Tuesday, May 25, 2010

N-TV న్యూస్ లో 'ఉప్పర మీటింగ్' అనే పదం....

N-TV లో రాజాలు, మహారాజాలు-పులులు, బొబ్బిలి పులులు ఉంటారు/ ఉంటాయి. వారు/అవి నిరంతరం పనిచేస్తున్నట్లు జనాలకు కనిపిస్తారు/ కనిపిస్తాయి. అలాంటిది...ఈ రాత్రి ఎనిమిది గంటల వార్తలలో 'ఉప్పర మీటింగ్' అనే పదం వచ్చింది....ఆ ఛానెల్ లో. ఇది చాలా అభ్యంతరకరం. ఇది వాడినందుకు...N-TV క్షమాపణ చెబితే బాగుంటుంది. 

ఉద్యోగులు టైం కు ఆఫీసుకు రావడంలేదని, వచ్చినా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని ఈ ఛానల్ ఒక కథనం ప్రసారం చేసింది. అందులో...వాయిస్ ఓవర్ లో 'టైం కు రారు...వచ్చినా...సొల్లు కబుర్లు, ఉప్పర మీటింగులు,' అని చెప్పారు. ఇది ఒక లూజ్ కాపీ. అది ఒక కులాన్ని అవమానపరిచే పదం. ఇలా కులాలకు సంబంధించిన మాటలు, జాతీయాలు, సామెతలు, జానపదాలు...వాడేటప్పుడు విలేకరులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా జాగ్రత్తగా వుండాలి. 'ఛండాలం', 'ఛండాలుడు', 'మంగలి కత్తి', 'లంబాడి వ్యవహారం'...వంటి పదాలు మీడియాలోనే కాకుండా....వాడుకలో కూడా నిషేధించడం సముచితం. 

ఈ మధ్యన నేను ఇలాంటి తప్పే ఈ బ్లాగ్ లో ఒక పోస్టులో రాసి ఇరుక్కుని చెంపలు వేసుకున్నాను. విలేకర్లు...దొంగల్లా తయారయ్యారని చెబుతూ...'స్టూవర్టు పురం' దొంగలనో/బ్యాచులనో రాసేసాను. అది ముమ్మాటికీ నా తప్పే. ఒక మిత్రుడు అలర్ట్ చేస్తేగానీ...కరెక్టు గా ఈ విషయం గురించి మా గురువు గారు క్లాస్ రూం లో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నాలుక కరుచుకున్నాను. 

నా మీద అప్పటికే మంట మీద ఉన్న ఒక మిత్రుడు...ఒక బ్లాగ్ లో..."రామూ...స్టూవర్టుపురం అని వాడతావా?" అన్న అర్థం వచ్చేలా శీర్షికలో నా పేరు పెట్టి మరీ ఒక పోస్ట్ పెట్టి...నాకు లింకు పంపాడు. నేనైతే...నిర్మొహమాటంగా ఆ లింకు ఓపెన్ చేసి....అది చదివి...'అయ్యా...తప్పయ్యింది. ఇంకెప్పుడూ ఆ మాట అలా రాయను," అని ఒక కామెంట్ పెట్టి వచ్చాను. N-TV బాసులు కూడా సిగ్గూఎగ్గూలేకుండా...సారీ చెబితే బాగుంటుంది. ఇక వారిష్టం. 

25 comments:

Anonymous said...

అలాగే ఈనాడు వాడు "కాపు సారా " అంటూ ఆనందంగా రాస్తూ ఉంటాడు. నిజానికి దాని పేరు నాటు సారా. అంతగా కావాలంటె కాచిన సారా అనవచ్చు. ఈనాడు గురుంచిన ఎంతో తెలిసిన ఇది ప్రస్తావించక పోవడం విచిత్రం.

Praveen Mandangi said...

జుత్తు సరిగా దువ్వుకోకపోతే ఉప్పర జుత్తు ఏమిటిరా అని అడిగేవాళ్ళు ఉన్నారు. కులాన్ని కించపరిచే సామెతలు పలకడం కొంత మందికి ఫాషన్.

critic said...

టీవీ ఛానళ్ళలో ’జనం భాష’ అనే ముసుగులో ఇలాంటి అభ్యంతరకరమైన, సంస్కారహీనమైన భాషను చెలామణీ చేసేస్తున్నారు.
మీ అభ్యంతరం నూటికి నూరుపాళ్ళూ సమర్థనీయం.
చానళ్ళ జర్నలిస్టులూ... మీరు ఎడాపెడా వాడే భాషను కాస్త సంస్కరించి హుందా అయిన భాషను వాడండి!

Saahitya Abhimaani said...

ఉప్పర మీటింగు అనేమాట మొట్టమొదటి సారిగా నేను మన్మధుడు అనే సినిమాలోనే విన్నాను. ఆ సినిమా రోజూ మూడాటలు, ఆదివారమునకు పండుగలకు నాలుగాటలు వేసి వంద రోజులు ఆడినప్పుడు లేని అభ్యంతరం, ఇప్పుడు ఏదో ఒక చానెల్లో ఒక్కసారి అంటే ఎందుకండి. అలాగైతే కొన్ని కులాల పాత్రలను పెట్టి, వారి వేష భాషలను ఎద్దేవా చేసే సినిమాలను ఏమి చెయ్యాలి.

Anonymous said...

ఉద్యోగులు టైం కు ఆఫీసుకు రావడంలేదని, వచ్చినా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని ఈ ఛానల్ ఒక కథనం ప్రసారం చేసింది. అందులో...వాయిస్ ఓవర్ లో 'టైం కు రారు...వచ్చినా...సొల్లు కబుర్లు, ఉప్పర మీటింగులు,' అని చెప్పారు. ఇది ఒక లూజ్ కాపీ. అది ఒక కులాన్ని అవమానపరిచే పదం.

- I didn't find any word that highlights "Kulam"!

- అది ఒక కులాన్ని అవమానపరిచే పదం. Are you aware of what you are writing?

Anonymous said...

"ఛండాలం" అనే పదం చాలా కామన్ వర్డ్.రిజర్వేషన్లు కావాలి,వర్గీకరణలు కావాలి తమ కులం పేరుతో కానీ కులం పేరు సూచించే మామూలు జాతీయాలు వాడకూడదు ఇదెక్కడి న్యాయం?

Ramu S said...

శివ గారూ..
అవును అది నాగార్జున సినిమా. నేను అది చూసినప్పుడే అనుకున్నాను..ఆ మాటకు ఒక కులం వారి నుంచి అభ్యంతరం ఎదురవతుందేమో అని. కానీ అలాంటిది జరిగినట్లు లేదు. సినిమా బాగా ఆడినా...మీడియా అలాంటి మాటలు వాడకుండా వుంటే సభ్యతగా ఉంటుందని. 'అంతా శ్రీ వైష్ణవులే...బుట్టలో రొయ్యలు మాయమయ్యాయి," అనే దాన్ని కూడా కొందరు జర్నలిస్టులు వాడరు. పైన ఒకాయన చెప్పినట్లు 'కాపు సారా' కూడా ఒకటి.
మీ హైదరాబాద్ పర్యటన సజావుగా సాగిందని అనుకుంటున్నాను. మిమ్మల్ని కలిసినందుకు మాకు ఆనందంగా ఉంది. రేడియో ప్రోగ్రాం ఫోటో లు బాగా తీసుకున్నారని, దాని మీద ఒక పోస్ట్ చేస్తారని భావిస్తున్నాను.
రాము

Praveen Mandangi said...

నేను తుని పట్టణ శివార్లలో ఉప్పర కులస్తులని చూశాను. వారిలో ఎక్కువ మంది చదువురానివాళ్ళు కావడం వల్ల ఉప్పర మీటింగ్ లాంటి సామెతలపై అభ్యంతరం చెప్పకపోయి ఉండొచ్చు. వాళ్ళు అమాయకులు కదా అని ఇలాంటి సామెతలు ఉపయోగించడం సంస్కారం కాదు.

Saahitya Abhimaani said...

రామూ గారూ. హైదరాబాదు వచ్చినప్పుడు మూడు అద్భుతాలు. అందులో రెండిటి గురించి అప్పుడే నా బ్లాగులో వ్రాశాను చూడండి. మూడో అద్భుతం ఈరోజో రేపో వ్రాస్తాను.

ఇక వ్రాతలలో కుల ప్రస్తావన. "కాపు సారా" అన్నది కుల ప్రస్తావన కాదనుకుంటున్నాను. కాచిన సారా కాపు సారా అయ్యి ఉంటుంది.

ఈ వ్రాయటాల్లో కొన్ని కులాలను మాత్రమె ఎన్నుకుంటారు. సహజంగా సాధు స్వభావులైన కులాన్నో, నిరక్షరాస్యులై వారి గురించి, వ్రాస్తున్న వైనం కూడా తెలుసుకోలేని వారి గురించో ఇటువంటి మాటలు పుడుతూ ఉంటాయి. మాట్లాడితే బుర్ర పగలగొట్ట గలిగిన వారి గురించి ఇటువంటి మాటలు పుట్టవు. కాబట్టి ఆంగ్లంలో అన్నట్టుగా Offence is the best defense. మన మీడియా వారు కాని, సినీ రచయితలుకాని, కులపరమైన వ్యాఖ్యలు, ఎద్దేవా చేయటం, ఒక కులాన్ని పట్టుకు ఊరికే ఆడిపోసుకోవటం, వారి వేష భాషలను ఆటపట్టిస్తూ సినిమాలలో సీన్లు సృష్టించటం మానుకోవాలి. లేకపోతె పైన చెప్పిన ఆంగ్ల సామెత నిజం చెయ్యటానికి ప్రజలు పూనుకునే ఆవకాశం ఉన్నది.

అయినా ఈ జాడ్యం మన ఒక్క దేశంలోనే కాదు యూరోపు, అమెరికాలల్లో కూడా కాథలిక్ లను , యూదులను, నల్ల వారిని రెడ్ ఇండియన్లను ఆటపట్టిస్తూ అనేకమైన మాటలు వాడుకలో ఉన్నాయి.

మన దేశంలోనే అందరూ పగలబడి నవ్వుతూ చదువుతూ ఆనందించిన సర్దార్జీ జోకులు ఎప్పుడు ఆగాయి! ఇప్పుడు ఎవరూ అటువంటి జోకులను బాహాటంగా చెప్పుకోవటం లేదు.

Anonymous said...

kaapu saara means kaachina saaraa. In some dialects, kaapu is used instead of "kaachu".

Kaapu saara was born frm that but as you are thinking of it.

chill ! :-)

Nrahamthulla said...

శివ గారన్నట్లు కొన్ని కులాలను మాత్రమె ఎన్నుకుంటారు. సహజంగా సాధు స్వభావులైన కులాన్నో, నిరక్షరాస్యులై వారి గురించి, వ్రాస్తున్న వైనం కూడా తెలుసుకోలేని వారి గురించో ఇటువంటి మాటలు పుడుతూ ఉంటాయి. మాట్లాడితే బుర్ర పగలగొట్ట గలిగిన వారి గురించి ఇటువంటి మాటలు పుట్టవు.సామెతల్లోకూడా మూఢనమ్మకాలు,కుల వివక్ష,అవహేళన ఇలాగే ఏర్పడ్డాయి.ఆకాలంలో చెల్లాయిగానీ ఈనాడు ఏవిధంగానూ సమర్ధించలేని సామెతలివిగో:

* నల్లబ్రామ్మడినీ ఎర్రకోమటినీ నమ్మకూడదు
* ముందువెళ్ళే ముతరాచవాడినీ ప్రక్కన బోయే పట్రాతి వాడినీ నమ్మరాదు
* ముందుపోయే ముతరాచవాడినీ వెనుకవచ్చే ఈడిగ వాడినీ నమ్మరాదు
* నీ కూడు నిన్నుతిననిస్తే నేను కమ్మనెలా ఔతాను?
* తుమ్మనీ కమ్మనీ నమ్మరాదు
* రెడ్లున్నఊరిలో రేచులున్న కొండలో ఏమీ బ్రతకవు
* నరంలాంటివాడికి జ్వరం వస్తే చెయ్యి చూచినవాడు బ్రతకడు
* తురకల్లో మంచివాడెవరంటే తల్లికడుపులో ఉన్నవాడు గోరీలో ఉన్నవాడు
* మాలవానిమాట నీళ్ళమూట
* చాకలి అత్త మంగలి మామ కొడుకు సాలోడైతేనేమి సాతానోడైతేనేమి?
* విధవముండకు విరజాజి దండలేల?
* కాశీలో కాసుకొక లంజ
* నంబీ నా పెళ్ళికి ఎదురురాకు
* నియోగి ముష్టికి బనారసు సంచా?
* మాలదాన్ని ఎంగటమ్మా అంటే మదురెక్కి దొడ్డికి కూర్చుందట
* కులం తక్కువ వాడు కూటికి ముందు
* చాకలిదాని అందానికి సన్యాసులు గుద్దుకు చచ్చారు
* మాలలకు మంచాలు బాపలకు పీటలా?
* మాలబంటుకు ఇంకొక కూలిబంటా?
* ఉల్లిపాయంత బలిజ ఉంటే ఊరంతా చెడుస్తాడు
తెలుగు సామెతలు: సంపాదక వర్గం- దివాకర్ల వెంకటావధాని, పి.యశోదా రెడ్డి, మరుపూరి కోదండరామరెడ్డి.- తెలుగు విశ్వవిద్యాలయం మూడవ కూర్పు పునర్ముద్రణ 1986 చూడండి

snehit said...

Rahamtullah garu
Special thanks for the information.Its very useful for journalists.
ramu

Anonymous said...

Rahamatulla gaaru
special thanks for the useful information.
ramu

Anonymous said...

shiva gaaru mee blog adress cheputaara plz

balu said...

కాపు సారా అనేది కులాన్ని సూచించదు. బట్టీ ల లో కాస్తారు కాబట్టీ కాపు సారా అంటారు.

Anonymous said...

Sir,
Inthakamundu kulam peru pettipliste tappu ippudu adioka fashion andaru name chivara kulam peru pettukotunnaru kada.

Ramu S said...

siva gaari blog

saahitya-abhimaani.blogspot.com

cheers
ramu

Vinay Datta said...

@Siva garu:

Jokes on Sardarjis are very much available as sms books in places like landmark. Those are one of the sms books sold like hot cakes.

Saahitya Abhimaani said...

Madam Madhurigaaroo. My point is that Sardarji Jokes are not that much popular now because Sikhs have shown that they can hit back, not necessarily because they were made the butt of many jokes, but because of other reasons also.

Therefore, for people who show that offense is their best defense, media or the cine ghost writers do not dare to utter any word even in whisper.

Anonymous said...

Siva garu wrote:ఉప్పర మీటింగు అనేమాట మొట్టమొదటి సారిగా నేను మన్మధుడు అనే సినిమాలోనే విన్నాను. ఆ సినిమా రోజూ మూడాటలు, ఆదివారమునకు పండుగలకు నాలుగాటలు వేసి వంద రోజులు ఆడినప్పుడు లేని అభ్యంతరం, ఇప్పుడు ఏదో ఒక చానెల్లో ఒక్కసారి అంటే ఎందుకండి. అలాగైతే కొన్ని కులాల పాత్రలను పెట్టి, వారి వేష భాషలను ఎద్దేవా చేసే సినిమాలను ఏమి చెయ్యాలి.


Siva garu don't club media with films. manmadudu cinema lo dialogue ni yevaru protest cheyyaledu ante daanni andaru accept chesinattu kadu kada? ee madhya telugu cinema lo 'nee yamma' anedi ootha padam aipoindi. andaru vintunnaru kada ani manam news lo 'nee yamma eppudoka break' analemu kada.

mee blog chusanu siva garu, feel very bad for missing it from past one year.

Raja

Anonymous said...

రోజా, శివ మరియు రాము గార్లు,
మన్మధుడు సినిమా లో వాడిన పదం గురించి ఎవరు అభ్యంతరం చెప్పలేదు అనేది కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్ ని కలిసి ప్రొటెస్ట్ చేసినట్టు న్యూస్ లో నేను చూసాను.
తర్వాత ఏమి జరిగింది అనే విషయం నాకు గుర్తు లేదు.
- శ్రీనివాస రావు

Ramu S said...

శ్రీనివాస రావు గారూ..
అది నేను ఫాలో కాలేదండీ. Thanks for the information.
ramu

Anonymous said...

@Siva : You must be a sardarji to believe that sardarji jokes are not much popular now :-)

Saahitya Abhimaani said...

"మన దేశంలోనే అందరూ పగలబడి నవ్వుతూ చదువుతూ ఆనందించిన సర్దార్జీ జోకులు ఎప్పుడు ఆగాయి! ఇప్పుడు ఎవరూ అటువంటి జోకులను బాహాటంగా చెప్పుకోవటం లేదు" అని నేను వ్రాస్తే అనామకుడికి అర్ధమయ్యింది ఏమిటి?

ప్రస్తుతం ఆవతలి వారి మాటలకు వక్రభాష్యం చెప్తూ గేలి చేయటం పెద్ద తెలివితేటల కింద చలామణి అవుతున్నాయి కదా, ఆ పంధా లోనే ఉన్నది ఈ అనామక వ్యాఖ్య.

బాబూ అనామకా! మళ్ళి చెప్తున్నాను వినండి. సర్దార్జీలు మెతకగా ఉన్నన్నాళ్ళూ వాళ్ళ మీద వాళ్ళ ఎదురుకుండానే జోకులు వేసుకున్న సమాజం 1980 లలో సిఖ్ టెర్రరిజం రాంగానే అవన్నీ మూసుకున్నారు. వాళ్ళ మీద జోకులు ఎప్పుడు ఆగాయి అని ఆశ్చర్యార్ధకం అంటే ఇది (!) ఉంచి నర్మగర్భంగా ఆపాను. అది అర్ధంకాక ఇలా తెలిసీ తెలియని వ్యంగ్యానికి పొతే ఎలా పేరు లేని అనమకా!

Saahitya Abhimaani said...

RAJA AND OTHERS,

My point of highlighting the use of caste related jibes in Cinema is to bring home the agony of such castes being targeted. If in a movie these insults are repeated everyday three or four shows, nobody is opening their mouth but when its coming in one channel once which at the most be repeated 3-4 times in one day only, why so much agitation on that. If we should object we should object for the movies first and media is only a logical follower of unhealthy trend from the movies. That was my point. Its surprising that it was understood as if I was propagating that it was Okay in movies and so can be used in media.

In my view media includes Cinemas also. What ever that is prepared by somebody for the benefit of entertainment or reading or viewing is definitely media. Of course now a days TV Channels are more entertaining than the movies. That's why the number of moves have come down drastically.

Let us object any unwanted or uncalled for reference to caste or religion in any form of media-be it cinemas or TV Channels or News Papers. But such objection should be sustained and made such perpetrators cannot go Scot-free.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి