Friday, May 14, 2010

ఇది....భలే ఉపయోగకరమైన వెబ్ సైట్!

ఒకొక్కసారి మనకు అమూల్యమైనవి అనుకున్నవి పోతాయి. కొన్నిసార్లు ఒకరికి అమూల్యమైనవి మనకు దొరుకుతాయి. తమ వస్తువులు పోతే...పోలీసు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు బహు స్వల్పం. మన ఖర్మ ఇలా కాలింది...అనుకుని కిమ్మనకుండా ఉండేవారే ఎక్కువ.


మన వస్తువులు దొరికినవారు వాటిని వాడేసుకోవడం లేదా పనికిరానివని చెత్తలో పారెయ్యడం జరుగుతుందని మనకు అనిపిస్తుంది. అది అన్ని సందర్భాలలోనూ నిజం కాకపోవచ్చు. మన వస్తువులు దొరికినవారు మనకోసం వెతుకుతుండవచ్చు. పోయిన మన సర్టిఫికెట్స్, మెడికల్ రిపోర్ట్ మనకు ఇవ్వాలని ఆరాటపడే బుద్ధిజీవులూ ఉంటారు. మనలను పట్టుకునేందుకు వారు నానా తంటాలు పడుతూ ఉండవచ్చు.


ఇలా...వస్తువులు పోగొట్టుకున్నవారికి, అవి దొరికిన వారికి వారధిగా ఉండేలా ఒక వెబ్ సైట్ రూపొందిచారు మన నరసరావుపేట యువకుడు. ఆ విషయాన్ని 'ది హిందూ' గుంటూరు విలేఖరి సుసర్ల రమేష్ గారు రిపోర్ట్ చేశారు. రక్తదానం వంటి సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే రమేష్ గారు ఈ వెబ్సైటు పై రాసిన వార్తను మీ కోసం ఈ పక్కన అందిస్తున్నాం.   ప్రజోపయోగం దృష్ట్యా...'ది హిందూ' వారి అనుమతి లేకుండానే వారి క్లిప్పింగ్ ను ఇక్కడ వాడుతున్నాం. థాంక్స్..రామ్ సార్.
ఇది చదివిన ఎడిటర్లు, రిపోర్టర్లు వీలయితే...మీ పత్రికలలో, ఛానెల్స్ లో దీని మీద మీరు ఒక వార్త చేయించండి. ప్రజలకు బాగా ఉపయోగంగా ఉంటుంది.

7 comments:

విశ్వ ప్రేమికుడు said...

భలే ఉందే మంచి విషయం చెప్పారు. ధన్యవాదములు.

Anonymous said...

ఎవరు ఎవర్నీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు లాంటివి కాకుండా ఇలాంటి మంచి విషయాలు పోస్ట్ చేయడం , మంచ్ని మెచ్చుకోవడం ద్వారా ఎక్కువ మేలు జరుగుతుందేమో1

Ramu S said...

మీరేమో అలా అంటారు. ఇంకొందరు..బదిలీ జాబితా ఇవ్వవేమి? అంటారు. ఇంకొకడు...ఇష్టం వచ్చిన బూతులు తిడుతున్నాడు. ఏమి చేయాలి సార్?

చీర్స్
రాము

Anonymous said...

http://www.findmymissings.com/index.php

Saahitya Abhimaani said...

అద్భుతం. చాలా మంచి వార్తను తెలియ చెప్పారు రామూగారూ. ధన్యవాదాలు.

జేబి - JB said...

మంచి విషయం పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.

Anonymous said...

avunu, manchi vishayam chepparu. Daily papers chaduvutoo unte manaku kooda alantivi boledu telustaayi!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి