Saturday, May 1, 2010

"పెయిడ్ న్యూస్" పై OU లో రామ్ కరణ్ ప్రసంగం

ఒకప్పుడు న్యూస్ అంటే నిర్వచనం ఇలా ఉండేది:
News is what somebody, something, somewhere tries to suppress or hide

ఇప్పుడు న్యూస్ అర్థం మారిపోయింది: 
News is nothing but infotainment
 
ఇలా న్యూస్ కు అర్థ తాత్పర్యాలు మారిపోయి, యాజమాన్యాలు ఎడిటోరియల్ విభాగాన్ని డబ్బు ఖర్చు చేసే (cost center) దానిగా, అడ్వర్టైజ్ మెంట్  విభాగాన్ని ఆదాయం తెచ్చే (profit center) దానిగా భావించడం పెరగడంతో జర్నలిజం లో 'పెయిడ్ న్యూస్' అనే పెనుపోకడ చోటుచేసుకున్నదని ఆంధ్ర ప్రదేశ్ గర్వించదగిన ఎడిటర్, ప్రస్తుతం 'న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' లో డిప్యుటీ రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్న రామ్ కరణ్  అన్నారు. 


ఉస్మానియా విశ్వ విద్యాలయం జర్నలిజం శాఖ విద్యార్ధులు ఆర్ట్స్ కాలేజ్ లో శుక్రవారం నాడు 'పెయిడ్ న్యూస్'పై నిర్వహించిన ఒక సెమినార్ లో ముఖ్య అతిధిగా పాల్గొని రామ్ కరణ్ మాట్లాడారు. ఈ జర్నలిజం శాఖ పూర్వ విద్యార్థి అయిన రామ్ కరణ్ డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియాలలో కీలక భూమిక పోషించారు. మంచి ఎడిటర్ గా పేరు తెచ్చుకున్నారు. టైమ్స్ ను వదిలాక దాదాపు రెండేళ్ళు ఐ-లాబ్స్ లో పనిచేసి మళ్ళీ ఒక నెల కిందటనే...క్రియాశీల జర్నలిజం లోకి వచ్చారు.


ఆర్థిక సంస్కరణలు ఆరంభం అయ్యాక 1991-92 ప్రాంతంలోనే భారత దేశంలో ప్రెస్ దిశ మార్చుకున్నదని రామ్ అభిప్రాయ పడ్డారు. "బెన్నెట్ కోల్మెన్ (టైమ్స్ అఫ్ ఇండియా) లో బడ్జెట్ స్టోరీ రాసే బాధ్యతను బిజినెస్ విలేకరి బదులు సంస్థ అకౌంటెంట్ కు అప్పగించడంతో ఈ మార్పు స్పష్టం అయ్యిందని చెప్పారు. క్రమంగా 'ఎడిటర్' వ్యవస్థను కూల్చేసారని తెలిపారు.  

"పత్రికలు వార్తా సేకరణకు కేటాయించే బడ్జెట్ పై కోత విధించాయి. ఒక్క వార్తలతో బతికి బట్టలేమని నిర్ధారణకు వచ్చిన యాజమాన్యాలు పేజ్-3, ఎంటర్ టైన్మెంట్ కు పెద్దపీట వేయకుండా ఒక్క రోజైనా మనుగడ సాగించలేని పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు టెలిఫోన్ లో మాట్లాడి ఒకటి రెండు కోట్స్ తీసుకుని వార్తలు రాస్తున్నారు," అని ఆయన విశ్లేషించారు. 

టైమ్స్ 'మీడియానెట్' అనే వ్యవస్థ ను నెలకొల్పి 'పెయిడ్ న్యూస్' కు ద్వారాలు తెరిచిందని, చాలా మంది జర్నలిస్టులు దాన్ని వ్యతిరేకించే బదులు అందులో...అదనపు డబ్బు పొందే 'అవకాశాన్ని' వెతుక్కుని ఇప్పటి పరిస్థితికి కారణమయ్యారని రామ్ చెప్పారు. "ఈ పరిస్థితిని జర్నలిస్టులు నిలువరించలేకపొయ్యారు. జర్నలిస్టులు దేనిమీదనైనా స్పందించి నిరసన  తెలపడం ఒక పాతికేళ్ళ కిందటనే ఆపేశారు," అని ఆయన అభిప్రాయపడ్డారు. 

ముందు సప్లిమెంట్ల ద్వారా ఆరంభమై, తర్వాత మాగజీన్ల ద్వారా విస్తరించిన 'పెయిడ్ న్యూస్' మహమ్మారి ఇప్పుడు వివిధ రూపాలను సంతరించుకున్నదని, గత ఏడాది ఎన్నికలలో దాని తీవ్ర రూపం తెలిసిందని రామ్ చెప్పారు. "ఇది మీడియా విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తుంది," అన్నారు. (పైన రెండు ఫోటోలలో...సెమినార్లో ప్రసంగిస్తున్న రామ్ కరణ్ ను చూడవచ్చు.)

ఈ కార్యక్రమంలో...ఉస్మానియా జర్నలిజం శాఖ అధిపతి డాక్టర్ కరణం నరేందర్, ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివెర్సిటీ (EFLU) జర్నలిజం విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మజా షా, ఉస్మానియా అధ్యాపకులు డాక్టర్ శ్యాం సుందర్, డాక్టర్ బాల స్వామి, శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జర్నలిజం విద్యార్థులకు ఈ సందర్భంగా హెడ్ లైన్ రైటింగ్, పీస్ టు కెమెరా (P to C) విభాగాలలో పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.

11 comments:

Anonymous said...

రామ్ కరణ్ ఈ సమస్యను ఎదుర్కొనే పద్ధతి, ఎదుర్కోవాల్సిన అవసరం, అసలు అది సాధ్యమా? లేకపోతే ఏమవుతుంది అలాంటి అంశాలపై కాబోయే జర్నలిస్టులకు ఏమైనా చెప్పారా? లేకపోతే నేరము- దాని వెనుక కారణాలు- అది చేసే విధానం మాత్రం చెప్పి దాన్ని నిరోధించడం గురించి మర్చిపోయారా? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.

Anonymous said...

You have taken a good programme of arranging lectures by real proffessionals with ethics and moral values like Ram Karan to the students of journalism on the subject of the paid news which has become hot topic in these days.But how many of these youngsters become like Ram Kiran in their proffession is a big question mark as any one can get attracted to money in their proffession.Even though there has been a lot of criticim and adverse comments on paid news there is no change in the attitude of the media pwersonnel as they are continuing paid news in print and electronic media.It is not that easy to transform the media and deviate it from the paid news culture but still there is a definite light at the end of tunnel as people like Ram Karan will definetely influence the younger generation to lead their proffession with ethical ,proffessional and moral values and try to become GK Reddys of The Hindu and Ramnath Goenka of Indian Express.
JP.

కొత్త పాళీ said...

Interesting

Rajendra Devarapalli said...

రాము గారు ఈ http://wp.me/pPLDz-Px టపాలో అమ్ముకున్న వార్తల మీద ఎపిడబ్ల్యుజె వాళ్ళ నివేదిక పీడీయఫ్ పైల్స్ ఉన్నాయి పత్రిక వారీగా.

Ramu S said...

నేను కూడా అదే ఫీల్ అయ్యాను. తను పరిష్కార మార్గాలు చెప్పలేదు. తన ప్రసంగం కాగానే...నా పక్కన కూర్చున్న డాక్టర్ పద్మజా షా గారితో నేను ఇదే మాట అన్నాను. రామ్ దీన్ని ఒక నివారించేలేని పరిణామం గానే చర్చించారు. ఎడిటర్ వ్యవస్థ దెబ్బతిన్నాక జర్నలిస్టులు నామమాత్రం అయిపోయారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని ఏమీ చేయలేకపోయింది అన్నారు.
రాము

Saahitya Abhimaani said...

I will put it in a slightly different angle. Now the news has been commercialized. What we are experiencing is the bad effects of commercialization of news. Yester years, news papers were established by such who have interest in journalistic values and not by those interested in money making alone. Any establishment should make money but News Papers and News Channels should not be for the sole purpose of making money somehow. Drive away the Barons from the journalistic arena from commanding and deviating the good profession a society can boast of. If there is unity among the people working for these papers and channels it is possible. That can come only with job security. Job security is possible only when the people have good value for themselves and respect each other and do not jump to replace a person being kicked out for being a journalist.

Now channels and papers are being established by commercial houses and corporates and by such people who know next to nothing about journalism.

God forbid if Emergency type situation of 1975 vintage happens now in the country, what all these channels and news papers owned by Barons and Neo-Barons would do, I shudder even to think about it.

Please do cover this type of good events with Journalists expressing themselves dispassionately and frankly and not self centered and defensive reactions.

Anonymous said...

దేశ మేధావి వర్గంలో ముఖ్యంగా పాత్రికేయమేధావుల్లో నిరాశావాదం, నిస్పృహ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ఏమీ చెయ్యలేం జీతాలు తీసుకోవడం తప్ప అనే ధోరణిలో కొట్టుకుపోతూ, దాన్నే కిందవరకూ బలంగా పాతుకొనేలా చేస్తున్నారు. నాకు పేర్లు అవీ గుర్తులేదు కానీ మన దేశంలోనే కేవలం నిరక్షరాస్య మహిళలు నడుపుతున్న పత్రికలు, రేడియో ఛానళ్ళు ఉన్నాయని చదివాను. ఈ మెట్టవేదాంతమంతా మేధావులలోనే ఉంది. అంచేత చేయగలిగే పని చిన్నదైనా దాన్ని చేయాలి. కనీసం మంచి చెయ్యవచ్చు, చెయ్యగలము అన్న వాదనలనైనా బలంగా వినిపించాలి. అన్ని చర్యలూ ముందు మనసులోంచి సంకల్పంలోంచే కదా ఉద్భవించేది. మేధావులు దీన్ని గుర్తించి ఈ దిశగా పనిచేస్తారని ఆశిస్తున్నాను.

Ramu S said...

JP gaaru,
Your point has been taken. Thanks for your time.
ramu

Vinay Datta said...

Forget about working journalists. College news and magazines are also commercialized. There are advertizers who pay at the mere mention of 'youth' . And the students take advantage, naturally. Can't blame both these groups because advertizers want publicity and students want to make their news colourful and attractive. Unfortunately, there's hardly anybody to tell them what journalism actually means. The values have to be developed at the root level.

Saahitya Abhimaani said...

Madam Madhuri touched upon the crux of the issue.

Yes its the advertisers who poisoned the media and taught them the short cuts for quick buck without being a journalist at all. Establish a rag, initially post some bold half truths, get some cheap publicity and you get all the ads and money.

Unfortunately, the actual manufacturers of goods and services in India or for that matter in all leading countries, do not know the limitation of advertisement for their products. They are lead to believe (mislead to believe I say) that without constant advertisements their products cannot be sold. So it is the advertisement "mafia" that is the main culprit, putting our their most unproductive service, much to the disadvantage to the society at large, which they try to take for a ransom and almost succeeded.

There should be a law by which how much media should earn out of ads out of their total income, as these ads are influencing the kind of news being published and shown.

Unknown said...

Ramu S గారూ...,ఒకప్పుడు న్యూస్ అంటే నిర్వచనం ఇలా ఉండేది:News is what somebody, something, somewhere try to suppress or hide ఇప్పుడు న్యూస్ అర్థం మారిపోయింది: News is nothing but infotainment  ఇలా న్యూస్ కు_____________________భలే భలే మీ బ్లాగ్

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి