాలం గడుస్తుంది. దొరికిన వాళ్ళు ముదుర్లయితే... వారి బాసులు ఏ విమానమో హైజాక్ చేసి...వారి విడుదలకు డిమాండ్ చేస్తారు. మన ప్రభువులు వారిని రాజ లాంఛనాలతో విడుదల చేసి పచ్చని తీరాలకు సాగ నంపుతారు. ఇదీ... అతి పెద్ద ప్రజాస్వామ్యంలో జరిగే తంతు. 

ప్రభువుల్లారా... మిగిలిన నేరాలకు లా బుక్కు ప్రకారం పొండి. ఇలా బాంబులు పెట్టే బద్మాష్ గాళ్ళ విషయంలో మాత్రం ఇంత పధ్ధతి పాటించాల్సిన అవసరం ఉందా, ఒక్క సారి ఆలోచించండి. మన మెతకతనం వల్ల, చేతగాని తనం వల్ల, మీ లుచ్చా రాజకీయాల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెడదాం. 

ఆంధ్రా పోలీసులు తెలివిగా నేరాన్ని నిరూపించలేరు గానీ... నిజమైన నిందితులను పట్టుకోగలరు, ఆ సత్తా వారికి వుంది. అలా దొరికిన వారిని ఆ దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గర చెట్టు కొమ్మలకు కట్టేసి జనాలకు వదలండి. "ఒక్క పది హేను నిమిషాలు" అక్కడ పోలీసులు లేకుండా చూడండి. 

ప్లీజ్...ఒక్క సారి ఈ పని చేయండి. మళ్ళీ హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు జరిగితే అడగండి. ఒక్క సారి ఇట్లా చేయడం వల్ల మన ప్రజాస్వామ్యానికి ముప్పు రాదు. ప్లీజ్ బాధితులకు ఒక్క చాన్సివ్వండి.          

12 comments:

Unknown said...

నిజమే... ఉగ్రవాదుల విషయంలో మనం ఇజ్రాయెల్ విధానాలను అనుసరిస్తే బాగుంటుంది. కానీ మన దగ్గర రాజకీయ సంకల్పం కొరవడుతోంది. ఓటు బ్యాంకుల కోసం వెంపర్లాడే నాయకులు ఉన్నంతకాలం మనం బాంబులకు బలవుతూనే ఉంటామనిపిస్తోంది.

చంద్ర said...

రాము గారు,
shocking post.

మీడియా లో పని చేస్తున్న, ఉన్నత విద్యావంతులైన మీరు ఇలా వ్రాస్తారు అనుకోలేదు.
మన దేశం లో ఎలాంటి నేరస్తుల కైనా చట్టం పరిధిలో విచారణ జరిగి శిక్ష పడాలి. వాదనలు, ప్రతి వాదనలు జరగడం ఆ జరిగి నేరం నిరూపణ అవ్వాలి. దీనికి మినహాయింపులు ఉండకూడదు. ఈ రోజు ఆవేశం తోనో, ఆవేదన తోనో, బాంబులు పెట్టిన ఉగ్రవాదులను చట్టం బయట శిక్షించాలి అంటున్నారు. అది అక్కడితోనే ఆగుతుందా? చట్టం బయట శిక్షించే పద్ధతి, సామాన్యుల మీద, పోలీసులకు నచ్చని వారి మీద అమలు చెయ్యరని ఏమిటి గ్యారంటి?
ఏ విషయం మీద అయినా చర్చ జరిపే హక్కు ఉండడం మన అదృష్టం. అలాంటి చర్చ ల వలన నే ఎవరు ఏమిటి అనేది మనకు తెలిసింది. మనం వారి అభిప్రాయాలు కరెక్ట్ అని ఒప్పుకోవలిసిన పని లేదు, కాని వారికి అభిప్రాయం చెప్పే హక్కు ఉంది అని మాత్రం ఒప్పుకొని తీరాలి అనుకుంటున్నాను.

ప్రతీక said...

మిత్రమా,
మీ ఆవేశం అర్దమవుతూనే వుంది. మీడియాలో వున్న మిత్రుడిగా అందునా డాక్టరేట్ చేసిన ఓ స్కాలర్ గా మీరు ఆవేశపడుతున్న తీరును మాత్రం హర్షించలేను. అందునా అందరికీ అందుబాటులో ఇలా బ్లాగటం... ఆలోచించండి

Ramu S said...

Chandra and Chigurupati,
Don't jump to conclusions sir. See this line.
దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లతో మా అబ్రకదబ్ర గుండె మండింది, బుర్ర చెడింది. రెచ్చిపోయి ఆవేశం తో ఇది పంపాడు..... రాము
It seems you haven't read some posts read by this angry young man.
Ramu

krshnrao said...

We are jerks..and not having guts.We hide our cowardice in the guise of democratic sentiments..Hindus are most hypocratic buffoons..this is world's conclusion..!

katta jayaprakash said...

There is nothing wrong in the views expressed by Ramu as it is natural,human and spontaneous if one looks at the tragedy of the injured some loosing legs,some hand and others with vegetative life with multiple injuries.The families who lost their bread winners is pathetic.Irrespective of Phds and highly intellectual mind the nature of response is spontaneous and emotional equal to every human being.When a medico and her mother were stabbed by criminals in Nellore every one demanded death sentence and same in the case of a sexual assault on a girl in Delhi irrespeCtive of educational status.Intellectual mind is nothing to do with the responses like Ramu's.

JP.

చంద్ర said...

Ramu gaaru,
I honestly missed the opening line of your post. Apologies. I don't know who is this angry young man 'abrakadabra'. If I knew him, I would have told him the same.
@krshnrao garu,
If you are referring the Hyderabad blasts incident, its not a problem for Hindu religion, for that matter any religion. Its a Law & Order problem. And India's Law & Order is concern for all the Indians, irrespective of their religious beliefs.

Ramu S said...

Chandra garu,
Your point is taken
ramu

Jai Gottimukkala said...

ఎవరండీ ఈ అబ్రకదబ్ర? ఇలాంటి భావజాలం ఉగ్రవాదం దొందూ దొందే.

Unknown said...

whatever you said is 100 % is correct Ramu garu we need punishment system followed in muslim countries. take for example the delhi gir incident. the culprits are still not punished our law has many loopholes which allows these criminals either to escape punishment or enjoy years together in jails all luxuries at the cost of the government which they might not get in their houses. rapists, animals who plant bombs which kills innocent people or thieves should be hanged in public or killed by stoning. kosi chetilo pettali anthe

NEWS ARTICLES said...

ఉగ్రవాదులను, సంఘ విద్రోహులను సమాజానికి దూరంగా ఉంచడమే మన చట్టాల లక్ష్యం, వారిపై పగ తీర్చుకోవడం కాదు. హక్కుల సంఘాలను విమర్శించడం సరికాదు. వారే లేకపోతే రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఉరి కంభానికి వేలాడేవారే. మీలాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.

NEWS ARTICLES said...

ఉగ్రవాదులను, సంఘ విద్రోహలను సమాజానికి దూరంగా ఉంచడమే మన చట్టాల లక్ష్యం, వారిపై పగ తీర్చుకోవడం కాదు. హక్కుల సంఘాలపై మీరు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఎంత వరకు సబబు. వారే లేకపోతే రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఉరికంభానికి వేలాడేవారే. మీలాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి