Saturday, May 29, 2010

జర్నలిస్టులా??....రాజకీయ కార్యకర్తలా???

అలనాడెప్పుడో సత్యకాలంలో....ఎడిటర్లు జేబులో రాజీనామా లేఖలు పెట్టుకుని తిరిగేవారట. పత్రిక యజమాని...తమ సంపాదకీయ స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తే...ఆ రాజీనామా మొహాన కొట్టి ఇంటికి వెళ్ళే వారట. నీతి, సత్యం కోసం....సుఖాన్ని, హోదాను వదులుకోవడానికి వెనుకాడని రోజులవి. 

ఇప్పుడు కాలం మారింది, జర్నలిజం రూల్స్ మారిపోయాయి. యజమానుల స్వరూపం మారిపోయింది. భూ ఆక్రమణదారుడు మూడు, నాలుగు ఛానెల్స్ పెట్టి....సంపాదకీయ సమావేశాలకు నిస్సిగ్గుగా అధ్యక్షత వహించి...'ఈ వార్త వాడండి...ఆ వార్త వాడండి...' అని తలపండిన జర్నలిస్టులకు ఆదేశాలు జారీచేసే దుర్మార్గపు రోజులు దాపురించాయి. 'సార్...మీ ఐడియా లు అమోఘం...మీది నిజంగా జర్నలిస్టు బుర్ర,' అని తెగ పొగిడి పదవి పదిలం చేయించుకునే...మహానుభావుల హవా నడుస్తున్న రోజులివి. అంతెందుకు--
ఇంతకు ముందు అనుకున్నట్లు...దావూద్ ఇబ్రహీం లేదా కసబ్...'ఒక వంద కోట్లతో ఛానల్ పెడదామని అనుకుంటున్నా...' అని ప్రకటన చేస్తే...మన సీనియర్ జర్నలిస్టులలో ఒక సెక్షన్ ఒకడికి తెలీకుండా ఒకడు వాళ్లకు మెయిల్స్ పంపుతుంది. అలాంటి ఆత్మలు చచ్చిన సీనియర్ జర్నలిస్టులు....బంజారా హిల్స్ లో బొచ్చడుమందని అబ్రకదబ్ర చెబుతాడు...నిజమో కాదో కానీ. 

హైదరాబాద్ లో మురికి కాల్వల మాదిరిగా ఎక్కడెక్కడి నుంచో పుట్టుకువచ్చిన పెట్టుబడుల ప్రవాహంతో పొలిటీషియన్లు, బిజినెస్ మెన్ మీడియా అధిపతులు అవుతున్నారు. జర్నలిజాన్ని పట్టపగలు ఖూనీ చేస్తున్నారు. డబ్బు కోసం నానా గడ్డికరిచే, అడ్డదారులు తొక్కే నయా జర్నలిస్టు జాతి...పావలా డబ్బుకు వంద రూపాయల యాక్షన్ చేస్తుంటే...నికార్సైన జర్నలిస్టులు లోలోన కుమిలిపోవాల్సిన దుస్థితి దాపురించింది. 

'ఛీ..ఛీ...అనవసరంగా ఈ రొంపి లోకి దిగాం...తెలియక,' అనే జర్నలిస్టులు కోకొల్లలు. 'నా కూతురును కానీ...కొడుకును గానీ...పొరపాటునైనా జర్నలిస్టును చేయను,' అనే మిత్రులు ఈ ఫీల్డులో ఎక్కువ మంది వున్నారు.

నేను తురుంఖాన్ అని ఈ బ్లాగ్ లో చాలాసార్లు రాసిన ఒక సీనియర్ జర్నలిస్టు పిలిస్తే వాళ్ళ ఆఫీసుకు వెళ్ళాను ఆ మధ్య. ఉదయం పూట ఏదో ప్రోగ్రాం చేయమని అంటే...'ఇది తెలుగు దేశం ఛానెల్ కదా. మనకు స్వేచ్ఛ ఉంటుందా?' అని అడిగాను. 'ఇప్పుడు ఛానెల్స్ అన్నీ అలాగే వున్నాయి రామూ...మనం కొద్దిగా అడ్జెస్ట్ కావాలి. తప్పదు కదా,' అని సారు సెలవిచ్చారు. పాపం అతనిదీ నిస్సహాయ స్థితి. ఆత్మను అమ్మేయక తప్పలేదు. మీకు తెలుసా.....ఇప్పుడు కాంగ్రెస్ కు పక్కాగా నాలుగు ఛానెల్స్, తెలుగు దేశంకు మూడు వున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సమీకరణలు మారతాయి.

'ఆత్మలను అమ్ముకుంటున్న జర్నలిస్టులు' అనే శీర్షికన ఇంకా పంచ్ తో ఈ పోస్టు రాయాలని ఉంది. కానీ...నేను కూడా ఇరవై ఏళ్ళు ఇదే వ్యవస్థలో పనిచేసి బైటికి వచ్చాక సుద్దులు చెప్పడం...అసహజంగా ఉంటుందని భావించాను. 'ఈనాడు' లో ఉండగా ఆ పత్రిక చేసిన తెలుగు దేశం భజనలో లీడ్స్, హెడ్ లైన్స్ విషయంలో నా పాపం కూడా ఉండకపోదు. ఎవడో లైన్  చెబితే...కథనాన్ని గానీ, పేజ్ మేకప్ గానే నేను ఎప్పుడూ మార్చలేదు. 'మనం జిత్తులమారి చంద్ర బాబుకు ఎందుకు వత్తాసు పలకాలి?' అని రామోజీ రావు గారిని ఒక సమీక్ష సమావేశంలో ప్రజాస్వామ్యయుతంగా నిలదీసిన వారిలో నేను ఒకడిని. 'రాష్ట్ర శ్రేయస్సు కోసం...' అని ఆయన చెప్పినప్పుడు ఇక మనం ఏమి వాదిస్తాం? 

'ది హిందూ'లో అసలు ఈ పరిస్థితి ఉండదని చాలా మంది అనుకుంటారు గానీ...నేను ఇలాంటివి రెండు సందర్భాలు ఎదుర్కున్నాను. చైనా అనుకూల వైఖరి కనబరిచే ఆ పత్రిక కు దలైలామా అంటే పడదని అనుకుంటా. ఒక సారి దలైలామా...నాగార్జున సాగర్ వస్తే...చచ్చీ చెడి నేను, నా ఫోటోగ్రాఫర్ దాన్ని కవర్ చేసాం. ఆ వార్తకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనిలేదని ఆదేశాలు వచ్చినప్పుడు...కొద్దిగా నొచ్చుకున్నాను. మర్నాడు ఆ వార్తకు లభించిన ప్రాధాన్యం చూస్తే....విషయం పూర్తిగా బోధపడింది.

మరొక సారి...ఒక పెద్ద సారు...కోకాకోలా కు అనుకూలంగా ఒక వార్త రాయమని ఆదేశం పంపారు. అది నాకు ఒక షాక్. జనాల నీటి హక్కును ఉల్లంఘిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఒక కంపనీ కి అనుకూలంగా ఒక జర్నలిస్టు అలా నాకు అసైన్ చేయడం నచ్చలేదు. మొహానే...'నో' అంటే బాగుండదని....ఆయన ఆదేశం మేరకు ఫీల్డ్ విజిట్ చేశాను. అక్కడ స్టోరీ లేదని చెప్పగానే మా మంచి సారు ఓకే అన్నారు. కుదరదు...రాయాల్సిందే అని ఆయన అంటే...నా పని ఏమయ్యేదో కదా! కోకకోలా పీ.ఆర్.ప్రతినిధి చేసినన్ని ఫోన్లు నాకు మానవ మాత్రుడు ఎవ్వడూ చేయలేదు. అయినా...మన ముందు...ఆ పాచికలు పారలేదు. 

నిన్న కాంగ్రెస్ ఎం.పీ.జగన్ మోహన్ రెడ్డి వరంగల్ జిల్లా లో జరప తలపెట్టిన యాత్ర, దాని తాలూకు రగడపై టీ.వీ.ఛానెల్స్ కవరేజ్ చూశాక...'వీళ్ళు జర్నలిస్టు లా...పొలిటికల్ యాక్టివిస్టులా?' అనిపించింది. గ్రౌండ్ రిపోర్ట్ ను కాంగ్రెస్ అనుకూల ఛానెల్స్ ఒక రకంగా...ఇతర ఛానెల్స్ ఒక రకంగా చూపాయి. 'సాక్షి' ఛానల్ ను, టీ.ఆర్.ఎస్. వారి 'రాజ్ ఛానల్' ను మార్చి మార్చి చూస్తే...ఫీల్డు మీద ఉన్న రిపోర్టర్లు, స్టూడియో లో ఉన్న యాంకర్లు, ప్రజెంటర్లు వాడిన పదజాలం, హావభావాలలో తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. మూడు నాలుగు ఛానెల్స్ మాత్రం 'గ్రౌండ్ రియాలిటీ' ప్రాతిపదికన వార్తలు అందించాయి.

కొందరు యాంకర్లు తమ యాజమాన్య విధానానికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. విజువల్స్ చూపడంలో కూడా చాలా తేడా కనిపించింది. 'మనం...వాస్తవాలకు కట్టుబడి ఉండాలి,' అని జర్నలిస్టులు చెప్పాలని అనుకున్నా చెప్పలేని దుస్థితి. ఒక రకంగా పోవాలని సీనియర్లు ప్రయత్నించినా...కుదరదు. కెరీర్లో ఎదుగుదలే ముందు, నీతి తర్వాత...అని నూరిపోసి ఈ యాజమాన్యాలు కొత్త బ్యాచులను తయారు చేసుకున్నాయి. వారు ఏ పనికైనా సిద్ధంగా ఉంటారు. ఏటికి ఎదురీద్దాం...అనుకునే వారికన్నా...సుఖ జీవనం కోసం...ప్రవాహంలో జలకాలాడేద్దాం...అని భావించే వారు ఎక్కువయ్యారు.

మొన్నటి దాకా...తెలుగునాట జర్నలిజానికి జబ్బు చేసిందని అనుకున్నాం. ఇప్పుడు జబ్బు ముదిరి....జర్నలిజం మరణశయ్య మీదకు చేరింది. దీనికి చికిత్స కనుచూపు మేరలో లేదు. ఇది కాకులు, గద్దలకు పండగ కాలం. ఈ పాడు మేడిపండు ప్రజాస్వామ్యంలో పురుగులు, పరాన్నభుక్కులవి కాక రోజులు మరెవరివి?

25 comments:

Anonymous said...

i remember only one sentence from yesterdays coverage, tv9 Rajnikanth saying 'ee himsaatmaka sanghatanalaki adishtanam voddanna vinakunda mondiga bayalderina jagan badhyatha vahisthada?'
Rajnikanth questioned the same with everyone who came in phone-in.
'Long Live AP Media'

Raja

సుజాత వేల్పూరి said...

మీరు చెప్పినట్లు రాజీనామా లేఖలు జేబులో పెట్టుకుని తిరిగే కాలం...బహుశా నిబద్ధతతో ప్రజా పక్షం వహించే పత్రికల కాలంలో! ప్రతి పత్రికా ఒక రాజకీయ పార్టీ పక్షం వహిస్తున్న రోజుల్లో అందులో పని చేసే ఉద్యోగులు "పత్రిక పాలసీ"ప్రకారం పోవాల్సిందే కదండి!వారికి వేరే ఛాయిస్ ఏముంది? కాదని ఉద్యోగం మారి మరో చోటికి పోయినా అక్కడైనా మరొకరికి కొమ్ము కాయాల్సిందేగా!

పత్రికలు,ఇతర మీడియా సంస్థలు వ్యాపార సంస్థలుగా ఎప్పుడైతే మారాయో, అప్పుడే జర్నలిస్టుల నైతికత గురించి మాట్లాడుకోవడం అనవసరమని గ్రహించాలి మనం! వాస్తవాలకు కట్టుబడి ఉండాలి అని అనుకున్నా అలా ఉండలేని పరిస్థితి వాస్తవంలో ఉన్నపుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు?

కొద్దిమంది తులసి మొక్కలున్నా, గంజాయి వనంలో నెగ్గుకురాలేని పరిస్థితి! ఏం చేస్తాం ఒక నిరాశాపూరిత నిట్టూర్పుతో సరిపెట్టుకోవడం తప్ప!

Anonymous said...

dear ramu, what you said is 100% correct. these are the saddest days we are experiencing. i shocked to have seen yesterday some channels aired even the raw news with political colour. all channels polarised towards parties. i shocked to learnt when you said, that even hindu has taken sides. Big vaccume for an unbiosed channel and a news paper in ap.

Thirmal Reddy said...

umr-e-daraz maang ke laya tha char din
do arzu mein kat gaye do intezar mein

"I asked for a long life, I received four days. Two passed in desire, two in waiting"

This was the famous line written by the last mughal emperor Bahadur Shah Zafar after the defeat in the First War of Independence in 1857. How I wonder this line aptly reflects the ambitions of young journalists of Telugu media. They ask for a long, fulfilling career but they get only a few days of journalistic life in which some days pass in desiring moral values and the remaining days pass in waiting for the moral values.

In my very short stint of 4 years at ETV2, I had a variety of situations which questioned my morality. Just under a year, it became clear to me that most of the journalists who by pass the moral values are typically of two types.

Modati rakam.... Kevalam kutumbanni poshinchukovadam kosam mathrame naithikathanu kasepu marchipoinattu untunnare thappa.... naaku thelisi viluvalanu poorthiga vismarinchadam ledu. Deeni ardham... naithika viluvalu butta dakhala chesina vaaru lerani kadu. Alanti vaallalo pedda jeethagaallu ekkuvaga unnaru. "Brother, manamentha, mana sthayi entha. Edo, chinna jeethagaallam, peddavallu cheppinattu vaartha rasthe pellam biddalni poshinchukune avakasamaina untundi"... ila anna naa thoti diguva madhya tharagathi journalist ki moral values gurinchi cheppe sahasam cheyalekapoya.

At the same time, inko rakam uunaru. Boss ki vishayam cheppalsi vasthe, mundoka sir, venaka oka sir thagilinchi kaani matladaru. "SIR alage SIR", SIR cheppandi SIR", "SIR meeru cheppinde correct SIR" lantivi annamata. alanti case lanu choosthe abbo... brahmandam baddalaina veellu ikkade untaru kabolu anukune vaani. Theera choosthe SIR ki panganamam petti maro SIR daggara cheri lakhsa rupayala jeetham, oka office car maintain chesthu kanapaddaru. Adenti ala chesaru ani prashninche avakasam lekapoindi.

Ramu, meere cheppandi.... moral values gurinchi badugu journalist ki bodhinchamantara, balupekkina boss lanu prashninchamantara.

THIRMAL REDDY
thirmal.reddy@gmail.com

astrojoyd said...

exellently expressed sir-jayadev,mahaa tv ,chennai correspondent...

Anonymous said...

అవును రాము గారు!
మీరు చెప్పింది అక్షరాలా నిజం!
అయితే ఒకప్పటి విలువలు ఇప్పడులేవు. అది అక్షర సత్యం. ఇప్పుడున్న విలువలూ రేపటికి ఉండవు. ఇది నిత్య సత్యం. ఛానళ్ల సంఖ్య పెరుగుతుండడంతో అప్పటి వరకు ఇతర ఛానళ్లలో డ్రైవర్లుగా, కెమేరా అసిస్టెంట్లుగా పనిచేసిన వారు సైతం విలేఖరులవుతున్నారు. సీనియర్‌ విలేఖరులు దొరక్క, తక్కువ జీతానికి పనిచేసే ఏ నిరుద్యోగికైనా జర్నలిస్టు అనే పోస్టు ఇస్తున్నారు. కనీసం వారికి జర్నలిజంలో ఓనమాలైనా నేర్పకుండా ఫీల్డుకు పంపుతున్నారు. ఇలాంటి వారివల్ల ప్రజల్లో పూర్తిగా జర్నలిజం అంటేనే ఏహ్యభావం కలిగేలా పరిస్థితి అదుపుతప్పుతోంది.


ఇలాంటి పిల్ల జర్నలిస్టులకు ఆయా ఛానళ్లు, పత్రికల్లో పనిచేసే సీనియర్లు కొంతమేరైనా విలువలు నేర్పాల్సిన అవసరం ఉంది. క్లాసుల్లా కాకున్నా... టీకొడుతూనో... టిఫిన్‌ చేస్తూనో... కొన్నిట్లో కొన్నైనా విలువలు నేర్పడం ఉత్తమం. ఇది నా అభిప్రాయం రాము గారు.

Saahitya Abhimaani said...

దావూద్ ఇబ్రహీం లేదా కసబ్...'ఒక వంద కోట్లతో ఛానల్ పెడదామని అనుకుంటున్నా...' అని ప్రకటన చేస్తే...

Today there appears to be no norms for anybody to start any channel or news paper. Even to become a Peon in any organisation there are some basic qualifications and such person's background would be checked and if to be appointed in govt. orgn., Police shall check the background. But for anybody to start in Politics or to start a channel or news paper, where are the bench mark prerequisite qualifications .

It would not be infringement of freedom of expression or(the so called press freedom), if there are stringent rules and prerequisites are defined for anybody to start a channel or news paper.

Why are you lamenting about what Sakshi channel is doing now? The channel is owned by the person who went on this sham "Yatra" and when he owns the channel itself, what kind of angle the channel would be showing.


Whatever EENADU did when NTR started Telugu Desam Party, now Sakshi paper/channel are doing for their proprietor. But the difference is NTR was a HUMAN BEING unlike the persono these channels are trying to prop up now.

Saahitya Abhimaani said...
This comment has been removed by the author.
సుజాత వేల్పూరి said...

Thirmal reddy గారు,
మీ వ్యాఖ్య చాలా వాస్తవికంగా, బాగుంది! కానీ ఇంత పెద్ద వ్యాఖ్యలు టింగ్లీష్ లో రాస్తే చదవడం కష్టం కదండీ! తెలుగు లో రాస్తే బాగుంటుందిగా!

Ramu S said...

Brother Tirumal,
Your ideas are good. your writing skills are excellent. Why don't you write a piece on "My Experience As a Journalist" for this blog. I'll post it as it is. If you can compose in Telugu, I'll be thankful to you.
Cheers
Ramu

Saahitya Abhimaani said...

Sujatagaaroo, What you said is true. Lets write either in English or in Telugu. But writing Telugu in English script is horrible and the person so writing is just running the risk of his comment completely ignored, as it is "unreadable". So my appeal to all is to write in Telugu using Lekhini.org or just write in English.

Anonymous said...

ramu garu meeru , mee laanti mari kondaru maruguna padina maanikyala gurinchi "My Experience As a Journalist" lanti pieces rasthe baguntundi. maa laanti young journalists ki sphoorthi ga vuntundi.

thinker said...

అందరూ జర్నలిస్టులను మాత్రమే తప్పు పడుతున్నారు, మరి ప్రేక్షక మహాశయుల సంగతేమిటి, అసలు ఈ దుస్థితి కి కారణం వెర్రి జనాలే, ఒక్క జర్నలిజం విషయం లోనే కాదు, కమ్యూనికేషన్ మీడియా మొత్తం నాశనమవడానికి కారణం వాటిని ఆదరించే ప్రజలే. అలా అని అసలు మీడియా కి దూరంగా వుండమని చెప్పట్లేదు, మంచి ని గ్రహించి చెడు ని వదిలి పెట్టే లక్షణాన్ని సంతరించుకొంటే ఏ గొడవా ఉండదు. అలా కాకుండా వాల్లు చూపించే సినిమాటిక్ వార్తలను చూసి గంగ వెర్రులెత్తిపొయి ఎమొషనల్ గా ఫీల్ అయిపోయి సమాజం మొత్తాన్ని అట్లాస్ లాగా తన భుజస్కందాల మీద మోస్తున్నట్టు ఫీల్ అయిపోయి చుట్టూ జరిగే ప్రతి సంఘటనకు విపరీతంగా స్పందించేసి(అది ఉద్యమం కావచ్చు, నాయకుడి ప్రసంగం కావచ్చు, లేదా ఎవడొ ఒకడి మరణం కావచ్చు.) ఇలా ఏం జరిగినా అదేదొ తమకే జరిగినట్టు ఫీల్ అయిపోయి, కిందా మీద పడుతున్నారు. నాకు తెలిసి ఇలాంటి జనాలు ఉన్నన్ని రోజులు రామోజి రావులు, సాక్షి రాం లు , అంద్రజ్యొథి (ఆయన పేరు తెలీదు) లు పండగ చేసుకుంటునే ఉంటారు, ఇలా జర్నలిస్టులను అదుపాగ్నలలో పెట్టుకొని వాల్ల బతుకులు కుక్క బతుకులుగా(పద ప్రయోగానికి క్షమించండి) మారుస్తారు. నా మటుకు నేను టి వి లో వచ్చె ప్రతి వార్తను ఒక అడ్వర్టైస్మెంట్ గా తీసుకుంటాను, కాబట్టి ఇంతవరకు నా గుండె పగల్లేదు, నా నెత్తిన కిరోసిన్ పడలేదు [:)]

గమనిక: తెలుగు బాగా వచ్చినా, సమయాభావం వలన అప్పుతచ్చులు ఏరివేయలేక పోయాను రెండవ క్షమాపణ కోరుకుంటున్నాను.

Anonymous said...

Ramu garu,
Your observations out of your experience,analysis are excellent and reflect the media in the mirror very clearly.But who has to set right the things that are going on wrong track derailing the proffession?Press Council of India is most useless and inefficient and the salaries paid to them are hundred percent waste.As the politicians are themselves are in hand in glove with the managements of media houses they are just onlookers and mute spectators to the degenerating values in the proffesson.There have been a number of artciles against the paid news but is there any response from media houses?On the contrary the paid news culture is still alive.
We go on crying against the ills and maladies of media but the sound of this will not reach the concerned people as they are deaf and dumb.
One of trhe bloggers said that the peole are also responsible for the ills of media.It is not proper to blame the common as he goes throgh the newspaper and news channel as they are presented and the common man is nothing to do with the ills of media and media pesonnel.It looks there is no solution to the questions raised by you as there is no proper responsible person,organisation and govt machinery to set right the media and transform it into a proffessional and ethical one as every one wants to take advantage of media for selfish purpose and media nturn gets huge returns in all aspects to maint it.
As rightly said by Sujatha garu I request all the bloggers either to go for pure Telugu script or English script as it is very irritating and strainful to go through Telugu in English version.

JP.

అర్క said...

విషయం పాతదే అయినా విశ్లేషణ బాగుంది. తిరుమల రెడ్డి చెప్పినట్లు స్వభావరీత్యా చెడిపోయినవాళ్ళు, చెడిపోయిన వాళ్ళదారిలో నడిస్తే లాభం వస్తుంది కనుక అలా నడుస్తున్నవాళ్ళు రెండు రకాలు. మొదటిరకంవారు వారి బ్లాక్మెయిల్ కి ఎవరు లొంగుతారో చూసి, వారితో బేరాలకు దిగుతారు. రెండో రకం వాళ్ళ పక్కన నుంచొని(నివారించకుండా, కొండొకచో ప్రోత్సహించి) తమ వాటా పుచ్చుకుంటారు.
ఇక బాసులను కాకా పట్టడం మూడో రకం.
కానీ రామూ గారు చర్చించింది వీటి గురించి కాదు.
ఛానల్స్ రాజకీయ, ఆర్థిక ఎజెండాల గురించి.
దేనివల్ల ప్రజలకు(సమాజానికి) ఎక్కువ నష్టం అంటే చెప్పడం కష్టమే కానీ ప్రస్తుతం రాజకీయ పక్షపాతం వల్ల ప్రజలు ఎవరినీ నమ్మడం లేదు, లేదా ఎవరిన నమ్మానిపిస్తే వారిని నమ్ముతున్నారు. కనుక ఛానల్స్ రాజకీయ ఎజెండా వల్ల పెద్ద నష్టం లేదనే నా అభిప్రాయం. ఇక రెండవది ఆర్థిక ఎజెండాతో సానుకూల ప్రతికూల వార్తలు రాయడం. ఇది కూడా ప్రజలకు తెలిసిపోయింది. అంత తేలికగా వాళ్ళు టీవీలో వచ్చినదాన్నో, పత్రికలో రాసినదాన్నో నమ్మడం లేదు. అయితే నమ్మినట్టుగా నలుగురితో చర్చిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు.
మొత్తం మీద ఈ దిగజారుడు వల్ల ఎక్కువగా నష్టపోయేదీ పోతున్నదీ పాత్రికేయులే. విశ్వసనీయత కోల్పోవడం వల్ల వృత్తిజీవితానికే కాక, వ్యక్తిగత జీవితానికీ అనేక ప్రమాదాలు ముంచుకొస్తాయి. అది కొందరు గమనించరు, మరి కొందరు గమనించనట్లు నటిస్తారు. కొందరు ఆ ఏం కాదులే అని అతి ధీమాకు పోతారు, ఆనక పోతారు. అయితే వారితో పాటు యావత్ పాత్రికేయలోకానికీ మసిపూసి పోతారు.
పరిణామ క్రమంలో భాగంగా ఇది జరుగుతోంది. త్వరలోనే పాత్రికేయరంగంలోనూ సద్విప్లవం వస్తుందని నేను విశ్వసిస్తున్నాను, మనం ప్రయత్నిద్దాం.

Thirmal Reddy said...

టింగ్లిష్, తాంక్ఫుల్, హారిబుల్, ద పర్సన్, ఇర్రిటేటింగ్

కేవలం లేఖినీలో ఉన్న సాంకేతిక కారణాల వల్ల ఇన్ని మాటలు పడాల్సి వస్తుందని అనుకోలేదు. సూచన వరకు ఫర్వాలేదు కానీ మరీ శివ గారి కామెంట్ చూస్తే "రాసిన వాడు గాడిద" అన్నట్టుగా ఉంది. బాహాటంగా నా పేరు చెప్పుకుని మరీ కామెంట్ రాస్తే ద పర్సన్ ఆనాల్సిన ఆవసరం లేదు.

If you have any organs of understanding still working, it took me 2700 hertz of my pendulum oscillations to compose these great letters of gyan. And, it is just because of technical glitches in the translation which I don't need to explore or explain to any earthling including myself. Well, there are two other ways of getting out of this idiosyncrasy. One, don't read the comment in a POSITIVE note and the other to shed your IDIOSYNCRASY itself.

I rest my case.

THIRMAL REDDY
thirmal.reddy@gmail.com

Anonymous said...

There are two parts to the story of a journalist...One...a job. Two...a profession. As a professional journalist, you would like to chronicle several issues depending on your ideology and perception. But, what if the management/editor does not like it?
Editor in most cases is the first reader of your story. Though your intention is to inform the reader at large about your observations collated according to your ideology, if the first reader negates it there is no way the reader at large would ever even know that there was one such story. On the contrary...you have done a story following the instructions of your first reader and it goes to print with your byline. Whether or not the reader at large likes it, a journalist in you is put into circulation. This is the 'JOB' part of what we. I think, we should learn to balance these two parts. Keep the first reader and the journalist in you happy by striking a balance. No point in cribbing.

Saahitya Abhimaani said...

"......But writing Telugu in English script is horrible and the person so writing is just running the risk of his comment completely ignored, as it is "unreadable"....."

Mr. Thirumal Reddy! please see what I wrote above before you become quite emotional about your writing in tenglish and our objections. I wrote "the person" not "that person". I hope you know the difference. My comment was in general and I did not care to address you at all. This is not the first time that I wrote my abhorrence of Telugu being written in English script the so called "technical glitches" notwistanding. Please see some of the previous posts. If technology is coming in your way of writing Telugu, write in English. After all whenever we write, we write for others to read. If we write without caring whether others read it or not,or how much they have to struggle to read such cross language scripting, OK! that is a different matter.

Once again I wish to clarify to you that my comment was not aimed at you at all but aimed at everybody who is butchering Telugu language by writing it in English script.

Ramu S said...

తిరుమల్ రెడ్డి గారూ..
తెలుగు విషయంలో నా బాధా, శివ గారు తదితరుల ఆవేదన ఇప్పటిది కాదు. మిమ్మల్ని ఉద్దేశించి కాదు. మేము చాలా రోజులుగా ఈ ఇబ్బందిని ఎదుర్కుంటున్నాము. వ్యక్తిగతంగా తీసుకోకండి.
రాము

Ambedkar said...

పత్రికలంటే... "పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలే" అని శ్రీ శ్రీ ఏనాడో చెప్పిన మాటను నేటి మన పత్రికలన్నీ నిజం చేస్తున్నాయి. ఇక ఆ విషయంలో చర్చించుకోవడం అంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే.

బి.డి.యం. అంబేద్కర్

venkata subba rao kavuri said...

ఈ- తెలుగు రచయితల సమావేశానికి నేను హాజరయ్యాను. సంఘ నిర్వహణ, బోధన తదితర విషయాల్లో నిర్వాహకుల్లో సరయిన అవగాహన లేనట్లు అనిపించింది. అయితే నిజాయితీకి లోటు లేదు. అందులోనూ ముదురు రచయితలాయే. తెలుగు చచ్చిపోతోందంటూ తెగ తెగ ఆంగ్లంలో వాపోయిన ఆంగ్ల దొరలకు అక్కడ కొరవ లేదు. నావరకు నాకు అంతగా ఈ సమావేసం వుపకరించలేదు. ప్రాధమిక సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలిపి, దానిని చదువుకొని సమావేశానికి రమ్మంటే బాగుండేది. నేరుగా బ్లాగు రూపకల్పన, టైపు, టపా నేర్పిస్తే కొంత ఫలితం దక్కవచ్చేమో. నిర్వాహకులు పరిశీలించాలి. నాకు బ్లాగ్ వుంది. ఇంగ్లీష్ టైపు రాదు. యాపిల్ కీబోర్డ్ పై అనుతో వేగంగా తెలుగు మాత్రమే వచ్చు. తపా యెలాగో తెలియటం లేదు. యెవరన్నా సాయం చేస్తారా.????
నన్నార్లు (శిబిరంలో నేర్చుకున్నాను)
వెంకట సుబ్బారావు కావూరి

Anonymous said...

I found this link more useful than lekhini

http://www.google.com/transliterate/

Anonymous said...

సుజాత గారు, మీ అభిప్రాయం సరికాదండి, జర్నలిస్టులలో తులసి మొక్కలే ఎక్కువండి. జాలి చూపించకుండా, ఉద్యోగ భద్రత వైపు నుంచి ఆలోచించి మాట్లాడండి. నీతి, నియమాలు తెలియనంత చిన్న పిల్లలు, మూర్ఖులు కాదు జర్నలిస్టులు. వాళ్ళు ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కుడా తెలుసు. ఈ వెధవ వుద్యాగం పోయినా నష్టం లేదు అనుకునే జర్నలిస్టులను అడిగితే ఈ విషయం తెలుస్తుంది.

జర్నలిస్టులు ఆత్మా గౌరవం, ఆత్మభిమానం చంపుకొని పని చేస్తున్నారు అంటే అవి ఇక వారి జీవితాల్లో ఉండవని, రావని , పాటించరని కాదు. నిన్న మహా టివి లో కే సి ఆర్ అద్భుతమైన మాట అన్నాడు... Nothing in this world can substitute self-respect and self rule. జర్నలిస్టులకు వారి ఉద్యోగ జీవితాల్లో ఇలా జీవించే అవకాసం రావడం లేదు. రాము గారు పోరాడి తెచుకోవాలి అంటారు కాని, అది అంత తేలిక కాదు. వారికి ఆ విషయం బాగా తెలుసనుకుంటాను. ఇప్పుడు మీడియా వున్నా పరిస్థితుల్లో జర్నలిస్టు నెల నెల జీతం కావాలంటేఆత్మాభిమానం తగ్గించుకోవాలి, అవసరమైతే వదులుకోవాలి. రిటైర్ అయినప్పుడు, రాము గారి లాగ పరిస్థితులు అనుకులించి వుద్యోగం మానేసి వేరే దారి చూసుకున్నప్పుడు కావాల్సినంత ఆత్మా గౌరవం, అభిమానం తో బతకవచు. దీని అర్ధం ఇప్పుడు పనిచేస్తున్న ఎవరికీ ఇవి ఏమి లేవనా?
- చందు


సుజాత గారు, మీ అభిప్రాయం సరికాదండి, జర్నలిస్టులలో తులసి మొక్కలే ఎక్కువండి. జాలి చూపించకుండా, ఉద్యోగ భద్రత వైపు నుంచి ఆలోచించి మాట్లాడండి. నీతి, నియమాలు తెలియనంత చిన్న పిల్లలు, మూర్ఖులు కాదు జర్నలిస్టులు. వాళ్ళు ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కుడా తెలుసు. ఈ వెధవ వుద్యాగం పోయినా నష్టం లేదు అనుకునే జర్నలిస్టులను అడిగితే ఈ విషయం తెలుస్తుంది.

జర్నలిస్టులు ఆత్మా గౌరవం, ఆత్మభిమానం చంపుకొని పని చేస్తున్నారు అంటే అవి ఇక వారి జీవితాల్లో ఉండవని, రావని , పాటించరని కాదు. నిన్న మహా టివి లో కే సి ఆర్ అద్భుతమైన మాట అన్నాడు... Nothing in this world can substitute self-respect and self rule. జర్నలిస్టులకు వారి ఉద్యోగ జీవితాల్లో ఇలా జీవించే అవకాసం రావడం లేదు. రాము గారు పోరాడి తెచుకోవాలి అంటారు కాని, అది అంత తేలిక కాదు. వారికి ఆ విషయం బాగా తెలుసనుకుంటాను. ఇప్పుడు మీడియా వున్నా పరిస్థితుల్లో జర్నలిస్టు నెల నెల జీతం కావాలంటే , pellam, pillalu bathakaalante, ఆత్మాభిమానం తగ్గించుకోవాలి, అవసరమైతే వదులుకోవాలి. రిటైర్ అయినప్పుడు, రాము గారి లాగ పరిస్థితులు అనుకులించి వుద్యోగం మానేసి వేరే దారి చూసుకున్నప్పుడు కావాల్సినంత ఆత్మా గౌరవం, అభిమానం తో బతకవచు. దీని అర్ధం ఇప్పుడు పనిచేస్తున్న ఎవరికీ ఇవి ఏమి లేవనా?
- చందు

Anonymous said...

Thank you..

గోగులపాటి కృష్ణమోహన్ said...

బాగా చెప్పారు మాస్టారు

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి