Tuesday, February 19, 2013

బీ బీ సీ లో జర్నలిస్టుల సమ్మె...

లెక్కాపత్రం లేదు కానీ.. తెలుగు చానెళ్ళలో గడిచిన మూడేళ్ళలో ఐదారు వందల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగం పోయిన అభాగ్యులు నెత్తీనోరూ బాదుకోవడం, ఇకటి రెండు సార్లు రాష్ట్ర మానవ హక్కుల సంఘం దగ్గరకు పోవడం మినహా ఏమీ చేయలేకపోయారు. ఈ రోజు ఉద్యోగానికని వెళ్ళిన జర్నలిస్టులు, టెక్నీషియన్లను హెచ్ ఆర్ డిపార్టుమెంటు వాళ్ళు పిలిచి సిమ్ కార్డు, ఐ.డీ. కార్డు తీసుకుని అటు నుంచి అటే ఇంటికి పంపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ తంతు ఆ కుటుంబాలలో సంక్షోభం సృష్టించింది, జర్నలిస్టు విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది.    

ఇప్పుడు గొడవ చేస్తే... వేరే ఛానెల్ లో ఉద్యోగం రాదేమోనన్న బతుకు భయంతో జర్నలిస్టులు మూసుకుని కూర్చోవాల్సి రాగా... చేవలేని జర్నలిస్టు సంఘాల నేతలు సుఖంగా తమ పని తాము చేసుకుంటూ ప్రెస్ క్లబ్ లో సేద తీరారు. ఉద్యోగ భద్రత గురించి వీళ్ళు ఒక్క నిరసన ప్రదర్శన అయినా తీయలేదు. ఈ దారుణంపై కనీసం ఈ మహానుభావులు స్పందించిన దాఖలాలు లేవు. 

దీనికి భిన్నంగా... ఉద్యోగాలపై వేటు వేసి డబ్బు ఆదా చేయాలన్న బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ (బీ బీ సీ) ఆలోచనను నిరసిస్తూ... నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నేతృత్వంలో సోమవారం నాడు సమ్మె జరిగింది. సెంట్రల్ లండన్ లోని బీ బీ సీ స్టూడియోతో పాటు బ్రిటన్ లోని వివిధ ప్రాంతాలలో జర్నలిస్టులు నిరసన నిర్వహించారు. ఉదయం వచ్చే రేడియో న్యూస్ ప్రోగ్రాం 'టుడే' తో పాటు వివిధ కార్యక్రమాలపై ఈ సమ్మె ప్రభావం పడింది. పలు ముఖ్యమైన షో లు రద్దయ్యాయి.  రెండు వేల ఉద్యోగాలు పోయేలా ఉన్నాయని, ప్రస్తుతానికి ఒక ముప్ఫై మందిని సాగనంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని యూనియన్ వాదిస్తున్నది. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.... 

National Union of Journalists general secretary Michelle Stanistreet said poor decisions by the BBC leadership were leading to quality journalism being compromised. The union says 2,000 jobs are at risk in BBC cost-cutting. Many will be eliminated through attrition, but about 30 jobs are targeted for compulsory layoffs.


'ది ఇండిపెండెంట్' కథనం ప్రకారం.... 

The union said jobs were set to be axed across the corporation, including BBC Scotland, Five Live, the Asian Network and the World Service.

The union has asked the BBC for a moratorium on all job cuts for a six-month period, to allow for talks and negotiation with the new Director-General.

The NUJ said 7,000 jobs had been cut at the BBC since 2004, while a further 2,000 are being lost under cost-saving plans.


బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ ప్రజల నుంచి వచ్చే డబ్బులతో నడుస్తూ ప్రజాదరణ పొందింది. కలర్ టీ వీ ఉన్న ప్రతి కుటుంబం ఏడాదికి 145.50 పౌండ్లు (దాదాపు 228 డాలర్లు) చెల్లించే లెవీ తో బీ బీ సీ నడుస్తోంది. 2010 లో ప్రభుత్వం ఈ లేవీని స్తంభింప చేయడంతో ఆ సంస్థకు నిధుల కొరత ఏర్పడి, ఆదా లో భాగంగా ఉద్యోగాలపై వేటు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. బీ బీ సీ స్టూడియో ఎదుట నిరసన తెలుపుతున్న ఒక జర్నలిస్టును ఈ చిత్రంలో చూడవచ్చు. 

ఎన్ యూ జే స్ఫూర్తితో జర్నలిస్టు సంఘాలు పనిచేయకపోతే... తెలుగు మీడియాలో జర్నలిస్టులు, టెక్నీషియన్లు వారి కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి మరింత పెరుగుతుంది. ఇకనైనా తమ పక్షాన నిలబడే జర్నలిస్టు సంఘాల ఆవశ్యకతను ప్రతి జర్నలిస్టు గుర్తించాలి. జర్నలిస్టు నేతలను నిలదీయడం నేర్చుకోవాలి. యువరక్తం వస్తే తప్ప జర్నలిస్టులకు రాష్ట్రంలో బతుకు లేదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇక్కడి జర్నలిస్టులకు చాలా కాలం పడుతుంది.   
Photo courtesy: Press Association.
    

3 comments:

katta jayaprakash said...

It's a good comment on the journalists and it's associations for behaving like,blind,deaf and dumb to many people who are sacked by the media houses.But it looks most of the reporters and others are confident that if not this channel or newspaper they land in some other with good salary so where is the problem except for a few unlucky? When every one is concentrating on illegal money being exorted from many where is the need for agitation for sacking? It's all a big mess in media!

JP.

కిరణ్ said...

మీ బ్లాగు బాగుంటుంది. ఈ రోజు చట్టాల ప్రకారం వ్యక్తి హక్కులు, గ్రామ హక్కులు, నగర హక్కులు... & vaari vaari పురోగతికి ప్రభుత్వ సహకారాలు లాంటి విషయాల మీద వ్యాసాలు అందించాలని కోరుతున్నాను..

ఇండియాలో డిస్టన్స్ లో మాస్టర్స్ ఇన్ జర్నలిజం అందిస్తున్న యూనివర్సిటీలు ఏవైనా ఉన్నాయా. ఉంటే తెలుపగలరు. thanks andi

K V Ramana said...

This is possible only when the Union is strong. If possible please get the details of our union, the leaders, their activities (professional or otherwise). It should be interesting. I still doubt how many of our union leaders are working journalists and how many of them are non-working journalists. Subject to correction...I also feel that many of them have "settled" down in their lives and most of them have not worry about their professional career or personal life.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి