Tuesday, October 27, 2009

తెలుగుపై చర్చలలో రజనీ, రోజాల "లాంగ్వేజ్ స్కిల్ల్స్"

"అమ్మకు (అంటే..తెలుగుకు) జరిగిన దాన్ని అవమానంగా ట్రీట్ చేయాల్సివుంది."
"కడపలో జరిగిన ఇంసిడెంట్ కు బ్యేస్ ఏమిటి?"
"ఓవర్ ఆల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇంప్రెషన్ కనిపిస్తున్నది."
----ఇవి మన ప్రియతమ చానెల్ TV-9 లో October 27 రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో  మన రజనీకాంత్ డైలాగులు.
"కేవలం సారీ చెపితే సరిపోతుందా. యాక్షన్ యీమీ తీసుకోరా?"
"సో..ఇది మైదుకూరు సంఘటనపై డిస్కషన్."
----ఇవి మన దాదా ఛానల్ I-News లో అంతకు కొద్ది సేపు ముందు అందాల రోజా చేసిన కామెంట్లు.
తెలుగుపై తెగ బాధ పడుతూ చర్చలలో వీరిద్దరూ..ప్రదర్శించిన "ఇంగ్లిష్ లాంగ్వేస్ స్కిల్ల్స్" మీద విశ్లేషనాత్మక కథనం రేపు. తెలుగు తెగ రేపునకు గురైన వైనం కోసం...వేచిచూడండి.

6 comments:

kvramana said...

annayya
nenu kooda TV9 charcha (discussion) choosanu. nijanga chala kopam vachindi. vichitram emitante, english lo kooda aa mahanubhavula naipunyam ante vundi. udaharanaku, SUDDEN aney padanni 'SHUDDEN' antadu aa paatrikeyudu. Ee daurbhagyaanni, durmaargaanni, bhasha daaridryaanni mana meeda ruddutunna channels (?) paina poorti sthayi udyamam cheyaalsina avasaram undi.
(kshaminchali...naa daggara Telugu software ledu. 15 samvatsaruluga Engish medialo undatam valla aa software avasaram naku raledu)
Ramana

సుజాత వేల్పూరి said...

అసలు టీవీ 9లో ఉపయోగించినంత "ఎంగ్లీష్" ఇంకెక్కడా ఉపయోగించడం నేను చూళ్ళేదు. తల్లిదండ్రులు అనడం ఎప్పుడో మానేశారు! పేరెంట్స్ ..పేరెంట్స్! ఫలానా వాళ్ళు ఈ "టాపిక్" మీద తమ "వ్యూస్" ని మనతో "షేర్" చేసుకుంటారు...!

ఎంత చక్కగా సులభమైన తెలుగులో చెప్పవచ్చు ఈ వాక్యాన్ని?

'దీనిమీద మీ "ఒపీనియన్" ఏమిటి? అని తప్ప అడగటం తప్ప అభిప్రాయం అనే మాట ఒకటుందని మర్చేపోయారు. పోనీ అదైనా కాస్త సరైన ఉచ్చారణతో ఉంటుందా అంటే అదీ లేదు. దీన్నే పచ్చి ఇంగ్లీష్ అనేవాళ్లం చిన్నప్పుడు! చివరికి టీవీ 9 చూస్తే నేర్చుకున్న కాస్త ఇంగ్లీషూ గంగలో కలిసే ప్రమాదం ఉందనిపిస్తోంది.

ఈ ఛానెల్ కి పోటీగా ఉండాలనో ఏమో మిగతా వాళ్ళూ ఇదే బాట! ఈ దరిద్రం ఎప్పుడు వదుల్తుందా అని చూస్తుంటే రోజుకో న్యూస్ ఛానెల్ పుట్టుకొస్తోంది.

Anonymous said...

ayya, tamareppudu camera munduku vachi maatlaadi erugaru. enta tesion untundo meeku teliayadu. eemi teliyani meeku experiance leni meeru anta chinchukovadam deniki.ishtam unte janam choostaaru kashtam ayite remote undane undigada... meerome professor antunnaaru... inta nagative mind too pillalaku eem chebutaaru sir.

Ramu S said...

అన్నయ్యా/ అక్కయ్యా,
కోపం వద్దు. మీరు కూడా ఆలోచించండి...అది ఎంత ఎబ్బెట్టుగా వుంటుందో. రోజా గారు మంచిగా యాంకరింగ్ చేసినప్పుడు..అదే మాట రాసాము. రజని గారు మంచి చర్చ సాగిస్తే అదే మాట మన వేదికలో మీరు చూడవచ్చు. మన ఛానెల్స్ వారు పిల్లలకు జరిగిన అవమానం...వారి హక్కులకు జరిగిన నష్టం గురించి మాట్లాడకుండా తెలుగు భాష గురించి ఇంగ్లీషులో చర్చలు సాగించారు.
నేను కెమెరా ముందు మాట్లాడానో..లేదో...మీకు తెలియదు కదా! థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్.
Lets be sportive
Ramu

Anonymous said...
This comment has been removed by a blog administrator.
mitrudu said...

రామూ, కొంచెం నాణ్యమైన కామెంట్స్ పెట్టొచ్చు కదా... ఇంగ్లీషు మాట్లాడవద్దని పిల్లల మెడలో బోర్డులు వేలాడదీయడానికీ, యాంకర్ల భాష బాగా లేకపోవడానికి ఏమిటీ లింకు?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి