Sunday, May 2, 2010

నవ్వుతూ...తుళ్ళుతూ...హాయిగా...తియ్యగా...

పదేళ్ళ కిందటి మాట. 
అది నా అత్యంత సన్నిహితుడి పెళ్లి వేడుక.
బ్రహ్మాండంగా జరుగుతోంది.
పంతులు గారు జోరుగా మంత్రాలు చదువుతున్నారు.  
ముహూర్తం వేళ అయ్యింది. 
మా వాడు లేచి వధువు మెడలో మంగళసూత్రం కట్టాడు.
"భాబూ...భజంత్రీలూ.....వాయించండి....," అని అయ్యగారు గట్టిగా కేక వేశారు.
"పిపీప్..పిపీ..పిపీప్..."
ఆహా ఏమి ఇంపుగా ఉంది...అని అందరం చెవులు రిక్కించి విన్నాం.
"పిపెప్..పిపీప్.....పావురానికి, పంజరానికీ పెళ్లి చేసే ఈ పాడు లోకం..పిపీప్...."
నాకు ఆ ట్యూను విని దిమ్మతిరిగింది.
"ఏమయ్యా...శుభమా అంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటే...ఇదేమి పాడు ట్యూను...మంచిది ఏదైనా వాయించు...," అని ఆ భజంత్రీ గారిని నేను వాయించాను.
"లేదు సార్...ఇది లేటెస్ట్ ఫిలిం సాంగు. వెంకటేష్, మీనా....," అని ఒక లెక్చర్ దంఛబోతుండగా...దండం పెట్టి..'నాయనా...అయినా సరే...వేరే పాట వాయించు," అని బతిమాలా.


---ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా...నవ్వు వస్తుంది. కనీసం ఒక ఇరవై మంది ఫ్రెండ్స్ కు ఈ ఉదంతం డ్రమాటిక్ గా వర్ణించి నవ్వుల పూలు పూయించి ఉంటా నేను. వరల్డ్ లాఫ్టర్ డే (ప్రపంచ నవ్వుల దినోత్సవం) సందర్భంగా ఒక పోస్టు రాయడానికి మంచి లీడ్ ఏమిటా అని అనుకుంటూ ఉంటే ఇది గుర్తుకు వచ్చింది. ఆ అసందర్భపు వాయిద్యం మధ్య పెళ్ళిచేసుకున్న ఆ జంట...పాటలో మాదిరిగా పావురం-పంజరం లాగా కాకుండా...చిలక-గోరింకల్లాగా హాయిగా ఉండడం మాకు సంతోషదాయకం. 


నాకున్న మంచి మిత్రులలో ఇద్దరు...మాంచి హాస్యప్రియులు. 'ఈనాడు'లో పనిచేసే ఇద్దరూ అద్భుతమైన మనుషులు---డబ్బీరు రాజేంద్ర ప్రసాదు, ఎన్.వేణుగోపాల్. ఇంత ముఖ్యమైన రోజు పొద్దున్నే డబ్బీరును కలవడం కాకతాళీయమైనా నాకు ఆనందం కలిగించింది. 


డబ్బీరును కలిసినా...ఫోన్ లో మాట్లాడినా... ఒకటి రెండు జోకులు చెప్పకుండా ఉండడు. సందర్భానికి తగినట్లు అద్భుతంగా ఒక జోకు పేల్చే సత్తా ఉన్నవాడు. ఇలాంటి వాళ్ళు బహు అరుదు. ఈ రోజు ఫోన్ చేసినప్పుడే...భార్య మీద ఒక జోకు చెప్పి...నవ్వించాడు. అది వెంటనే...నా భార్య హేమకు చెప్పి నేనూ నవ్వించాను. డబ్బీరును కలిసాక...మరొక జోకు! వాడు ఒక నాన్-వెజ్ జోకు రమ్యంగా చెప్పి నవ్వించాడు. 

ఇక వేణుతో ఉంటే...ఇద్దరం గుండెల నిండా నవ్వుకుంటాం. నేనెక్కడో హడావుడిలో బిజీగా ఉన్నప్పుడు ఆ ఫోన్ వస్తుంది. "ఆ... క్లింటన్...ఎలా ఉన్నావ్?" అంటాడు. క్లింటన్ కు మనకు సంబంధం లేదు, వాడి బుద్ధులు మనకు లేవు. అయినా అది అంతే. నేను ఫోన్ చేసినప్పుడు...పొరపాటునైనా..."వేణూ..." అనను. "కోఫీ అన్నన్..." అనో..."టైగర్ వుడ్స్" అనో పిలిచి సంభాషణ కొనసాగిస్తా. ఎందుకో అలాగే కొనసాగుతున్నది చాలా ఏళ్ళనుంచి. ఆ  పలకరింపు ఒక మంచి సంభాషణకు దారి తీస్తుంది. మనసును తేలిక పరుస్తుంది.

ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే భలే తృప్తిగా ఉంటుంది. నేను ఏ ఊరు వెళ్ళినా...ఇలాంటి వాళ్ళను వెతికి, పట్టుకుని వారితో జీవిత కాలపు బంధం ఏర్పాటు చేసుకుంటా. మన బ్యాటరీ డౌన్ అయినప్పుడు వీళ్ళకు ఫోన్ చేసి మాట్లాడితే....భలే మజాగా ఉంటుంది.

వీళ్ళిద్దరి స్పెషాలిటీ ఏమిటంటే....హాస్యపూరితమైన పూర్వ సంఘటనలు/ ఉదంతాలు గుర్తుకు ఉంచుకొని మరీ నాటకీయంగా, సందర్భానుసారంగా చెప్పి నవ్వించడం. పదాల విరుపు, ఛలోక్తులు వీరి సొంతం. ఉదాహరణకు- ఇందాక....'డబ్బీరు' అనే తన ఇంటి పేరుకు మా వాడు వ్యుత్పత్తి  వివరించాడు. 'మీ వాళ్ళు ఎవరో...ఒక డబ్బా బీరు కొనుక్కుని తాగి ఉంటారు. అందుకే....డబ్బీరు అని పేరు వచ్చింది,' అని నా తమ్ముడు జోగ్గా అతనితో అన్నాడు. "అది కాదు...డబ్బీరు...అంటే...డబ్బు ఈరు. అంటే..డబ్బు ఇవ్వరు అన్నమాట," అని విశదీకరించాడు డబ్బీరు. ప్రతి మాటలో, ప్రతి మనిషిలో  హాస్యాన్ని చూసి... వెగటు కలగకుండా విశ్లేషించి నవ్వించే అరుదైన మిత్రులు ఉండడం నాకు అదృష్టంగా తోస్తుంది.  

నాకు సరిగ్గా నుదిటి మీద ఒక "-- (డాష్)" గుర్తు ఉంటుంది. చిన్నప్పుడు ఇస్త్రీ పెట్టె మీదపడినప్పుడు అయిన గాయం తాలూకు మచ్చ అది. అది చూసి ఒక రోజు నా కూతురు మైత్రేయి, కొడుకు స్నేహిత్ ఒక జోక్ వేశారు.

"డాడీ...అప్లికేషన్లో ఈ డాష్ గుర్తు ఎప్పుడు వాడతారు? చెప్పడానికి ఏమీ\ సమాచారం లేనప్పుడు కదా! నీ బుర్రలో ఏమీ లేదని, అది ఒట్టి ఖాళీ అన్నదానికి సూచనగా ఆ దేవుడు 'డాష్' గుర్తు కచ్చితంగా నుదిటి మధ్యలో పెట్టాడేమో....!," అని ఇద్దరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. అపుడప్పుడూ ఆ డాష్ గుర్తును తడుముతూ ముసిముసిగా నవ్వుతారు. ఈ గడుసు పిల్లలకు చూడండి... తండ్రి ఎంత అలుసై పొయ్యాడో!


బాధలు, బాధపెట్టే వారు పుష్కలంగా ఉన్న ఈ ప్రపంచంలో నవ్వుతూ బతకడం ఒక్కటే మనిషి చేయాల్సిన పని. ఇతరులను బాధపెడుతూ పవర్ ను అనుభవించే వారు కొందరైతే...బాధను అనుభవించడానికే పుట్టాను అని అనుక్షణం అనుకుంటూ కృశించే వారు ఇంకొందరు. బాధలులేని వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎవడి బాధ వాడు పడుతున్నాడు. ఎదుటి వాడి ఏడుపును చూసి నవ్వుకుని ఆనందించే వాడు ఒకడైతే...ఏడుపుగొట్టు ప్రపంచాన్ని చూసి ఏమీ చేయలేక నవ్వుకునే వాడు మరొకడు. విడివిడిగా కన్నా కలివిడిగా ఈ సమస్యలను నవ్వుతో అధిగమించవచ్చు. 

దానికి కావలసింది...మంచి మనసు, మంచి స్నేహితులు. మంచి మనసుతో ఉంటే మంచి స్నేహితులు, మంచి వాతావరణం పొందడం అంత కష్టం కాదు. రండి..మంచి మనసుతో నవ్వులు విరబూసే పసందైన లోకాన్ని సృష్టిద్దాం. బాధలను, ఆవేదనలను నవ్వులతో జయిద్దాం.
----------------------------------------------
యాడెడ్ ఎట్ 6 PM: ఏమీ...లాఫ్టర్ డే మహత్యం! ఇంతవరకూ మా ఇంటికి రాని వేణు గాడు సాయంత్రం ఉన్నట్టుండి సతీసమేతంగా వచ్చాడు. కాసేపు అందరం కలిసి కూచొని హాయిగా మాట్లాడుకున్నాం. పొద్దున్న డబ్బీరు, ఇప్పుడు వేణు అనుకోకుండా కలవడం నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. మొత్తానికి ఇది గుర్తుండిపోయే లాఫ్టర్ డే.

10 comments:

Anonymous said...

Our TV channels have experts who unintentionally make us laugh.

When Aditya Music Channel started, about 5 o'clock in the evening somebody called ( there were real callers in the early days of this channel ). Replying to one of the questions the anchor asked, the man who called up said that he has great regard for his mother.

Then the anchor promptly and generously said there's a special song devoted to his mother. The song then played was...'raalipoye poovvaa neeku raagaalenduke...'

Ramu S said...

ha.ha.ha. its really timely.
thanks
ramu

Praveen Mandangi said...

డబ్బీరు అనే ఇంటి పేరు శ్రీకాకుళం జిల్లా & ఒరిస్సాలో శిష్ట కరణం (పట్నాయక్) కులస్తుల ఇంటి పేరు. ఒరిస్సాలో మా తాతగారి ఊరి కరణం ఇంటి పేరు కూడా డబ్బీరే.

venkata subba rao kavuri said...

హాయిగా తియ్యగా సున్నిత హాస్యంతో మదిని పులకింపజేసిన నవ్వుల నీరాజనానికి నేను చెప్పబోయేది అద్దరి. ఈనాటి ఈనాడు ఆదివారం పుస్తక సమీక్షలో సేజ్యగాదు కధల సంపుటి గురుంచి చదివి అలా ఆర్టీసి క్రాస్ రోడ్డుకు వెల్దునుకదా. అక్కడ పాదచారుల దారిలో పాత పుస్తకాల మందీలో సేజ్యగాదు పుస్తకం సాక్షాత్కరించింది. అంతే బాధ, కోపం నన్నావరించాయి కాసేపు. ర్య్తు కుతుంబం అని గర్వంగా చెప్పుకునే నేను ర్య్తుల సంగతుల్ని గొప్పగా రాసిన ఆ కధల సంపుటిని అలా రహదాఇ మీద వదల్లెక 30 రూపాయలు ఇచ్చి ఇంటికి తెచ్చుకున్నాను. పుస్తకం నా మిత్రుడు మరి.
వెంకట సుబ్బారావు కావూరి

naren javvaji said...

భయ్యా,
రాటు తేలిపోయావు. కనీసం రెండు రోజులకు ఓకసారైన నీ బ్లాగ్ చూడనిదె మనసొప్పదు.

నరేందర్ జవ్వాజి

jara said...

స్టూడియో యన్ లో చేరనున్న వెంకట కృష్ణ
స్టూడియో యన్ లో మరో సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ చేరుతున్నట్లు సమాచారం ఆయన ప్రస్తుతం టి వి ఫైవ్ లో ఇన్ పుట్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు .రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం వెనుక రిలయన్స్ హస్తం ఉందంటూ ఆయన చేసిన వార్త ప్రాసారం రాష్టం లో తీవ్ర దూమారం లేపింది .బి ఆర్ నాయుడు చైర్మన్ గా వెంకట్ ను సమర్దిన్చినప్పటికి మిగతా భాగస్వాములు ముఖ్యంగా వ్యాపార వర్గానికి చెందిన జైన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు .ఆయనను తీసివేయ వలిసినేదని పట్టు బడుతున్నారు .వెంకట కృష్ణకు తెలుగు దేశం పార్టి తో మంచి సంబంధాలు ఉండడం ముఖ్యంగా చంద్ర బాబు కు కూడా ఇతని మీద మంచి అభిప్రాయం ఉండడం తో స్టూడియో యన్ లో చేరడానికి పరిస్తితులు అనుకులించాయి

jar said...

సూర్య సెవన్ లోకి అంకం రవి
సూర్య న్యూస్ పేపర్ కూడా టి వి రంగం లోకి అడుగు పెడుతుంది .సూర్య సెవన్ న్యూస్ ఛానల్ప్రారంభించేందుకు పేపర్ఆఫీస్ పై బాగాములో స్టూడియో పనులు ఇప్పటికే మొదలయ్యాయి ఎలాక్ట్రానిక్ మీడియాకు చెందినా కొంత మందిజర్నలిస్ట్ లు ఇప్పటికే చేరారు. సూర్య లో పనిచేసి ఆ తర్వాతా ఐ న్యూస్ లో చేరిన అంకం రవి తో పాటు మరికొంత మందిఈ ఛానల్ లో చేరుతున్నట్లు సంచారం

Rajendra Devarapalli said...

డబ్బీరును అడిగానని చెప్పండి.ఆమధ్య కరంటు,కాళిదాసు చిత్రాల నిర్మాత శ్రీనివాస్ ఇద్దరూ ఫోన్ చేసారు.వీలైతే ఓసారి ఫోను చెయ్యమనండి మీకు వీలున్నప్పుడు.

Anonymous said...

A very good piece of writing.In these days of hurry,worry and curry most of the people have lost sense of smile and laugh to enjoy oneself irrespective of the circumstances in whic one leads the life.A few bits on smile.

A SMILE IS A CURVE THAT SETS EVERYTHING STRRAIGHT.
GIFT EVERY ONE A SMILE WHICH MAKES LIFE LIGHTER AND WORLD BRIGHTER.
A SMILE COSTS LESS THAN ELECTRICITY BUT GIVES MORE LIGHT THAN IT IN ONE'S LIFE.
A JOKE-- Maine tuzhe pyaar kiya abala samazhkar, magar tere baap ne muzhe baaja daala tabla samzhke........

Why the T20 world cup matches are played in the night?One Dega Rao replied that to control population..........

JP.

Anonymous said...

A very good piece of writing.In these days of hurry,worry and curry most of the people have lost sense of smile and laugh to enjoy oneself irrespective of the circumstances in whic one leads the life.A few bits on smile.

A SMILE IS A CURVE THAT SETS EVERYTHING STRRAIGHT.
GIFT EVERY ONE A SMILE WHICH MAKES LIFE LIGHTER AND WORLD BRIGHTER.
A SMILE COSTS LESS THAN ELECTRICITY BUT GIVES MORE LIGHT THAN IT IN ONE'S LIFE.
A JOKE-- Maine tuzhe pyaar kiya abala samazhkar, magar tere baap ne muzhe baaja daala tabla samzhke........

Why the T20 world cup matches are played in the night?One Dega Rao replied that to control population..........

JP.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి