Friday, May 14, 2010

i-news యాజమాన్యంపై SHRC కి జర్నలిస్టుల ఫిర్యాదు

తెలుగు జర్నలిజం చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి ఈ రోజు తెరలేచింది. హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా...నోరు మూసుకుని భరించే తెలుగు జర్నలిస్టు గళం ఎత్తడం మొదలుపెట్టాడు. అదీ....ఒంటరిగా కాదు...మూకుమ్మడిగా. గుడ్డికన్ను లాంటి జర్నలిస్టు సంఘంతో పనిలేదని నిర్ధారణకు వచ్చిన జర్నలిస్టులు విధిలేక ఐ-న్యూస్ యాజమాన్యంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. 

జర్నలిస్టులకు జీతాలు, భత్యాలు ఇవ్వకుండా i-news యాజమాన్యం నానా ఇబ్బందులు పెడుతున్నదని ఈ బ్లాగ్ లో మూడు పోస్టులు పెట్టిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కుటుంబ పోషణకు మరో మార్గాంతరం లేక వేరే ఛానెల్స్ లో చేరిన దాదాపు యాభై మంది జర్నలిస్టులు, టెక్నీషియన్లు ఈ రోజు రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మన్ సుభాషణ్ రెడ్డి గారిని కలిసారు. i-news యాజమాన్యం తమను దారుణంగా ఇబ్బంది పెట్టిందని, ఇంతవరకూ బకాయిలు ఇవ్వలేదని వారు లిఖితపూర్వకంగా, మౌఖికంగా ఫిర్యాదు చేశారు. 

i-news యాజమాన్యం PF కింద వసూలు చేసిన డబ్బు ఏమి చేసిందీ అర్ధంకావడం లేదని, ESI సౌకర్యం కూడా లేకుండా మోసం చేసారని బాధితులు వాపోయారు. యాజమాన్యం డబ్బులు ఉండీ ఇవ్వడంలేదని వారు ఫిర్యాదు చేశారు. తమకు వాసు వర్మ అండ్ కో ఇచ్చిన ఆఫర్ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్, ఐ.డీ.కార్డులు కూడా వారు SHRC కి సమర్పించారు. 

జూన్ 2 న హియరింగ్!
కేసును సావధానంగా విన్న సుభాషణ్ రెడ్డి గారు కార్మిక శాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు పంపినట్లు సమాచారం. జూన్ రెండో తేదీన వచ్చి మళ్ళీ కలవాల్సిందిగా ఆయన ఆ బాధిత జర్నలిస్టులను కోరారు. N-TV, ABN-AJ, Raj, Studio-N లలో పనిచేస్తున్న మాజీ ఐ-న్యూస్ ఉద్యోగులు ఈ బృందం లో ఉన్నారు. అనంతరం తాము బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఒక ఫిర్యాదు సమర్పించినట్లు బాధితులు ఈ బ్లాగ్ కు ఫోన్ లో తెలిపారు. 
రాజశేఖర్, కందుల రమేష్ ల బాధ్యత ఎంత?

"TV-9 లో ఒక దొంగ వ్యవహారం లో ఉజ్జోగం కోల్పోయిన రాజశేఖర్ ను నమ్మి i-news లో చేరడం మేము చేసిన తప్పు. ఇది ఒక NRI ఛానల్ అని మమ్మల్ని నమ్మించాడు. మమ్మల్ని నట్టేట ముంచి తాను N-TV లో మంచి జీతం తో చేరాడు," అని ఒక బాధితుడు అన్నాడు.
ఆ తర్వాత TV-5 నుంచి వచ్చి చేరిన కందుల రమేష్ కూడా తమను మోసం చేసినట్లు ఒక వర్గం భావిస్తున్నది. "మేము సమ్మె కు దిగినప్పుడు, అంతకు ముందు సర్ది చెప్పిన కందుల రమేష్ కూడా కొందరిని నట్టేట ముంచి...తమ వాళ్ళ ఛానల్ అయిన studio-N లో చేరాడు," అని అన్నారు. తమను బాగా నమ్మించి వంచించిన సీనియర్లపై బాధితులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సొంత లాభం, సొంత పే ప్యాక్ తప్ప ఇతరుల బాధ పట్టని ఇలాంటి సీనియర్ జర్నలిస్టుల వల్ల సాధారణ జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సీనియర్ల సొంత కాలిక్యులేషన్స్ వల్ల i-news యజమాని వంటి వాళ్ళు జర్నలిజాన్ని రోడ్డుపక్క పల్లీలు అమ్ముకునే వ్యవహారంగా భావిస్తున్నారు.

3 comments:

Saahitya Abhimaani said...

ఒక పేపరు కానీ, చానెల్ కాని పెట్టాలంటే పెట్టుబడే కాకుండా, సదరు వ్యక్తీ లేక వ్యక్తులు కనీసం ఒక పది సంవత్సరాలు విలేఖరులుగానో, సంపాదకులుగానో పనిచేసి ఉండితీరాలన్న నియమం పెడితే కొద్దో గొప్పో తాము చేస్తున్న పని గురించి తెలిసిన వాళ్ళు యజమానులుగా ఉండే ఆవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఊరికే చేతులో డబ్బులు పట్టుకుని బడ్డి కొట్టు పెట్టినట్టు పేపర్లు చానెళ్ళు కుక్క గొడుగుల్లా పుట్టకుండా ఉంటాయి.

Anonymous said...

siva cheppindi nijame... journalism sangati devuderugu. paper gani, tv gani petta dalachukunna varipi murder casulu lekunda undali. govt., kanisam aa matram jagratta tisukovali. konni channel owners pina aneka criminal kasulu unnatlu samacharam. inka vallu jananiki melu ela chestaru?

Anonymous said...

manchi pani chesaru.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి