Saturday, May 15, 2010

సత్యం వధ--ధర్మం చెర: నీతికి పాతర--అవినీతి జాతర

నేను నిజాయితీపరుడినని ఎలుగెత్తి చాటండి. నేను అబద్ధాలు చెప్పనని ప్రకటించండి. మంచిని పెంచుదామని పిలుపునివ్వండి. దేశాన్ని ప్రేమించమనండి. 

ఒక బానపొట్ట అవినీతి మృగం వెంటనే మిమ్మల్ని టార్గెట్ చేసి ఒక బండ వేస్తుంది. ఒక వికృతాకార అక్రమార్కుడు మీ పై శూలం విసురుతాడు. ఒక తెగ బలిసిన అబద్ధాల విషసర్పం మీ మీద బుస కొట్టి పడగ విప్పుతుంది. ఒక దుష్టగ్రహం మిమ్మల్ని సజీవ సమాధి చేస్తుంది. వారిలో ఒకరిద్దరు జట్టుకట్టి మిమ్మల్ని భూస్థాపితం చేసేవరకూ నిద్రపోరు.

అదే మీరు మేకవన్నె పులో, తడిగుడ్డతో గొంతు కోసే బాపతో, జనం డబ్బు ఇట్టే స్వాహా చేసే రకమో, అబద్ధాల ఇటుకలతో మేడకట్టే నేర్పరో అయితే! డోంట్ వర్రీ. జనం ఆదరిస్తారు. ఎర్ర తివాచీ పరుస్తారు. జేజేలు పలుకుతారు. పల్లకిలో ఊరేగిస్తారు. బ్రదర్, మనం పూర్తిగా బ్రష్టు పట్టిపోయాం. ఇక్కడ సత్యం వధించబడుతున్నది, ధర్మం చెర పెట్టబడుతున్నది. నీతికి పాతర వేస్తున్నారు, అవినీతి జాతర సాగుతున్నది. అబద్ధాలు, కులం, ప్రాంతం, మతం ఆయుధాలుగా నీతిపై నిత్యసమరం సాగుతున్నది. 'దేశభక్తి' అనేది ఒక సనాతన ఆలోచనగా మారింది.

"ధర్మం నా బాట..." అనే శీర్షికతో ఒక నిజాయితీపరుడైన పోలీసు అధికారి (సీ.ఐ.) పై 'ఈనాడు' పత్రిక రెండో పేజీలో ప్రచురించిన వార్త చదివాక ఈ మాటలు రాస్తున్నాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా దాదాపు ఒక రెండు దశాబ్దాలు ఉజ్జోగం చేసి...అవినీతి మధ్య ఇమడలేక రిజైన్ చేసాడట జయచంద్ర రాజు అనే ఈయన. ఏ స్టేషన్ లో ఏనాడూ నాలుగు నెలలకు మించి పనిచేయనివ్వలేదట. చెడు ఉన్న చోట తాను ఉండలేనని, ఇది భరించలేక ఉద్యోగం వీడానని చెబుతున్న రాజు గారు నీతిలేని వారి మనసులు మారాలని ఎమ్మిగనూర్ నుంచి నెల్లూరు దాకా పాదయాత్ర చేస్తున్నారట. 

ఈ మాట మీ పక్కవాడికి చెప్పండి. 'భలే మంచి పని...ఇది సదాశయం,' అని వాడు అనడు..."ఆ...ముడుపుల దగ్గర తేడా వచ్చి...ఉజ్జోగం తీసేసే పరిస్థితి వస్తే వదిలేసి ఉంటాడు," అని వాడు ఒక భాష్యం ఇస్తాడు. పాపం...ఇన్ని రోజులు ఈ రాజు గారు ఎన్ని కష్టాలు పడి ఉంటాడో! పాజిటివ్ దృక్కోణం, నీతికి కనీసం బాసటగా అయినా నిలుద్దామన్న తలంపు మనకు శూన్యం. ఇది కలికాలపు మహిమా? పెద్ద జబ్బా?

చాలా మంది ఆలోచించరు గానీ...మనం అన్ని రంగాలలో బ్రష్టు పట్టిపోవడానికి కారణం ఒకే ఒక్కటి---'అబద్ధం'. దాని అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, కుటుంబసభ్యులే అవినీతి, అక్రమం, దురాగతం, దోపిడీ, కపటత్వం, వంచన, దారుణం...వగైరా. నన్నడిగితే...ఈ దారుణ పరిస్థితిలో సమాజాన్ని రక్షించుకోవాలని భావించేవారు చేయాల్సింది ఒక్కటే...ధర్మ ప్రచారం. ఇకపై మేము అబద్ధం చెప్పం... అని భార్యా భర్త, కుటుంబం, స్నేహితుల సమూహం బాస చేస్తే...చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.

తరచి చూస్తే...సత్యం అనే పునాదిపై మన మానవ సంబంధాలు ఏర్పడ్డాయి. భార్యాభర్తలు, స్నేహితులు పరస్పరం దొంగమాటలు మాని నిజాలనే మాట్లాడితే అక్కడ స్వచ్ఛమైన ప్రేమ వెల్లివిరుస్తుంది. ఉద్యోగులు బల్ల కింద చెయ్యి పెట్టడం ఆపినా...దొంగ టీ.ఏ.బిల్లులు పెట్టకపోయినా...వారిలో తెలియని ధైర్యం దానంతట అదే వస్తుంది. అది నిజంగా పాజిటివ్ శక్తి. నిజానికి అన్ని మతాలూ దీన్నే ఘోషిస్తున్నాయి. అబద్ధం పాతకమని మతం/ దేవుళ్ళు చెబుతారు, అబద్ధం చెప్పవద్దని ప్రతి అమ్మా చెబుతుంది. అయినా ఇక్కడ అబద్ధం వెర్రితలలు వేస్తూ కరాళ నృత్యం చేస్తున్నది విభిన్న రూపాలలో. న్యాయవాదులు, నేతలు, జర్నలిస్టులు...ఇలా అన్ని రంగాల వారు అబద్ధాలను త్యజిస్తే...మెరుగైన సమాజం దానంతట అదే ఏర్పడుతుంది. అక్కడ మనం మనస్ఫూర్తిగా, పరస్పర నమ్మకంతో హాయిగా బతకవచ్చు.

నిజాయితీగా బతకాలని భావిస్తే సుఖం ఉండదు, అన్నీ కష్టాలే. అయినా ఆ తృప్తి చాలా గొప్పది. ఈ విషయంలో నేను కొన్నేళ్లుగా ఒక ప్రయోగం చేస్తున్నాను. నేను పూర్తిగా కన్వీన్స్ అయిన విషయం ఒకటి ఉంది. ధర్మాన్ని మనం రక్షిస్తే...ధర్మం మనలను రక్షిస్తుంది. ఇది అందరికీ తెలిసిన పాత మాటే. దీని స్వగత దృష్టాంతాలను త్వరలో మీతో పంచుకుంటాను. అంతవరకూ అబద్ధాలు లేని ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించడం కొనసాగిస్తూ పోదాం.

16 comments:

bondalapati said...

"ధర్మాన్ని మనం రక్షిస్తే...ధర్మం మనలను రక్షిస్తుంది" ఇలా ఏ ఒక్కరో అనుకొంటే అలా అనుకొన్న వాడి కి నష్టం. ఎందుకంటే అందరూ అవినీతి పరులైనప్పుడు జీవన వ్యయం పెరిగిపోతూ ఉంటుంది. చివరికి ఈ అవినీతి సమాజం అతనిని మింగేస్తుంది. సమాజం లోని ప్రతి ఒక్కరూ ఇలా అనుకొని అమలుచేస్తేనే ఉపయోగం ఉంది.

మాగంటి వంశీ మోహన్ said...

టపా బానే ఉంది కానీ

"సత్యం వద, ధర్మం చర" అండి బాబూ -

అంటే సత్యమే పలుకు, ధర్మమే పాటించు (అనుష్ఠించు) అని..అంతే కానీ సత్యం వధించబడింది, ధర్మం చెర పట్టబడింది అని కాదు....మొదటి లైన్లలో కొద్దిగా దగ్గరకు జరిగారు కానీ, మళ్ళీ మారథాను రన్నరైపోయి ఏథెన్సు వరకు వెళ్ళిపోయారు.. :)

భవదీయుడు
వంశీ

Anonymous said...

I have also gone through the story of former CI Jayachandra Raju.To be frank he is the Raju of truth,sincerity,discipline and ethical values as he just left the police job which has become a gold mine for many in these days.I know some of my father,s friends who left the police job as they could not adjust with the environment of the department and went back to agriculture.Now I AM just recollecting them with the incident of Raju.He is arole model for all police personnel including IPS officers who after pasing many hurdles of screenings and interviews successfully with their
talent,skill and knowledge enter the job and ultimately succumbing to the corruption,political pressures and other weakneses,I just wonder what happened to their
talent,skill and meritorious performance to serve the people and country with all good qualities!we can count citizens like J.Raju on fingers and we have to locate and identify them with a magnifying glass as they are a rare specimens.Let us hope with the spirit,courage and initiative of Jayachandra Raju many police personnel with all evil qualities will have a fresh look at their jobs and try to transform themselves as good police personnel if not best and serve the peole,the department and the country at large enjoying the government salary and other allowances without any harassment for money,material from their subordinates as it leads to corruption from bottom to top.

I profusely and heartfully thank Madhuri garu for her regards for my comments in the blog.

JP.

Anonymous said...

I have also gone through the story of former CI Jayachandra Raju.To be frank he is the Raju of truth,sincerity,discipline and ethical values as he just left the police job which has become a gold mine for many in these days.I know some of my father,s friends who left the police job as they could not adjust with the environment of the department and went back to agriculture.Now I AM just recollecting them with the incident of Raju.He is arole model for all police personnel including IPS officers who after pasing many hurdles of screenings and interviews successfully with their
talent,skill and knowledge enter the job and ultimately succumbing to the corruption,political pressures and other weakneses,I just wonder what happened to their
talent,skill and meritorious performance to serve the people and country with all good qualities!we can count citizens like J.Raju on fingers and we have to locate and identify them with a magnifying glass as they are a rare specimens.Let us hope with the spirit,courage and initiative of Jayachandra Raju many police personnel with all evil qualities will have a fresh look at their jobs and try to transform themselves as good police personnel if not best and serve the peole,the department and the country at large enjoying the government salary and other allowances without any harassment for money,material from their subordinates as it leads to corruption from bottom to top.

I profusely and heartfully thank Madhuri garu for her regards for my comments in the blog.

JP.

Ramu S said...

వంశీ గారూ..
నాకు తెలుసు స్వామీ. పారడీ వ్యవహారం. అర్థం చేసుకోరూ...
రాము

Unknown said...

I have been searching for the people, who are honest and never lie at any cost. At last, I have found a person, who is genuine. The world has become so materialistic even family bonding has been eroding of late. Why people have become so selfish, let them, but don't harm anybody, if you wanted to help anybody you can and if you don't want don't. but never resort to harm them. Everybody should follow these steps, it gives immense satisfaction, as you said. An adage says good always triumphs over evil, it exactly happens--good people with good deed will face obstacles while evil will succeed, but that is short lived, whereas the good Samaratins will have a last laugh, as they get benefited in the long run. I appeal to everybody not to lie and stick to your words, it gives you many followers, who will follow your footsteps. So, this way we can build a good society, which paves way for good people. If found your statement as an oasis in a desert. Hats off to honest people.

shyam

Anonymous said...

రామూ గారూ, నేనూ మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తాను.
అయితే ధర్మబద్ధంగా బతకటం నిరంతర ప్రయోగం. మనమూ తెలియకుండా గీతదాటుతాం. అనుభవిస్తాం.
సాధారణ మానవధర్మం ప్రకారం మనం కష్టపడి సంపాదించుకొన్న దానితోనే మన అవసరాలు తీర్చుకోవాలి. "కష్టం" అనేదానికీ, "బాగా బతకటం" అనేదానికి ఎవరి నిర్వచనం వారికుంటుంది కనుక అందరూ మీ టపాలోని అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు.
మీ ప్రయోగస్ఫూర్తికీ, దాన్ని మాతో పంచుకున్నందకూ అభినందనలు. మీ అనుభవాల కోసం ఎదురుచూస్తూ ఉంటాము.
అర్క..

తాజాకలం: మీరు పని వత్తిడిలో తీరికలేక చాలా విషయాల్లో టపాలు రాస్తానని ఊరిస్తూ రాయలేక పోతున్నట్టున్నారు. మాలాంటి వాళ్ళను పార్ట్ టైం ఉద్యోగానికి తీసుకుంటారా?

మాగంటి వంశీ మోహన్ said...

రాముగారూ

ఈ మీ పేరడీ కౌంటరు కోసమే ఆ "బురిడీ" రాసింది. :)

అదలా పక్కనబెడితే - అబద్ధాలు త్యజించడం అంత తేలికైన పనీ కాదు, హర్షించే పరిస్థితీ లేదు. అడుతున్నదీ, మాటాడుతున్నదీ అబద్ధమని తెలిసి నవ్వుకునేవారెందరో, అది అబద్ధమనీ తెలిసి నవ్వుకున్నవారూ అంతమందే, ఆ అబద్ధాన్నే జీవనాధారం చేసుకున్నవారూ అంతమందే, అదే అబద్ధాన్ని నిజమని నమ్మేవారూ అంతమందే.

ఆ వెయ్యితలల పుఱుగును వదిలించటానికీ, మర్దన చేయటానికీ కృష్ణులవారూ లేరు. ఒక్కడు ప్రక్షాళణ మొదలెడితే సాగుతుందనుకునే పరిస్థితీ లేదు. ఆ నిజాన్ని అంగీకరించే దమ్ము అంతకన్నా లేదు.

సర్వం జగన్నాధం - సర్వం అయోమయం

ఏదేమైనా మీ దృష్టాంతాలను చదవాలనీ, చూడాలనీ ఉన్నది. త్వరలో ఆ పని కానిస్తే సంతోషం. అప్పటిదాకా మీ "వన్ లైనర్" - టి.వి నైన్ లాటిదే - గుర్తుపెట్టుకుంటా - "అబద్ధాలు లేని ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించడం కొనసాగిస్తూ పోదాం"

భవదీయుడు
వంశీ

Anonymous said...

dear ramu garu.. ii block lo mee nundi kani answers kani truth ga unnayantara.. press employes.. ki mee meda nammakam kaliginchara.. .
eenadu lo transfers list nijamga unta bayatapentandi.. single person meda anyamga unta fight cheyandi... manchi uddeswyam tho... telpandi... mari eenadu lo inka transfers avvani varu brusttu pattistunaa varu chalamandi. alaga seat lo unnaru.. local mangaers ni pattukuni padavi kapadukuntunaru.vari vishyam yemiti.. aaa mandya other state desk incharge Trsku usmania lo direct ga support chestunna . chusi yemi analedu . transfer kaladu.. indulo nejayathi undantara..?meru yenta sepu mnr vargama.. dn&rahul vargama ani different chesi rastunaru.. main ga all over ga eenadu nee target chestunatulu undi..? maha desk vadu ni kuda seat ni buttukuni unnaru.. yenduvalana.. ?anta .. avineethi.. broker ga untunaru eenadulo .. ipatikyna management ground stage lo ki velli gamanichali..

Saahitya Abhimaani said...

ఇప్పుడున్న సమస్య ఏది అవినీతి ఏది అబద్ధం తెల్చుకోవటమే. మనమందరమూ వీటికి ఎంతగా అలవాటు పడిపోయామంటే, తేడా తెలియటంలేదు ఎవరికీ. ఎవరికీ వారు తాము చేసే పని సవ్యమైనదనే గట్టిగా నమ్ముతూ చేస్తున్నారు. మాట్లాడే మాట అబద్ధమన్న స్పృహే ఉండటంలేదు, చేసేది అవినీతని తెలియదు. తెలియక అదే గొప్పపని అని ఎంతో ఆత్మా స్థైర్యంతో చేసే దశకు సమాజం దిగజారిపోయింది. ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో ఇలా బయటపడి కొన్నాళ్ళు పోరాడి మరుగున పడిపోతారు. కారణం సమాజంలో ఎవ్వరూ వారికి మద్దతుగా రాకపోవటమే.

మీరు రెండు మూడు పేరాలలో చెప్పినది వంద శాతం కరెక్టు.

నా ఉద్దేశ్యం ఈ మొత్తానికి మూలం, జనాభా వెర్రి వెర్రి గా పెరగటం, ఉన్న కొద్ది వనరులు అందరికీ చాలవు. కొద్దిగా ఉన్న వనరుల పంపిణీ దగ్గర, సమాజంలో పుట్టిన జాడ్యం ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా మన దేశంలో జనాభా పెరుగుదల తగ్గటమే కాదు, జానాభానే బాగా తగ్గాలి, అప్పుడే ఇటువంటి జాడ్యాలు కనుమరుగవుతాయి.

durgeswara said...

రాముగారు
మీ ఆవేదన సమాజం ఆలోచించవలసిన సీరియస్ విషయం. ఐతే ఇప్పుడన్ని సంస్కరణలు వ్యతిరేకక్రమంలో నడపాలని చూస్తున్నారు ప్రభుత్వాలుగానీ ,లేక మేధావులుగానీయండి. గుర్రాన్ని బండి వెనుక కట్టి ఫలితం కావాలంటే ఎలా? మొత్తంసమాజం లో మార్పుకోసం కృషిచేయాలనే సంస్కర్తల లక్ష్యమవుతున్నది. వాస్తవానికి జరగాల్సినది సమాజ సంస్కరణకాదు. వ్యక్తి సంస్కరణ జరగాలి. వ్యక్తిత్వాలను ధర్మబద్దంగా ఉండేలా తీర్చి దిద్దగల విద్య ,భావజాల వ్యాప్తి కావాలి. రేపు ఉంటామో పోతామో తెలియకపోయినా ,ఉన్నదే ఎక్కువని తెలిసినా కూడా ఇంకా వస్తుసమ్చయనం చేయాలనే కోరికలను ఎలా తుంచగలుగుతారు ? చట్తలద్వారానా > సాధ్యంకాదు. పోనీ ఉపన్యాసాలద్వారానా ? విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారానా ? ఇలా అందరికీ చెప్పినా వారు ఎందుకామోదించాలి ? అమోదించాలంటే ఈ సంపదకన్నా మహోన్నతమైనది ఉన్నది ,ధర్మ బద్ధంగా జీవిస్తే దాన్నందుకోవచ్చు అనే నమ్మకం కలగాలికదా ? ఈనాటి స్థితిలో ఆ నమ్మకం ఎలా కల్పించగలం ? . సత్యహరిశ్చందృని నాటకం చూసి జీవితంలో అబద్ధమాడరాదని నిర్ణయించుకున్నాడో పిల్లవాడు. జీవితాంతం ఆసత్యాన్నాశ్రయిమ్చి ఉండి దేశప్రజలందరినీ తనని అనుసరించేలా చేయగల శక్తినిపొందాడు. ఆయన గాంధీ .
మరి ఈరోజు ధర్మం, సత్యం, నీతి నిజాయితీ ,చేతగాని వారిని ఉద్ద్దేశించి అపహాస్యం చేయపడేపదాలుగా చలామణి అవుతున్నప్పుడు . పాతతరమేమి అనుసరిస్తుంది ? కొత్త తరమేమి నేర్చుకుంటుంది ? యుగాలనుండి అధర్మపరులకు ప్రాప్తించిన హీనమైన స్థితిని గూర్చి మనకు పరంపరగా వివరిస్తూ వస్తున్న విద్యలను నిరోధిస్తూ , స్వార్ధపరతమాత్రమే సమున్నతంగా గౌరవించబడుతున్న నేటి యుగధర్మం లో ఈ నీతి వాక్యాలు ,బోధలు తలకెక్కుతాయంటారా ? ఎక్కవు .ప్రకృతి రెండురకాల అవకాశం మనకిస్తుంది . ఒకటి ప్రకృతి బోధించేది గ్రహించి సక్రమమైన పద్దతి నేర్చుకోవటం. లేదా ప్రకృతే ప్రాణభయంతో మనలను పరుగులు పెట్టించి నేర్పినప్పుడు చచ్చినట్లు మన మనుగడకోసం నేర్చుకోవడం.
అదేదో జరిగినదాకా .... అవసరాన్ని బట్టి మంచితనం ..అవకాశాన్ని బట్టి చెడ్దతనం మన ప్రవర్తనలలో కొనసాగుతూనే ఉంటాయి.

rammy said...

డియర్ రాము అబద్దం దాని బందువులు వర్ణన చాలా బాగుంది.నేను జర్నలిస్టుని కాకపోయినా చాలా మంది జర్నలిస్టులతో ఒకప్పుడు సన్నిహిత సంబంధాలు ఉండేవి.పాట్నా కి పంపబడిన సలీం మెడినొవా లో పి.ఆర్.ఓ గా చేరిన న్యూస్ ఎడిటర్ సలీం గారు అప్పటి ఎం.డి. రమేష్ బాబు, చెన్నారెడ్డి వార్త కు ntr heading ,ntr vartaku చెన్నారెడ్డి heading మూర్తి గారు ఇప్పటి ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.ఎన్.ఆర్ గారు అందరూ నాకు పాత మిత్రులే.ఈనాడు ముంబై నుండి ఇద్దరు సీనియర్లను బదిలీ చెసింది.20 ఏళ్ళకు పైగా పనిచేస్తున్న వారికి ఒక్క ప్రమోషన్ ఇవ్వకపోయినా ఒకరిని విజయచంద్ ని పాట్నా కి హరిష్ చంద్ర ను అహ్మదాబాద్ కి బదిలీలు చేసి తమ తొక ఎప్పుడూ ఒంకరే అని మరొసారి చెప్పారు.నేను కామెంట్లు గా కొడుతున్నది విషయం గా మీరు పెడితే బాగుంటుంది.మీ పర్సనల్ మెయిల్ ఐడి మొబైల్ ఇస్తే నాకు కొంత బాగుంటుంది.
రమ్మీ

Ramu S said...

డియర్ రమ్మీ గారూ..
ఇప్పుడు సలీం గారు ఎక్కడ ఉన్నారు?
మీరు srsethicalmedia@gmail.com కు మెయిల్ రాయండి. టచ్ లో ఉందాము.
thanks for your time
cheers
ramu

rammy said...

రాము గారూ విజయచంద్ లక్నో కి బదిలి అయింది. నేము పాట్నా అని పొరపాటుగా వచ్చింది.

Vinay Datta said...

You have put the problem for discussion.
JP garu, Siva garu, Durgeswara garu, have given insight into the problem.

Lying definitely starts in the family. In the disguise of Sanaatana Dharmam, the family system in India is predomonantly paternal. The relationships are bound not only by love, responsibility, social pressure but also by fear. We donot accept a person as a herself or himself. There starts the problem.

The entire India criticized Bill Clinton when he admitted that he had many affairs. He was late in accepting, I agree, but he finally accepted. We donot see even one such person in India. (I need not tell you that) It doesn't mean that all our people are decent and dignified. When it comes to accepting people as themselves, admitting faults and being honest, the western world is much better than India. The westerners maybe insecured because of poor family bonds, but they are not driven by fear in many aspects.

Vamsi garu, thanks for the explaination.

JP garu, many thanks to you for the acknowledgement. I look for the posts in this blog for the content and also for the comments of shrewd and straight forward people like yourself, Siva garu, Sujatha garu, WitReal garu, etc.

yuddandisivasubramanyam said...

honesty and dishonesty both have merits and demerits.
honesty path is very thorny, but the destination gives contemplation/eternal satisfaction.
dishonesty path is laid with roses, but it leads to hell.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి